Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 13ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం నవమి(ఉ. 09-25 వరకు) తదుపరి దశమి; రోహిణి నక్షత్రం (రా. 03-05 వరకు) తదుపరి మృగశిర నక్షత్రం, అమృత ఘడియలు (రా.11-38 నుంచి 01-21 వరకు), వర్జ్యం (సా.0 6-28 నుంచి 08-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 09-58 నుంచి 10-48 వరకు) రాహుకాలం (మ.01-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.05-45 సూర్యాస్తమయం సా.06-25

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 13 Aug 2020 7:06 AM GMT

    మహబూబ్ నగర్ జిల్లా:

    - జడ్చర్ల పట్టణం మరియు యాసాయి కుంట తండాలో సుమారు 2 కోట్లకు పైగా బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.

  • 13 Aug 2020 6:37 AM GMT

    పెద్దపెల్లిజిల్లా:

    - సుల్తానాబాద్ మున్సిపాలిటీలో వర్షం కారణం చుపిస్తూ కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు వాయిదా , వాయిదా తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్ ల ఆందోళన....

  • 13 Aug 2020 6:30 AM GMT

    వరంగల్ రూరల్ జిల్లా :

    - ఖానాపురం మండలం పాఖాల సరస్సు 31 ఫీట్లకు గాను 27.3 ఫీట్లకు చేరుకున్న నీరు.

  • 13 Aug 2020 5:34 AM GMT

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

    భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. 34 అడుగులు వున్న నీటి మట్టం, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలంలో ఇంకా నీటి మట్టం పెరుగుతుందని తెలుపుతున్న సీ డబ్ల్యూసీ అధికారులు

  • 13 Aug 2020 5:33 AM GMT

    భద్రాద్రికొత్తగూడెం జిల్లా:

    - చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు కు భారీగా చేరుతున్న వరద నీరు 11 గేట్లు ఎత్తివేసి 32855 కూసెక్కుల నీరు దిగువకు విడుదల.

  • 13 Aug 2020 5:29 AM GMT

    రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు కు కరోనా పాజిటివ్

    - రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఆయన సతీమణి సరోజినీ దేవి రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు వైరస్ బారిన పడ్డారు.

    - హైదరాబాదులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

    - గతంలో లక్ష్మీకాంతరావు కుమారుడు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు కూడా కరోనా సోకడంతో చికిత్స పొంది బయట పడ్డారు...

    - ప్రస్తుతం లక్ష్మీకాంతరావు దంపతుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది.

  • 13 Aug 2020 5:28 AM GMT

    జైలు అధికారుల తీరుపై మండిపడ్ట వి.హెచ్

    - నిన్న అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలు లో ఉన్న NSUI విద్యార్థి సంఘం నేతలను కలిసేందుకు జైలు వద్దకు వెళ్లిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత వి.హెచ్, పిసిసి ప్రదాన కార్యదర్శి బొల్లు కిషన్ లు.

    - ఎవరిని కలువటానికి అనుమతి లేదని స్పష్టం చేసిన జైలు అధికారులు...

    - జైలు అధికారుల తీరుపై మండిపడ్ట వి.హెచ్

  • 13 Aug 2020 4:15 AM GMT

    ఎల్లారెడ్డి డివిజన్ లో భారీ వర్షం

    కామారెడ్డి జిల్లా:

    - ఎల్లారెడ్డి డివిజన్ లో భారీ వర్షం

    - ఎల్లారెడ్డి : 23.0mm,

    - నాగిరెడ్డిపేట్ : 56.4mm,

    - గాంధారి : 26.2mm,

    - లింగంపేట : 17.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

  • 13 Aug 2020 4:14 AM GMT

    జిల్లాలో నేటి నుంచి రాపిడ్ మెడికల్ సర్వే ప్రారంభం..

    కామారెడ్డి జిల్లా :

    - జిల్లాలో నేటి నుంచి రాపిడ్ మెడికల్ సర్వే ప్రారంభం.

    - ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరణ.

    - జ్వరం ,జలుబు,గొంతునొప్పి బాధితుల గుర్తింపు.

    - వైద్య ,పోలీస్ ,రెవెన్యూ అధికారుల బృందాలకు అప్పగింత.

    - మూడు రోజుల్లో రాపిడ్ మెడికల్ సర్వే పూర్తి చేయాలి.

    - అనంతరం హెల్త్ క్యాంపు నిర్వహించాలి.

    - వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ శరత్

  • 13 Aug 2020 4:12 AM GMT

    ఎల్లారెడ్డి లో 24 కరోనా పాజిటివ్ కేసులు

    కామారెడ్డి జిల్లా:

    - ఎల్లారెడ్డి లో 24 కరోనా పాజిటివ్ కేసులు

    - 47 మందికి టెస్టు లు నిర్వహించగా 24 పాజిటివ్, 17 నెగెటివ్, 5 పెండింగ్ ఉన్నట్లుగా నిర్దారించిన వైద్యులు

Print Article
Next Story
More Stories