Live Updates: ఈరోజు (సెప్టెంబర్-09) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 09 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | సప్తమి (రా.9-31వరకు) తదుపరి అష్టమి, | కృత్తిక నక్షత్రం (ఉ. 8-34వరకు) తదుపరి రోహిణి | అమృత ఘడియలు ఉ. 5-56 నుంచి 7-41 వరకు | వర్జ్యం రా. 1-50 నుంచి 3-34 వరకు | దుర్ముహూర్తం: ఉ. 11-33 నుంచి 12-22 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-06
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 9 Sep 2020 3:51 PM GMT
Antarvedi Updates: అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్ నియామకం
తూర్పుగోదావరి:
- అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్‌ను నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్‌గా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌కు బాధ్యతలు అప్పగించారు.
- అంతర్వేదిలో పరిస్థితి పర్యవేక్షించాలని దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది
-. 15 రోజులపాటు అంతర్వేదిలోనే ఉండాలని, కొత్త రథం నిర్మాణం సహా పరిస్థితులు కొలిక్కి తీసుకురావాలని దేవదాయ శాఖ సూచించింది.
- అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ఆలయ ఇన్‌చార్జి ఈవో ఎన్‌ఎస్. చక్రధరరావుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే
- కొత్త ఇవో గా ఎర్రంశెట్టి భద్రాదీజీ నేడు బాధ్యతలు స్వీకరించారు
- ఆలయ సిబ్బందిపైనా చర్యలకు రంగం సిద్ధమైంది.
- 9 Sep 2020 3:48 PM GMT
Vizianagaram Updates: విజయనగరం జిల్లా గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు.
విజయనగరం:
- నెలల నిండిన గర్భిణిని డోలీపై కొండ దించిన గిరిజనులు.
- శృంగవరపుకోట మండలంలోని దారపర్తి పంచాయతీ పల్లపు దుంగాడ గ్రామానికి చెందిన కస్తూరి దేవుడమ్మకు పురిటినొప్పులు రావడంతో వైద్యం కోసం ఇక్కట్లు
- కుటుంబ సభ్యులు బందువుల సాయంతో డోలీలో పదకొండు కిలోమీటర్ల తీసుకువచ్చి కొండ దిగువనున్న దబ్బగుంట గ్రామం నుండి ఆటలో హస్పలకు తరలించిన కుటుంబ సభ్యులు
- 108 వాహనానికి రెండు గంటలకు పైగా ఫోను చేసి నెట్వర్క్ కలవకపోవడంతో ఆటోలో ఎస్ కోట హస్పటలకు తరలింపు.
- 9 Sep 2020 12:15 PM GMT
Visakhapatnam updates: వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు..అవంతి శ్రీనివాస్ పిసి
విశాఖ..
అవంతి శ్రీనివాస్ పిసి
-వ్యవసాయానికి మీటర్లు బిగించవద్దని కేంద్రానికి చంద్రబాబు ఎందుకు లేఖ రాయరు.
-హిందువుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదు
-మాది సెక్యులర్ ప్రభుత్వం...అందరి మత విశ్వాసాలనిమా ప్రభుత్వం పట్టించుకుంటుంది
-కృష్ణా పుష్కరాలలో చంద్రబాబు ఎన్ని ఆలయాలు పడగొట్టించారో గుర్తు లేదా
-చంద్రబాబు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది
-పేద రైతులకి ఉచిత విద్యుత్ ని నాడు చంద్రబాబు వ్యతిరేకించారు.
-అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే మూడు రాజధానులు
-అమరావతిని కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలనా రాజధానిగా చేస్తాం..
-పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ పోలీసులపైనమ్మకం లేదనటం దారుణం...
-లోకేష్ ని జైలుకి వెళ్లకుండా చూసుకోమనండి
- 9 Sep 2020 11:32 AM GMT
Amaravati updates: ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు..
అమరావతి..
-వందశాతం మేర ప్రభుత్వ రంగ సంస్థగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్
-కేంద్రం ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కుల అమలు ఏజెన్సీగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్
-ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ షగిలి షన్మోహన్ కు ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రా కార్పోరేషన్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు
- 9 Sep 2020 11:20 AM GMT
Amaravati updates: భూముల నిర్వహణ, రీ సర్వే ల పై సబ్ కమిటీ ఏర్పాటు..
అమరావతి..
-ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ మేనేజ్మెంట్, ల్యాండ్ టైటిలింగ్ మరియు రీసర్వే పై అధ్యయనం చేసి సమస్యలకు సూచనలు చేయనున్న సబ్ కమిటీ
-నలుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు
-కమిటీ సభ్యులుగా డెప్యూటీ సీఎం రెవిన్యూ, ఆర్థిక, ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ మంత్రులు
- 9 Sep 2020 11:17 AM GMT
Srikakulam updates: రైతాంగానికి ఉచిత విద్యుత్ అనేది దేశంలో మొదటి సారి ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడం జరిగింది..స్పీకర్ తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం జిల్లా..
-స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..
-ప్రజలు ఆదరించి మాకు ఎంతకాలం అధికారం ఇస్తే అంతకాలం ఈ పథకం అమలు జరుగుతుంది..
-మంచిని ప్రోత్సహించే ప్రతిపక్షం దేశంలో కారువైనందుకు బాధగా ఉంది..
-విద్యుత్ ఆదా చేసేలా మీటర్లు ఏర్పాటు చేసి రైతులకు అన్యాయం జరగకుండా పథకాన్ని ప్రారంభించాం..
-గత ప్రభుత్వం చేసిన 8 వేల కోట్ల బకాయిలు కూడా చెల్లించి ఈ పాలసీ ప్రవేశపెడుతున్నాం..
-ఉచిత విద్యుత్ అనేది వైసిపి ప్రభుత్వం జీవం..ఊపిరి..
-ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ పథకాన్ని కొనసాగిస్తాం..
-ఉచిత విద్యుత్ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళం నుంచి ప్రారంభించడం సంతోషకరం..
- 9 Sep 2020 11:13 AM GMT
Kadapa updates: వైయస్సార్ సంపూర్ణ పోషణ పంపిణీ లో రాయచోటి నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలి...ప్రభుత్వ ఛీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి....
కడప :
-రాయచోటి సి.డి.పి.ఓ కార్యాలయంలో 20 వేల మంది బాలింతలకు, పిల్లలకు, గర్భిణీలకు వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్స్ పంపిణీ చేసిన ప్రభుత్వ ఛీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి....
-వైయస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు ఆరోగ్య రక్ష...
-వైయస్సార్ సంపూర్ణ పోషణ పధకం ద్వారా అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయాలి...
- 9 Sep 2020 11:01 AM GMT
Kakinada updates: ఉద్యోగ భధ్రత కల్పించాలని కోరుతూ కళ్యాణ మిత్రలు కురసాల కన్నబాబుని విన్నవించుకున్నారు.
తూర్పుగోదావరి...కాకినాడ...
-14 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భధ్రత కల్పించాలని కోరుతూ కళ్యాణ మిత్రలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ని కలసి విన్నవించుకున్నారు.
-యూనియన్ జిల్లా నాయకురాలు అరుణ మాట్లాడుతూ తమకు వేతనం రెట్టింపు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని , కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
-కళ్యాణమిత్రలు ఉద్యోగం ఉందో...లేదో... తెలీక ఆందోళన చెందుతున్నారన్నారు.
-ఆందోళన చెందవద్దని, ముఖ్యమంత్రి తో మాట్లాడి , సమస్య పరిష్కారం చేస్తాన మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు...
-అంతకు ముందు కళ్యాణ మిత్రలు కలెక్టరెట్ ముందు దర్నా నిర్వహించారు..
- 9 Sep 2020 10:48 AM GMT
Srikakulam updates: చంద్రబాబు అసాధ్యం అన్నదానికి, వైఎస్ సుసాధ్యం చేసి చూపించారు.. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్..
శ్రీకాకుళం జిల్లా..
-ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..
-వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించాలని ఉద్దేశ్యం తో రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు..
-దీన్ని కూడా తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు..
-చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వం ఏం చేసినా విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు..
-వైఎస్ ఉచిత విద్యుత్ అంటే , తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని చంద్రబాబు అపహాస్యం చేశారు..
- 9 Sep 2020 10:29 AM GMT
National updates: రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన పరిమల్ నత్వాని..
జాతీయం..
-రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఛాంబర్ లో ప్రమాణస్వీకారం చేసిన పరిమల్ నత్వాని
-ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడం గౌరవంగా ఉంది
-రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు నా కృతజ్ఞతలు.
-ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి ఎదురు చూస్తున్నాను
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire