Live Updates: ఈరోజు (13 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 13 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | త్రయోదశి: సా.4-08 తదుపరి చతుర్దశి | చిత్త నక్షత్రం రా.10-28 తదుపరి స్వాతి | వర్జ్యం ఉ.7-32 నుంచి 9-02 వరకు తిరిగి తె.3.41 నుంచి 5.10 వరకు | అమృత ఘడియలు సా.4-30 నుంచి 5-59 వరకు | దుర్ముహూర్తం ఉ.8-21 నుంచి 9-06 వరకు .12-06 నుంచి 12-51 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.06-07 | సూర్యాస్తమయం: సా.05-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 13 Nov 2020 12:54 PM GMT
Jagtial District Updates: నూతన కార్యాలయంను ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు..
జగిత్యాల జిల్లా:
జగిత్యాలలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంను ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
🔹దుబ్బాక ఎలక్షన్ లో కేసీఆర్ కు ఊహించని దెబ్బ తగిలింది. టీఆరెస్ ఎమ్మెల్యే లందరికి బుద్ది వచ్చింది.
🔹ప్రజలు పనిచేసే ప్రభుత్వనికి పట్టం కట్టారు.
🔹తెలంగాణ ప్రజలకు చెప్పేది ఒకటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి పేరుకపోయింది.
🔹ఏ ప్రాజెక్టు లు కూడా పూర్తి కాలేదు. మిషన్ భగీరథ పూర్తి కాక ముందే పైపులు పలిగిపోతున్నాయి.
🔹కేసీఆర్ ఒక అబద్ధాల ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడు.
🔹ఏమన్నా అంటే కేంద్రం డబ్బులు ఇస్తాలేదు అని చెబుతాడు.
🔹కేసీఆర్ ఇకనైనా బుద్ది తెచ్చుకో మీరు ప్రజలకు చెప్పిన హామీలను నెరవేర్చండి.
- 13 Nov 2020 12:44 PM GMT
Karimnagar Updates: రెచ్చిపోతున్న ఇసుక మాఫియా...
కరీంనగర్ జిల్లా :
- మానేరు నుండీ యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా.
- అర్ధరాత్రి దాటిన తరువాత మానేరు లో ఇసుక అక్రమ తవ్వకాలు.
- రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తో మొదలైన గొడవలు
- బొమ్మకల్ శివారు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తుండగా పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.
- బ్లూ కోర్ట్ సిబ్బంది తో వాగ్వాదనికి దిగి దాడికి యత్నించిన ట్రాక్టర్ యజమానులు.
- విధులకు ఆటంకం కలిగించరంటూ అధికారులకు సమాచారం ఇచ్చిన బ్లూ కోర్ట్ పోలీసులు.
- 13 Nov 2020 12:33 PM GMT
Pragathi bhavan Updates: ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది..
ప్రగతి భవన్...
- ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
- ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది.
- ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది.
- రేపు ఉదయం గవర్నర్ నామినేటెడ్ కోట ఎమ్మెల్సీల కు శాసనమండలిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తున్న అధికారులు.
- 13 Nov 2020 12:16 PM GMT
Pragathi Bhavan Updates: ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు పేర్లు ఖరారు...
ప్రగతి భవన్...
-గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు పేర్లు దాదాపు ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్...?
-మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య , గోరేటి వెంకన్న , దయానంద గుప్తా పేర్లు ఖరారు.
-మరికొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించనున్న సీఎం కేసీఆర్.
-ఈ ముగ్గురిని ప్రగతి భవన్ రావాలని సమాచారం ఇచ్చిన ప్రగతి భవన్ అధికారులు.
-ప్రగతి భవన్ చేరుకున్న గవర్నర్ కోటా ఫైనల్ అయినా ఎమ్మెల్సీ అభ్యర్థులు... మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, దయానంద్ గుప్త.
- 13 Nov 2020 12:10 PM GMT
Telangana High Court Updates: బి.జె.పి. ఎంపీ సుజనా చౌదరికి చేదు అనుభవం..
టీఎస్ హైకోర్టు.....
- హైకోర్టు ను ఆశ్రయించిన ఎంపీ సుజనా చౌదరి...
- గతంలో సీబీఐ లుక్ ఔట్ నోటీసులు జారీ..
- అమెరికా వెళ్లేందుకు ప్రయత్నం చేసిన సుజనా ను అడ్డుకున్న ఎయిర్పోర్ట్ సిబ్బంది..
- ఇమ్మిగ్రేషన్ అభ్యన్తరం తో నిలిచిన సుజనా అమెరికా ప్రయాణం..
- హైకోర్టు లో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు..
- 13 Nov 2020 4:51 AM GMT
Khammam District updates: నేడు ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాల్లో మంత్రుల పర్యటన....
ఖమ్మం
-రైతు వేదిక ప్రారంభానికి మాజీ మంత్రి తుమ్మల రాక....
-తుమ్మల చే రైతు వేదిక ప్రారంభానికి అధిష్టానం ఆహ్వానం.. పాల్గొంనున్న రవాణా శాఖ మంత్రి పువ్వడ అజయ్ కుమార్ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి...
-మాజీ ఎం పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఆహ్వానం పలికిన అధిష్టానం
- 13 Nov 2020 4:13 AM GMT
Nalgonda Updates: మిర్యాలగూడ లో మందుబాబుల హల్ చల్...
నల్గొండ జిల్లా:
- సిఐ తో వాగ్వాదం చేసి ఎకంగా ఆయన వాహనాన్నే ఎత్తుకెల్లిన మందుబాబులు..
- మిర్యాలగూడ టౌన్ ఈదులగూడా సర్కిల్ వద్ద రూరల్ సీఐ రమేష్ బాబు పోలీసు వాహనం చోరీ.
- అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న నలుగురు యువకులను సిఐ విచారిస్తుండగా..పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనం తో కోదాడ వైపు పరారైన యువకుడు.
- ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని పోలీసు వాహనం ఢీకొనడంతో..కారు ముందు భాగం ధ్వంసం.
- చేజింగ్ చేసి ఆలగడప టోల్ గేటు వద్ద వాహనాన్ని పట్టుకున్న రూరల్ ఎస్ఐ పరమేష్..
- పోలీసుల అదుపులో మందుబాబులు....
- 13 Nov 2020 3:28 AM GMT
Hyderabad Updates: మాదాపూర్ సైబర్ టవర్ సిగ్నల్ వద్ద రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్
- సిగ్నల్ జంప్ చేసి మరి బులెట్ బైక్ పై వెళుతున్న భార్య భర్తలను ఢీ కొట్టిన బెంజ్ కార్.....
- బైక్ ఉన్న గౌతమ్ దేవ్(33) మృతి, భార్య శ్వేతా కు తీవ్ర గాయాలు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలింపు....
- బెంజ్ కారు ను నడిపిన వ్యక్తి కాశి విశ్వనాథ్ తన తో మిత్రుడు కౌశిక్.....
- కారు నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన కాశి విశ్వనాథ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- కార్ లో ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం...
- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు.....
- 13 Nov 2020 2:39 AM GMT
Rangareddy District Updates: రాగన్న గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం....
రంగారెడ్డి జిల్లా....
-ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిదిలోని రాగన్న గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం....
-అక్కడికక్కడే ఇద్దరు మృతి...
-ఇద్దరికి గాయాలయ్యాయి హస్పటల్ కు తరలింపు..
-బైక్ ను ఢీ కోట్టిన కారు.
-బైక్ పై వెళ్తున్న ఇద్దరు మృతి...
-సఫారీ కార్ లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు ఆస్పత్రికి తరలింపు....
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire