Live Updates: ఈరోజు (15 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 15 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | త్రయోదశి ఉ.06-25 వరకు తదుపరి చతుర్దశి | ఉత్తర నక్షత్రం రా.07-59 వరకు తదుపరి హస్త | వర్జ్యం: రా.01-25 నుంచి 02-55 వరకు | అమృత ఘడియలు ఉ.10-47 నుంచి 11-55 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ.02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 Oct 2020 7:43 AM GMT
Vijayawada updates: దుర్గగుడి ఘాట్ రోడ్ నిలిపివేత!
విజయవాడ...
-ఈ నెల 13న ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో మరికొన్ని కొండ రాళ్లు పడే విధంగా ఉన్నాయి..
-వాటిని తొలగిస్తున్న ఆలయ సిబ్బంది
-భక్తులకు ఇబ్బంది లేకుండా ముందుగానే ఘాట్ రోడ్ లో వాహనాలు నిలిపివేసిన అధికారులు..
-విరిగిన ఇనుప మెష్ తిరిగి ఏర్పాటు చేస్తున్న అధికారులు
- 15 Oct 2020 7:35 AM GMT
High Court Of Andhra Pradesh: ఆవాస్ యోజన పథకం ప్రయోజనాలపై హైకోర్టు విచారణ!
అమరావతి..
-పీఎం ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం, లబ్దిదారులకు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ..
-రాష్ట్రంలో 85 వేలు ఇళ్ల నిర్మాణాలు పూర్తైన ప్రభుత్వం, పేదలకు ఇవ్వడం లేదని వాదనలు వినిపించిన న్యాయవాది..
-ఇప్పటి వరకు ఏపీకీ, కేంద్రం ఎంత వరకు నిధులు కేటాయించింది అని ప్రశ్నించిన హైకోర్ట్..
-ప్రధాని ఆవాస్ యోజన పథకం ప్రయోజనాలు ఏంటని అడిగిన హైకోర్ట్..
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలతో అపడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం..
-తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం
- 15 Oct 2020 7:27 AM GMT
Amaravati updates: క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష!
అమరావతి..
-కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో సంస్కరణలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష
-హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్
- 15 Oct 2020 7:24 AM GMT
Visakha updates: కోవిడ్ బాదితుల ఇంట్లో చోరి!
విశాఖ...
-చోడవరం పట్టణంలోని దుడ్డి వీదిలో కోవిడ్ బాదితుల ఇంట్లో చోరి....
-7తులాల బంగారం,50వేల నగదు అపహరించిన దుండగులు....
-కుటుంబలోఒకరి కోవిడ్ రావడంతో అంతా కేజిహెచ్ లో చికిత్స పొందుతున్నారు...
-ఈ క్రమంలో దొంగతనానికి పాల్పడిన దుండగులు...
-తలుపులు పగలగొట్టి దొంగతనం చేసిన దుండగులు...
-విషయం తెలుసుకొని పోలీసులకు పిర్యాదు చేసిన ఇంటి యజమాని సత్యనారాయణ....
-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చోడవరం పోలీసు..
- 15 Oct 2020 7:21 AM GMT
Vijayawada updates: బెజవాడలో మరో దారుణం!
విజయవాడ..
-ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తితో దాడి చేసిన ఉన్మాది
-నేరుగా ఇంటికి వెళ్లి కత్తితో దివ్య తేజస్విని మెడపై పొడిచిన స్వామి
-తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రికి తరలింపు
-ఆ తర్వాత తనను తాను కత్తితో గాయపరచుకున్న నిందితుడు
-యువతి పరిస్థితి విషమం కావటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు
-నిందితుడు పేరు కోటేశ్వర రావు..
-క్రీస్తు రాజపురం లో ఘటన...నిందితుడు పెయింటింగ్ పని చేస్తున్నాడు.
-కొంత కాలం గా తేజస్విని ని ప్రేమ పేరుతో వేధిస్తున్న నిందితుడు కోటేశ్వరరావు
- 15 Oct 2020 7:18 AM GMT
Visakha updates: నక్కపల్లి మండలo రాజయ్యపేట గ్రామంలో మత్యకారులు ఆందోళన..
విశాఖ..
-రాజయ్యపేట గ్రామానికి సంభందించిన ఉప్పుటేరు లో చేపలు చనిపోయిన వైనం
-ఉప్పుటేరు చెరువులో 5000 వేల కుటుంబాలు బ్రతుకుతున్నామని మత్స్యకారులు ఆందోళన
-హెటేరో డ్రగ్స్ కంపెనీ పొల్యూషన్ వాటర్ ఉప్పుటేరు చేరువులలో వదలడం వల్ల చేపలు చనిపోయాయి అని మత్యకారులు ఆందోళన
-ఎన్ని సార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదు అని మత్యకారులు ఆందోళన చెందుతున్నారు
- 15 Oct 2020 7:15 AM GMT
Amaravati updates: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి!
అమరావతి....
-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్ వర్క్ ఆస్పత్రులకు 148.37 కోట్ల రూపాయల నిధులు విడుదల.
-ఉద్యోగులకు హెల్త్ స్కీం కింద 31.97 కోట్లు విడుదల.
-రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ గారికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం.
- 15 Oct 2020 5:53 AM GMT
Vizianagaram updates: ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసన!
విజయనగరం...
-మహారాజ కళాశాలను ప్రైవేటీకరణ చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయం వద్ద నిరసన..
-మాన్సాస్ కార్యలయం వద్దకు వెల్లేందుకు కోట లోపలికి అనమతించని పోలీసులు
-కోటలోకి వెళ్ళేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయుకులను, కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు.
- 15 Oct 2020 5:50 AM GMT
Visakha updates: జలాశయాల ప్రస్తుత పరిస్థితి వివరాలు!
-విశాఖ జిల్లా...
-వర్షపాతం సెంటీ మీటర్ల లో
-చోడవరం 8.6
-బుచ్చయ్యపేట 8.8
-రావికమతం 7.6
-మాడుగుల 7.1
-దేవరాపల్లి 8.6
-కె.కోటపాడు 10.3
-చోడవరం:
-చోడవరం మండలం లోని గవరవరం వద్ద నిర్మించిన తాత్కాలిక కాజేవే వరద ఉధృతి కి దాదాపు 30 మీటర్ల మేర కొట్టుకు పోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది....
-రైవాడ జలాశయం:
-కెపాసిటీ: 114 మీటర్లు
-ప్రస్తుత నీటిమట్టం: 113.80 మీటర్ల కు చేరడంతో జలాశయం నుండి దిగువకు 8842 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు .
-పెద్దేరు జలాశయం:
-గరిష్ట నీటిమట్టం: 137 మీటర్లు
-ప్రస్తుతం నీటిమట్టం: 136.20 మీటర్ల కు చేరడంతో 5204 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేశారు...
-కోనాం జలాశయం..
-జలాశయం లోకి 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో అదనపు నీటిని బొడ్డేరు నదిలోకి విడుదల చేసిన అధికారులు..
- 15 Oct 2020 5:45 AM GMT
Anantapur updates: ఉరవకొండలో కాలువలోకి దూసుకెళ్లిన కారు!
అనంతపురం:
-ఉరవకొండ పట్టణ శివారులో గుంతకల్లు రహదారిపై హంద్రీనీవా పిల్ల కాలువలోకి దూసుకెళ్లిన కారు.
-కాలువలో నీరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం, స్వల్ప గాయాలతో బయట పడ్డ ప్రయాణికులు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire