ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్వతంత్ర దినోత్సవ సందేశం
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 Aug 2020 11:00 AM GMT
లోయర్ మానేరు డ్యామ్ లోకి భారీగా చేరుతున్న వరద నీరు
కరీంనగర్ :
- రోజుకి టిఎంసి చొప్పన వరద ఎల్ ఎం డి ప్రాజెక్టు వస్తున్నట్టుగా తెలిపిన అధికారులు
- రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరింతగా వరద పెరిగే అవకాశం...
- 15 Aug 2020 10:10 AM GMT
పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టు జలకళ ....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
- పూర్తిస్థాయి నీటిమట్టం :8.4 టీఎంసీలు.
- ప్రస్తుత నీటిమట్టం :7.65 టీఎంసీలు .
- పూర్తిస్థాయి నీటిమట్టం :407.అడుగులు .
- ప్రస్తుత నీటి మట్టం : 404.50 అడుగులు .
- ఇన్ ఫ్లో...:70000 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో..:78000 క్యూసెక్కులు
కిన్నెరసాని జలకళ...
- గత నాలుగు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు (12)గేట్లు ఎత్తి 78వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నా అధికారులు .... దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
- 15 Aug 2020 10:09 AM GMT
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
- మల్హార్ మండలంలోని ఉదృతంగా ప్రవహిస్తున్న ఆరే వాగు..
- వంతెన పైనుండి ప్రవహిస్తున్న వరద నీరు...
- పలు గ్రామాలకు నిలిచిపోహీన రాకపోకలు..
- 15 Aug 2020 10:08 AM GMT
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
- టేకుమట్ల మండలం కుందనపల్లి వాగులో చిక్కుకున్న 12మంది రైతులను కాపాడేందుకు పోలీసులు, రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నాలు విఫలం..
- ఉదృతంగా ప్రవర్తిస్తున్న చలివాగు..
- విషయం KTRకు ఫోన్లో తెలియ పర్చిన జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, స్థానిక MLA గండ్ర వెంకటరమణారెడ్డి...
- రైతులను కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేసిన KTR... మరికొద్ది సేపట్లో సంఘటన స్థలానికి చేరుకొనున్న హెలికాప్టర్..
- రానున్న మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో రైతులు ఎవ్వరు బయటకు వెళ్లవద్దని సూచించిన సీఎం కేసీఆర్.
- 15 Aug 2020 10:07 AM GMT
బ్రేకింగ్..
- భూ వివాదం లో కీసర్ ఎమ్మార్వో నాగరాజు ఇతర ముగ్గురు నిందితుల అరెస్ట్
- అంజిరెడ్డి, శ్రీనాథ్, విఆర్యే సాయిరాజ్
- నాంపల్లి ఏసీబీ కార్యాలయం నుండి వైద్యపరీక్షలకు తరలింపు
- వైద్యపరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పర్చనున్న ఏసీబీ అధికారులు
- 15 Aug 2020 9:51 AM GMT
సూర్యాపేట జిల్లా :
- మూసి ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువలకు సాగు నీటిని విడుదల చేసిన మంత్రి జగదీష్ రెడ్డి ..పాల్గొన్న ఎంపీ బడుగుల లింగయ్య యదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,
- 15 Aug 2020 8:32 AM GMT
ఎమ్మార్వో ఇంటిలో కొనసాగుతున్న సోదాలు
ఏసిబి ఆపేడ్స్: కీసర ఎమ్మార్వో కేసులో బయటపడుతున్న అక్రమాస్తులు..
ఎమ్మార్వో ఆస్తులు 100 కోట్ల పైచిలుకు ఉంటుందని ఎసిబి అంచనా.
ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు అమ్మకాలు జరిపిన నాగరాజు.
హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్దగా ఆస్తులు కొనుగోలు.
ఎమ్మార్వో ని పట్టుకున్న సంఘంలో కోటి ఇరవై ఎనిమిది లక్షలు స్వాధీనం..
ఇంటిలో సోదా చేయగా 28 లక్షల రూపాయల నగదు లభ్యం..
ఎంఆర్ఓ నాగరాజ్ ఇంట్లో బంగారు ఆభరణాలు ..
రెండు బ్యాంకుల లాకరు స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు.
Vra దగ్గర ఐదు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న ఎసిబి.
వివాదాస్పద ఇరవై ఎనిమిది ఎకరాల భూమిని ఒకరికి కట్టబెట్టేందుకు లంచం డిమాండ్.
రెండు కోట్ల రూపాయల వరకు లంచాన్ని డిమాండ్ చేసిన నాగరాజ్.
శామీర్ పెట్ లో గెస్ట్ హౌస్ నిర్మించి ఇవ్వాలని షరతు విధించిన నాగరాజు...
అంజిరెడ్డి శ్రీనాథుడు కలిసి ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండు ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం.
ల్యాండ్ పట్టా పాస్ బుక్ లో కోసం నాగరాజు కు రెండు కోట్లు లంచాన్ని ఆఫర్ చేసిన బ్రోకర్స్....
- 15 Aug 2020 8:27 AM GMT
భూ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించాం: మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ : బొమ్మకల్ భూ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు
బొమ్మకల్ భూ ఆక్రమణలకు సంబంధించిన విచారణ పారదర్శకంగా జరుగుతోంది ...
ఎవరు భూ ఆక్రమణలకు పాల్పడ్డా చర్యలు తప్పవు
కరీంనగర్ జిల్లా అధికారులు కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ ఆధ్వర్యంలో రెండు టీములు విచారణ జరుపుతున్నాయి
ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు స్థలాల సొంతదారులకు రక్షణ కల్పించాల్సిన కూడా ప్రభుత్వనిదే...
- 15 Aug 2020 8:24 AM GMT
మేడ్చల్: గుండ్ల పోచంపల్లి లో కరోనా తో నిమ్మ రాజమణి అనే వృద్దురాలి ( 70) మృతి..కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాకపోవడంతో అంతక్రియలు నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది
- 15 Aug 2020 8:22 AM GMT
మంత్రి సోలిపేట కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు పోచారం, బిబిపాటిల్
సిద్దిపేట: చిట్టపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే రామలింగ రెడ్డి కుంటుంబ సభ్యులను పరామర్శించి,ఆయన చిత్ర పటానికి పులామాల వేసి నివాళులర్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి... జహీరాబాద్ ఎంపీ బిబిపాటిల్..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire