Live Updates: ఈరోజు (16 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 16 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | పాడ్యమి ఉ. 9-07 తదుపరి విదియ | అనూరాధ నక్షత్రం సా. 5-41 తదుపరి జ్యేష్ఠ | వర్జ్యం రా.10-59 నుంచి 12-29 వరకు | అమృత ఘడియలు ఉ.7-56 నుంచి 9-26 వరకు | దుర్ముహూర్తం మ.12-07 నుంచి 12.52 వరకు తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-09 | సూర్యాస్తమయం: సా.05-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 Nov 2020 1:11 PM GMT
Krishna District Updates: నాగులచవితి ఉత్సవాలకు ముస్తాబైన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం..
కృష్ణాజిల్లా..
-నాగులచవితి ఉత్సవాలకు ముస్తాబైన మోపిదేవిలో శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం
-రేపు అంగరంగ వైభవంగా జరుగనున్న స్వామివారి నాగుల చవితి ఉత్సవాలు
-స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
-నాగుల చవితి సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం
-రేపు ఉదయం 2 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు
-అనంతరం స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకోనున్న స్థానిక ఎంఎల్ఏ సింహాద్రి రమేష్
-నాగుల చవితి సందర్భంగా రేపు ఆలయంలో నిర్వహించే ప్రత్యేక దర్శనాలు రద్దు
-రేపు స్వామివారిని దర్శించేందుకు సుమారు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు వరకు రావచ్చని అంచనా
-దర్శనానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు
-ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు
-దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం డిపోల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
- 17 Nov 2020 1:03 PM GMT
Amaravati Updates: కోవిడ్ నియంత్రణలోకి వచ్చాక ఎన్నికలకి మాకు అభ్యంతరం లేదు..
అమరావతి...
-స్థానిక ఎన్నికల అంశంపై HMtv తో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని...
-గతంలో కేసులు లేనప్పుడు ఎందుకు వాయిదా వేశారు సమాధానం చెప్పాలి..
-చంద్రబాబు చెప్తే అపారా.. సుజనా చౌదరి చెప్తే అపారా చెప్పాలి..
-రెండు మూడు కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు ఏ రాష్ట్రంలోనూ ఆపలేదు..
-మార్చిలో పదవి కాలం అయిపోతుందని నిమ్మగడ్డ కంగారు పడుతున్నాడు..
-నిమ్మగడ్డకి అంత ఆత్రం ఎందుకు.. ?
-ఏకగ్రీవాలు జరుగుతుంటే ఉంటాయి.. టీడీపీ కి బలం లేదు కనుక చేతులెత్తేశారు..
-చంద్రబాబు హయాంలో ఏకగ్రీవాలు జరగలేదా..?
-చంద్రబాబు నిమ్మగడ్డ ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కార్యక్రమాలు ఆపాలని చూస్తున్నారు..
-జిల్లాల విభజన అనేది ఎన్నికల ముందు మా హామీ.. పక్రియ జరుగుతుంది..
-చంద్రబాబు మైండ్ పోయింది.. ఎర్రగడ్డలో చేర్చాలి.
- 17 Nov 2020 1:00 PM GMT
Krishna District Updates: ఏ కొండూరు మండలం రేపూడి తండాలో విషాదం!
కృష్ణాజిల్లా..
-ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి
-ఒకే కుటుంబానికిచెందిన భానావతు శ్రీనివాసు(5), భానావతు యమునా(4)
-ఇద్దరు పిల్లలూ కారులో ఆడుతుండగా కారు డోర్స్ పడటంతో ఊపిరి ఆడక కారులోనే మృతి
-గ్రామంలో విషాద ఛాయలు
- 17 Nov 2020 12:58 PM GMT
Visakha Updates: విశాఖలో ఉద్యోగాల పేరిట మోసం..
విశాఖ..
-డీసీపీ ఐశ్వర్య రస్తోగి కామెంట్స్
-ఇటీవల జరిగిన సీఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కానిస్టేబుల్స్
-ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్ల అరెస్ట్
-కానిస్టేబుళ్ళుగా పనిచేస్తున్న బి. మనోజ్ కుమార్,ఏ రమణ, బి.హరికృష్ణ
-తిరుపతి నాయక్ అనే వ్యక్తి దగ్గర నుండి 8 లక్షల 90 వేల రూపాయలు వసూలు
-ఇప్పటి వరకు 28 మందిని మోసగించినట్లు గుర్తించాం
-2019 జులై నుండి సస్పెన్షన్ లో ఉన్నారు.
- 17 Nov 2020 12:55 PM GMT
Nellore District Updates: రౌడీ మూకల హల్ చల్ కేసులో పురోగతి..
నెల్లూరు:
-యువకులపై విచక్షణా రహితంగా దాడి చేసిన రౌడీ మూకలు
-కిశోర్ అనే వ్యక్తి కారు ను తీసీకెళ్లిన యుగంధర్ అనే వ్యక్తి
-కార్ డేమెజ్ కావడంతో యుగంధర్ ను డబ్బులు చెల్లించమన్న కిశోర్
-డబ్బులు చెల్లించకపోవడంతో యుగంధర్ పై విచక్షణారహితంగా దాడి
-మూడు నెలల క్రితం జరిగిన ఘటన ...ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్
-రెండు వేరు వేరు ఘటనలపై ఇప్పుడు పోలీసులు కేసు నమోదు.
- 17 Nov 2020 12:53 PM GMT
Anantapur Updates: చిరుత సంచారం..
అనంతపురం:
- కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో నీ మరెమ్మపల్లి వీధి లో చిరుత సంచారం.భయాందోళన లో కాలని వాసులు.
- 17 Nov 2020 12:52 PM GMT
Amaravati Updates: డీఎస్పీ స్ధాయి అధికారులకు ఇంటిజెన్స్ డీఎస్పీలుగా బదిలీ!
అమరావతి..
-రాష్ట్రంలో నలుగురు ఇంటిలిజెన్స్ డీఎస్పీలను పోలీసు హెడ్ క్వార్టర్స్ కు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆర్డర్లు
-ఐదుగురు డీఎస్పీ స్ధాయి అధికారులకు ఇంటిజెన్స్ డీఎస్పీలుగా బదిలీ
- 17 Nov 2020 12:50 PM GMT
Amaravati Updates: సినీ నిర్మాత అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు..
అమరావతి..
-గన్నవరం విమానాశ్రయం విస్తరణకు ఇచ్చిన భూములకు సరైన నష్టపరిహారం ఇవ్వాలంటూ పిటిషన్ వేసిన అశ్వనీదత్
-ఈ నెల 26కి వాయిదా వేసిన హైకోర్టు
- 17 Nov 2020 12:43 PM GMT
Vijayawada Updates: మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ప్రజలలో నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమం..
విజయవాడ..
-ఎమ్మెల్యే-బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్- మల్లాది విష్ణు:
-సింగ్ నగర్ 58,59 డివిజన్లలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో, ప్రజలలో నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమం.
-డివిజన్ లో గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
-మా ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాల వ్యవధిలో విజయవాడ నగర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.
-నగరంలో నూతనంగా ఫ్లైఓవర్లు, పోలీస్ స్టేషన్లు, సిసి రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం.
-సంక్షేమ,అభివృద్ధి పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు.
-స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.
-టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఏజెంటుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రవర్తిస్తున్నారు.
-చంద్రబాబు చేస్తున్న దగా,కుట్ర, నీచ రాజకీయాలు
-ప్రజలు గమనిస్తున్నారు.
-రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుని తిరస్కరించిన బుద్ధి రాలేదు.
-పత్రికలు అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేస్తున్న డ్రామాలు ప్రజలు చూస్తున్నారు.
-సీఎం జగన్ పేదలు ప్రజలకు ఉచితంగా ఇల్లు కేటాయించే విషయంలో చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడు
- 17 Nov 2020 12:36 PM GMT
Amaravati Updates: తెలంగాణ రాష్ట్రంలోనూ, జి.హెచ్.ఎమ్.సి. పరిధిలోను పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు..
అమరావతి..
పవన్ కళ్యాణ్..
-కార్యకర్తలు, యువ జనసైనికులు నుంచి పోటీ చేయాలని పలు విజ్ఞప్తులు వచ్చాయి.
-వారి వినతి మేరకు జి.హెచ్.ఎమ్.సి. ఎన్నికల్లో పోటీ కి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశాను.
-నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నారు.
-జి.హెచ్.ఎమ్.సి.లోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ...ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయి.
-తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి.
-ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకొంటున్నారు.
-వారి అభిష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ జి.హెచ్.ఎమ్.సి. ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుంది
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire