Live Updates: ఈరోజు (14 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 14 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి ఉ.08-20 వరకు తదుపరి త్రయోదశి | పుబ్బ నక్షత్రం రా.06-56 వరకు తదుపరి ఉత్తర | వర్జ్యం: రా.01-43 నుంచి 03-13 వరకు | అమృత ఘడియలు మ.12-49 నుంచి 01-18 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-17 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-30 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 14 Oct 2020 9:00 AM GMT
Ranga Reddy district updates: మైలార్ దేవుపల్లి లోని పల్లెచెరువుకు గండి...
రంగారెడ్డి , రాజేంద్రనగర్...
-చెరువు పూర్తిగా నిండడంతో కట్ట తెగి కిందకు వెళ్తున్న వరద..
-ఏ క్షణమైనా పూర్తిస్థాయిలో చెరువు కట్ట ధ్వంసమయ్యే అవకాశం...
-తీవ్ర భయాందోళన లో లోతట్టు ప్రాంతాల ప్రజలు
-అల్ జుబేల్ కాలనీ , అలీ నగర్ , గాజీ మిలన్ కాలనీ , నింరా కాలనీ , ఉప్పుగూడా , లలితా బాగ్ లోని లోతట్టు ప్రాంతాలు నీట్ మునిగే అవకాశం...
-అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు..
-సంఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ , మున్సిపల్ , పోలీస్ అధికారులు...
- 14 Oct 2020 8:56 AM GMT
Ranga Reddy updates: లష్కర్ గూడ కార్ లో ఇద్దరూ గల్లంతు..
రంగారెడ్డిజిల్లా...
-అబ్దుల్లా పూర్ మెట్ మండలంలోని లష్కర్ గూడ వాగు లో కొట్టుకుపోయిన కారు ఘటనలో మాధారం వెంకటేష్ గౌడ్
-మృతదేహం 3 కిలోమీటర్ల దూరం లో లభ్యం
-గాలింపు చర్యలు ముమ్మరం చేసిన అధికారులు
-ఇంకో వ్యక్తి కోసం గాలిస్తున్న పోలీసులు
-ఆందోళన లో కుటుంబ సభ్యులు
- 14 Oct 2020 8:52 AM GMT
Kinnerasani River updates: పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టు జలకళ ....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ....
-పూర్తిస్థాయి నీటిమట్టం :8.4 టీఎంసీలు.
-ప్రస్తుత నీటిమట్టం :8.19 టీఎంసీలు .
-పూర్తిస్థాయి నీటిమట్టం :407.అడుగులు .
-ప్రస్తుత నీటి మట్టం : 406.30అడుగులు .
-ఇన్ ఫ్లో...:6000 క్యూసెక్కులు
-అవుట్ ఫ్లో..: 6000. క్యూసెక్కులు
-(2)గేట్లు ఎత్తి 6వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నా అధికారులు ....
-దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
- 14 Oct 2020 8:44 AM GMT
Hyderabad updates: వరద ఉధృతి పరిస్థితులను పరిశీలించిన అంజనీకుమార్..
హైదరాబాద్..
పాతబస్తీ..
-జంట నగరాలతో పాటు పాతబస్తీలో వరద ఉధృతి పరిస్థితులను పరిశీలించిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్..
-ఫలక్నామా, చంద్రయన గుట్ట ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న 15 మందిని కాపాడాము..
-లోతట్టు ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్నవారిని రెస్క్యూ టీమ్, జిహెచ్ఎంసి పోలీసులు సంయుక్తంగా కలిసి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు.
-ప్రజలు భయాందోళనకు గురి అవల్సిన అవసరం లేదు.
-పడవల ద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నలు కొనసాగుతున్నాయి
- 14 Oct 2020 8:40 AM GMT
Hyderabad updates: హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు..
-హైదరాబాద్-కర్నూలు హైవే తెగడంతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు..
-ఓఆర్ఆర్‌పై నుంచే వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
-మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు టోలిచౌకి ప్లైఓవర్ వాడొద్దని చెప్పారు.
-దీనికి బదులు సెవెన్ టోంబ్స్ నుంచి వెళ్లాలని ప్రయాణీకులను పోలీసులు కోరారు.
-పురానాపూల్ 100 ఫీట్ రోడ్డును పూర్తిగా మూసి వేశారు. ఇక్కడి నుంచే వెళ్లే వాహనాలను కార్వాన్ నుంచి మళ్లిస్తున్నారు.
-మలక్‌పేట్ ఆర్‌యూబీ రోడ్ బ్లాక్ అయ్యింది.
-దీంతో ఈ మార్గాన వచ్చే వాహనాలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.
-మూసీ ఉప్పొంగడంతో మూసారాం బాగ్ బ్రిడ్డి దగ్గర ట్రాఫిక్ బ్లాక్ అయ్యింది.
-ఇటు వైపు రావొద్దని పోలీసులు వాహనదారులకు సూచించారు.
-మలక్‌పేట్ వద్ద నాలా పొంగడంతో మలక్‌పేట్-ఎల్బీనగర్ మార్గం పూర్తిగా బ్లాక్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు
- 14 Oct 2020 8:36 AM GMT
Musi Project updates: ప్రమాదపుటంచున మూసీ ప్రాజెక్టు...
-రికార్డు స్థాయిలో మూసీ ప్రాజెక్టు కు వరద నీరు ...దాదాపు రెండు లక్షల ఇన్ ఫ్లో ...
-మూసీ ప్రాజెక్టు సామర్ధ్యానికి మించి ఇన్ ఫ్లో...
-అన్ని గేట్లు ఓపెన్ చేసిన కష్టంగా అవుట్ ఫ్లో ...
-మూసీ ప్రాజెక్టు చెరువనా రత్నపురం వద్ద మూసీ ఆనకట్టకు గండి కొట్టిన అధికారులు...
-హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి ,మేడ్చల్ ,యాదాద్రి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు...
-ఎగవన భారీ వర్షాలతో మూసీ నది లోకి భారీగా వస్తున్న వరద నీరు..
-మూసీ నది ఉధృతి తో ...బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట , నార్కెట్‌పల్లి మండలాల్లో వందల గ్రామాలకు నిలిచిన రాకపోకలు...
- 14 Oct 2020 8:32 AM GMT
Musi Project updates: మూసీ ప్రాజెక్టు దిగువన వరద నీరు ఎపెక్ట్...
సూర్యాపేట జిల్లా :
-హుజూర్ నగర్ మండలం లింగగిరి నూతన బ్రిడ్జి నిర్మాణం లో ఉండగా తాత్కాలిక బ్రిడ్జి పై నుండి భారీగా ప్రవహిస్తున్న వరద నీరు హుజూర్నగర్ లింగగిరి రాకపోకలు అంతరాయం...
-గరిడేపల్లి, హుజూర్ నగర్ మండలం లో నీట మునిగిన పంట పొలాలు...
- 14 Oct 2020 8:28 AM GMT
Hyderabad updates: చందానగర్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు...
-చందానగర్ లో సెల్లార్ వరకు పూర్తిగా మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు...
-సహాయం కోసం కాలనీవాసుల ఆర్తనాదాలు...
-కింద ఫ్లోర్ వరకు పూర్తిగా మునిగిపోవడంతో టెర్రస్ పైకి ఎక్కిన కాలనీ వాసులు..
-జిహెచ్ఎంసి బృందానికి టోల్ ఫ్రీ నెంబర్లు కి కాల్ చేసిన పట్టించుకునే నాధుడు లేడు అని స్థానికులు ఆవేదన...
- 14 Oct 2020 7:01 AM GMT
Musi River updates: మూసీ నదికి ఊహించని అతి భారీ వరద..
-శాసనమండలి సమావేశాల నుండి నేరుగా సూర్యాపేట కు బయలుదేరిన మంత్రి జగదీష్ రెడ్డి..
-రత్నపురం వద్ద గండి కొట్టడంతో టేకుమట్ల వద్ద రోడ్డు పైకి ప్రవహిస్తున్న నీళ్లు..
-ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అధికారులకు మంత్రి ఆదేశం..
-దిగువన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి
- 14 Oct 2020 6:57 AM GMT
Telangana Legislative Council: జిహెచ్ఎంసి సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేటీఆర్...
-శాసనమండలిలో జిహెచ్ఎంసి సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్.
-సవరణలు మండలిలో ప్రతిపాదించిన కేటీఆర్.
-ఎంఎస్ ప్రభాకర్ రావు ప్రభుత్వ విప్..
-ప్రభుత్వం ప్రవేశపెట్టిన ghmc సవరణ బిల్లు చాలా బాగుంది.
-మహిళలకు ఈ బిల్లు ద్వారా ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.
-నగరంలో మంచి అభివృద్ధి జరిగింది.
-భారీ వర్షాలతో చాలాచోట్ల ఇబ్బంది పడ్డా ....గతంలో తీసుకున్న చర్యలతో పరిస్థితి కాస్తా మెరుగుపడ్డది.
-ఈ సవరణ బిల్లు కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire