Live Updates: ఈరోజు (సెప్టెంబర్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 10 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అష్టమి (రా.10-36 వరకు) తదుపరి నవమి | రోహిణి నక్షత్రం (ఉ. 10-28 వరకు) తదుపరి మృగశిర | అమృత ఘడియలు: ఉ.7-01 నుంచి 8-44 వరకు తిరిగి తె. 2-35 నుంచి 4-16 వరకు | వర్జ్యం: సా. 4-24 నుంచి 6-05 వరకు | దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-44 వరకు తిరిగి మ. 2-49 నుంచి 3-38 వరకు | రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-05
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 10 Sep 2020 1:08 PM GMT
ACB Updates: మెదక్ అడిషనల్ కలెక్టర్ కేసులో కొనసాగుతున్న ఏసీబీ విచారణ...
ఏసీబీ అప్ డేట్స్......
-ఐదుగురు నిందితులను ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్న ఏసీబీ అధికారులు...
-మరి కాసేపట్లో న్యాయమూర్తి నివాసంలో హాజరు పరచనున్న ఏసీబీ...
-కలెక్టర్ నివాసంలో బ్యాంకు లాకర్ ను గుర్తించిన ఏసీబీ..
-లాకర్ కీ తన వద్ద లేదంటున్న అడిషనల్ కలెక్టర్ నగేష్...
-బ్యాంకు కు నోటిసులు ఇచ్చిన ఏసీబీ..
-ఇతర ఉద్యోగుల పాత్ర, మాజీ అధికారి పాత్ర పై ఏసీబీ ఆరా..
-ఆడియో టేపులు, చెక్ లు, ల్యాండ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్లను నిందితుల ముందు ఉంచి విచారిస్తున్న ఏసీబీ.
-అడిషనల్ కలెక్టర్ నగేష్ వద్ద కీలక ఆధారాలు సేకరిస్తున్న ఏసీబీ..
-నిందితుల నివాసాలలో దొరికిన నగదు, నగలు ఆస్తులను పరీశీలించిన ఏసీబీ....
- 10 Sep 2020 1:06 PM GMT
Kollur updates: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను సందర్శించిన శాసనసభాపతి పోచారం, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి..
కొల్లూరు..
-తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చురుగ్గా కొనసాగుతుదన్న కేటీఆర్
-జిహెచ్ఎంసి పరిధిలో సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం.
-ఈ సంవత్సరం డిసెంబర్ మాసానికి సుమారు 85వేల ఇళ్లను పేదలకి అందిస్తాం.
-కొల్లూరులో జిహెచ్ఎంసి నిర్మిస్తున్న భారీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాజెక్టుని శాసనసభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి సందర్శించిన కేటీఆర్
-అక్కడ కొనసాగుతున్న పనులను కేటీఆర్ సమీక్షించారు.
-స్పీకర్, మంత్రులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, అక్కడ ఉన్న సౌకర్యాలు, పనులు జరుగుతున్న తీరు ని తెలుసుకున్నారు.
-అంతకుముందు ముగ్గురు నిర్మాణం పూర్తయిన ఇళ్లల్లోకి వెళ్లి వాటిని స్వయంగా పరిశీలించారు.
-ఈ టౌన్ షిప్ రికార్డుల్లోకెక్కుతుందని గుర్తు చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
-ఇళ్ళు లేని నిరు పేదల కోసం, ప్రత్యేకంగా టౌన్ షిప్ నిర్మించడం బహుశా ప్రపంచంలోనే మొదటిసారి అన్న పోచారం.
-దేశంలోనే పేదల హౌసింగ్ కార్యక్రమాల్లో కొల్లూరు ఒక ఆదర్శమైన ప్రాజెక్టుగా నిలుస్తుంది.
- 10 Sep 2020 12:59 PM GMT
Hyderabad-Weather Updates: రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలతో పాటు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం..రాజారావు వాతావరణ అధికారి..
రాజారావు వాతావరణ అధికారి @ హైదరాబాద్..
-3.6కిమీ ఎత్తున షీర్ జోన్స్ ఏర్పడడం వల్ల ఈరోజు నుండీ వచ్చే 5 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలతో పాటు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..
-ఈనెల 13 న పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో ఆంద్రప్రదేశ్ తీరానికి వెంబడి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది..
-13 నుండి తెలంగాణ జిల్లాలో ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..
-గత 10 రోజులుగా నిన్నటి వరకు గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి...
-నిన్న భద్రాచలం లో 36.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది..
-నిన్నటి వరకు ఎలాంటి ఉపరితల అవర్తనాలు ఏర్పడలేవు గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం వల్లే వాతావరణం లో మార్పులు...
- 10 Sep 2020 12:48 PM GMT
Seconderabad updates: మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన మహిళ కేసు చేదించిన మార్కెట్ పోలీసులు..
సికింద్రాబాద్..
-సికింద్రాబాద్ మార్కెట్ పోలిస్ స్టేషన్..
-శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన మార్కెట్ పోలీసులు..
-మృతురాలు బన్సీలాల్ పేట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్న మహిళ గా గుర్తించిన పోలీసులు..
-మరికొద్ది సేపట్లో మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించనున్న నార్త్ జోన్ డీసీపీ కళామేశ్వర్.
- 10 Sep 2020 9:45 AM GMT
ACB updates: మెదక్ ఏసీబీ కేసులో దర్యాప్తు ముమ్మరం...
ఏసీబీ అప్ డేట్స్......
-అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను ఏసీబీ ప్రధాన కార్యాలయంకు తీసుకొచ్చిన ఏసీబీ...
-హైదరాబాద్ ఏసీబీ ప్రధాన కార్యాలయం లో ఐదుగురు నిందితులను విచారిస్తున్న ఏసీబీ అధికారులు...
-ఉన్నతాధికారి పాత్ర తో పాటు కింది స్థాయి ఉద్యోగుల పాత్ర పై నిందితులను నుండి వివరాలు సేకరిస్తున్న ఏసీబీ...
-స్టాంప్ అండ్ రీజిస్టేషన్ కు రాసిన లేఖ తో మాజీ కలెక్టర్ పాత్ర పై అనుమానాలు...
-మాజీ కలెక్టర్ రిటైర్మెంట్ రోజునే స్టాంప్ అండ్ రీజిస్టేషన్ కు లేఖ..
-దీంతో మాజీ కలెక్టర్ పై బలపడుతున్న అనుమానాలు...
-అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను ఉస్మానియా ఆసుపత్రి లో వైద్య పరీక్షలు నిర్వహించనున్న ఏసీబీ...
-అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్న ఏసీబీ అధికారులు...
- 10 Sep 2020 9:40 AM GMT
Telangana updates: రవీంద్రభారతి వద్ద ప్రయివేటు స్కూల్ టీచర్ నాగులు ఆత్మహత్యయత్నం బాధాకరం...నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శి..
నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శి..
-ప్రయివేటు స్కూల్ లో పనిచేసే టీచర్లు ఉద్యోగాలు లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు..
-దీనిమీద ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం అడ్డుకోకపోవడంతో టీచర్లు ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు...
-తక్షణమే ప్రభుత్వం ప్రయివేటు టీచర్లకు డబ్బులు రుణాలు ఇప్పించాలి వాళ్ళని ఆదుకోవాలి...
-ఆత్మహత్యయత్నం చేసిన టీచర్ కి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి..
- 10 Sep 2020 9:10 AM GMT
Kamareddy updates: తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో తమ్మినేని కామెంట్స్..
కామారెడ్డి..
-తమ్మినేని కామెంట్స్..
-తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
-తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచింది
-నిజాం సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలపై ఐలమ్మ పోరాడింది
-ఆమె స్పూర్తితో మేము పోరాటాలకు సిద్ధం అవుతున్నాము
-సీఎం కేసీఆర్ తెచ్చిన నూతన రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం
-రైతుబంధు సమయంలో కూడా కౌలు రైతులను గుర్తించలేదు
-ఈ చట్టంలో రెవిన్యూ లోపాలు, కుంభకోణాల జోలికి వెళ్ళలేదు
-కొత్తగా భూ సర్వే పై శాసన సభలో చట్టం చేయాలి
- 10 Sep 2020 9:05 AM GMT
Pragathi Bhavan: ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఎంపీల తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ.
ప్రగతి భవన్..
-సమావేశానికి ప్రభుత్వం ఉన్నతాధికారులను కూడా పిలిచిన కేసీఆర్.
-కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, జిఎస్టి వాటా, పరిపాలన అనుమతులు, కొత్త విద్యుత్ చట్టం పై చర్చ.
-పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అంశాలు, సభలో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్..
- 10 Sep 2020 9:00 AM GMT
Telangana updates: కేసీఆర్ మూడనమ్మకాల కోసం సచివాలయం.. గుడి.. మజీద్ కూల్చివేసారు....రేవంత్ రెడ్డి..
-రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ @ అరణ్య భవన్
-హుస్సేన్ సాగర్ పరిదిలో సచివాలయం నిర్మాణం వస్తుంది
-2006తరువాత మ్యాపులే ఉంచి.. పాతవి మాయం చేసింది
-ఎన్జీటి బృందం ను తప్పు దోవ పట్టించారు
-సికింద్రాబాద్ ఆర్మీ ఏరియాలో ఉన్న బ్రిటిష్ లైబ్రరీ లో పాత మ్యాప్ ఉంది
-సచివాలయంకు అన్ని అనుమతులు వచ్చాయని .. త్వరలోనే సచివాలయం నిర్మాణం చేస్తామని సునీల్ శర్మ ప్రకటించారు
-400కోట్ల నుంచి 700కోట్లకు అంచనాలు పెంచేసారు
-హుస్సేన్ సాగర్ చుట్టు ఉన్న నిర్మానాలు అన్ని తాత్కాలిక మైనవే
-మక్తాకూడా హుస్సేన్ సాగర్ అని తేల్చింది
-ఖైరతాబాద్ నుంచి మింట్ కంపౌండ్.. అమృత కస్టల్.. బండ్ వరకు హుస్సేన్ సాగర్ అని కేంద్ర కమిటీ తీర్పు ఇచ్చింది
-గుళ్ళను కూల్చిలేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
-ఎర్రగడ్డ కేసీఆర్ జన్మస్థలం..
-ఎన్జీటి కమిటీ వచ్చిందని నన్ను హౌజ్ అరెస్ట్ చేసారు
- 10 Sep 2020 8:38 AM GMT
Pragathi Bhavan: మరికొద్ది సేపట్లో ప్రగతిభవన్ లో పార్టీ ఎంపీలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్..
-సీఎం తో జరిగే ఈ సమావేశానికి పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరవుతారు.
-ఈ నెల 14 నుండి పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
-రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జిఎస్టి విషయంలో కేంద్రం వైఖరి.
-ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెందని సీనియర్ అధికారులు కూడా పాల్గొని వివిధ అంశాలపై వివరాలు అందిస్తారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire