ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం, 16 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ద్వాదశి(ఉ. 11-03 వరకు) తదుపరి త్రయోదశి ; పునర్వసు నక్షత్రం (తె. 05-41 వరకు) తదుపరి పుష్యమి నక్షత్రం, అమృత ఘడియలు (లేవు), వర్జ్యం (సా.05-29 నుంచి 07-06 వరకు) దుర్ముహూర్తం (సా. 04-42 నుంచి 05-32 వరకు) రాహుకాలం (సా.04-30 నుంచి 06-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 16 Aug 2020 9:14 AM GMT
తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ అధికారంలోనికి వచ్చారు: రేవంత్ రెడ్డి
దేశంలో మోడీ హిందుత్వ ఎజెండాతో, రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ అధికారంలోనికి వచ్చారని ఏ. రేవంత్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు.
గతంలో రాజులు రాజ్యాలపై దాడుల చేసి గెలిచాక పాత జ్ఞాపకాలు కూల్చేసేవారు.
ఇప్పుడు కేసీఆర్ నిజాం కాలంనాటి పాత కట్టడాలు కూల్చేస్తున్నారు.
దేవాలయాల కూల్చివేత పై మోడీ , అమిత్ షా , కిషన్ రెడ్డిలకు మాట్లాడే అర్హత లేదు.
ఆలయాల కూల్చివేత లో బీజేపీ , ఎంఐఎం ఇద్దరు దోషులే
కేంద్రంలో మోడీ , రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు సెంటిమెంట్ ను వాడుకొని అధికారంలోకి వచ్చారు.
నిజం సర్కార్ కట్టిన ఆనవాళ్ల ఇప్పటికీ నగరం లో ఉన్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం లో నిజం అనవాళ్లను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారు.
దానిలో భాగంగానే ఉస్మానియా , యాదాద్రి దేవాలయంల నిర్మాణానికి పూనుకున్నారు.
నూతన సచివాలయ నిర్మాణం కూడా దానిలో భాగమే.
కూలీకుతుబ్ షాహి కాలంలో నిర్మించిన మసీదు , పోచమ్మ దేవాలయాలు.
తెలంగాణ లో ఉన్న పురాతన దైవ క్షేత్రలకు తన మార్క్ చూపేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమం మొత్తం నల్ల పోచమ్మ దేవాలయంలో పూజలు చేసాకే చేశారు.
ఎంఐఏం పూర్తిగా టీఆర్ఎస్ కనుసన్నలతోనే నడుస్తోంది.
ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన కాంగ్రెస్ ను కాదని ఏంఐఎం కు ఇచ్చారు.
- 16 Aug 2020 9:10 AM GMT
వరద ప్రాంతాలలో కలెక్టర్ పర్యటన
కొమరం భీం జిల్లా: వరద ప్రాంతాలలో కలెక్టర్ పర్యటన..
పెంచికల్ పేట్ మండలంలోని బొక్కివాగు మత్తడిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా .
నిన్న వరదలో చిక్కుకున్న స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
- 16 Aug 2020 9:08 AM GMT
పేన్ గంగా లో పెరుగుతున్న వరద ఉధృతి.. హై అలర్ట్ ప్రకటించిన అదికారులు
ఆదిలాబాద్ ...పేన్ గంగా నది పరివాహన ప్రాంతం లో హై అలర్ట్ ప్రకటించిన అదికారులు
బారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తమైన. అదికారులు..
పెన్ గంగా నది ఉప్పోంగుతుందని హెచ్చరికలు జారీచేసిన. అదికారులు
పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో దండోరా వేయిస్తున్నా అదికారులు
నదిపరివాహక ప్రాంతంలోకి వెళ్లవద్దని ప్రజలను కోరుతున్నా అదికారులు
- 16 Aug 2020 9:04 AM GMT
గ్రేటర్ ఎన్నికలో యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి.. ఎం. విక్రమ్ గౌడ్, పిసిసి కార్యదర్శి
గ్రేటర్ ఎన్నికలో ఎవరి నియోజకవర్గంలో వారు కనీసం రెండు టికెట్ లు గెలిపించుకోవాలని ఎం. విక్రమ్ గౌడ్, పిసిసి కార్యదర్శి అన్నారు..
లేదంటే ఎమ్మెల్యే టికెట్ అడగడానికి కూడా అర్హులం కాదు ..
పక్కవారి నియోజకవర్గాల్లో చేతులు పెట్టేవారు ఉన్నారు..
అలాంటి వారితో పార్టీ కి ఇబ్బంది.
యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి..
ప్రతిసారి పైసలు పని చేయవు, బట్టలు చింపుకొని పని చేసేవారు కావాలి..
- 16 Aug 2020 9:01 AM GMT
జల దిగ్బంధంలో వరంగల్.. బాధితులను సురక్షిత పాంత్రాలకు తరలింపు
వరంగల్ అర్బన్: క్రిస్టియన్ నగర్ లోని గాంధీ నగర్ కాశీ బుగ్గలిని పద్మనగర్ ముంపు ప్రాంతాలను సిపి ప్రమోద్ కుమార్, కమిషనర్ పమేలా సత్పతీలతో కలిసి పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
నగరంలో బారి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి
ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాసం కోసం నగరంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 2600 మందికి పునరావాసం కల్పించినట్లు కలెక్టర్ వెల్లడి.
లోతట్టు ప్రాంతాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది 24 గంటల పాటు పనిచేస్తున్నారని నిన్నటితో పోల్చితే నేడు వరద కొంచం తగ్గు ముఖం పట్టినదని
మొదటి అంతస్తులో నివసించే ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్ట పడే వారిని కూడా పోలీస్ సహాయంతో పంపిస్తున్నట్లు సిపి వెల్లడి
- 16 Aug 2020 5:05 AM GMT
Hussain sagar: నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్
- గడిచిన వారం రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలతో నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్
- హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా 240 చదరపు కిలోమీటర్ల మేర కురుస్తున్న వర్షం అంతా కూడా సాగర్ లోకి వచ్చి చేరుతుంది
- హుస్సేన్ సాగర్ ఎఫ్ టి ఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా...., ప్రస్తుతం 513.58 మీటర్లు గా ఉంది
- దాంతో తూము ని ఓపెన్ చేసి నీటిని కిందికి వదులుతున్న జిహెచ్ఎంసి లేక్స్ విభాగం అధికారులు
-నిన్న ఇన్ఫ్లో ఔట్ఫ్లో లో ఐదు వందల క్యూసెక్కులు ఉండగా ఈ రోజు అది ఏడు వందల క్యూసెక్కులకు చేరింది
- హైదరాబాద్ నగరంలో వర్షం ఇలాగే కురుస్తే ఇబ్బందులు ఇబ్బందులు ఏర్పడుతాయి అంటున్న బల్దియా వర్గాలు
- 16 Aug 2020 4:53 AM GMT
Flood Alert: మూసీ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరద.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం.
సూర్యాపేట :
- భారీగా ఇన్ ఫ్లో వస్తుండడంతో నిండుతున్న మూసీ, ఏ క్షణం లోనైనా గేట్లు ఎత్తే అవకాశం.
- మూసీ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మూసీ అధికారుల ఆదేశం....
- నల్గొండ, సూర్యాపేట జిల్లా మూసీ పరివాహక గ్రామాల ప్రజలు నది,వాగుల్లోకి వెళ్ళొద్దని సూచన.
- పూర్తి సామర్థ్యం : 645 అడుగులు.(4.46 టీఎంసీలు.)
- ప్రస్తుత నీటి మట్టం : 642.4 అడుగులు.(3.79 టీఎంసీలు)
- నికర సామర్థ్యం : 3.67 టీఎంసీలు.
- ఇన్ ఫ్లో : 6,832 క్యూసెక్కులు
- కుడి, ఎడమ కాలువ : 100 క్యూసెక్కులు.
- మొత్తం అవుట్ ఫ్లో : 145 క్యూసెక్కులు.
- 16 Aug 2020 3:20 AM GMT
మంచిర్యాల జిల్లా:
- మంచిర్యాల జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం,
- శ్రీరాంపూర్,రామకృష్ణాపుర్, మందమర్రి సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో నిలిచిపోయిన 72000 టన్నుల బొగ్గు ఉత్పత్తి,
- సుమారు 18 కోట్ల రూపాయల నష్టం
- 16 Aug 2020 3:20 AM GMT
భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి..
భద్రాచలం:
- 49.5 అడుగులు చేరుకున్న నీటిమట్టం
- కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సహాయక శిబిరాలకు వెళ్లాలని అధికారుల సూచన
- 16 Aug 2020 3:19 AM GMT
భద్రాద్రి కొత్తగూడెం:
- చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ లోకి భారీ వర్షాల కారణంగా ఐదవ రోజు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
- స్థానికంగా కురిసే వర్షాలతో పాటు ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలోని చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో కురిసే వర్షాలతో పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
- దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద ప్రవాహం ఉండటంతో అదికారులు ప్రాజెక్ట్ కు చెందిన 25 గేట్లలో 24 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 1 లక్షా 35 వేల 768 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు.
- రిజర్వాయర్ లోకి వచ్చే ఇన్ ప్లో 1 లక్షా 39 వేల 466 క్యూసెక్కులు ఉండటంతో అదికారులు వచ్చిన నీటిన వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు...ప్రాజెక్ట్ వద్ద 90 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire