Live Updates: ఈరోజు (12 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 12 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | దశమి ఉ.11-15 వరకు తదుపరి ఏకాదశి | ఆశ్లేష నక్షత్రం రా.08-43 వరకు తదుపరి మఘ | వర్జ్యం: ఉ.09-41నుంచి 11-15 వరకు | అమృత ఘడియలు రా.07-08 నుంచి 09-25 వరకు | దుర్ముహూర్తం: ఉ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 12 Oct 2020 4:01 PM GMT
Vizianagaram update: వాయుగుండం పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్...
విజయనగరం జిల్లా...
-బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్...
-భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు..
-పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ 13వ తేదీ ఉదయం కాకినాడ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణశాఖ నుంచి హెచ్చరికలు అందాయి..
-మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయటం జరిగింది..
-మత్స్యకార గ్రామాల్లో దండోరా వేయించడంతోపాటు, సచివాలయ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశాం..
pతీరప్రాంత మండలాలైన భోగాపురంలో కంట్రోల్ రూము(8074400947), పూసపాటిరేగలో (7036763036) కంట్రోలు రూములను ఏర్పాటు చేయడం జరిగింది..
- 12 Oct 2020 3:54 PM GMT
Visakha updates: జగన్ మోహన్ రెడ్డి ది తుక్లక్ పాలన...
విశాఖ..
-మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కామెంట్స్
-రైతు సంక్షేమ కోరుతున్నాము అన్న జగన్ ప్రభుత్వం రాజధాని రైతులకు చేస్తున్నది అన్యాయం కాదా.?
-మహిళా రైతులను బూటు కాళ్లు తో తన్నటం ఇది ఎక్కడి నాయ్యం
-ఇప్పటికి రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అటున్న బొత్స కు కనీసం విజ్ఞత ఉందా
-విశాఖ ఎంపీ కి రాజీనామ చేయండి అమరావతి రాజధానా? విశాఖ రాజధానా? అని ఎన్నికలకు వెళ్దాం.
-మీరు గెలిస్తే విశాఖ రాజధాని..మేము గెలిస్తే అమరావతి రాజధాని అని సవాల్ చేసిన అయ్యన్న
- 12 Oct 2020 3:45 PM GMT
Peddapuram Rain updates: భారీ వర్షాలకు మెయిన్ కుప్పకూలిన పాత మున్సిపల్ కాంప్లెక్స్ లో రెండు షాప్ లు..
తూ. గో.జిల్లా*
పెద్దాపురం*
-భారీ వర్షాలకు పెద్దాపురం మెయిన్ రోడ్ లో కుప్పకూలిన పాత మున్సిపల్ కాంప్లెక్స్ లో రెండు షాప్ లు
-మున్సిపల్ అధికారులు నోటీస్లు ఇచ్చినప్పటికీ ఖాళీ చేయని 16 షాప్ ల యజమానులు
-పెద్దాపురం సోమవారం సెలవు కావడంతో అన్ని షాప్ లు మూసివేసి ఉండటంతో తప్పిన ప్రమాదం
-సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ , అగ్నిమాక సిబ్బంది
- 12 Oct 2020 3:44 AM GMT
Visakha updates: ములగాడ గణపతినగరం లో విషాదం...
విశాఖ జిల్లా...
-గాజువాక మండలం ములగాడ గణపతినగరం లో విషాదం
-భారి వర్షానికి రిటైనింగ్ వాల్ విరిగిపడి ఇంటి గోడలు కూలిపోయాయి
-ఇంటిలో నివాసముంటున్న రామలక్ష్మి అనే గర్బిణి మృతి
-నిద్రపోతున్న కుమారుడు జ్ఞానేశ్వర్( 3)మృతి మృతురాలి తల్లికి ,భర్తకు గాయాలు. హాస్పిటల్ కు తరలింపు
-నిన్న కురిసి బారి వర్షానికీ గణపతినగరం లో ఇంటిగోడ కూలి గర్భిణీ స్రి తో పాటు బిడ్డ అక్కడిఅక్కడె మృతి చెందరు ..
- 12 Oct 2020 3:42 AM GMT
Kakinada updates: వాయుగుండం ప్రభావంతో ఎగమతులు, దిగుమతులు నిలిపివేత..
తూర్పుగోదావరి..
-వాయుగుండం ప్రభావంతో కాకినాడ యాంకరేజ్ పోర్టుకు వచ్చిన 13 అంతర్జాతీయ నౌకల నుంచి ఎగమతులు, దిగుమతులు నిలిపివేత..
-తుపాన్ సమయంలో సురక్షితంగా ఉండేందుకు
-13 అంతర్జాతీయ వెసెల్స్ ను యాంకరేజ్ పోర్ట్ నుంచి సముద్రంలోకి తీసుకెళ్లాలని సూచించిన పోర్ట్ అధికారులు..
- 12 Oct 2020 3:35 AM GMT
Amaravati updates: ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...
అమరావతి...
-రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న ఉద్యమానికి 300 రోజులు.
-ఉద్యమంలో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారు.
-అయినా సరే ప్రభుత్వం నుంచి భూములిచ్చిన రైతులకు ఊరట కలిగించే ఒక్కమాట రాలేదు. పాలకుల అహంకారం
-ఆస్థాయిలో ఉండటం దారుణం (1/2)
#300DaysForOneCapital
-రాజధాని అమరావతిని కాపాడుకునేంత వరకు తెలుగుదేశం రైతులకు అండగా ఉంటుంది.
-సోమవారం ఉద్యమానికి 300 రోజులు అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిర్వహించే నిరసన కార్యక్రమాలలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొని మద్దతుగా నిలవండి.
-ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినదించండి(2/2)
- 12 Oct 2020 3:32 AM GMT
Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి..
తిరుమల...
-తెలుగు అకాడమీకి తిరుపతిలో టీటీడీ భవనాన్ని మంజూరు చేసింది.
-తెలుగు, సంస్క్రత అకాడమీల బాధ్యతలు నాకు అప్పగించడం చాలా సంతోషం.
-జగన్ పరిపాలనపై పేద వర్గాలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-సీఎం జగన్ చుట్టూ కమ్ముకున్న అన్యాయ వ్యవస్థల నుండి ఆయనకు రక్షణ కల్పించాలని శ్రీవారిని ప్రార్థించా
-లక్ష్మీ పార్వతి, తెలుగు అకాడమీ చైర్ పర్సన్
- 12 Oct 2020 2:10 AM GMT
Visakha Weather updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం...
విశాఖ...
-పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి విశాఖపట్నం కు ఆగ్నేయ దిశగా 330 km, కాకినాడ కు తూర్పు ఆగ్నేయ దిశగా 370 km, నర్సాపూర్ కు తూర్పు ఆగ్నేయ దిశగా 400 km దూరంలో కేంద్రీకృతం
-రాగల 24 గంటలలో ఇది తీవ్ర వాయుగుండముగా మారే అవకాశం
-ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి నర్సాపూర్ మరియు విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire