Live Updates: ఈరోజు (సెప్టెంబర్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 15 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | త్రయోదశి-రా.8-44 వరకు తదుపరి చతుర్దశి | ఆశ్లేష నక్షత్రం - మ.12-56 తదుపరి మఘ | అమృత ఘడియలు ఉ.11-21 నుంచి 12-56 వరకు | వర్జ్యం రా.12-31 నుంచి 2-04 వరకు | దుర్ముహూర్తం ఉ..8-17 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-45 నుంచి 11-32 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం ఉ.5-51 | సూర్యాస్తమయం సా.6-02
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 Sep 2020 3:02 PM GMT
Telangana Assembly Updates: విద్యుత్ చట్ట సవరణ వ్యతిరేకిస్తూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాన్ని సీపీఎం స్వాగతిస్తుంది: తమ్మినేని వీరభద్రం
- 2003 విద్యుత్ చట్ట సవరణ వ్యతిరేకిస్తూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించడాన్ని సీపీఎం స్వాగతిస్తుంది..
- ఇదే తరహాలో 1995 నిత్యావసర సరుకుల రవాణా ఆర్డినెన్స్ ను ,జిఎస్టీ పై కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ధోరణిని నిరసిస్తూ శాసనసభ లో తీర్మానం చేయాలి...
- రాష్ట్రాల హక్కులను కాపాడడానికి ముఖ్యమంత్రి చొరవ చేసి కలిసి వచ్చే రాష్ట్రాలతో కేంద్రం పై వత్తిడి తేవాలి...
- 15 Sep 2020 3:00 PM GMT
Suryapet Updates: టీజేఎస్ కార్యాలయంలో ప్రయివేటు ఉపాద్యాయులతో కోదండరాం ముఖాముఖి..
సూర్యాపేట జిల్లా :
- సూర్యాపేట టీజేఎస్ కార్యాలయంలో ప్రయివేటు ఉపాద్యాయులతో కోదండరాం ముఖాముఖి..
- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షన్నర పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ప్రభుత్వం చెల్లించాలనే డిమాండ్లతో ఛలో అసెంబ్లీ..
- కరోనాతో బతుకుదెరువు కోల్పోయిన అన్ని రంగాల వారిని ప్రభుత్వం ఆదుకోవాలి.
- 21న తల పెట్టిన ఛలో అసెంబ్లీకి బ్రతుకు దెరువు కోల్పోయిన ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలి.
- 2018 చట్టం ప్రకారం లే అవుట్ నిబంధనలు విధించి వాటిని వెనుకకు తిప్పేలా కొత్త చట్టం అమలు చేస్తామనడం సమంజసం కాదు.
- ఎల్ ఆర్ ఎస్ స్కీం పేద ప్రజలకు ఉపయోగపడేలా మార్చకుంటే పేదవారికి సొంతింటి కల ఎండమావే అవుతుంది.
- 15 Sep 2020 12:53 PM GMT
TS RTC: రూట్లా వారీగా రెండు రాష్ట్రాలు సమానంగా నడపనలని ప్రపోజ్ చేశాం..సునీల్ శర్మ..
సునీల్ శర్మ, తెలంగాణ ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ
-రుట్లా వారీగా క్లారిటీ ఇస్తేనే మేము ముందుకు వెళ్తాం
-రెండు రాష్ట్రాలు అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళతాం
-ఏపీ వారు చెప్పిన దాన్ని బట్టి ముందుకు వెళతాం
- 15 Sep 2020 11:54 AM GMT
Bandi Sanjay Home Isolation: ఢిల్లీలో సెల్ఫ్ హోమ్ ఐసోలేషన్ కు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
-తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ కృష్ణ దాస్ కు కరోన పాజిటీవ్ రావడంతో హోమ్ ఐసోలాషన్ కి వెళ్లిన బండి.
-సోమవారం మొత్తం పార్టీ వ్యవహారాల కోసం ఇంచార్జ్ కృషదాస్ తో గడిపిన బండిసంజాయ్.
-హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు పార్లమెంటుకు సమాచారం అందించిన బండి సంజయ్.
- 15 Sep 2020 11:42 AM GMT
Telangana High Court: చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ పై హైకోర్టులో ముగిసిన విచారణ..
టిఎస్ హైకోర్టు...
-చివరి సెమిస్టర్ కు ఎప్పటిలాగే రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపిన ప్రభుత్వం
-అటానమస్ కళాశాలలు వారికి అనుకూలమైన రీతిలో నిర్వహించుకోవచ్చునన్న ప్రభుత్వం
-పరీక్షలు ఎలా నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం: హైకోర్టు
-ప్రభుత్వ విధానపరమైన జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
-సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారినీ రెగ్యులర్ గా పాసయినట్టు పరిగణిస్తామన్న ప్రభుత్వం
-సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో వెల్లడించాలని కోరిన న్యాయవాది దామోదర్ రెడ్డి
-సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమన్న ఏజీ
-రెండు నెలల్లో నిర్వహిస్తామని తెలిపిన జే ఎన్ టీ యూ హెచ్
-పరీక్షలను కరోనా జాగ్రత్తలతో నిర్వహించాలని స్పష్టం చేసిన హైకోర్టు
-రేపు జేఎన్ టీయూహెచ్, ఎల్లుండి ఓయూ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
- 15 Sep 2020 11:30 AM GMT
Private Universities Bill: ప్రైవేట్ యూనివర్సిటీ ల బిల్లును ఉభయ సభలు ఆమోదించడం బాధాకరం...చాడ వెంకట్ రెడ్డి..
చాడ వెంకట్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
-రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల లో ఫీజు రీయింబర్స్ మెంట్, రిజర్వేషన్లు వర్తించవని ప్రభుత్వం చెప్పడం దారుణం...
-ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడమే అవుతుంది...
-ప్రభుత్వ తిరోగమన విధానంలో ప్రయాణిస్తుంది...
-ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేసి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీ లకు అనుమతులు ఇవ్వడం విచారకరం...
ప్రైవేట్ యూనివర్సిటీ లలో కూడా రిజర్వేషన్లు, ఫీజ్ ఎంబర్స్ మెంట్ కల్పించి, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలని సిపిఐ డిమాండ్ ...
- 15 Sep 2020 11:21 AM GMT
RTC Updates: ప్రారంభమైన ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం..
ఆర్టీసీ అప్డేట్స్...
-సమావేశానికి తెలంగాణ నుండి ఎండీ సునీల్ శర్మ, ఈడీ ఆపరేషన్స్ పురుషోత్తం..ఈడీ ఈ వినోద్ ఈడీ వెంకటేశ్వర్లు
-ఏపీ నుండి ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు.. ఆపరేషన్ ఈడీ బ్రహ్మానంద్ రెడ్డి...
-అంతరాష్ట్ర సర్వీసుల పునరుద్దరణపై చర్చలు జరుపనున్న ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు..
-ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరితే మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న అంతరాష్ట్ర సర్వీసులు..
- 15 Sep 2020 11:14 AM GMT
Telangana Assembly: అసెంబ్లీ కమిటీ హాల్లో దలిత గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం..
అసెంబ్లీ..
-అసెంబ్లీ కమిటీ హాల్లో దలిత గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం
-దలిత, గిరిజనుల సమస్యలు పై చర్చ
-పోడు భూములు, అసెన్డ్ భూముల సమస్యల పై చర్చ..
-హాజరైన మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవకి రాథోడ్.
- 15 Sep 2020 11:08 AM GMT
Hyderabad updates: ఈ రోజు వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నలుగురి ని అరెస్ట్ చేశారు.. అంజనీకుమార్ హైదరాబాద్ సీపీ....
అంజనీకుమార్ హైదరాబాద్ సీపీ....
-మహీంద్ర స్కార్పియో హ్యుండియా అసెంట్ కార్లలో డబ్బులు తరలిస్తుండగా పట్టుకున్నాం..
-వీళ్లంతా గుజరాత్ చెందినవారు...
-ఈ రోజు ఉదయం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 లో మహీంద్ర వెహికిల్స్ లో 3కోట్ల 75 లక్షల 30 వేలను , రెండు కార్లను స్వాధీనం చేసుకున్నాం....
-ఈ డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారు..
-ఇది ఎవరికి సంబంధించింది దానిపై ఇన్ కంటాక్స్ కు సమాచారం ఇచ్చాము...
-ఆ నలుగురు విచారణ జరుపుతున్నాము...
- 15 Sep 2020 10:06 AM GMT
TS Assembly: సభ పని దినాలపై రేపు అధికారిక ప్రకటన చేయనున్న స్పీకర్..
అసెంబ్లీ..
-రోజు 1200 మంది ఒకే చోట చేరడంతో కరోనా వ్యాప్తి చెందుతుంది
-ఇప్పటికే అసెంబ్లీ సిబ్బంది..పోలీసుల కు కరోనా
-నిన్న ఒక్క రోజే 14 మందికి కరోన నేపథ్యంలో సభ ను ముగించాలని ప్రభుత్వ ప్రతిపాదన
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire