Live Updates: ఈరోజు (13 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 13 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ఏకాదశి ఉ.09-59 వరకు తదుపరి ద్వాదశి | మఘ నక్షత్రం రా.07-59 వరకు తదుపరి పుబ్బ | వర్జ్యం: ఉ.08-22 నుంచి 09-56 వరకు | అమృత ఘడియలు సా.05-40 నుంచి 06-35 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు తిరిగి మ.10-32 నుంచి 11-19 వరకు | రాహుకాలం: ఉ.03-30 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 13 Oct 2020 8:52 AM GMT
Amaravati updates: రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపిఎస్ అధికారుల బదిలీ..
అమరావతి..
-గ్రే హౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అడిషనల్ డిజి గా అర్ కే మీనా
-ఏసీబీ డైరెక్టర్ శంఖా బ్రత బాగ్చి బదిలీ, ఏపీఎస్పి బెటాలియన్ ఐజీ గా నియామకం
-గుంటూరు రేంజ్ డిఐజీ గా త్రివిక్రమ్ వర్మా
-ఇంటెలిజెన్స్ డీఐజీ విజయ కుమార్ బదిలీ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గా నియామకం
-విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి
- 13 Oct 2020 8:50 AM GMT
West Godavari Weather Updates: ఏలూరులో నీటమునిగిన ఆర్టీసీ డిపో..
పశ్చిమ గోదావరి జిల్లా....
-నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఏలూరులో నీటమునిగిన ఆర్టీసీ డిపో
-ఏలూరు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న కండక్టర్స్ రెస్ట్ రూమ్స్ లో చేరుకున్న వరద నీరు
-నగరంలో పలు రోడ్లు జలమయం
- 13 Oct 2020 8:45 AM GMT
East Godavari Weather updates: వెంకటేశ్వర స్వామి దేవాలయం రాత్రి వర్షానికి ఆఁలయ ప్రాంగణం మునక...
తూర్పుగోదావరి... కొత్తపేట..
-ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుపతి గా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రాత్రి వర్షానికి ఆఁలయ ప్రాంగణం మునక.
-ఈరోజు దర్శనాలు రద్దు
-మోటార్లతో నీటిని బయటకు
-పంపుతున్న సిబ్బంది
- 13 Oct 2020 8:40 AM GMT
West Godavari Weather updtaes: నిడదవోలు లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..
పశ్చిమ గోదావరి జిల్లా..
-నిడదవోలు లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రైల్వే స్టేషన్ అంతా జలమయమైంది.
-రైల్వే ట్రాక్ పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఆ ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైళ్లు, పాసింజర్ రైళ్లు, అధికారులు ఎంతో అప్రమత్తంగా నడుపుతున్నారు.
- 13 Oct 2020 8:36 AM GMT
Kurnool District updates: తుంగభద్ర పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే చేపట్టాలి..
కర్నూలు...
-కర్నూలు పార్లమెంట్ టీ.డీ.పీ అధ్యక్షులు..
-సోమిశెట్టి వెంకటేశ్వర్లు..
-ఇంచార్జి మంత్రి అనిల్ కుమార్ తుంగభద్ర పుష్కరాలపై సమీక్ష కూడా నిర్వహించలేదు...
-మంత్రి జిల్లా కు ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో తెలియడం లేదు...
-తుంగభద్ర పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి..
- 13 Oct 2020 8:29 AM GMT
Kurnool District updates: కోవెలకుంట్లలో అన్న పై కత్తితో దాడి చేసిన తమ్ముడు...
కర్నూలు జిల్లా ....
-తలకు బలమైన గాయాలు తగలడంతో కోయిలకుంట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
- 13 Oct 2020 8:27 AM GMT
Kurnool District updtes: మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమాల పై సిపిఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు...
కర్నూలు..
-మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమాల పై సిపిఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు.. రౌండ్ టేబుల్ సమావేశం.
-ఇట్టినా ప్లాంటేషన్ ఈ కంపెనీ పేరుతో 2006లో ఆస్పరి చిన్న ఆహోతూరు పెద్ద హోతూరు గ్రామాలలో సేకరించిన 450 ఎకరాల భూములను రైతులకు మంత్రి తిరిగి అప్పగించాలి.
- 13 Oct 2020 8:24 AM GMT
National updates: ఆంగ్ల మాధ్యమం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ...
జాతీయం..
-హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం
-విచారణ జరిపిన సీజేఐ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం
-వెకేషన్ తర్వాత పిటిషన్ ను విచారిస్తామన్న సీజేఐ
-నవరాత్రి సెలవుల తర్వాత విచారణ జరుపుతామన్న ధర్మాసనం
- 13 Oct 2020 8:21 AM GMT
Guntur Weather updates: అచ్చంపేట మండలంలో ఎడతెరపలేకుండా కురస్తున్న భారీ వర్షం...
గుంటూరు...
-పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు...
-అచ్చంపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వరదనీరు...
-అచ్చంపేట సినిమాహల్ సెంటర్లోప్రధాన రహదారిపై వరదనీరు...
-అచ్చంపేట కెనాల్ ఆఫీస్‌లోకి చేరిన వరద...
-పలు దుకాణాలలోకి చేరిన వరద...
- 13 Oct 2020 8:19 AM GMT
Krishna District updates: విద్యుత్ రైల్వే డబ్లింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ రాంకృపాల్...
కృష్ణాజిల్లా...
-గుడివాడ - మచిలీపట్నం విద్యుత్ రైల్వే డబ్లింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ రాంకృపాల్
-మోటర్ ట్రాలీ పై మచిలీపట్నం వరకు డబ్లింగ్ ట్రాక్ నిర్మాణాన్ని పరిశీలించిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు
-రేపటి నుండి డబ్లింగ్ ట్రాక్ పై పట్టాలు ఎక్కనున్నా పలు రైళ్లు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire