Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 14 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం దశమి(ఉ. 10-29 వరకు) తదుపరి ఏకాదశి ; మృగశిర నక్షత్రం (తె. 04-27 వరకు) తదుపరి ఆర్ద్ర నక్షత్రం, అమృత ఘడియలు (రా.07-09 నుంచి 08-50 వరకు), వర్జ్యం (ఉ.0 9-00 నుంచి 10-42 వరకు) దుర్ముహూర్తం (ఉ. 08-17 నుంచి 09-08 వరకు తిరిగి మ. 12-30 నుంచి 01-20 వరకు) రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-24

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • ఉదయానంద హాస్పిట‌ల్ ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్
    14 Aug 2020 8:45 AM GMT

    ఉదయానంద హాస్పిట‌ల్ ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్

    అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్స్‌ను క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌.

    ఈ ఆసుపత్రి వల్ల ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించిన సీఎం.

    హాస్పిటల్‌ డైరెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన సీఎం

    నంద్యాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి తదితరులు.

    క్యాంప్‌ కార్యాలయంలో హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి హజరైన డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, హాస్పిటల్‌ డైరెక్టర్‌ స్వప్నారెడ్డి.

  • ప్రకాశం బ్యారేజి వ‌ద్ద జ‌ల‌క‌ళ‌
    14 Aug 2020 7:06 AM GMT

    ప్రకాశం బ్యారేజి వ‌ద్ద జ‌ల‌క‌ళ‌

    విజయవాడ:

    ప్రకాశం బ్యారేజి డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, స్వరూప్

    బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో వచ్చే 3 రోజులూ భారీ వర్షాలు కురిసే అవకాశం

    ప్రకాశంబ్యారేజి వద్దకు 60వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకునే అవకాశం

    కృష్ణానది పరివాహక ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి

    కృష్ణానది ప్రాంతాల ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

    ప్రమాదాల నివారణ కోసం కరకట్టలు మరియు ఇతర నిర్మాణాలను తనిఖీ చేయాలి

  • బాల్య వివాహాన్ని అడ్డుకున్న రెవిన్యూ అధికారులు
    14 Aug 2020 7:01 AM GMT

    బాల్య వివాహాన్ని అడ్డుకున్న రెవిన్యూ అధికారులు

    ప్రకాశం జిల్లా: కొమరోలు లో మైనర్ బాల్య వివాహన్ని అడ్డుకున్న రెవిన్యూ అధికారులు.

    16 సంవత్సరాల బాలికకు వివాహం చేస్తున్నారన్న పక్కా సమాచారంతో వివాహం నిలుపుదల

    .ఇరువర్గాలతల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్న అధికారులు

  • ఏపీ పోలీస్ శాఖలో కరోనా కలకలం...
    14 Aug 2020 6:55 AM GMT

    ఏపీ పోలీస్ శాఖలో కరోనా కలకలం...

    విజయవాడ: ఏపీ పోలీస్ శాఖ కరోనా ర్యాపిడ్ టెస్టులతో కలకలం...

    పంద్రాగష్టు వేడుకలకు బెటాలియన్ల నుంచీ 49 మంది దూరం

    కానిస్టేబుల్ నుంచీ ఇన్‌స్పెక్టర్ వరకూ అన్ని స్దాయిలలో కోవిడ్ బాధితులు

     

  • పోలీస్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన పామర్రు ఎమ్మెల్యే
    14 Aug 2020 6:53 AM GMT

    పోలీస్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన పామర్రు ఎమ్మెల్యే

    కృష్ణాజిల్లా: పెదపారిపూడిలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు.

    హాజరైన ట్రైనీ డీఎస్పీ రమ్య, గుడివాడ డీఎస్పీ సత్యానందం,సీఐ కిషోర్ బాబు,ఎస్సై రాజేంద్రప్రసాద్.

  • 14 Aug 2020 6:52 AM GMT

    అమరావతి: మరికాసేపట్లో గుంటూరు రూరల్ లో రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించనున్న ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

  • ఆస్ప‌త్రికి సిబ్బందికి టాకీ టాకీల అంద‌జేత‌
    14 Aug 2020 6:50 AM GMT

    ఆస్ప‌త్రికి సిబ్బందికి టాకీ టాకీల అంద‌జేత‌

    తూర్పుగోదావరి -రాజమండ్రి: రాజమండ్రి- కొవిడ్ ప్రభుత్వాస్పత్రికి వాకీటాకీలు అందించిన తెలుగుదేశం నేతలు ఆదిరెడ్డి వాసు, కాశీనవీన్, నిమ్మలపూడి గోవింద్

    భవానీ చారిటబుల్ ట్రస్ట్, గంగరాజు పాల డైరీ సహకారంతో సమకూర్చిన 10 సెట్లు వాకి టాకీలు

    మెరుగైన వైద్యసేవలుకై ఆస్పత్రి ఇన్ఛార్జి డాక్టర్ రమేష్ కిషోర్ కు అందచేత

  • రమేష్ ఆసుపత్రి ప్రమాద ఘటనలో నోటీసులు.
    14 Aug 2020 6:47 AM GMT

    రమేష్ ఆసుపత్రి ప్రమాద ఘటనలో నోటీసులు.

    గుంటూరు: రమేష్ ఆసుపత్రి ప్రమాద ఘటనలో రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమత కు నోటీసులు.

    విచారణకు హాజరు కావాలని మమత కు నోటీసులు జారీ చేసిన విజయవాడ పోలీసులు

    ఇటీవలే కరోనా బారినపడి విశ్రాంతి లో ఉన్న డాక్టర్ మమత

    అయినా సరే తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు.

    నేడు విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయం లో విచారణ కు హజరుకాన్ను మమత.

  • ప్రకాశం బ్యారేజి వద్ద భారీగా వరదనీరు
    14 Aug 2020 6:44 AM GMT

    ప్రకాశం బ్యారేజి వద్ద భారీగా వరదనీరు

    విజయవాడ: ప్రకాశం బ్యారేజి వద్ద భారీగా వరదనీరు

    55గేట్లు ఎత్తి 32,625 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిన అధికారులు

    మరో గంటలో ఇంకొక 5 గేట్లను ఎత్తే అవకాశం

  • కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పంద్రాగష్టు వేడుకలు
    14 Aug 2020 6:41 AM GMT

    కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పంద్రాగష్టు వేడుకలు

    విజయవాడ: పంద్రాగష్టు వేడుకలకు ఏర్పాట్లలో భాగంగా బెటాలియన్లకు కోవిడ్ టెస్టులు

    మొత్తం 17మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ

    ఇద్దరు మహిళా పోలీసులకు కోవిడ్ పాజిటివ్

    కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పంద్రాగష్టు వేడుకలు నిర్వహిస్తామంటున్న ఏపీ ప్రభుత్వం

Print Article
Next Story
More Stories