Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 11 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అష్టమి (రా.10-36 వరకు) తదుపరి నవమి | రోహిణి నక్షత్రం (ఉ. 10-28 వరకు) తదుపరి మృగశిర | అమృత ఘడియలు: ఉ.7-01 నుంచి 8-44 వరకు తిరిగి తె. 2-35 నుంచి 4-16 వరకు | వర్జ్యం: సా. 4-24 నుంచి 6-05 వరకు | దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-44 వరకు తిరిగి మ. 2-49 నుంచి 3-38 వరకు | రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-05
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 11 Sep 2020 10:35 AM GMT
Gun Park Media Point: చట్టంలో లోపాల వల్లే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు..వి హనుమంత రావు..
గన్ పార్క్ మీడియా పాయింట్..
-వి హనుమంత రావు కాంగ్రెస్ సీనియర్ నేత..
-పీవీ భూ సంస్కరణలు అమలు చేసారు
-సర్వే నెంబర్ 5,6లలో భూమి వేరేవారికి ఇచ్చారు
-తెలంగాణ లో 2.45లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంలి
-2.25లక్షలకే లెక్క ఉంది 25లక్షల భూమి కి రికార్డ్ లేదు
-ఇనాం.. దేవాలయ.. ఇతర భూముల లెక్కలు లేవు
-భూ వివాదాలు ఆపాలని రెవెన్యూ చట్టం తెచ్చావు
-దళారులు రాజకీయాల్లోకి వచ్చి బ్రస్టు పట్టిస్తున్నారు
-కీసరలో భూమి దళితులకు ఇచ్చినప్పుడే మంచి చేసినట్లు
-150కుటుంబాలు రోడ్లపై పడ్డాయి
-కీసర లో జరిగిన అవినీతి ని లో నాగరాజు లాంటి వారిని కఠినంగా శిక్షించాలి
-కుల సంఘాలకు మూడు మూడు ఎకరాలు ఇచ్చారు, మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారు
- 11 Sep 2020 10:02 AM GMT
Revanth Reddy Revanth Reddy Comments: అసెంబ్లీ సమీపంలో నాగులు ఆత్మహత్యాయత్నం తీవ్రంగా కలచివేసింది..ఏ. రేవంత్ రెడ్డి..
ఏ. రేవంత్ రెడ్డి, ఎం పీ టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
• తెలంగాణ ఉద్యమ కాల ఆత్మబలిదానాలను గుర్తుకు తెచ్చింది
• నాగులు ఆర్తనాదాలలో తెలంగాణ నిరుద్యోగ యువత గుండె చప్పుడు ఉంది
• కేసీఆర్ కనికరం లేని ముఖ్యమంత్రి
• నాడు యువత శవాల వద్ద కేసీఆర్ కార్చింది కన్నీరా... ముసలి కన్నీరా.
• కేసీఆర్ తీరుతో బలిదానాలు చేసుకున్న యువత ఆత్మలు ఘోశిస్తున్నాయి
• కేటీఆర్ సూటూబూటూ వేసుకుని బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో ఫోటోలు దిగితే ఉద్యోగాలు వచ్చినట్టేనా
• కేసీఆర్ హామీలు మీడియాలో హెడ్ లైన్స్ వచ్చాయి తప్ప... యువతకు ఉద్యోగాలు రాలేదు
• నాగులుకు మెరుగైన వైద్యం ప్రభుత్వమే అందించాలి, ఉపాధికి హామీ ఇవ్వాలి
• నిరుద్యోగ సమస్యపై తక్షణ కార్యచరణ ప్రకటించాలి
• కేసీఆర్ స్పందించకుంటే... నిరుద్యోగ యువత తరఫున త్వరలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఉద్యమం చేస్తా
- 11 Sep 2020 8:39 AM GMT
Telangana latest news: బిజెపి అసెంబ్లీ ముట్టడి విజయవంతం..బండి సంజయ్ ..
బండి సంజయ్ ...బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
-తెలంగాణ ప్రజల పక్షాన బిజెపి నిజాం రజాకార్ల వారసుల పక్షాన కెసిఆర్
-తెలంగాణ ప్రజల ఆకాంక్ష లక్ష్యం తెలంగాణ విమోచన దినోత్సవ అధికారిక నిర్వహణ డిమాండ్ ముట్టడి తో మరోసారి రుజువయింది
-బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తారని అసెంబ్లీ ముట్టడి విజయంతో ఋజువైంది
-తెలంగాణ విమోచన పోరాట వీరుల స్ఫూర్తితో ఎనిమిదవ నిజాం కెసిఆర్ మెడలు వంచుతాం
-రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల బలప్రయోగంతో బీజేపీ నాయకులు కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు
-అక్రమ అరెస్టులు కెసిఆర్ ప్రభుత్వంది పిరికిపంద చర్య
-సాయంత్రం వరకు అసెంబ్లీ ముట్టడి కొనసాగుతుంది
-రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి బిజెపి నాయకులు కార్యకర్తలు తరలివస్తూనే ఉంటారు
-బిజెపి కార్యకర్తల శక్తిని కెసిఆర్ ప్రభుత్వం తట్టుకోలేదు
-త్వరలోనే కెసిఆర్ ను ఫామ్ హౌస్ కే శాశ్వతంగా పరిమితం చేస్తాం
- 11 Sep 2020 8:34 AM GMT
Legislative Council TS Legislative Council: శాసన మండలిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి..
శాసన మండలి..
# విసిల నియామకంలో సాంకేతిక సమస్యలతో ఆలస్యం జరిగింది
# త్వరలో సెర్చ్ కమిటీలు సమావేశం అయి విసిలను ఖరారు చేస్తారు
# యూనివర్సిటీలకు అవసరమైన మేరకు నిధులు మంజూరు చేస్తాం
#తెలంగాణ శాసన మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి
# రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణముకు నిర్ణయం.9 రైతు వేదికల నిర్మాణం పూర్తి అయ్యింది.
# మిగతా రైతు వేదికల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి
# దసరాకు సామూహికముగా రైతు వేదికలు ప్రారంభించుకోవలని సర్కార్ ఆలోచన
# ఒక కోటి 41 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వివిధ పంటల సాగు
# శాసనమండలి సోమవారానికి వాయిదా..
- 11 Sep 2020 8:28 AM GMT
TS Legislative Council: శాసన మండలిలో మంత్రి ఈటెల రాజేందర్..
# కరోనా కాంటాక్ట్ ట్రెసింగ్ లో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది
# గ్రామీణ ప్రాంతాల్లో కూడా కంటైన్మెంట్ జోన్ లు ఏర్పాటు చేసాం
# ముందుస్తు జాగ్రత్తలతో రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించుకోగలిగాము
# గాంధీ హాస్పిటల్ లో డాక్టర్లు రాజా రావు ,ప్రభాకర్ రెడ్డిలు ఇద్దరు దేవుళ్ళు
# వైద్య సిబ్బందికి ఎంత ఇచ్చినా తక్కువే
# కరోనా మహమ్మారి ఇప్పట్లో పోదు
- 11 Sep 2020 8:24 AM GMT
Fake Doctor Teja Reddy: రాచకొండ లో నకిలీ డాక్టర్ తేజా రెడ్డి హల్చల్..
-ఏకంగా పోలీసులనే మస్కా కొట్టించిన తేజా రెడ్డి
-నకిలీ సర్టిఫికెట్స్ తో పలు ప్రైవేట్ హాస్పిటల్ ల్లో డాక్టర్ గా విధులు
-లాక్ డౌన్ సమయంలో రాచకొండ పోలీసులకు మందులు అందించిన తేజా రెడ్డి
-పోలీస్ సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహణ
-సీనియర్ ఐపిఎస్ లను సైతం బురిడీ కొట్టించిన నకిలీ డాక్టర్
-రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్ లో వాలంటీర్ గా విధులు నిర్వహణ
-మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్న తేజ రెడ్డి
-తనని వేదింపులకు గురి చేయడం తో తేజ పై రెండవ భార్య పోలీస్ లకు ఫిర్యాదు
- 11 Sep 2020 7:18 AM GMT
Hyderabad updates: అసెంబ్లీ వద్ద పోలీసులకు చెమటలు పట్టిస్తున్న బీజేపీ కార్యకర్తలు..
-మూడంచెల భద్రతను దాటుకుని అసెంబ్లీ వద్దకు విడతల వారీగా చేరుకుంటున్న బీజెపీ శ్రేణులు...
-అరెస్ట్ చేసి గోశామహల్ స్టేడియం, నారాయణ గూడ పీఎస్ కు తరలింపు
-ఇప్పటివరకు 300మందికి పైగా బీజేపీ కార్యకర్తల అరెస్ట్..
-144 సెక్షన్ కింద సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేకపోవటంతో అరెస్టులు చేస్తున్న పోలీసులు..
-భద్రతను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు...
- 11 Sep 2020 7:08 AM GMT
Bandi Sanjay Kumar Arrest: జూబ్లీహిల్స్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్టు చేసిన పోలీసు.
బండి సంజయ్..
-రవీంద్రభారతి వద్ద అసెంబ్లీ ముట్టడికి వచ్చిన నాగర్ కర్నూల్ బీజేపీ నాయకులు అరెస్ట్...
-నాగర్ కర్నూల్ బీజేపీ నేత పద్మనాభ చారి తో బీజేపీ మహిళ మార్చ నాయకుల అరెస్ట్...
-అరెస్ట్ చేసిన వారిని స్థానిక పొలీస్ స్టేషన్ కి తరలింపు..
-అసెంబ్లీ ముట్టడికి వచ్చిన సంగారెడ్డి కరీంనగర్ జిల్లా నాయకుల అరెస్టు...
-తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించాలంటూ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు...
-ఓబిసి, యువమోర్చా నాయకులను అరెస్టు చేసి స్థానిక పొలీస్ స్టేషన్ కి తరలింపు...
-అసెంబ్లీ మూట్టడికి ప్రయత్నించిన పార్టీ బీజేపీ ప్రధనకార్యదర్శులు ప్రదీప్ కుమార్ , ప్రేమేందర్ రెడ్డి లు అసెంబ్లీ ముందు అరెస్టు చేసిన పోలీసులు
- 11 Sep 2020 6:31 AM GMT
Telangana Latest updates: రవీంద్రభారతి వద్ద బీజేపీ యువమోర్చా నాయకుల అరెస్ట్...
-ఒక్కసారిగా సంధుల్లో నుండి అసెంబ్లీ వైపు గా పరుగులు పెట్టిన బిజెపి యువ మోర్చా నాయకులు...
-ఒక్కసారిగా 30 మందికి యువమోర్చా నాయకులు రావడంతో ఉద్రిక్త వాతావరణం...
-వారందరినీ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలింపు...
- 11 Sep 2020 5:33 AM GMT
Telangana Assembly: అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేపీ నేత లంకల దీపక్ రెడ్డి అరెస్టు...
-కారులో దిగి అసెంబ్లీ గేటు వైపు వెళ్తున్న లంకల దీపక్ రెడ్డి ని అడ్డగించిం పోలీసులు..
-సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు...
-అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలింపు...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire