Live Updates: ఈరోజు (12 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 12 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి సా.6-24 తదుపరి త్రయోదశి | హస్త నక్షత్రం రా.12-04 తదుపరి చిత్త | వర్జ్యం ఉ.9-25 నుంచి 10-56 వరకు | అమృత ఘడియలు సా.6-26 నుంచి 7-56 వరకు | దుర్ముహూర్తం ఉ.9-51 నుంచి 10-36 వరకు, తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 12 Nov 2020 2:41 PM GMT
Telangana High Court Updates: ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్ల ను చట్టబద్ధంగా నియమించలేదని హైకోర్టు పిల్ ధాఖలు..
టీఎస్ హైకోర్టు.....
- పిల్ ధాఖలు చేసిన రాజాస్వామి...
- ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా చట్ట వ్యతిరేకంగా నలుగురు ఆర్టీఐ కమిషనర్ల ను నియమించిందని కోర్టుకు తెలిపిన పిటీషనర్ తరపు న్యాయవాది రాపోలు భాస్కర్..
- నారాయణ రెడ్డి, సైఫుల్లాఖాన్, కట్టా శేఖర్ రెడ్డి, శంకర్ నాయక్ లను ఆర్టీఐ కమిషనర్లు గా నియమించిందన్న పిటీషనర్ తరపు న్యాయవాది.
- వీరి నియామకాన్ని రద్దు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్న న్యాయవాది రాపోలు భాస్కర్.
- ఆర్టీఐ కమిషనర్ల నియామకం పై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు..
- రెండు వారాల్లో పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం.
- తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.
- 12 Nov 2020 2:34 PM GMT
Adilabad District Updates: రిమ్స్ మెడీకల్ కళశాలలో ఎ.సి.బి. అదికారులు తనిఖీలు..
ఆదిలాబాద్
- రహస్యంగా కీలకమైన డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నా అదికారులు
- స్కాలర్ షిప్ సంబందించిన. పైళ్లను పరిశీలిస్తున్నారని సమాచారం.
- విషయం బయటకు చెప్పడానికి తనిఖీలు చేస్తున్నా అదికారులు
- 12 Nov 2020 2:32 PM GMT
Pragathi Bhavan Updates: ప్రగతి భవన్ కి చేరుకున్న ఎంఐఎం అధ్యక్షుడు ఆసుదుద్దీన్..
ప్రగతి భవన్....
- సీఎం కేసీఆర్ తో సమావేశం అయ్యే అవకాశం..
- దాదాపు 6 గంటలుగా మంత్రులు, ప్రధాన కారుదర్శులతో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ సమావేశం...
- 12 Nov 2020 1:47 PM GMT
Nalgonda Updates: నిడమనూరు తహాశీల్దార్ కార్యలయం దగ్గర కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ...
నల్గొండ :
-నిడమనూరు లో వరద నష్టం వల్ల బాధితులకు న్యాయం చేయాలని తహాశీల్దార్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి...
-అక్కడే ఉన్న టిఆర్ఎస్ డిసిసిబి డైరెక్టర్ అంజయ్య కు డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం... తోసేసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు....
- 12 Nov 2020 5:05 AM GMT
Nizamabad Updates: మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులోని మంజీర వంతెన పై రాకపోకలు నిషేధం..
నిజామాబాద్ :
-మంజీర వంతెన పిల్లర్లు అరిగిపోవడం, మూడో నెంబర్ పిల్లర్ పక్కకు ఓరగడంతో రాకపోకలు నిషేధం విధించిన మహా ఇంజినీర్లు.
-పాత వంతెన పై రాకపోకలు సాగించాలని సూచన.
- 12 Nov 2020 5:04 AM GMT
Jangaon District Updates: సన్న బియ్యంకు మద్దతు ధర ఇవ్వాలని ప్రగతి భవన్ ముట్టడి..
జనగామ జిల్లా:
-సన్న బియ్యంకు మద్దతు ధర ఇవ్వాలని ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో జిల్లాలో కొనసాగుతున్న అరెస్టుల పరంపర..
-ముట్టడికి వెళ్లకుండా ముందస్తుగా 50 మంది బిజెపి పార్టీ శ్రేణులను అరెస్టు చేసిన జనగామ పోలీసులు...
- 12 Nov 2020 5:01 AM GMT
Hyderabad Updates: అంబర్ పేట్ ప్రధాన రహదారి పై రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్..
- అంబర్ పేట్ ప్రధాన రహదారి పై ఆర్టీసీ సిటీ బస్ ఢీకొని బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి మృతి...
- అంబర్ పేట్ నుండి రామంతపూర్ వెళ్తుండగా బస్ వెనుక టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి...
- 12 Nov 2020 4:59 AM GMT
Hyderabad Updates: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం..
గ్రేటర్ హైదరాబాద్..
# గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం..
# నేడు 11 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది.
# గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ పార్థసారథి విడివిడిగా భేటీ కానున్నారు.
# ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరు కానున్నారు.
# ఒక్కో పార్టీకి 15 నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించారు.
# వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఖరారు, ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పై చర్చ
# పోటీ చేసే అభ్యర్థుల వ్యయం, చెల్లించాల్సిన డిపాజిట్ సహా ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
# ఓటర్ల జాబితా ముసాయిదాను ఇప్పటికే ప్రకటించింది.. అభ్యంతరాలు స్వీకరిస్తుంది.
# పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది.
# వీటితో పాటు ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ చర్చించనుంది.
- 12 Nov 2020 4:56 AM GMT
Pragathi Bhavan: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల పై వరుస సమావేశాలు..
ప్రగతి భవన్..
-మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ.
-మంత్రులతో భేటీ లో గ్రేటర్ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో పంటనష్టం పై చర్చ .
-ఆ తరువాత పార్టీ జనరల్ సెక్రెటరీలతో సీఎం కేసీఆర్ సమావేశం.
-గ్రేటర్ ఎన్నికల వ్యూహం పై చర్చ
- 12 Nov 2020 3:47 AM GMT
Nizamabad Updates: నగరంలో మద్యం అమ్ముతున్న ఇంటి పై ఎక్సైజ్ పోలీసుల దాడి..
నిజమాబాద్ :
-నగరంలోని బోయి గల్లీలో అక్రమంగా దేశీ దారు మద్యం అమ్ముతున్న ఇంటి పై ఎక్సైజ్ పోలీసుల దాడి.
-186 క్వార్టర్ బాటిళ్లు , 25 ఫుల్ బాటిల్స్ దేశీ దారు మద్యం స్వాధీనం.
-నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire