Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 11 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | నవమి (రా.11-12 వరకు) తదుపరి దశమి | మృగశిర (ఉ.11-55 వరకు) తదుపరి ఆర్ద్ర | అమృత ఘడియలు (రా.2-20 నుంచి 4-08 వరకు) | వర్జ్యం (రా.8-39 నుంచి 10-19 వరకు) | దుర్ముహూర్తం (ఉ.8-16 నుంచి 9-05 వరకు తిరిగి మ.12-21 నుంచి 1-10 వరకు) | రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-04
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 11 Sep 2020 3:21 AM GMT
Amaravati Updates: ఏపీలో అడుగు కదపకుండానే 87 రకాల పోలీస్ సేవలు
అమరావతి
- రాష్ట్రంలోని 964 పోలీస్ స్టేషన్లను అనుసంధానం
- ‘ఏపీ పోలీస్ సేవ’ మొబైల్ యాప్ సిద్ధం
- పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది
- త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం
అన్ని రకాల నేరాలపై ఫిర్యాదులు యాప్ ద్వారా చేసి, రశీదు పొందచ్చు
- దర్యాప్తు పురోగతి, అరెస్టులు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్‌వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్ సేవలు, వెరిఫికేషన్లు ఈ యాప్ ద్వారా జరుగుతాయి
- ఈ యాప్ నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు
- అత్యవసర సమయాల్లో వీడియో కాల్ చేస్తే పోలీస్ కంట్రోల్ రూంకు వెంటనే సమాచారం వెళ్తుంది
- సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే అవకాశం కూడా ఉంది
- 11 Sep 2020 3:13 AM GMT
Chalamalasetty Ramanujaya Death: కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ మృతి
అమరావతి
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామానుజయ
- కాపు కార్పొరేషన్ కు తొలి ఛైర్మన్ గా పని చేసిన రామానుజయ
- కరోనా లక్షణాలతో కొద్దిరోజుల క్రితం విజయవాడ జీజీహెచ్ లో చేరిన రామానుజయ
- 4రోజుల నుంచి వెంటిలేటర్ పై వైద్యం అందించిన వైద్యులు
- ఈ ఉదయం ఆసుపత్రిలో నే మృతి చెందిన రామానుజయ
- 11 Sep 2020 1:57 AM GMT
Andhra Pradesh Updates: వ్యాధి నిరోధక టీకాలలో ఏపీ నంబర్ వన్
అమరావతి
- ఏపీలో టీకాలు వేయించుకున్న 97శాతం చిన్నారులు
- 8 రకాల టీకాలు వేయించుకుంటున్న వారు 73.6 శాతం
- దేశంలో టీకాలు వేయించుకుంటున్న వారి సగటు 59.2%
- నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడి
- జాతీయ స్థాయిలో 74.2 మంది గ్రామాలలో టీకాల కోసం సబ్ సెంటర్లకు
- పట్టణ ప్రాంతాల్లో 45 శాతం మంది సబ్ సెంటర్, అంగన్‌వాడీలకు
- టీకాల కోసం దేశంలో 9.1 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులకు, 2.6 శాతం మంది ఎన్జీవోలకు
- ఏపీలో టీకాలు వేయించుకుంటున్న వారిలో బాలుర కంటే బాలికలే ఎక్కువ
- 11 Sep 2020 1:12 AM GMT
Weather Updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం.
వాతావరణం:
- ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం...
- అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం..
- దీనిప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు...
- తూర్పు-పడమర గాలుల వల్ల రాష్ట్రంలో ఎండల తీవ్రత..
- 11 Sep 2020 1:09 AM GMT
Rajahmandry Updates: సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ నేడు హారతులకు పిలుపునిచ్చిన జనసేన
తూర్పుగోదావరి:
రాజమండ్రి: దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నిరసన తెలుపుతూ, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ నేడు హారతులకు పిలుపునిచ్చిన జనసేన
- నేటి సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య ఇళ్ళవద్దనే దీపాలను వెలిగించాలని మహిళలకు జనసేన పిలుపు
- 11 Sep 2020 1:08 AM GMT
East Godavari Updates: ఆర్డీవో కార్యాలయాల ఎదుట బిజేపీ -జనసేన ధర్నాలకు సంయుక్త పిలుపు
తూర్పుగోదావరి:
రాజమండ్రి : హిందూ దేవాలయాలపై వరుస దాడులు నిరసిస్తూ జిల్లా కలెక్టరు, ఆర్డీవో కార్యాలయాల ఎదుట నేడు 12 గంటలకు బిజేపీ -జనసేన ధర్నాలకు సంయుక్త పిలుపు
- అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి రథం దగ్ధం ఘటనలను ప్రశ్నించిన వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్
- అరెస్టు చేసిన హిందువులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ ఘటనపై వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు పై ధర్నాలో నిరసన తెలపనున్న బిజేపీ -జనసేన
- 11 Sep 2020 1:06 AM GMT
Srisailam Dam Updates: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద
కర్నూలు జిల్లా:
- 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
- ఇన్ ఫ్లో: 1,98,239 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో: 1,68,000 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులు
- పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టిఎంసీలు
- ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 214.8450 టీఎంసీలు
- కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire