Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్వతంత్ర దినోత్సవ సందేశం

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • ఉమ్మ‌డి ఆదిలాబాద్‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు
    15 Aug 2020 7:53 AM GMT

    ఉమ్మ‌డి ఆదిలాబాద్‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలు

    నిర్మల్ కలెక్టరెట్ లో జాతీయ జెండాను అవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..

    పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి..

    కుమ్రంబీమ్ జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను అవిష్కరించిన. విప్ అరికెపూడి గాందీ..

    ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను అవిష్కరించిన విప్ కర్నెప్రభాకర్. పాల్లోన్నా ఎమ్మెల్యే జోగురామన్న , కలెక్టర్ సిక్తాముఖి

  • ప్ర‌తి ఎకరానికీ నీరందించ‌డ‌మే కేసీఆర్ ల‌క్ష్యం: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
    15 Aug 2020 7:50 AM GMT

    ప్ర‌తి ఎకరానికీ నీరందించ‌డ‌మే కేసీఆర్ ల‌క్ష్యం: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

    నిజామాబాద్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్

    ఎందరో మహాను బావుల త్యాగాల వల్ల స్వాతంత్యం వచ్చింది

    సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.

    ఆసరా, కళ్యాణ లక్ష్మీ, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ , రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి.

    కాళేశ్వరం ద్వారా తెలంగాణలోని ప్రతి ఎకరాకు నిరందించే లక్ష్యం పూర్తవుతొంది.

  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన
    15 Aug 2020 7:46 AM GMT

    ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన

    కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన

    మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పొంగిన వాగులు ..చెరువులు

    సైదాపూర్ మండలం లో వరద ఉదృతి...ఆవునూర్ ..గొల్లగూడెం మధ్య నిలిచిపోయిన రాకపోకలు

    తిమ్మాపూర్ మండలం లోని అలుగునూర్ రామకృష్ణ కాలనీ లో ఇళ్లల్లోకి చేరిన నీరు....

    నల్లగొండ ,మక్త పల్లి, లక్ష్మీదేవి పల్లి ,నేదునూరు గ్రామాలలో చెరువులో మత్తడి పడి 40 ఎకరాల వరి పొలం నీటిమట్టం.

    బెజ్జంకి మండలం తోటపల్లి చెరువుకు మత్తడి 50 ఎకరాల పంట పొలం నీటిమట్టం.

    రాత్రి కురిసిన భారీ వర్షానికి రేణికుంట మోయతుమ్మెద వాగులో భారీగా పెరిగిన నీటి ప్రవాహం.

  • సిరికొండ , ధర్పల్లి మండల మధ్య నిలిచిపోయిన రాకపోకలు...
    15 Aug 2020 7:45 AM GMT

    సిరికొండ , ధర్పల్లి మండల మధ్య నిలిచిపోయిన రాకపోకలు...

    నిజామాబాద్ : సిరికొండ మండలంలో కురిసిన వర్షం ప్రవహిస్తున్న కప్పల వాగు..

    వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన కొండూరు వద్ద కప్పల వాగు పై తాత్కాలికంగా నిర్మించిన బ్రిడ్జి వంతెన

    సిరికొండ , ధర్పల్లి మండల మధ్య నిలిచిపోయిన రాకపోకలు...

  • లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లు ఎత్తిన అధికారులు
    15 Aug 2020 7:43 AM GMT

    లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లు ఎత్తిన అధికారులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా:  లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లు ఎత్తిన అధికారులు

    పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

    ప్రస్తుత సామర్థ్యం 98.70 మీటర్లు

    పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

    ప్రస్తుత సామర్థ్యం 12.230 టీఎంసీ

    ఇన్ ఫ్లో 4,85,500 క్యూసెక్కులు

    ఓట్ ఫ్లో 4,41,000 క్యూసెక్కులు

  • నల్లొండ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం
    15 Aug 2020 7:41 AM GMT

    నల్లొండ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

    నల్గొండ: కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామశివారులో ఆగి ఉన్న డిసిఎమ్ ను డీ కొట్టిన కారు.. ప్రమాదం లో ఇద్దరు మృతి

  • హైదరాబాద్ బస్ భవన్ లో 74 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..
    15 Aug 2020 7:39 AM GMT

    హైదరాబాద్ బస్ భవన్ లో 74 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

    వేడుకల్లో పాల్గోని జాతీయ జెండా ఆవిష్కరించిన ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ...

    పాల్గొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు- తదితరులు...

    ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ అన్ని సేవల్లో రవాణా రంగం కీలకమని విద్యార్థులు ఉపాధ్యాయులు, కార్మికులకు మెరుగైన సేవలు అందించడమే పరమావధిగా ఆర్టీసీ ముందుకు వెళ్తుందన్నారు...

    సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ నేతృత్వంలో ఆర్టీసీ లో ఆదాయాన్ని రబట్టడానికి కార్గో ,పార్శిల్ సర్వీసులతో పాటు ,రిటైల్ అమ్మకాల్లో పెట్రోల్ బంకులు ప్రారంభించాన్నారు...

    రాఖిల పండగ సందర్భంగా పార్శిల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయన్నారు...

    జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు ఆర్టీసీ సొంతమని నూతన ఆదాయ మార్గాల్లో సేవల్లో ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు...

  • అధికారులకు చుక్కలు చూపించిన కరోనా బాధితుడు
    15 Aug 2020 7:36 AM GMT

    అధికారులకు చుక్కలు చూపించిన కరోనా బాధితుడు

    ఖమ్మం జిల్లా: మూడు రోజుల గాలింపు అనంతరం ఎట్టకేలకు పట్టుకుని క్వారంటైన్ సెంటర్ కి తరలించిన పోలీసులు

    ఖమ్మం గ్రామీణం మండలం మద్దులపల్లి కరోనా క్వారంటైన్ కేంద్రం నుంచి బాధితుడి పరారీ

    గురువారం క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయిన చింతకాని మండలానికి చెందిన వ్యక్తి

    ఖమ్మం గ్రామీణం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కోవిడ్ సెంటర్ అధికారులు

    ఖమ్మం రూరల్ మండలంమద్దుల పల్లి కోవిడ్ కేంద్రం నుండి తప్పించుక పోయిన కోవిడ్ బాదితుడిని పట్టుకున్న రూరల్ పోలీసులు...

    తెల్దారుపల్లి సమీపంలో ఓ పొలంలో తలదాచుకున్న బాధితుడు

    మూడు రోజులుగా తిండి లేకుండా వర్షంలోనే తడిసి ముద్దైన బాధితుడు

    క్వారంటైన్ కేంద్రంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులతోనే పారిపోయినట్లు చెబుతున్న బాధితుడు

  • మెదక్ కలెక్టరేట్ లో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి  తలసాని
    15 Aug 2020 7:34 AM GMT

    మెదక్ కలెక్టరేట్ లో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి తలసాని

    మెదక్ :మెదక్ కలెక్టరేట్ లో జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్ర పశు సంవర్ధక,మత్స్య,సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్..పాల్గొన్న ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి,మదన్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్

    -మంత్రి తలసాని కామెంట్స్: 

    # జెండా పండుగను సంతోషంగా దేశవ్యాప్తంగా చేసుకుంటారు

    #సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి దిశగా వెళ్తోంది

    #గత పాలకులు తెలంగాణ అభివృద్ధి నిర్లక్ష్యం చేసాయి. 

    #తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది..వారి ఆశయాలను సాధిస్తాం

    #దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

    #తెలంగాణ అభివృద్ధి ని చూసి వారుణదేవుడు కూడా కరుణిస్తున్నాడు

    #తెలంగాణ లో కుల వృత్తులు అభివృద్ధి చెడుతున్నాయంటే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే

    #ఒక్కప్పుడు మెదక్ జిల్లా ఎడ్యుకేషన్ లో వెనుకబడింది..ప్రస్తుతం 33 శాతం పెరిగింది.

    #పేద విద్యార్ధులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం.విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని మధ్యాహ్న భోజన పథకం అమలు చేశాం.

    #నియంత్రణ సాగు ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.

    #రైతులకు పెట్టుబడి ఇవ్వాలనే గొప్ప సంకల్పం గల నాయకుడు కేసీఆర్

    # మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటి ఇంటికి తాగునీరు అందిస్తున్నాం

    #గర్భిణీలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నాము

    #షాధిముభారక్ ,కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా పేద ఆడపిల్లలకు అదుకుంటుంది తెలంగాణ సర్కార్

    #కరోనా ను అదుపు చేయడంలో తెలంగాణ సర్కారు అన్ని రకాల చర్యలు చెవుడుతుంది.

    #ఎస్సి,ఎస్టీ,బిసి,మైనార్టీ వర్గాల కోసం తెలంగాణ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది తెలంగాణ సర్కార్

    #వర్షాలు లేక ,గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసున్న పరిస్థితి ఉండేది.ప్రస్తుతం లేదన్నారు...

  • స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నవ తెలంగాణ నిర్మాణం సాగాలి: కోదండరాం
    15 Aug 2020 7:29 AM GMT

    స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నవ తెలంగాణ నిర్మాణం సాగాలి: కోదండరాం

    నాంపల్లి జనసమితి కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన కోదండరాం, హాజరైన పార్టీ కార్యకర్తలు నాయకులు.

    మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలందరికీ 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

    స్వాతంత్ర దినోత్సవం అని గుర్తు చేసుకోవడం అంటే సుదీర్ఘకాలంగా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకోవడమే.

    ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిగా పెద్ద ఎత్తున స్వాతంత్ర్య పోరాటం కొనసాగింది.  తో 

    బిర్సాముండా తిరుగుబాటుతో తో ప్రారంభమై... మొదటి స్వాతంత్ర పోరాటం తో ప్రజా ఉద్యమంగా మారింది.

    ఆధునిక ప్రజాస్వామ్య విలువలతో పోరాటం నడిచి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము.

    ఈ పోరాటంమే భారతదేశానికి ప్రజాస్వామ్య విలువలని, సామాజిక న్యాయాన్ని పరిచయం చేసింది.

    స్వేచ్ఛ అంటే మనిషికి సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి, విముక్తి కాదు... పేదరికం నుంచి ఆధిపత్యం నుంచి దోపిడీ నుంచి విముక్తి లభించడం.

    ఆ స్వేచ్ఛ కోసమే మనకు రాజ్యాంగం లో ఆదేశ సూత్రాలు వచ్చాయి.

    ఆధిపత్యం నుంచి స్వేచ్ఛ కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది.

    స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం సాగింది.

    స్వాతంత్రోద్యమ స్ఫూర్తిగా నవ తెలంగాణ నిర్మాణం సాగాలి.

    భారత రాజ్యాంగం స్వాతంత్రోద్యమ విలువల ప్రతీక.

    రాజ్యాంగాన్ని చక్కగా అమలు చేయడం ద్వారా ఆధునిక భారత నిర్మాణాన్ని... నవ్య తెలంగాణ నిర్మించుకోవడం సాధ్యమవుతుంది.

    ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణ కర్తవ్యంగా భావించాలి.

Print Article
Next Story
More Stories