Live Updates: ఈరోజు (సెప్టెంబర్-09) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 09 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | సప్తమి (రా.9-31వరకు) తదుపరి అష్టమి, | కృత్తిక నక్షత్రం (ఉ. 8-34వరకు) తదుపరి రోహిణి | అమృత ఘడియలు ఉ. 5-56 నుంచి 7-41 వరకు | వర్జ్యం రా. 1-50 నుంచి 3-34 వరకు | దుర్ముహూర్తం: ఉ. 11-33 నుంచి 12-22 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-06
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 9 Sep 2020 12:37 PM GMT
ACB updates: మెదక్ ఇంచార్జ్ కలెక్టర్ నగేష్ అరెస్ట్ కు రంగం సిద్ధం...
ఏసీబీ అప్ డేట్స్......
-మరికాసేపట్లో అరెస్ట్ చేయనున్న ఏసీబీ...
-ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో ముగిసిన ఏసీబీ సోదాలు..
-ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు....
-జూనియర్ అసిస్టెంట్ వసిమ్ హైమ్మద్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు...
-మెదక్ ఇంచార్జ్ కలెక్టర్ నగేష్ బినామీ కోల జీవన్ గౌడ్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..
-నగేష్ ఆడియో టేపులు, డాక్యుమెంట్లు, స్వాధీనం చేసుకున్న ఏసీబీ.
-ఇప్పటికే ఆడియో టేపులు స్వాదీనం
-సోదాలు అనంతరం అరెస్ట్ చేసి ఏసీబీ ప్రధాన కార్యాలయం కు తరలించనున్న ఏసీబీ.
- 9 Sep 2020 12:11 PM GMT
BJP Media Statement: గవర్నరుగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా డా. తమిళిసై సౌందరరాజన్ గారికి బీజేపీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు..కె కృష్ణసాగర రావు..
బీజేపీ మీడియా స్టేట్మెంట్.
కె కృష్ణసాగర రావు....ముఖ్య అధికార ప్రతినిధి,
-గవర్నర్ తమిళిసై గారి తొలి ఏడాది పాలన ఎంతో ఫలప్రదంగా సాగింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారితో ఆవిడ కలసిపోయారు, రాజ్ భవన్ ను సామాన్యులకు చేరువ చేసి, అందరికీ అందుబాటులోకి తెచ్చారు.
-రాష్ట్ర రాజ్యాంగాధిపతిగా, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, అన్ని ప్రతిపక్ష పార్టీలూ స్వేచ్ఛగా రాజభవన్ తలుపు తట్టే అవకాశం కల్పించారు గవర్నర్.
-ఆవిడ భవిష్యత్తు పదవీకాలం మరింత ఫలప్రదంగా సాగాలని కోరుకుంటున్నాను.
-ఇటువంటి వ్యక్తి గవర్నరుగా రావడం తెలంగాణ ప్రజల అదృష్టం.
- 9 Sep 2020 11:56 AM GMT
Actress Sravani Suicide: నటి శ్రావణి ఆత్మహత్య కేస్ లో మరో ట్విస్ట్...
సిరియల్ నటి శ్రావణి కేస్ అప్డేట్
-తన చావు కి కారణం సాయి అనే వ్యక్తి అని దేవ్ రాజ్ కి కాల్ చేసి చెప్పుకున్న శ్రావణి...
-కుటుంబ సభ్యుల ఫోర్స్ వలన నాపై తప్పుడు కేసులు పెట్టించారు అని చెప్తున్నా దేవరాజ్..
-సెప్టెంబర్ 7 న నేను శ్రావణి కలిసి డిన్నర్ కి వెళ్లాము అక్కడికి సాయి అనే వ్యక్తి వచ్చి శ్రావణి పై చేయి చేసుకున్నాడు....
-శ్రావణి కి సాయి అనే వ్యక్తి 5 సంవత్సరాల నుండి పరిచయం ఉంది అని చెవుతున్న దేవరాజ్...
-సంవత్సరం క్రితం నేను శ్రావణి కి పరిచయం అయ్యాను...
-శ్రావణి కుటుంబ సభ్యులు మరియు సాయి అనే వ్యక్తి ఆమె ను కొట్టి హింసించేవారు...
-నాపై గతం లో ఫిర్యాదు చేసిన తరువాత కూడా ఇద్దరం కలుసుకున్నాము...
-నా చావు కి కారణం సాయి అనే వ్యక్తి అని నాతో చెప్పుకుంది.....
- 9 Sep 2020 11:48 AM GMT
Sriram Sagar Project updates: పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్..
నిజామాబాద్..
-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగులకు చేరిన జలాశయం
-మహారాష్ట్ర నుంచి గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి
-రేపు శ్రీరాం సాగర్ వరద కాల్వ ద్వారా నీటిని విడుదల చేయనున్న అధికారులు
-పరివాక గ్రామాల ప్రజలను మత్స్య కారులు, గొర్రెలు, పశువుల కాపరులను అప్రమత్తం చేసిన అధికారులు
- 9 Sep 2020 11:45 AM GMT
Telangana updates: కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా..మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్
-మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్:
-కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వారికి నమస్సుమాంజలిలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-తెలంగాణ ప్రజలకు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి
-నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన కాళోజీ, మానవీయ విలువలను చాటారు
-మానవతే కేంద్రంగా కవిత్వాన్ని రాసి ప్రపంచవ్యాప్తం చేశారు
-వారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారు కావడం మా అదృష్టంగా భావిస్తున్నాను
-వారి జయంతి ని తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం కాళోజీ స్మారక పురస్కారాలు ఇస్తున్నందుకు సీఎం కేసీఅర్ గారికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు
-కాళోజీ ఆశీస్సులతో సీఎం కేసీఅర్ గారి ఆలోచనలతో సాంస్కృతిక తెలంగాణ గా మారుతుంది
-కాళోజీ జీవితమే ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో అనేక మంది కవులు అయ్యారు
-కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మరోసారి నమస్సుమాంజలి తెలియచేస్తున్నాను
- 9 Sep 2020 9:52 AM GMT
TS Assembly: అసెంబ్లీ లో రెవెన్యూ చట్టం ప్రవేశ పెట్టడం చారిత్రాత్మకం..మంత్రి శ్రీనివాస యాదవ్
మంత్రి శ్రీనివాస యాదవ్ చిట్ చాట్ @ అసెంబ్లీ ప్రాంగణం బయట..
#కొత్త చట్టం తెచ్చిన సీఎం కెసిఆర్ కు అభినందనలు..
#పనుల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు .. కొత్త చట్టం తో వారికి పెద్ద ఊరట లభించినట్టయింది
#అవినీతి బెడద పూర్తిగా తొలగిపోతుంది
#సీఎం కెసిఆర్ అక్బర్ కు మంచిగా సమాధానమిచ్చారు
#సీనియర్ సభ్యుడైనంత మాత్రాన అక్బర్ ఏదీ పడితే అది మాట్లాడతానంటే కుదరదు
#భట్టి అపర మేధావి లా వ్యవహరిస్తుంటారు ..ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడం చేత కాదు
#మంత్రి ఈటెల రాజేందర్ మొత్తం విషయాలను చెప్పాలంటే రెండు రోజులైనా సమయం సరిపోదు
- 9 Sep 2020 8:19 AM GMT
Siddipet updates: సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు బొమ్మర వెంకటేశం మృతి...
సిద్దిపేట :
-కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటి చైర్మెన్,సీఎం కేసీఆర్ బాల్య మిత్రుడు బొమ్మర వెంకటేశం మృతి...
-కరోనాతో గత వారం రోజుల క్రితం హైదరాబాద్ లోని వాసవి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈరోజు మృతి...
-మృతుని స్వస్థలం దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామం.
- 9 Sep 2020 8:13 AM GMT
Revenue Act-KCR: రెవెన్యూలో కేసీఆర్ తెచ్చిన కొత్త చట్టం ఒక వరం లాంటిది....ఎమ్మెల్యే దానం నాగేందర్..
-ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్..
-రెవెన్యూ లో కొత్త సంస్కరణలు తీసుకురావాలని సమస్యలు పరిష్కరించడానికి తెచ్చిన చట్టాన్ని రైతులు వరంగా భావిస్తున్నారు..
-ఇలాంటి చట్టం తీసుకురావాలనే ఆలోచన చాలా గొప్ప విషయం
-తెలంగాణలోని చిన్న సన్నకారు రైతులు ఈ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు
-శుక్రవారం ఈ చట్టం పై సీఎం కేసీఆర్ పూర్తిగా వివరించబోతున్నారు..
-దేశ చరిత్రలో కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది
- 9 Sep 2020 8:10 AM GMT
Warangal Urban Updates: వరంగల్ సీపీ ప్రమోద్ కుమార్ ప్రెస్ మీట్..
వరంగల్ అర్బన్..
-మత్తు పదార్థాలకు బానిసైన యువకుడు ఆడేపు అకాశ్ బాబు ఈనెల 3న డబ్బుకోసం మేనత్త శారదను హత్య చేశాడు
-నిందితుడు అక్ష బాబుతో పాటు మరో ఇద్దరి సహాయంతో శారదను హత్య చేశాడు.
-హత్య చేసి బీరువా మీద పడ్డట్లు చిత్రీకరించాడు.
-ఓ బాల నేరస్తుడితో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశాం.
-శారదా కుమారుడు అఖిల్ చికిత్స పొందుతూ ఉన్నాడు.
-వారి నుంచి 2 లక్షల 71వేల నగదు, బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నాం
- 9 Sep 2020 7:32 AM GMT
SR Nagar Inspector with HMTV: నిన్న రాత్రి 11:30 కు శ్రావణి చనిపోయినట్లు ఫిర్యాదు వచ్చింది... ఇన్స్పెక్టర్ నర్సింహ రెడ్డి....
HMTV తో ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ నర్సింహ రెడ్డి....
-గత కొన్ని సంవత్సరాలుగా కాకినాడ కు చెందిన దేవరాజు రెడ్డి అలియాస్ సన్నీ తో టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
-పరిచయం కాస్త ప్రేమగా మారింది.
-జూన్ లో దేవరాజు పై శ్రావణి ఫిర్యాదు చేసింది..
-ఫిర్యాదు మేరకు దేవరాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాము
-శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిన కారణాలు దేవరాజు అదుపులోకి తీసుకొని విచారిస్తాము
-టిక్ టాక్ పరిచయం తో దేవరాజు శ్రావణి ని వేధింపులకు గురి చేసేవాడనీ శ్రావణి కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చారు..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire