Live Updates:ఈరోజు (ఆగస్ట్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 16 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ద్వాదశి(ఉ. 11-03 వరకు) తదుపరి త్రయోదశి ; పునర్వసు నక్షత్రం (తె. 05-41 వరకు) తదుపరి పుష్యమి నక్షత్రం, అమృత ఘడియలు (లేవు), వర్జ్యం (సా.05-29 నుంచి 07-06 వరకు) దుర్ముహూర్తం (సా. 04-42 నుంచి 05-32 వరకు) రాహుకాలం (సా.04-30 నుంచి 06-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ బీజేపీ నేత
    16 Aug 2020 5:34 PM GMT

    మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ బీజేపీ నేత

    గుంటూరు: మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ బీజేపీ నేత రామాంజనేయులు

    నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు మద్యం అక్రమ రవాణా

    రూ.6 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్న పోలీసులు

    రామాంజనేయులు సహా ముగ్గురు అరెస్ట్, రెండు కార్లు స్వాధీనం

    గత ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన రామాంజనేయులు

  • 16 Aug 2020 5:32 PM GMT

    నాటుసారా స్వాధీనం

    తూర్పుగోదావరి - కొత్తపేట: రావులపాలెం లో ముగ్గురు వ్యక్తులు నుండి 70 లీటర్లు నాటుసారా స్వాధీనం వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు

  • ఆడుకోవ‌డానికి ఫోన్ ఇవ్వ‌లేద‌ని.. ఆత్మ‌హ‌త్యయ‌త్నం
    16 Aug 2020 5:29 PM GMT

    ఆడుకోవ‌డానికి ఫోన్ ఇవ్వ‌లేద‌ని.. ఆత్మ‌హ‌త్యయ‌త్నం

    అనంతపురం: గుత్తి మండలం బ్రాహ్మణపల్లె లో దారుణం.

    ప్రీ ఫైర్ గేమ్ ఆడటానికి తండ్రి సెల్ ఫోన్ యివ్వలేదని బ్లేడ్ తో గొంతుకోసుకున్న యువకుడు నరేంద్రకుమార్(17).

    యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు....

    ఆసుపత్రిలో చికిత్స అందకపోవడం తో తిరిగి గుత్తికి తీసుకెళుతున్న తల్లిదండ్రులు.

  • వినాయ‌క చ‌వితిపై క‌రోనా ఎఫెక్ట్‌.. ప‌లు నిషేధాజ్ఞలు
    16 Aug 2020 5:26 PM GMT

    వినాయ‌క చ‌వితిపై క‌రోనా ఎఫెక్ట్‌.. ప‌లు నిషేధాజ్ఞలు

    తూర్పుగోదావరి: కోవిడ్ విజృంభణ నేపధ్యంలో వీధులు, గ్రామ కూడళ్లు, బహిరంగ ప్రదేశాలలో గణపతి నవరాత్రి పందిళ్లు, భారీ విగ్రహాలు ఏర్పాటుపై నిషేధాజ్ఞలు..

    భక్త జన సమీకరణతో సామూహిక పూజలు, వినోద కార్యక్రమాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి..

    వినాయక చవితి పూజలు, వేడుకలను కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్ల లోనే జరుపు కోవాలని ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్..

  • ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత
    16 Aug 2020 5:21 PM GMT

    ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

    విజయవాడ: ప్రకాశం బ్యారేజీ 70గేట్లలో 50గేట్లు మూడు అడుగులు, 20గేట్లు రెండు అడుగులు ఎత్తారు

    1.35లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు.

     

  • పేకాట రాయుళ్ల పై దాడి..
    16 Aug 2020 3:31 PM GMT

    పేకాట రాయుళ్ల పై దాడి..

    గుంటూరు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి లో సుభాని అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    2లక్షల ముప్పై వేల నగదు,రెండు కార్లు సీజ్ చేసి కేసు నమోదు చేసిన నకరికల్లు పోలీసులు.

  • తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదల
    16 Aug 2020 3:29 PM GMT

    తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదల

    అనంతపురం: తుంగభద్ర డ్యాం నుంచి కిందికి నీరు విడుదల.

    ఆనకట్ట మూడు గేట్లు ఒక్క అడుగు ఎత్తి 4,539 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన అధికారులు.

    మొత్తం 6,594 క్యూసెక్కుల నీరు నది ద్వారా విడుదల.

  • రాజాంలో దారుణం..అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి మిస్సింగ్..
    16 Aug 2020 3:28 PM GMT

    రాజాంలో దారుణం..అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి మిస్సింగ్..

    శ్రీకాకుళం జిల్లా: గత నెల 16న అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు..

    కరోనా లక్షణాలు ఉన్నాయంటూ శ్రీకాకుళం రిమ్స్ కి తరలించిన ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది..

    ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో జెమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేసిన రిమ్స్ వైద్యులు..

    కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ నిర్ధారణ అయ్యిందని కుటుంబ సభ్యులకు తెలిపిన జెమ్స్ సిబ్బంది..

    నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన జెమ్స్ వైద్యులు..

    నెల రోజులు గడిచినా ఇంటికి రాని బాధితుడు..

    తమ వ్యక్తి ఆచూకీ తెలపాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళన..

    రాజాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..

  • నెల్లూరు నారాయణ కోవిడ్ హాస్పిటల్ లో ప్రధాన డాక్టర్ల ఎత్తులు..
    16 Aug 2020 8:00 AM GMT

    నెల్లూరు నారాయణ కోవిడ్ హాస్పిటల్ లో ప్రధాన డాక్టర్ల ఎత్తులు..

    నెల్లూరు: నెల్లూరు నారాయణ కోవిడ్ హాస్పిటల్ లో ప్రధాన డాక్టర్లు ఎత్తులు.. విధులకు దూరం..డ్యూటీలు చేస్తున్నట్లు షో..

    హౌస్ సర్జన్లకు విధులు కేటాయింపు..

    సీనియర్ డాక్టర్లను పక్కన పెట్టి హౌస్ సర్జన్లకు కోవిడ్ డ్యూటీలు వేయడంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన..

    డ్యూటీలు కేటాయిస్తున్న తీరుపై అనుమానాలు..డిసి హెచ్ పై అసంతృప్తి..

  • వాజ్ పేయ్ ఆశయ సాధనకు కృషి చేస్తాం: కన్నా లక్ష్మి నారాయణ
    16 Aug 2020 7:55 AM GMT

    వాజ్ పేయ్ ఆశయ సాధనకు కృషి చేస్తాం: కన్నా లక్ష్మి నారాయణ

    గుంటూరు: బిజేపి రాష్ట్ర కార్యాలయం లో మాజీ ప్రధాని వాజ్ పేయ్ రెండో వర్దంతి .

    వాజ్ పేయ్ చిత్ర పటానికి నివాళ్ళు అర్పించిన బిజేపి నేతలు కన్నా లక్ష్మి నారాయణ, రావెల, రామకృష్ణ, తాళ్ళ, అమ్మిశెట్టి.

    కన్నా లక్ష్మి నారాయణ కామెంట్స్: 

    స్వయంకృషి తో పైకి వచ్చిన గొప్ప రాజకీయ నాయకుడు,

    ప్రతిపక్షలు సైతం మెచ్చిన మహానేత,

    తన రాజకీయ జీవితం మొత్తం సబ్ కా సాబ్, సబ్ కా వికాస్ స్పూర్తి తో పని చేసారు.

    ప్రధాని అయ్యాక ఎవరికి బయపడకుండా పోక్రాన్ ప్రయోగం చేశారు.

    చంద్రయాన్ కు రూపకల్పన చేసారు.

    దేశం మొత్తం కలిసేలా స్వర్ణ చతుర్బుజీ పేరుతో హైవేల నిర్మాణం చేపట్టారు.

    గ్రామలకు లింక్ రోడ్లు వేసి గ్రామాభివృద్దికి కృషి చేశారు.

    వాజ్ పేయ్ లాంటి మహానీయడు ని కోల్పోవడం బిజేపికి తీరని లోటు.


Print Article
Next Story
More Stories