Live Updates: ఈరోజు (సెప్టెంబర్-09) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 09 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | సప్తమి (రా.9-31వరకు) తదుపరి అష్టమి, | కృత్తిక నక్షత్రం (ఉ. 8-34వరకు) తదుపరి రోహిణి | అమృత ఘడియలు ఉ. 5-56 నుంచి 7-41 వరకు | వర్జ్యం రా. 1-50 నుంచి 3-34 వరకు | దుర్ముహూర్తం: ఉ. 11-33 నుంచి 12-22 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-06
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 9 Sep 2020 6:33 AM GMT
Antervedi updates: పోలీసుల వలయంలో అంతర్వేది ఆలయం..
తూర్పుగోదావరి..
-అంతర్వేది స్వామి వారి ఆలయం వద్ద భారీగా పోలీసులు
-పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు
-గ్రామాల నుంచి ఆలయం వద్దకు ఏవిధమైన వాహనాలు రాకుండా, వెళ్లకుండా పోలీసు బారికేడ్లు ఏర్పాటు.
- 9 Sep 2020 6:31 AM GMT
Srikakulam updates: రాజాం మడ్డువలస రిజర్వాయర్ ఆఫీస్ ముందు జి సిగడాం మండలం రైతులు ఆందోళన..
శ్రీకాకుళం జిల్లా..
-రెండు సంవత్సరాలుగా మడ్డువలస కుడికాలువ ద్వారా నీరు రావడం అందడం లేదంటూ ధర్నా..
-అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంతో ఆందోళన బాట పట్టిన రైతులు..
-బిజెపి ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన..
- 9 Sep 2020 6:28 AM GMT
Amaravati updates: సచివాలయంలో మరో 17 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్..
అమరావతి..
-సచివాలయం లో 100 దాటిన కరోనా కేసులు
-తాజా కేసులతో ప్లానింగ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ కు వర్క్ ఫ్రమ్ హోం
- 9 Sep 2020 6:26 AM GMT
Kakinada updates: రాష్ట్రీయ బ్రాహ్మిన్ ఫ్రంటి తెలుఁగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్సి dhv సాంబశివరావ్ కామేంట్స్....
తూర్పు గొదావరి....
-అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం రథం దగ్ధం ఫై విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర వెంటనె స్పందించ్చారు.
-అయితే సాధుపరిషత్ పేరిట శ్రీనివాసానంద అనే సాధువు ఈ విషయంలో శారదా పీఠాధిపతి ని నిందించడం సమంజసం కాదు..
-ఆ సాధువు చేసిన ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నము
-దేశంలోనే కాదు, ప్రపంచంలోనే విశాఖ శారదా పీఠానికి హిందూ ధర్మాన్ని కాపాడే ఏకైక పీఠంగా పేరు ఉంది..
-మరోసారి ఈ సాధువు రాజకీయాలు మాట్లాడినా, విశాఖ శారదా పీఠం పేరు ఎత్తినా సహించేది లేదు..
-స్వామీజీ సూచనల మేరకు మంత్రులు పర్యటించారని,లోతుగా విచారణ చేస్తున్నారు..
-మరోసారి స్వరూపానంద పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు..
- 9 Sep 2020 6:20 AM GMT
Amaravati updates: సచివాలయం లో వాస్తు మార్పులు..
అమరావతి..
-ఇప్పటికే అసెంబ్లీ, సచివాలయంలో మూడు గేట్లు మూసివేత
-తాజాగా మరో రెండు గేట్లకు గోడను నిర్మిస్తున్న అధికారులు
-సచివాలయం గేట్ నంబర్ 1, అసెంబ్లీ గెట్ నంబర్ 2 వద్ద గోడ నిర్మాణం
-గతం లో అసెంబ్లీ గేట్ నంబర్ 5, సచివాలయం గేట్ నంబర్ 1, 8 మూసివేత.
- 9 Sep 2020 5:34 AM GMT
Amaravati updates: మూడు రాజధానులపై సీఎం జగన్..
అమరావతి..
-ఏపీకి మూడు రాజధానులు, అమరావతి భవిష్యత్తు, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, ఫోన్ ట్యాపింగ్ వంటి పలు కీలక అంశాలపై ఒక జాతీయ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి
-లక్ష కోట్ల ఖర్చు బెట్టి మహా నగరాన్ని నిర్మించడం సాధ్యం కాదు.
-దానివల్ల అదనపు ఆదాయం పక్కన పెడితే,మౌలిక సదుపాయాల కోసం చేసిన అప్పులు కూడా తీర్చలేము.
-అమెరికా ఆర్థిక వ్యవస్థలో మహా నగరాల పాత్ర ఎక్కడా?
-గతంలో విశాఖపట్నం రాజధాని కాదు చిన్న పట్నంలా ఉన్న సమయంలో దశాబ్దాల క్రితం స్టీల్ ప్లాంట్ తో చాలా పరిశ్రమలు వచ్చాయి.
-ఇప్పుడు విశాఖపట్నం మహా నగరంగా అభివృద్ధి చెందుతుంది.
-పెట్టుబడులు అన్ని ఒక ప్రాంతంలో పెట్టడం కంటే అనేక ప్రాంతాలను అనుసంధానం చేయవచ్చు.
-నగరాల ద్వారా ఆదాయాలు పెరుగుతాయని అనుకోవడం తప్పుడు ఆలోచన.
-ఒకటి రెండు మినహాయించి ప్రపంచంలో ఎక్కడా కూడా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీస్ సఫలం కాలేదు.
-శివరామ కృష్ణన్ కమిటీ చెప్పిన విధంగానే మూడు ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం.
-ప్రభుత్వ పనులు మొత్తం ఒకే ప్రాంతం నుండి ఎందుకు జరగాలి.
-చెన్నై, హైదరాబాద్ ద్వారా రాష్ట్రం ఇప్పటికే నష్టం పోయిందని చరిత్ర చెప్తుంది.
-గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని కూడా మూడు ప్రాంతాలపై దృష్టి పెట్టాం
-1990లో గతంలో హైదరాబాద్ జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ తరహాలో అమరావతిలో కూడా చెయ్యాలని చూసారు.
-సచివాలయం,హైకోర్టు,అసెంబ్లీ వల్ల అభివృద్ధి జరగదు అని భావిస్తే వాటి కోసం ఎందుకు పట్టుబడుతున్నారు.
-అమరావతి ప్రాంతం భారీ నిర్మాణాలకు అనువైన ప్రాంతం కాదు.
-33వే ల ఎకరాలు రైతుల నుండి తీసుకోవడం కంటే మరో ప్రాంతంలో 500ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టి ఉండొచ్చు.
-*భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది*
-బినామిలు అందరూ బయటపడతారు.
-రాజధానిలో భూములు కొన్నవారు వేల కోట్లు సంపాదించారు.
-విశాఖపట్నం,అనంతపురం, కర్నూలు,తిరుపతి సహా రాష్జ్త్రంలో మరోకోన్నీ నగరాలు అభివృద్ధి కేంద్రాలుగా మారతాయి.
-నేను అమరావతిని విస్మరించలేదు ఇక్కడ శాసన రాజధాని కొనసాగుతుంది
-దేశంలో రెఫరెండం కాన్సెప్ట్ ఉపయోగంలో లేదు అందుకే నిపుణుల సలహా తీసుకుంటున్నాం
-దేశంలో రెఫరెండం అప్షన్ ఉంటే ఈ అంశంపై రెఫరెండం కు వెళ్లే వాళ్ళం.
-అభివృద్ధి వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజల మద్దత్తు ఉందని మాకు నమ్మకం.
-కేవలం29గ్రామాలు,10 వే ల మంది రైతులు అనేక కారణాల వల్ల వ్యతిరేకిస్తున్నారు కానీ, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు అన్ని వికేంద్రీకరణకు మద్దత్తు ఇస్తున్నాయి
-చంద్రబాబుకు మరో ఎజెండా లేదు.
-గత 15నెలలుగా చంద్రబాబు అమరావతి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.
-మేము అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని ముందే చెప్పాము.
-అమరావతి అంత చర్చించదగిన అంశం కాదు
-ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన సీఎం
-ఆధారాలు సమర్పించాలని డిజిపి చంద్రబాబును కోరారు.
-ట్యాపింగ్ కు సంబంధించి ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు.
-మేము ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మా ఫోన్ ట్యాప్ చేశారు. ఆధారాలు కూడా సమర్పించాం.
-కాంగ్రెస్,బీజేపీలపై మాది రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ.
-లోక్ సభలో నాలుగవ అతిపెద్ద పార్టీ అయినప్పటికీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయ లేదు.
-రాష్ట్ర విభజన అనంతరం కేవలం ఎపి అభివృద్ధిపై మాత్రమే మేము దృష్టి సారించాం.
-రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నాం.
-జాతీయ అంశాలు మాకు అంత ప్రాధాన్యత కాదు.
-కేంద్రంతో సంబంధాలు
-ఎపి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో మా మద్దతు ఉంటుంది.
-ప్రత్యేక హోదా కోసం మా పోరాటం కొనసాగుతుంది.
-రెవెన్యూ లోటుతో రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది.
-పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తేనే రాష్ట్రాభివృద్ధి చెందుతుంది.
-ప్రత్యేక ప్యాకేజి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.
-జిఎస్టీ మినహాయింపు లపై కేంద్రంజిఎస్టీ చెల్లింపులలో కొంత ఆలస్యం చేసినప్పటికీ, పెద్ద ఎత్తున జిఎస్టీ చెల్లింపులు తగ్గించలేదు.
-కరోన నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని కేంద్రo అర్థం చేసుకోవాలి.
-ప్రస్తుతంసంక్షోభం నుండి బయట పడాలి అంటే అప్పులు తెచ్చుకోవడమే మార్గం.
-ఇప్పటికే అదనంగా అప్పులు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
-ప్రజల పై పన్నుల భారం విధించలేము.
-ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషిస్తున్నాం.
-ఇంగ్లిష్ మీడియంపై సీఎం జగన్
-జాతీయ విద్యా విధానంలో కూడా 6వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియంకు శ్రీకారం చుట్టారు
-మేము ఇంగ్లీష్ మీడియం అమలు దిశగా అడుగులు వేశాం.
-జాతీయ విద్యా విధానంపై 2020 దేశంలో సమానత్వాన్ని తీసుకొస్తుంది.
-ఇంగ్లీష్ పై ప్రేమతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టలేదు.
-మాతృభాషను విస్మరించము విస్మరించే ఆలోచన కూడా లేదు.
-సమానత్వాన్ని తీసుకు రావడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం
-స్థోమత ఉన్న వాళ్లు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీషు మీడియం చదివిస్తుంటే పేద విద్యార్థులు మాత్రం ప్రాంతీయ భాషల్లో చదువుతున్నారు.
-ప్రయివేటు స్కూల్ నుండి వచ్చిన వారు ప్రభుత్వ,ప్రయివేటు రంగాల్లో అధిక శాతం ఉద్యోగాలు సాధిస్తున్నారు.
-సీఎం జగన్..
- 9 Sep 2020 4:03 AM GMT
Visakhapatnam updates: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..
విశాఖ..
-ఈనెల 13 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరాన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.
-దాని ప్రభావంతో తగ్గునున్న పగటి ష్ణోగ్రతలు
-ఈనెల 12 నుంచీ కోస్తాంధ్ర, తెలంగాణలకు వర్షాలు
-నేడు రేపు తెలంగాణ, రాయలసీమల్లో ఉరుములతో కూడిన జల్లులు. ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల జల్లులు
- 9 Sep 2020 2:35 AM GMT
Antarvedi Fire Accident: చలో అంతర్వేది కి పిలుపునిచ్చిన బిజెపి, జనసేన నాయకుల గృహనిర్బంధం
తూర్పు గోదావరి
అమలాపురం: అమలాపురం సబ్ డివిజన్ లో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా చలో అంతర్వేది కి పిలుపునిచ్చిన బిజెపి జనసేన నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేసిన పోలీసులు..
- కర్ఫ్యూ వాతావరణం తలపిస్తున్న కోనసీమ...
- 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా ర్యాలీలు ,నిరసన కార్యక్రమాలు నిషేధం
- ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది..
- నిన్న అనుమతి లేకుండా చలో అంతర్వేది కార్యక్రమంలో నిర్వహించిన 43 మంది పై కేసు నమోదు చేసి అరెస్టు లు.
- 9 Sep 2020 2:31 AM GMT
Anantapur Pesticides: అనంతపురం జిల్లాలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
- జిల్లా వ్యాప్తంగా 64.50 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలు నిలిపివేత
- ఎరువుల కు సంబంధించి సరైన పత్రాలు డీలర్ల వద్ద లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు
- మొత్తం రూ.13,12,573 విలువైన సరుకును సీజ్ చేసిన అధికారులు.
- 9 Sep 2020 2:30 AM GMT
Anantapur Arts College: ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు అనంతపురం ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు పరీక్షలు.
అనంతపురం:
- ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు బిఏ, బీకాం పరీక్షలు
- మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు బిఎస్సి పరీక్షలు నిర్వహణ
- మొత్తం 1622 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire