Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 13ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం నవమి(ఉ. 09-25 వరకు) తదుపరి దశమి; రోహిణి నక్షత్రం (రా. 03-05 వరకు) తదుపరి మృగశిర నక్షత్రం, అమృత ఘడియలు (రా.11-38 నుంచి 01-21 వరకు), వర్జ్యం (సా.0 6-28 నుంచి 08-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 09-58 నుంచి 10-48 వరకు) రాహుకాలం (మ.01-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.05-45 సూర్యాస్తమయం సా.06-25
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 13 Aug 2020 4:33 PM GMT
రేపు నూతన పరకామణి భవన నిర్మాణానికి శంకుస్థాపన
తిరుమల:
- 10 కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో పరకామణి భవనం
- నిర్మాణ వ్యయాన్ని విరాళంగా అందిస్తున్న బెంగళూరుకు చెందిన భక్తుడు మురళి కృష్ణ
- శ్రీవారి కానుకలు లెక్కింపు ప్రత్యక్షంగా భక్తులు చూసేలా నూతన భవనం నిర్మాణం
- ఇకపై స్వామివారి కానుకలు ఏరోజుకారోజు లెక్కించే అవకాశం
- 13 Aug 2020 4:08 PM GMT
ఫైనల్ దశకు చేరుకున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లోని కోవిడ్ కేర్ సెంటర్ విచారణ
విజయవాడ:
- ఫైనల్ దశకు చేరుకున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లోని కోవిడ్ కేర్ సెంటర్ విచారణ
- గత ఐదు రోజులుగా కొనసాగుతున్న జాయింట్ కలెక్టర్ నేత్రుత్వంలోని కమిటీ విచారణ
- జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తో భేటి అయిన జాయింట్ కలెక్టర్ శివశంకర్
- ఇప్పటివరకు తయారు చేసిన నివేదికను కలెక్టర్ కు వివరించిన జెసి
- హెల్త్ కు సంబంధించి రిపోర్ట్ ను కలెక్టర్ కు అందచేసిన శివకుమార్
- రేపు పూర్తిస్ధాయి నివేదికను కలెక్టర్ కు అందచేసే అవకాశం
- 13 Aug 2020 1:51 PM GMT
కృష్ణా జిల్లా:
- పెనుగంచిప్రోలు మండలం శనగ పాడు వద్ద ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు నది
- మున్నేరు నది మద్య లో చిక్కుకున్న నలుగురు పశువుల కాపరులు
- వీరిలో ఒకరు నీళ్లల్లో ఉండగా మరో ముగ్గురు ఇసుక దిబ్బ పై ఉన్నారు
- సహాయ చర్యలు చేపట్టిన అధికారులు
- 13 Aug 2020 1:50 PM GMT
ఉప్పాడ తీరంలో నలుగురు మత్స్యకారులు గల్లంతు..
తూర్పుగోదావరి:
- తూర్పుగోదావరి యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో
- నలుగురు మత్స్యకారులు గల్లంతు
- ఈనెల 12న బోటుపై వేటకు వెల్లిన మత్య్సకారులు
- బోటు ఇంజన్ పాడైందని నిన్న బంధువులకు మెస్సేజ్
- బోటు వెదకడానికి వెళ్లిన వారికి లబ్యం కాని బోటు ఆచూకీ
- పని చేయని మత్స్యకారుల సెల్ ఫోన్లు
- బోటులో ఉప్పాడకు చెందిన మత్స్యకారులు ముగ్గురు
- అమీనాబాద్ కు చెందిన ఒక మత్య్సకారుడు
- ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు
- బోటులో ఉప్పాడకు చెందిన వంకా వీరన్న(35), వంకా దుర్గ (32), వంకా సంగీవు (23)
- అమీనా బాద్ కు చెందిన పిక్కి తాతబ్బాయి (45)
- ఈ నెల 11 న మూడు బోట్లు లలో చేపల వేటకు వెళ్లిన 12మంది మత్స్యకారులు...
- సురక్షితం గా ఒడ్డుకు చేరిన రెండు బోట్లు లలో మత్స్యకారులు ..
- 13 Aug 2020 1:49 PM GMT
మొవ్వ PHC పరిధిలో నలుగురికి పాముకాటు
కృష్ణా:
- మొవ్వ PHC పరిధిలో నలుగురికి పాముకాటు
- తక్షణ వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టిన PHC వైద్యుడు డా. శొంఠి శివరామకృష్ణ
- పాముకాటుకు గురైన వీర్ల మురళీకృష్ణ (ఘంటసాల మండలం చిలకలపూడి), పర్ల రమ్య (చల్లపల్లి మండలం, పురిటిగడ్డ), వీర్ల వెంకట సుబ్బారావు (ఘంటసాల మండలం చిలకలపూడి), పోసాని నాగరాజు (బందరు మండలం కోన)
- వీరు నలుగురు పొలంలో పనులు చేస్తుండగా పాముకాటుకు గురయ్యారు
- ఈ నెలలో ఇప్పటి వరకు పాముకాటుకు గురైన 64 మందికి తక్షణ వైద్యం అందించినట్టు తెలిపిన డా. శొంఠి
- పాముకాటుకు గురైన వారు 15-30 నిమిషాల వ్యవధిలో సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు వస్తే ఎటువంటి ప్రాణాపాయం ఉండదు - శొంఠి
- 13 Aug 2020 12:24 PM GMT
విజయవాడ
స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ట్రాఫిక్ డైవర్షన్స్
ఉదయం 7గంటల నుంచీ 12గంటల వరకూ ట్రాఫిక్ డైవర్షన్లు
ఉదయం 7 గంటల నుంచీ కంట్రోల్ రూమ్ వద్ద నుంచీ బెంజిసర్కిల్ కు వెళ్ళే వాహనాలు, కంట్రోల్వరూమ్ వై జంక్షన్ నుంచీ ఏలూరు రోడ్డు మీదుగా మళ్ళింపు
ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నుంచీ వారధి, స్క్రూ బ్రిడ్జి మీదుగా బెంజి సర్కిల్
బెంజ్ సర్కిల్ నుంచీ స్క్రూ బ్రిడ్జ్, వారధి మీదుగా బస్టాండ్
రెడ్ సర్కిల్, ఆర్టీఏ జంక్షన్, వెటరినరీ సెంటర్ల వద్ద ఏ వాహనాలూ అనుమతించబడవు
పాసులు కలిగిన ఆహ్వానితులు ఉదయం 7:45లోగా స్టేడియం లోకి చేరుకోవాలి
బెంజ్ సర్కిల్ నుంచీ డీసీపీ బంగళా వరకూ పాసులు కలిగిన ఆహ్వానితులకు మాత్రమే అనుమతి
AA పాస్ కలిగిన వారు ఫుడ్ కోర్టు వైపు గేట్ నం.౩ నుండి వచ్చి వాహనాలు పార్క్ చేయాలి
A1, A2, A3 పాసులు కలిగిన వారు గేట్ నం.4 నుండీ వచ్చి హ్యాండ్ బాల్ కోర్ట్ వద్ద వాహనాలు పార్క్ చేయాలి
B1, B2 పాస్ కలిగిన వారు గేట్ నం.2 ద్వారా వచ్చి అక్కడే వాహనాలు పార్క్ చేయాలి
- 13 Aug 2020 12:23 PM GMT
అమరావతి...
పెదపాటి అమ్మాజీ మాల కార్పొరేషన్ చైర్మన్
హర్షకుమార్ చంద్రబాబు ఎజెండా మాట్లాడుతున్నారు.
హర్షకుమార్ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి దయవల్ల ఎంపీ అయ్యారు..
దళితులను పావుగా హర్షకుమార్ వాడుకున్నారు..
హర్షకుమార్ చంద్రబాబు స్ర్కిప్టు చదువుతున్నారు..
ప్రసాద్ రాష్ట్రపతికి రాసిన లేఖ వెనుక హర్షకుమార్ ఉన్నారు..
నక్సలైట్ లోకి వెళ్లాలని ప్రసాద్ ను హర్షకుమార్ ప్రోత్సహిస్తున్నారు..
హర్షకుమార్ కు సరదాగా ఉంటే నక్షలైట్ లో చేరాలి..
హర్షకుమార్ తనతో పాటు చంద్రబాబును కూడా నక్సలైట్ చేరాలి..
అంతే తప్ప దళిత యువకులను రెచ్చగొట్టవద్దు..
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళిత శిరోమండనం కేసులో తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు..
ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు..
దళిత బాలిక పై హత్యాచారం కు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు..
దళిత బాలికకు ప్రభుత్వం పది లక్షల పరిహారం ఇచ్చింది..
ప్రకాశం జిల్లాలో దళిత యువకుడిపై దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేశారు....
దళితులను నీచంగా చంద్రబాబు చూశారు..
దళితుల్లో పుట్టాలని ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు మాట్లాడారు..
అప్పుడు ఎందుకు హర్షకుమార్ నోరు మెడపలేదు..
ఉనికి కోసమే చంద్రబాబు హర్షకుమార్ పాకులాడుతున్నారు..
దళితుల కోసం మీడియా సమావేశం పెట్టి మూడు రాజధానులు కోసం ఎందుకు హర్షకుమార్ మాట్లాడుతున్నారు..
దళితుల ఆత్మగౌరవాన్ని హర్షకుమార్ చంద్రబాబు కు తాకట్టు పెట్టారు..
- 13 Aug 2020 12:23 PM GMT
అమరావతి....
కనకరావు మాదిగ, మాదిగ కార్పొరేషన్ చైర్మన్
చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ ల్లో హర్షకుమార్ ఒకరు....
చంద్రబాబు ఇచ్చే ప్యాకేజికి హర్షకుమార్ కక్కుర్తి పడుతున్నారు..
చంద్రబాబు ఇచ్చిన స్కీఫ్ట్ మేరకు హర్షకుమార్ మాట్లాడుతున్నారు..
చంద్రబాబు కాళ్ళు పట్టుకొని దళిత జాతి పరువు హర్షకుమార్ తీసారు..
చంద్రబాబు కాళ్ళు పట్టుకొని దళిత సమస్యలుపై పోరాటం చేస్తామంటే ఎవరు నమ్మరు..
దళితులపై దాడి చేసిన చరిత్ర టీడీపీది..
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరిగాయి...
రాష్ట్రపతికి ప్రసాద్ లేఖ రాయడం వెనుక చంద్రబాబు హర్షకుమార్ ఉన్నారు..
యానాంలో రిజెన్సీ సిరామిక్ సంఘటనలో యాజమాన్యంతో కుమ్మకై దళితులు, బీసీలకు అన్యాయం చేశావు..
అమరావతిలో భూ కుంభకోణంపై హర్షకుమార్ ఎందుకు మాట్లాడలేదు..
రాజధానిలో దళిత భూములను బలవంతంగా లాక్కున్నపుడు హర్షకుమార్ ఎందుకు నోరు మెడపలేదు..
దళితుల్లో పుట్టాలని ఎవరైనా పుట్టాలనికుంటారాని మాట్లాడిన చంద్రబాబు దళితుల గిరించి మాట్లాడే అర్హత లేదు..
ఏడాది కాలంలో ఎస్సీ సంక్షేమంపై బహిరంగ చర్చకు మేము సిద్ధం..
మాతో చర్చకు హర్షకుమార్, టీడీపీ నేతలు సిద్ధమా...?
దళిత పక్షపాతి జగన్మోహన్ రెడ్డి..
దళితులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు...
- 13 Aug 2020 10:27 AM GMT
అమరావతి
రాష్ట్రంలో ఉన్న మైనింగ్ భూములను ఇతర అవసరాలకు కేటాయించవద్దని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
మైనింగ్ భూములపై దేశంలో కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుందన్న ఏపీ హైకోర్టు
ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు (స్టే) జారీ చేసిన కోర్టు
ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్, టంగుటూరు మండలాల్లో మైనింగ్ భూములు ఇళ్ల పట్టలుగా ఇచ్చేందుకు తీసుకోవటంపై దాఖలైన పిటిషన్ పై కోర్టు స్టే ఆర్డర్ ఆదేశాలు
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
- 13 Aug 2020 10:27 AM GMT
శ్రీకాకుళం జిల్లా..
జవాన్ ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడు..
ఉమామహేశ్వరరావు బిడ్డల పేరిట 50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను పార్టీ శ్రేణుల ద్వారా అందజేత..
జవాన్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire