Live Updates: ఈరోజు (సెప్టెంబర్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 15 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | త్రయోదశి-రా.8-44 వరకు తదుపరి చతుర్దశి | ఆశ్లేష నక్షత్రం - మ.12-56 తదుపరి మఘ | అమృత ఘడియలు ఉ.11-21 నుంచి 12-56 వరకు | వర్జ్యం రా.12-31 నుంచి 2-04 వరకు | దుర్ముహూర్తం ఉ..8-17 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-45 నుంచి 11-32 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం ఉ.5-51 | సూర్యాస్తమయం సా.6-02
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 Sep 2020 9:54 AM GMT
Guntur updates: జిజిహెచ్ లో వైసిపి ఎమ్మెల్యే ముస్తఫా ఆకస్మిక తనిఖీ..
గుంటూరు ః....
-ఆసుపత్రిలో వైద్య సేవలపై ఆరా...
-డాక్టర్ ల పనితీరు ను రోగులను అడిగి తెలుసుకున్న ముస్తఫా.
-సూపరింటెండెంట్ సుధాకర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం.
-సాధారణ రోగులను అసలు పట్టించుకోవడం లేదు.
-సామాన్య రోగుల పరిస్థితి వర్ణీతీతంగా ఉంది.
-జిజిహెచ్ లంచాల మయంగా మారిందని మండిపాటు.
-సీట్లు కూర్చోని కబుర్లు చెబితే కుదరదని సూపరిటెండెంట్ కు హెచ్చరిక
-ఎమ్మెల్యే తీరు తో బెంబేలెత్తిపోయిన జిజిహెచ్ వైద్య సిబ్బంది.
- 15 Sep 2020 9:52 AM GMT
Prakasam Barrage updates: కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి..కె. కన్నబాబు..
అమరావతి..
కె. కన్నబాబు విపత్తుల శాఖ కమిషనర్..
-ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
-ప్రస్తుత ఇన్ ఫ్లో 3,95,669, , అవుట్ ఫ్లో 3,90,669 క్యూసెక్కులు
-వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ శాఖ
-కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
-బోట్లు,మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్ద
-వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదు
- 15 Sep 2020 9:46 AM GMT
Amaravati updates: మన దేశ ప్రగతి ప్రస్థానంలో ఇంజనీరింగ్ రంగ నిపుణుల పాత్రను ఎవరూ విస్మరించలేరు..పవన్ కళ్యాణ్..
అమరావతి..
పవన్ కళ్యాణ్..
-మన ఇంజనీరింగ్ నిపుణులకు మార్గదర్శకులు ‘భారతరత్న’ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.
-ఈ రోజు ఆ మహనీయుని జయంతి.. సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అంజలి ఘటిస్తున్నాను.
-హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదల నుంచి గట్టెక్కించేలా నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు.
-విశాఖపట్నం ఓడరేవును సముద్రపు కోత నుంచి కాపాడే విధానాన్ని అందించారు.
-దేశంలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపకల్పనలో విశ్వేశ్వరయ్య గారి భాగస్వామ్యం మరువలేనిది.
-మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గౌరవార్థం వారి జయంతిని జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని నిర్వహించుకొంటూ ఉంటాం.
-విశ్వేశ్వరయ్య గారిలోని తపన, దృఢ సంకల్పం... ఆయన జీవితం యువ ఇంజనీర్లకు ఆదర్శంగా నిలుస్తాయి.
-మన దేశ ఇంజనీర్లు అత్యుత్తమ నైపుణ్యాలతో పరిశోధనల్లో, నూతన ఆవిష్కరణల్లో ముందుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.
- 15 Sep 2020 9:40 AM GMT
Kurnool-Srisailam updates: శ్రీశైలంలో గంటా మఠం జీర్ణోద్ధరణ పనుల్లో రాగి రేకులపై కన్నడ ఒరియా దేవా నాగరిక లిపిలో శాసనాలు..
కర్నూలు జిల్లా..
-శ్రీశైలంలో గంటా మఠం జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా పునర్ నిర్మాణ పనులలో మరోసారి బయటపడ్డాయి రాగి రేకులు, పురాతనం నాటి నానాలు
-ఇప్పటికే 29 రాగిరేకులు బయటపడ్డ వైనం
-రాగి రేకుల శాసనాలలో శ్రీశైలం పోషణ కు సంబంధించి మల్లన్న మాన్యంగా భూములు ఉన్నట్లు తెలిపిన పురావస్తు శాఖ అధికారులు
-ప్రస్తుతం బయటపడ్డ రాగిరేకులు నాణేలపై పంచనామా చేస్తున్న రెవెన్యూ పోలీసు దేవాదాయ శాఖ అధికారులు
- 15 Sep 2020 9:31 AM GMT
National updates: సవాలు విసురుతున్నా కావాలంటే బహిష్కరించి చూడండి....రఘురామ కృష్ణంరాజు..
జాతీయం..
ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రెస్ మీట్
-మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం రాష్ట్ర ప్రజలకు కలుగుతోంది..
-ప్రజాప్రతినిధులు కూడా రాచరికం పోయింది ప్రజలు ఓటేస్తేనే గెలిచామని గుర్తుంచుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలి.
-వైకాపా లోక్ సభపక్ష నేత మిథున్ రెడ్డి నిన్న మాట్లాడుతూ.. నాపై అనర్హత వేటు వేయాలని మళ్లీ కోరుతామన్నారు
-రాష్ట్ర ప్రభుత్వ పనుల గురించి ఏనాడైనా మిథున్ రెడ్డి మాట్లాడారా?
-రైల్వే జోన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది.? ఏం సాధించింది?
-నీటి పారుదల శాఖ, రోడ్ల నిర్మాణంలో బీభత్సమైన అవినీతి జరుగుతుంది
-లోక్ సభపక్షనేతకు ఎన్నిక పెడితే మిథున్ రెడ్డికి మూడు ఓట్లకు మించి రావు.
-మిథున్ రెడ్డి పై చాలా మంది ఎంపీలకు అసంతృప్తి ఉంది.
-నాలాగే చాలా మంది ఎంపీలపై వివక్ష ఉంది. కాకపోతే వారు బయటపడటం లేదు
-నన్ను పార్టీ నుంచి బహిష్కరించినా.. నేను పార్లమెంట్ లో కమిటీ చైర్మన్ గా కొనసాగుతాను.
-సవాలు విసురుతున్నా కావాలంటే బహిష్కరించి చూడండి. కమిటీ చైర్మన్ గా కొనసాగుతా.
-వారికి కావలసిన వారు లోక్సభలో కూర్చునేలా ప్రజా సమస్యలపై మాట్లాడే నాలాంటి వారిని మాత్రం దూరంగా రాజ్యసభ గ్యాలరీ లో కూర్చునేలా ఏర్పాట్లు చేయడం తగదు.
--రఘురామకృష్ణంరాజు, వైకాపా ఎంపీ
- 15 Sep 2020 9:05 AM GMT
Kadapa updates: హైకోర్టు వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి తక్షణం రాజీనామా చెయ్యాలి...తులసిరెడ్డి..
కడప :
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కామెంట్స్..
-హైకోర్టు ధర్మాసనం పోలీసు వ్యవస్థపై, డిజిపి పై, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
-పోలీసుల్లో పరివర్తన రావాలి...వై పీఎస్ కావద్దు ఐపీఎస్ లుగా నిరూపించుకోండి...
-రాష్ట్రంలో ఐ పి సి ని అమలుపరచండి , వై పిసి ని కాదు...
-రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా బిజెపి బలపరిచిన అభ్యర్థి కి నేనంటే నేనని వైకాపా, టి డి పీ లు మద్దతిచ్చాయి...
-టిడిపి ,వైసీపీలు తమ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఎన్డీయే బలపరిచిన అభ్యర్థిని సపోర్ట్ చేశాయి...
-బిజెపికి రాష్ట్ర ప్రయోజనాలను టిడిపి వైసిపిలు తాకట్టు పెట్టాయి...
-టిడిపి ,వైసిపిలను నమ్ముకుంటే కుక్క తోకను పట్టుకొని గోదావరి ఈదడమే...
- 15 Sep 2020 8:51 AM GMT
East Godavari updates: గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు..
తూర్పుగోదావరి :
మంత్రి కన్నబాబు కామెంట్స్..
-ఏలేరు కాలువల ఆధునీకరణను త్వరలోనే పూర్తి చేస్తాం ఏలేరు ముంపు సమస్యను సీఎం, ఇరిగేషన్ మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లాము..
-ఉన్నత స్థాయిలో దీనిపై చర్చిస్తున్నాం ఏలేరు, సుద్దగడ్డ, నక్కలకండి కాలువల ముంపు వల్ల గొల్లప్రోలు, పిఠాపురం ప్రాంతాల్లో భారీగా పంట నష్టం జరిగింది..
-చాలా చోట్ల కాలువలకు గండ్లు పడ్డాయి. పంట నష్టాల అంచనాకు బృందాలను ఏర్పాటు చేశాము..
-గొల్లప్రోలు పట్టణంలో ఎస్సీ, ఈ బీసీ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి..
-కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించాం..
- 15 Sep 2020 8:45 AM GMT
Amaravati updates: రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది..సోము వీర్రాజు..
అమరావతి...
-hmtv తో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
-టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు..
-రాజధాని నిర్మాణం 7200 కోట్ల పనుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు..
-ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చదరపు అడుగుకు 8 వేల నుంచి 12 వేల వరకు ఖర్చు చేశారు..
-నీరు చెట్టు, పోలవరం, ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ పనుల్లో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది..
-టీడీపీ నేతలు బాత్ రూమ్ లను కూడా వదలకుండా అవినీతికి పాల్పడ్డారు
-టీడీపీ హయాంలో జరిగిన అవినీతి మొత్తంపై విచారణ జరపాలి..
-టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ని ప్రధాన మంత్రి మోడీ కూడా ప్రశ్ననించారు..
-చంద్రబాబు అవినీతిని ఎటిఎంతో ప్రధాని నరేంద్ర మోడీ పోల్చారు.
-టీడీపీపై చేసిన అవినీతి ఆరోపణలకు మేము ఇప్పటికి కట్టుబడి ఉన్నాము..
- 15 Sep 2020 8:39 AM GMT
Kadapa updates: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో విచారణ చేపట్టిన సిబిఐ బృందం ....
కడప :
-మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో పులివెందులలో విచారణ చేపట్టిన సిబిఐ బృందం .....
-పులివెందుల కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీకాంత్ ను మరోసారి విచారిస్తున్న సిబిఐ అధికారులు ....
-ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం .....
- 15 Sep 2020 8:36 AM GMT
Kakinada rain updates: భారీ వర్షాలకు జలమయమైన కాకినాడ నగరం..
తూర్పుగోదావరి:
కాకినాడ..
-చెరువులను తలపిస్తున్న నగరంలోని ప్రధాన రహదారులు..
-మెయిన్ రోడ్, సినిమా రోడ్, సాంబమూర్తినగర్, రామారావు పేట, గాంధీనగర్ లో నడుం లోతు నీళ్ళల్లో ప్రయాణిస్తున్న వాహనాలు..
-కాకినాడ జీజీహెచ్ లోకి చేరిన వర్షం నీరు. తల్లి పిల్లల వార్డు, ఓపి, రేడియాలజీ, బ్లడ్ బ్యాంకు విభాగాల్లో చేరిన వర్షం నీరు..
-తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు, వారి బంధువులు..
-చెరువును తలపిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు, ఆర్టీసీ బస్టాండ్..
-ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం..
-నిమిషాల వ్యవధిలో భగభగ మంటున్న భానుడు..
-మధ్యాహ్నం 1 గంట నుంచి కాస్తున్న ఎండ..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire