Live Updates: ఈరోజు (15 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 15 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అమావాస్య ఉ.11-24 తదుపరి శుక్లపక్ష పాడ్యమి | విశాఖ నక్షత్రం రా.7-11 తదుపరి | వర్జ్యం రా.10-56 నుంచి 12-25 వరకు | అమృత ఘడియలు రా.10-58 నుంచి 12-28 వరకు | దుర్ముహూర్తం సా.3-51 నుంచి 4-36 వరకు | రాహుకాలం సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.06-08 | సూర్యాస్తమయం: సా.05-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 Nov 2020 5:47 AM GMT
Visakha Updates: ఫ్యూజన్ ఫుడ్స్ ఖాళీ చేయిస్తున్న vmrda అధికారులు!
విశాఖ....
- విశాఖ సిరిపురంలో vmrda స్థలంలో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ ఖాళీ చేయిస్తున్న, vmrda అధికారులు
- భారీగా పోలీసులు మోహరింపు.
- ఎలాంటి నోటీసు ఇవ్వకుండా 2024 వరకు, లీజు ఉన్నప్పటికీ నోటీసులు, సమాచారం ఇవ్వకుండా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు అంటూ యజమాని హర్ష ఆరోపణ.
- లీజు అయిపోవడంతోనే ఖాళీ చేయిస్తున్నారు అంటున్న అధికారులు
- 15 Nov 2020 3:38 AM GMT
Amaravati updates: రాజాగారి మరణం పార్టీకి తీరణి లోటు...
అమరావతి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు స్క్రోలింగ్ పాయింట్స్:
• తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి. రాజా గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
• తణుకు ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునిగా నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరనీయం.
• రాజాగారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.
• ఎల్లవేళలా ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది.
• రాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున భగవంతున్ని ప్రార్థిస్తున్నా.
- 15 Nov 2020 3:07 AM GMT
Vijayawada Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..
విజయవాడ...
- విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన కోర్కెల పరిష్కారానికి చర్యలు చేపట్టండి.
- గత నెల 19 నుండి విద్యుత్ ఉద్యోగులు జేఏసీగా ఆందోళన చేపట్టారు.
- యాజమాన్యం, జెఏసిల మధ్య అక్టోబరు 28న జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
- దీంతో విద్యుత్ ఉద్యోగులు పోరాటానికి సమాయత్తమవుతున్నారు.
- 2003 విద్యుత్ చట్టానికి 2020 పేరుతో సవరణలు చేయటం తగదు.
- జెన్కో ఆధ్వర్యంలోని ఆర్టీపీపీలో, ఎన్ టి పి ఎస్ లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో ప్రారంభించాలి.
- కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.
- 15 Nov 2020 3:01 AM GMT
Somashila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...
నెల్లూరు:
-- ఇన్ ఫ్లో 7657 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 3770 క్యూసెక్కులు.
-- ప్రస్తుత నీటి మట్టం 75.942 టీఎంసీలు. పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు.
- 15 Nov 2020 2:19 AM GMT
Vizianagaram Updates: గిరిపుత్రులకు తప్పని డోలీ కష్టాలు..
విజయనగరం...
- అర్దరాత్రి గర్బిణి మహిళకు పురిటినొప్పులు రావడంతో టార్చిలైట్లతో డోలీలో 10 కిలోమీటర్ల కొండదించిన వైనం.
- దబ్బగుంట వరకు డోలీలో మోసుకుంటూ వచ్చి అక్కడ నుండి ఆటోలో శృంగవరపుకోట హస్పటలకు తరలింపు.
- రహదారి సౌకర్యం లేక అను నిత్యం గిరిజనులకు వైద్యం కోసం తప్పని డోలీ మోతలు.
- 15 Nov 2020 2:17 AM GMT
East Godavari Updates: పిఠాపురం మండలం లక్మినరసాపురంలో కోళ్ల ఫారం దగ్ధం..
తూర్పు గోదావరి జిల్లా....
- బాణాసంచా పడి కాలినట్లుగా చెబుతున్నా స్థానికులు..
- సుమారు 5వందల కోళ్ళకు పైగా దగ్ధం, మంటలను అదుపుచేస్తూన్న ఫైర్ సిబ్బంది.
- 15 Nov 2020 2:11 AM GMT
Krishna District Updates: గౌడపేటలో అగ్నిప్రమాదం...
కృష్ణాజిల్లా, గన్నవరం
- టపాసు రవ్వలు పడి ఓ పూరిల్లుకు అంటుకొని చెలరేగిన మంటలు
- మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
- 15 Nov 2020 2:06 AM GMT
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!
తిరుమల సమాచారం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 23,232 మంది భక్తులు.
- తలనీలాలు సమర్పించిన 8,400 భక్తులు.
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.55 కోట్లు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire