Live Updates: ఈరోజు (సెప్టెంబర్-14) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 14 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | ద్వాదశి (రా. 10-01వరకు) తదుపరి త్రయోదశి | పుష్యమి నక్షత్రం (మ. 1-22 వరకు) తదుపరి ఆశ్లేష | అమృత ఘడియలు: ఉ.6-57 నుంచి 8-33 వరకు | వర్జ్యం: రా.1-55 నుంచి 3-30 వరకు | దుర్ముహూర్తం: మ.12-20 నుంచి 1-09 వరకు తిరిగి మ. 2-47 నుంచి 3-36 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 సూర్యాస్తమయం: సా.6-03
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 14 Sep 2020 2:45 PM GMT
BATHUKAMMA FESTIVAL: అక్టోబర్ 16న బతుకమ్మ పండుగ ప్రారంభం
అక్టోబర్ 16న బతుకమ్మ పండుగ ప్రారంభం: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత
అక్టోబర్ 16 నుండి 24 వరకు బతుకమ్మ పండుగను జరుపుకోవాలని సూచించిన మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
బతుకమ్మ పండుగ తేదీలపై మాజీ ఎంపీ కవితను కలసిన ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలోని సిద్ధాంతులు, పండితులు
అధిక ఈశ్వీయుజ మాసం కారణంగా శాస్త్ర ప్రకారం పండుగ తేదీల్లో మార్పు: పండితులు
- 14 Sep 2020 2:41 PM GMT
Osmania University Exams Postpone: ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల వాయిదా
తెలంగాణ లో ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల వాయిదా
- అనివార్య పరిస్థితుల వల్ల ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రేపు ఎల్లుండి జరగబోయే ఇంజనీరింగ్,బీసీఏ,బి ఫార్మసీ, బీహెచ్ఎంసీటీ,బీసీటీసీఏ పరీక్షలు వాయిదా
- తదుపరి షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించిన ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినేషన్..
- ఈనెల 17 నుండి జరిగే పరీక్షలు యధాతథం
- 14 Sep 2020 12:01 PM GMT
Hyderabad updates: కార్పొరేషన్ ద్వారా తీసుకునే లోన్లు 90శాతం నుండి 200 శాతానికి పెంచుకుంటున్నారు..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క @ గన్ పార్క్
-దీనివల్ల రెవెన్యూ రిసిప్ట్స్ కి లక్షా 10వేల కోట్లు గ్యారెంటీ పెట్టారు
-ఇప్పటికే ఉన్న అప్పులకు ఈ అప్పులు కలిపి 2020కల్లా 5లక్షల 87వేల 536 వేల కోట్లు అవుతుంది
-ఇప్పటికే అప్పు, వడ్డీ కలిపి 23 వేల కోట్లు కడుతున్నాం
-కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
-ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే సమస్య పరిష్కారం కాదు
-ఏకపక్షంగా బిల్లులు ఆమోదించుకుంటున్నారు
-ఈ మూడేళ్ళలో సర్వే చేయకుండా కేసీఆర్ ఇప్పుడు తన వైఫల్యాలను కప్పి పుచుకునే కార్యక్రమాలు చేస్తున్నాడు
-గతంలో కేసీఆర్ వీఆర్వో, ఎమ్మార్వోలకు బాగా పని చేస్తున్నారని బోనస్ ఇచ్చారు
-77 వేల ఎకరాల్లో 54 వేల ఎకరాలు కబ్జాకు గురైందని కేసీఆర్ చెప్పారు
-ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు
ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబు
-ప్రభుత్వ యూనివర్సిటీలను పతిష్టం చేసి అభివృద్ధి చేయాలని, నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది
-అనుమతి ఇచ్చిన 5 ప్రయివేట్ యూనివర్సిటీల్లో మూడు టీఆరెస్ పార్టీకి చెందిన వ్యక్తులవే
- 14 Sep 2020 11:54 AM GMT
Sravani Case Updates: శ్రావణి 2012లో హైదరాబాద్ కి వచ్చింది..ఏఆర్ శ్రీనివాస్ డిసిపి..
ఏఆర్ శ్రీనివాస్ డిసిపి వెస్ట్ జోన్ మాసబ్ ట్యాంక్..
-టీవీల్లో పనిచేయాలని వచ్చింది..
-2015లో సాయి కృష్ణ రెడ్డి పరిచయం అయ్యాడు..
-ఆ తరువాత నిర్మాత అశోక్ రెడ్డి పరిచయం అయ్యాడు..
-2019లో దేవరాజ్ రెడ్డి తో పరిచయం ఏర్పడింది..
-దేవరాజ్ తో దూరం గా ఉండలాని పలు సందర్భాల్లో గొడవ పడ్డాడు సాయి..
-దేవరాజ్ తో మాట్లాడకూడదు అని శ్రావణి తల్లి తండ్రులు సైతం వేదించారు...
-శ్రావణి ని సాయి ,తల్లిదండ్రులు కొట్టారని చెప్పాడు దేవరాజ్..
-దేవరాజ్ దూరం పెట్టడం వల్ల ఆ అమ్మాయి మనస్తాపం తో ఆత్మహత్య చేసుకుంది...
-A1 sai
-A2 ashok reddy
-A3 devaraj
-సాయి దగ్గర ఉన్న ఫొటోలతో శ్రావణిని బెదిరించాడు..
-శ్రావణి ని దక్కని కారణంగానే సాయి బెదిరింపులు,వేధింపుల తో ఆమె ఆత్మహత్య చేసుకుంది..
-మొత్తం ముగ్గిరి టార్చర్ భరించలేక మనస్తాపం చెంది శ్రావణి ఆత్మహత్య చేసుకుంది...
-అశోక్ రెడ్డి పరారీలో ఉన్నడు... అదుపులోకి తీసుకొని రిమాండ్ చేస్తాము...
- 14 Sep 2020 11:47 AM GMT
Hyderabad Weadher Updates: అల్పపీడనం దక్షిణ తెలంగాణ పై అధికంగా ప్రభావం చూపుతుంది.... శ్రావణి వాతావరణ అధికారిణి..
శ్రావణి వాతావరణ అధికారిణి @ హైదరాబాద్
-ఉత్తర కోస్తా పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం గా కొనసాగుతుంది...
-ఈ తీవ్ర అల్పపీడనం దక్షిణ తెలంగాణ పై అధికంగా ప్రభావం చూపుతుంది....
-ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ జిల్లాలో ఇవాళ ,రేపు తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్లా భారీ నుండి అతి భారీ వర్షాలు ,తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...
-ఈ తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది..
-ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ,సూర్యాపేట , మహబూబ్ బాద్ మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ,నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- 14 Sep 2020 11:39 AM GMT
Secunderabad updates: సికింద్రాబాద్ రైలు నిలయం రెండు రోజుల పాటు షట్ డౌన్..
సికింద్రాబాద్..
-సికింద్రాబాద్ రైలు నిలయం రెండు రోజుల పాటు షట్ డౌన్..
-ఈరోజు, రేపు రైలు నిలయం సానిటైజ్ చేయాలని నిర్ణయం..
-రైలు నిలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో 40 వరకు కరోనా పాజిటివ్ కేసులు..
- 14 Sep 2020 11:35 AM GMT
Medak ACB Updates: మెదక్ అడిషనల్ కలెక్టర్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం...
ఏసీబీ అప్ డేట్స్.....
-ఐదుగురు నిందితులను కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసిన ఏసీబీ..
-నర్సాపూర్ అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు 4 నిందితులను 5 రోజుల పాటు కస్టడీ కి కోరిన ఏసీబీ.
-నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్న ఏసీబీ..
-మాజీ కలెక్టర్ పాత్ర పై ఆరా తీస్తున్న ఏసీబీ..
-స్టాంప్ అండ్ రీజిస్టేషన్ కు మాజీ కలెక్టర్ రాసిన లేఖ ద్వారా మాజీ కలెక్టర్ పాత్ర పై వివరాలు సేకరిస్తున్న ఏసీబీ..
- 14 Sep 2020 10:30 AM GMT
Telangana updates: మోడీ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్చకు భంగం కలిగిస్తోంది.. నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి..
నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి..
-దేశంలో మేధావులు, కమ్యూనిస్టులు, పౌర హక్కులనేతలపై అక్రమ కేసులు అపకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తాం
-ఆర్ ఎస్ ఎస్ ఐడియాలజీని దేశంపై రుద్దాలని చూస్తున్నారు....
-సీతారాం ఏచూరిపై పెట్టిన కేసును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
-అక్రమ కేసులను వెంటనే ఉప సంహరించుకోవాలి
- 14 Sep 2020 10:21 AM GMT
Telangana Legislative Council: 7 మండలాలను ఏపీ లో కలిపి , మోడీ ప్రభుత్వం తెలంగాణ కు శాశ్వత నష్టం చేసింది..సీఎం కేసీఆర్.....
శాసన మండలి లో సీఎం కేసీఆర్.....
-అసలు ఇప్పుడు తెలంగాణ లో భూస్వాములే లేరు..
-యస్సీ ,యస్టీ ,బీసీ ల చేతులలోనే 90శాతం పైగా భూములు ఉన్నాయి..
-25 ఎకరాల పైబడి ఉన్న రైతులు కేవలం 6679 మంది మాత్రమే..
ఎన్. రాంచందర్ రావు... బీజేపీ ఎమ్మెల్సీ
-రిజిస్ట్రేషన్ కాకుండా కబ్జా లో ఉన్నా భూముల పరిస్థితి ఏంటీ..
-గ్రామ స్థాయి లో రెవెన్యూ పరిపాలన ఎవరు చూస్తారు..
జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ
-అవినీతి వీఆర్వో లకు మాత్రమే పరిమితం కాదు.. ఎమ్మార్వో ,ఆర్డీవో లు కూడా ఉన్నారు.. వారి సంగతి ఏంటీ..
-రెవెన్యూ బిల్లు ను సెలక్ట్ కమిటీ కి పంపించాలి.
-వీఆర్వో లను ఇతర శాఖలో విలీనం చేయడం వల్ల..6వేల మంది నిరుద్యోగులకు నష్టం జరుగుతుంది..
- 14 Sep 2020 10:08 AM GMT
Hyderabad updates: ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద వామపక్ష పార్టీల నిరసన..
తమ్మినేని వీరభద్రం..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి..
-ఢిల్లీ లో సీఏఏ ఎన్నర్సీ కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ దాఖలు..
-సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తో మరో 8మంది మేధావుల పేర్లు చేర్చడం పట్ల వామపక్ష పార్టీల నిరసన..
-ఏచూరి పై కేసును కమ్యూనిస్టుల మీద దాడిగా చూడాల్సి వస్తుంది.
-నిర్బందాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
-మేధావులపై , ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి బెదిరించాలని మోడీ సర్కారు కుట్ర చేస్తుంది.
-బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు ఆపేవరకు వామపక్ష పార్టీ ల పోరాటం ఆగడు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire