ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 14 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం దశమి(ఉ. 10-29 వరకు) తదుపరి ఏకాదశి ; మృగశిర నక్షత్రం (తె. 04-27 వరకు) తదుపరి ఆర్ద్ర నక్షత్రం, అమృత ఘడియలు (రా.07-09 నుంచి 08-50 వరకు), వర్జ్యం (ఉ.0 9-00 నుంచి 10-42 వరకు) దుర్ముహూర్తం (ఉ. 08-17 నుంచి 09-08 వరకు తిరిగి మ. 12-30 నుంచి 01-20 వరకు) రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-24
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 14 Aug 2020 11:03 AM GMT
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా:
వాంకిడి మండలం సామెల గ్రామానికి వెళ్ళే రహదారి బురదమయంగా మారడంతో సర్పంచ్ ఆధ్వర్యంలో రహదారిపై వరి నాట్లు వేసి, నిరసన తెలిపిన గ్రామస్తులు.
- 14 Aug 2020 11:02 AM GMT
వరంగల్ రూరల్ జిల్లా:
శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం, ప్రగతి సింగారం గ్రామాల్లో నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించిన పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పాల్గొన్న ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత, జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి
- 14 Aug 2020 11:02 AM GMT
బ్రేకింగ్...
- రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఇంద్రారెడ్డి నగర్ లో హరి అనే వ్యక్తి ఇంటిఓనర్ తో వాటర్ కొరకు గొడవపడి
- దాడి చేస్తుండగా అక్కడే ఉండి అడ్డుకొబొయిన చిన్నరాయిడు అతని భార్య ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి.
- చిన్నరాయిడు పై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలు ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషమం.
- పోలీసులు అదుపులో నిందితుడు హరి....
- 14 Aug 2020 11:01 AM GMT
జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...
మహబూబ్ నగర్ జిల్లా :
- 17 గేట్లు ఎత్తి వేత..
- ఇన్ ఫ్లో: 1 లక్ష 58 వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో: 1 లక్ష 44 వేల 457 క్యూసెక్కులు.
- పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:
- 9.657 టీఎంసీ.
- ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.434 టీఎంసీ.
- పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
- ప్రస్తుత నీటి మట్టం: 317.910 మీ.
- 14 Aug 2020 10:59 AM GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఈ ముఠాపై చాలా కేసులు ఉన్నాయి..
- సైబరాబాద్ సీపీ సజ్జనర్..
- రాత్రి సమయంలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న 5 మంది దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు..
- వారి వద్ద నుండి 17.5 తులాల బంగారం..300 తులాల వెండి వస్తువులు..25 వేల నగదు స్వాధీనం..
- రాజేంద్రనగర్ లో ఇంట్లో దొంగతనం చేయడనికి ప్రయత్ని చేస్తుండగా పట్టుబడిన దొంగలు..
- రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఈ ముఠాపై చాలా కేసులు ఉన్నాయి..
- గ్యాంగ్ ప్రధాన నిందితుడు కోసురి శ్రీనివాసరావు..
- గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రైవేట్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసరావు..
- శ్రీనివాస రావు ఒక గ్యాంగ్ ను ఏర్పటుచేసుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో దొంగతనాలకు పాల్పడుతున్నారు..
- ఇప్పటి వరకు 48 దొంగతనల్లో శ్రీనివాస రావు పాల్గొన్నాడు..
- 16 జూలై న ఒంగోలు జిల్లా జైలు నుంచి రిలీజ్ అయిన శ్రీనివాసరావు మళ్ళీ దొంగతనాలు మొదలుపెట్టాడు..
- A2శంకర్ నాయక్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో 51 దొంగతనలు చేసాడు..
- రాత్రి సమయాలలో తాళం వేసిన ఇళ్లు టార్గెట్ చేసుకొని రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు..
- శ్రీనివాస రావు తో పాటు నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశాం..
- వీరందరి పైన గతంలో దొంగతనాల కేసులు ఉన్నాయి..
- 2009 నుండి దొంగతనాలు చేస్తున్న శ్రీనివాసరావు ముఠా..
- గుర్తు తెలియని వ్యక్తులకు ఇంటిని అద్దెకి ఇవ్వకూడదు..
- 14 Aug 2020 10:56 AM GMT
విద్యావంతులు భవాని రెడ్డికి కాంగ్రెస్ పార్టీ స్వాగతీస్తోంది: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
- టీజేఏస్ పార్టీ తరపున పొత్తుల్లో భాగంగా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి భవాని రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేశారు
- విద్యావంతులు భవాని రెడ్డికి కాంగ్రెస్ పార్టీ స్వాగతీస్తోంది
- ఆమెకు కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుంది
- దుబ్బాక నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది
- ఆమేరకు పీసీసీ నిర్ణయించింది
- ఎవ్వరేమి మాట్లాడిన అది వారి వ్యక్తిగతం
- డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి... మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలి
- ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చెయ్యాలి
- ఆ తర్వాత నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చెయ్యండి... నేను కూడా పాల్గొంటా
- చిన్న రైతు నుంచి పొలం లాక్కుని నరసింహులు ఆత్మహత్య కు ప్రభుత్వం పురికొల్పింది
- రాష్ట్రంలో దళితులపై దాడులు ఆగడం లేదు
- మంథని పోలీస్ స్టేషన్లో ఓ దళితుడు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడు
- దళితులు, గిరిజనులపై దాడులు జరుగుతుంటే....
- సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దురదృష్టం
- సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ మూల సిద్దాంతం
- కేసీఆర్ ప్రభుత్వంలో సామజిక న్యాయం.... జగరడం లేదు
- ఎక్కడ సామాజిక న్యాయానికి అడ్డంకులు ఎదురైనా అక్కడ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది
- బడుగు బలహీన వర్గాల తరఫున కాంగ్రెస్ పోరాటం చేస్తాము
- కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రిని కలిసి రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై పిర్యాదు చేస్తాము
- కరోనా విషయంలో... పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం అయ్యింది
- కరోనా లెక్కలు తప్పు చెబుతున్నారు..
- మరణాలను దాస్తున్నారు
- కరోనా లెక్కలు...ప్రభుత్వ పెద్దలు అనుకున్న మేరకే బైట వెల్లడిస్తున్నారు
- కరోనతో మృతి చెందిన బిపిఎల్ బాధిత కుటుంబాలకు 10 లక్షల ఎక్సగ్రెసియా ఇవ్వాలి ప్రభుత్వం
- కరోనా వల్ల మరణించిన వాళ్ల వివరాలు పీసీసీ కి పంపాలి కాంగ్రెస్ కార్యకర్తలు
- గాంధీ భవన్ లో వివరాలు అందచెయ్యాలి
- కరోనాతో మరణించిన వారి వివరాల్ని బైట పెడతాము
- గవర్నర్ దృష్టికి తెసుకెళ్లతము... నష్టపరిహారం కోసం డిమాండ్ చేస్తాము
- కరోనా ని ఆరోగ్యశ్రీ లో చేర్చడానికి సీఎం కి అభ్యంతరం ఏమిటి
- ప్రజల సొమ్ముతో ఆరోగ్యశ్రీ అమలు చేయడానికి ముఖ్యమంత్రి కి ఉన్న ఇబ్బందేంటీ
- హైకోర్టు చెప్పేవరకు ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ విషయంలో ప్రభుత్వ స్పందించకపోవడం ఏమిటీ
- ప్రైవేట్ ఆస్పత్రిలో... రోజు కి 70వేలు నుంచి లక్ష రూపాయలు కరోనా చికిత్సకు బిల్ వేస్తున్నారు
- ఆ బిల్లులు చూసే చాలా మంది ప్రాణాలు పోతున్నాయి
- ఎందుకు ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ ని నియంత్రించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు
- కరోనతో మరణిస్తే....కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు యాభై లక్షల బీమా మొత్తాన్ని... వైద్యులకు ఇస్తున్నట్లే కరోనతో ముందుండి పోరాడుతున్న
- పోలీసులు, జర్నలిస్టులకు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు మరణిస్తే రూ. 50 లక్షలు ఎక్సగ్రెసియా ఇవ్వాలి.
- 14 Aug 2020 10:54 AM GMT
కాంగ్రెస్ పార్టీలో చేరిన టిజెఎస్ నాయకురాలు భవాని రెడ్డి
- కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్దిపేటకు చెందిన టి జె ఎస్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భవాని రెడ్డితో పాటు మరో పదిమంది అనుచరులు
- భవాని రెడ్డి కి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన
- పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు
- భవాని రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని స్వాగతించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి
- అందరిని సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ లో పని చెయ్యాలని విజ్ఞప్తి చేసిన జగ్గారెడ్డి
- అధికార పార్టీని గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధమై కాంగ్రెస్ పార్టీలో కి రావడం చాలా సంతోషం.... జగ్గారెడ్డి
- కాంగ్రెస్ పార్టీలో చేరిన టిజెఎస్ నాయకురాలు భవాని రెడ్డి
- అధికార పార్టీ ని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీ కె ఉంది
- సిద్దిపేట లో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేస్తా
- కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యురాలిగా అందరితో కలిసిమెలిసి పని చేస్తా అందరిని కలుపుకుని అధికార టిఆర్ఎస్ పార్టీ కి చుక్కలు చూపిస్తా
- 14 Aug 2020 10:52 AM GMT
సంగారెడ్డి జిల్లా:
జహీరాబాద్ పట్టణంలో కరోన సోకి హోమ్ ఐషులేషన్ ఉన్న వారికి మంత్రి హరీష్ రావు సహకారంతో కరోన కిట్ లను ఆదచేసిన ఎమ్మెల్యే మానిక్ రావు,ఎమ్యెల్సి ఫరీదుద్దీన్.
- 14 Aug 2020 10:43 AM GMT
అమీన్పూర్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం ...
- 15 రోజుల్లో పోస్టుమార్టం రిపోర్టు వచ్చే అవకాశం..
- కేసు పర్యవేక్షణ అధికారి గా అడిషనల్ డీజీ స్వాతి lakra...
- చిన్నారి ఒంటిపైన గాయాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు...
- చిన్నారి బావ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు...
- ఆశ్రమం నుంచి 38మంది పిల్లల్ని స్టేట్ హోమ్ కి తరలించిన అధికారులు.
- వారందరికీ కరోనా టెస్టు చేసిన అధికారులు...
- స్టేట్ హోం 38 నుండి కాచిగూడలోని నింబోలి అడ్డకు తరలించే అవకాశం...
- 14 Aug 2020 10:42 AM GMT
- సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్ లో జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి ఏలేటి రోజా రాధాకృష్ణ శర్మ అధ్యక్షతన ప్రారంభమైన జెడ్పీ సర్వసభ్య సమావేశం.
- హాజరైన మంత్రి శ్రీ హరీష్ రావు,ఎమ్మెల్సీ శ్రీ రఘోత్తం రెడ్డి, కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి , ఎంపీపీ లు, జెడ్పీటీసీ లు , అధికారులు
- దివంగత దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కి సంతాపం.
- ఎమ్మెల్యే రామలింగారెడ్డి సేవలను గుర్తు చేసుకున్న సర్వ సభ్య సమావేశం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire