Live Updates: ఈరోజు (సెప్టెంబర్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 10 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అష్టమి (రా.10-36 వరకు) తదుపరి నవమి | రోహిణి నక్షత్రం (ఉ. 10-28 వరకు) తదుపరి మృగశిర | అమృత ఘడియలు: ఉ.7-01 నుంచి 8-44 వరకు తిరిగి తె. 2-35 నుంచి 4-16 వరకు | వర్జ్యం: సా. 4-24 నుంచి 6-05 వరకు | దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-44 వరకు తిరిగి మ. 2-49 నుంచి 3-38 వరకు | రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-05
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 10 Sep 2020 12:43 PM GMT
Amaravati updates: ఏపీలో సీరో సర్వైలెన్స్ సర్వే ఫలితాల వెల్లడి..
అమరావతి..
-రాష్ట్రంలో 19.7 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని నిర్ధారణ
-పురుషుల్లో 19.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ
-మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ
-పట్టణాల్లో 22.5 శాతం మందికి కరోనా వచ్చి పోయినట్లు నిర్ధారణ
-గ్రామీణ ప్రాంతాల్లో 18.2 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు వెల్లడి
-కంటైన్‌మెంట్ జోన్లలో 20.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ
-నాన్ కంటైన్‌మెంట్ జోన్లలో 19.3 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు వెల్లడి
-రాష్ట్రంలో కరోనా వచ్చిపోయిన వారిలో 20.3 శాతం మంది హైరిస్క్‌లో ఉన్నట్లు నిర్ధారణ
- 10 Sep 2020 12:39 PM GMT
Kakinada-Amalapuram updates: అమలాపురంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు స్థలాన్ని పరిశీలించిన మంత్రి విశ్వరూప్ ,కలెక్టర్ మురళీధర్ రెడ్డి..
తూర్పు గోదావరి జిల్లా..
అమలాపురం..
-కామనగరువు తోపాటు మూడు ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించిన మంత్రి
-రెండు రోజుల్లో స్థల సర్వే జరిపి విస్తీర్ణంతో నివేదిక ఇవ్వాలని మండల రెవెన్యూ అధికారులు ఆదేశించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి
- 10 Sep 2020 12:33 PM GMT
Amaravati-BC Corporation: తుది దశకు చేరుకున్న బిసి కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల భర్తీ.
అమరావతి..
-సీఎం వద్దకు చేరిన 13 జిల్లాల కార్పొరేషన్ చైర్మన్,డైరెక్టర్ల జాబితా.
-ఈరోజు సాయంత్రానికి సీఎం ఫైనల్ చేసే అవకాశం.
-మొత్తం 52 కార్పొరేషన్లతో పాటు అదనంగా మరో 4 కార్పొరేషన్ల ఏర్పాటు.
-కార్పొరేషన్ చైర్మన్ల, డైరెక్టర్ల భర్తీలో మహిళలకు పెద్ద పీట వేసిన సీఎం.
-మొత్తంలో 50 శాతం మహిళలకే కేటాయించిన సీఎం.
- 10 Sep 2020 12:27 PM GMT
Visakhapatnam: విశాఖలో 57వ వార్డు లో విగ్రహాల వివాదం....
విశాఖ...
-బుద్దిడి విగ్రహం, హునుమాన్ ఆలయ స్థంభాలను తొలగించిన జీవీఎంసీ సిబ్బంది..
-ఆలయ స్థంభాల తొలగించడం పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన స్థానికులు
-స్థానికుల సమాచారంతో ఘటన స్థలం కు చేరుకున్న సాధుమఠం స్వామిజీ శివానంద, హిందూ పరిషత్ సభ్యులు..
-ఆలయ స్థంభాలు, బుద్దిడి విగ్రహం తొలగింపు పై ఆందోళన..
-ఘటన స్థలం కు చేరుకుని స్థానికులకు నచ్చజెప్పి పంపిన పోలిసులు..
- 10 Sep 2020 12:25 PM GMT
Amaravati-Antarvedi updates: అంతర్వేది రథం ఘటన దురదృష్టం..అంబటి రాంబాబు..వైసీపీ ఎమ్మెల్యే..
అమరావతి...
-జరిగిన సంఘటన పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది..
-ఈవోను వెంటనే ప్రభుత్వం తొలగించింది..
-కొత్త రథాన్ని తయారు చేయడం కోసం 95 లక్షలు కేటాయించింది..
-మతాలు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాయి..
-జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి..
-సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని మతాలు కులాలు సమానమే..
-తిరుపతి వెళ్లే బస్సు టికెట్లు మీద అన్యమత ప్రచారం చేసి దాన్ని వైఎస్సార్ సీపీ మీద నెట్టే ప్రయత్నం చేసి చంద్రబాబు నవ్వుల పాలయ్యారు..
-విజయవాడలో 39 పురాతన దేవాలయాలను కులదోయించిన చరిత్ర చంద్రబాబుది..
-సీబీఐ మీద ఎప్పుడు నమ్మకం కలిగిందో చెప్పాలి..
-సీబీఐ విచారణ వేయడానికి మాకు ఎలాంటి అభ్యతరం లేదు..
-కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారు...
-మానవ రూపంలో ఉన్న దెయ్యం చంద్రబాబు నాయుడు..
- 10 Sep 2020 12:19 PM GMT
Visakha updates: విశాఖ లో డ్రగ్స్ కలకలం..
విశాఖ...
-హైదరాబాద్ నుండి విశాఖ కు దిగుమతి చేసి విశాఖ విధ్యార్థులు కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వర్మ రాజు అనే యువకుడు ని అదుపులోనికి తీసుకున్న పోలీసులు.
-200మీ గ్రా ఎండీఎంఏ బ్లాట్స్, ఓఎస్డీ షీట్లు గంజాయీ, గోగో ప్లస్ షీట్స్ ను గుర్తించిన పోలిసులు...
-వర్మరాజు ఇచ్చిన సమాచారం మేరకు రుషికొండ వద్ద ఓ రెస్టారెంట్ లో డ్రగ్స్ నిల్వలను గుర్తించిన పోలిసులు..
-డ్రగ్స్ సీజ్ చేసి నిందితులు లను అదుపులోనికి తీసుకున్న పోలీసులు
- 10 Sep 2020 12:17 PM GMT
Visakha-Srikanth Case: శిరోముండనమ కేసులో ముగ్గురు నిందితులను కస్టడీ కోరిన పోలీసులు..
విశాఖ..
-శ్రీకాంత్ శిరోముండనము కేసు..
-నూతననాయుడుభార్య మధుప్రియ,ఇందిరా,వరహలను కస్టడీకి అనుమతించిన కోర్టు
-రెండు రోజుల పోలీసులు కస్టడీ కి అనుమతించిన కోర్టు
-రెండు రోజుల పాటు ముగ్గురు నిందితులు ను విచారించనున్న పోలీసులు
- 10 Sep 2020 9:35 AM GMT
Amaravati updates: చంద్రబాబు, లోకేష్ పై జోగి రమేష్...వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్ ..
అమరావతి...
-జోగి రమేష్...వైసీపీ ఎమ్మెల్యే....
-హత్యకేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారిని పరామర్శించేందుకు రాష్ట్రానికి లోకేష్ వచ్చారు.. రాష్ట్ర ప్రజలు కోసం రాలేదు..
-40 మందిని జైలుకు పంపిస్తామని లోకేష్ అంటున్నాడు..
-ఒక ఎమ్మెల్యే అవినీతి చేసినట్లు చూపించు..
-సవాల్ చేసి హైదరాబాద్ పారిపోవడం కాదు..
-నీ దగ్గర ఆధారాలు ఉంటే బైట పెట్టాలి..
-లోక జ్ఞానం లేని లోకేష్ రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు..
-ప్రజాలు కష్టాల్లో ఉంటే మీరు హైదరాబాద్ లో ఉంటారా..
-కరోనాకు భయపడి హైదరాబాద్ పారిపోతారా..
-14 ఏళ్ల సీఎంగా చంద్రబాబు చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి ఏడాదిలో చేశారు..
-అమరావతిని సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తారు..
- 10 Sep 2020 9:28 AM GMT
Visakha updates: సీఎం జగన్మోహనరెడ్డికి హిందువుల మీద కోపం ఎందుకో అర్థం కావడం లేదు...మాజీ మంత్రి అయ్యనపాత్రుడు..
విశాఖ..
-మాజీ మంత్రి అయ్యనపాత్రుడు కామెంట్స్...
-తూర్పు గోదావరి జిల్లాలోని సింహాచలంనకు చెందిన భూముల్లోని ఇసుక, గ్రావెల్ ను చైర్మన్ తను స్వయంగా కలెక్టర్ కు లెటర్ రాసి, అమ్మకం చేయడం అన్యాయం - మాజీ మంత్రి అయ్యన్న
-నిబంధనల ప్రకారం పాలకమండలిలో తీర్మానం చేస్తే ఆలయ ఈవో చర్యలు తీసుకోవాల్సి ఉంది. దానికి
-భిన్నంగా చైర్మన్ వ్యవహారించడం దారుణం..
-15 నెలల కాలంలో మూడు దేవాలయాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి..
-16 గుళ్ల గోపురాలు పడగొట్టడం జరిగింది. వీటిపై సీఎం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు...
-అంతర్వేది ఘటనపై పట్టించుకున్న మాదిరిగానే సింహాచలం దోపిడీలపై జిల్లా మంత్రులు కూడా స్పందించాలి...
- 10 Sep 2020 8:23 AM GMT
Amaravati Updates: రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసగా ఆదివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పూజలు..చిన్న రాజప్ప మాజీ మంత్రి..
అమరావతి..
-చిన్న రాజప్ప మాజీ మంత్రి
-ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రేపు రాజోలు బందు నిర్వహణ
-పార్టీలకతీతంగా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలి
-రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుండి శనివారం వరకు సూర్య దేవాలయాల వద్ద పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది.
-ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా ప్రజలు పాల్గొనాలని పిలుపునిస్తున్నాం.
-ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేవాలయాల్లో ప్రార్థనలు నిర్వహించాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire