Live Updates: ఈరోజు (సెప్టెంబర్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 08 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | షష్ఠి (రా. 8-01 వరకు) తదుపరి సప్తమి | భరణి (ఉ. 6-18 వరకు) తదుపరి కృత్తిక | అమృత ఘడియలు లేవు | వర్జ్యం (రాత్రి 7-26 నుంచి 9-11 వరకు) | దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-48 నుంచి 11-35 వరకు) | రాహుకాలం (సా. 3-00 నుంచి 4-30 వరకు) | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-07

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Anantapur updates: నగరంలో అపెక్స్ డియాగ్నోస్టిక్స్ ను సీజ్ చేసిన అధికారులు..
    8 Sep 2020 8:41 AM GMT

    Anantapur updates: నగరంలో అపెక్స్ డియాగ్నోస్టిక్స్ ను సీజ్ చేసిన అధికారులు..

    అనంతపురం:

    -రోగులకు రెఫరల్స్ లేకున్నా అనవసరంగా వైద్య పరీక్షలు చేస్తున్నారన్న ఆరోపణలపై కలెక్టర్ గంధం చంద్రుడు సీరియస్.

    -కలెక్టెట్ ఆదేశాల మేరకు సీజ్ చేసిన వైద్య అధికారులు.

  • Rajahmundry-Razole updates: అంతర్వేది ఆలయానికి భారీగా చేరుకుంటున్న హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు..
    8 Sep 2020 8:38 AM GMT

    Rajahmundry-Razole updates: అంతర్వేది ఆలయానికి భారీగా చేరుకుంటున్న హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు..

    తూ.గో.జిల్లా ...రాజమండ్రి- రాజోలు

    -అంతర్వేది రథం దగ్ధం విషయంలో పోలీసులు విచారణ తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ థార్మిక సంఘాలు.

    -ఒకరోజు పిచ్చోడు చేసిన పనిగా, మరొక రోజు తేనెతుట్టె తీయడం కోసం పొగ వేశారని రథం దగ్ధం కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్న హిందూ థార్మిక     సంఘాలు

    -మలికిపురం సెంటర్ నుండి అంతర్వేది వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు హిందూ ధార్మిక సంఘాలు ప్రకటన.

    -ప్రతినిధుల రాకను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్న హిందూ ధార్మిక సంఘాల నాయకులు .

  • Visakha updates: అంతర్వేది ఘటన బాదకరం, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి... సోమువీర్రాజు
    8 Sep 2020 8:33 AM GMT

    Visakha updates: అంతర్వేది ఘటన బాదకరం, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి... సోమువీర్రాజు

    విశాఖ..

    -బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కామెంట్స్...

    -హిందూ దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయి...భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి..

    -రాష్ట్రంలో దేవాదాయ శాఖ కు చెందిన ఒక సెంటు భూమి అన్యాక్రాంత కాకుండా చూస్తాం.

    -దేవాలయ భూములు పరిరక్షణ కోసం భాజపా పనిచేస్తుంది.

    -అంతర్వేది ఘటన పై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని కోరుతూ సీఎం జగన్ కి లేఖ రాసాను...సోము వీర్రాజు

  • Kurnool updates: నటుడు జయప్రకాష్ రెడ్డి హఠాన్మరణం తో దిగ్ర్భాంతి కి గురైన జిల్లా వాసులు..
    8 Sep 2020 8:07 AM GMT

    Kurnool updates: నటుడు జయప్రకాష్ రెడ్డి హఠాన్మరణం తో దిగ్ర్భాంతి కి గురైన జిల్లా వాసులు..

    కర్నూల్..

    -జయప్రకాష్ రెడ్డి స్వగ్రామం ఆళ్లగడ్డ లోని సిరివెళ్ల మండలం,వీరారెడ్డి పల్లె

    -జయప్రకాష్ రెడ్డి మరణంతో శోకసంద్రంలో వీరారెడ్డి పల్లె వాసులు..

  • Rajahmundry updates: అంతర్వేదిలో అగ్నిప్రమాద కారణాలపై ఇంకా కొలిక్కిరాని విచారణ..
    8 Sep 2020 8:03 AM GMT

    Rajahmundry updates: అంతర్వేదిలో అగ్నిప్రమాద కారణాలపై ఇంకా కొలిక్కిరాని విచారణ..

    తూర్పుగోదావరి -రాజమండ్రి..

    -పవిత్ర పుణ్యక్షేత్రమైన అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య రథం ఆహుతైన ఘటనపై అనేక అనుమానాలు.

    -అయిదు పోలీసు బృందాలతో చుట్టుపక్కల గ్రామాల్లోనూ విచారణ

    -అంతర్వేది ఆలయానికి సరైన భద్రత, పర్యవేక్షణ లేకపోవడం వల్లనే రథం ప్రమాదమని కలెక్టరు కు నివేదించిన కీలక శాఖల అధికారులు

    -ఫోరెన్సిక్‌ ఆధారాల ఫలితాల కోసం నిరీక్షణ

    -అయితే తేనేపట్టు కోసం అర్ధరాత్రి ఎవరికి అవసరం?

    -అంతర్వేది ఆలయానికి ఘటన జరిగిన ఈనెల 5న భీమవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు స్వాములు వచ్చినట్టు సమాచారం

    -నేడు మళ్ళీ ఆందోళనకు సిద్ధమవుతున్న భజరంగ్దళ్, విహెచ్ పీ ..

  • Jayaprakash Reddy Death: జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి బాలకృష్ణ నివాళి..
    8 Sep 2020 7:05 AM GMT

    Jayaprakash Reddy Death: జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి బాలకృష్ణ నివాళి..

    -ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మృతి పట్ల బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

    -ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు.

    -ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.

    -ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా అని బాలకృష్ణ అన్నారు.

  • Jayaprakash Reddy passed away: ఓ గొప్ప నటుడ్ని కోల్పోయాం : మహేశ్‌బాబు..
    8 Sep 2020 6:44 AM GMT

    Jayaprakash Reddy passed away: ఓ గొప్ప నటుడ్ని కోల్పోయాం : మహేశ్‌బాబు..

    -ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణంపై ప్రముఖ నటులు, సినీ రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

    -తాజాగా సినీ హీరో మహేశ్‌బాబు జయప్రకాష్ రెడ్డి మరణానికి నివాళులు అర్పించారు. జయప్రకాశ్‌ రెడ్డి గారి మరణం నన్ను ఆవేదనకు గురి చేసింది.

    -ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ గొప్ప నటుడు, కమెడియన్‌.

    -ఆయనతో కలిసి పనిచేసిన రోజులు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా సానుభూతి తెలుపుతున్నా అని మహేశ్‌బాబు   అన్నారు.

  • 8 Sep 2020 6:37 AM GMT

    Jayaprakash Reddy passed away: జయప్రకాష్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ..

    అమరావతి..

    -ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణంపట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

    -కర్నూలు జిల్లా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జయ ప్రకాష్ రెడ్డి మాతృగడ్డ మాండలికాన్ని సినిమాల్లోకి చొప్పించి, మెప్పించిన విలక్షణ నటుడు.

    -ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆయన తాను నటించిన పాత్రలను మెప్పించేవారు.

    -జయప్రకాష్ రెడ్డి ఆకస్మిక మరణంపట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాం.

  • Jayaprakash Reddy Death: జయప్రకాశ్‌రెడ్డి మృతికి చంద్ర‌బాబు సంతాపం..
    8 Sep 2020 6:25 AM GMT

    Jayaprakash Reddy Death: జయప్రకాశ్‌రెడ్డి మృతికి చంద్ర‌బాబు సంతాపం..

    -చంద్ర‌బాబు నాయుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా..

    -జయప్రకాష్ రెడ్డి గారు మరణంతో తెలుగు సినిమా, థియేటర్ మూగ‌బోయింది.

    -ఆయ‌న చేసిన బహుముఖ ప్ర‌ద‌ర్శ‌న‌లు, మ‌ర‌పురాని సినిమాలతో ఎన్నో ద‌శాబ్దాలుగా అల‌రించారు.

    -ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నాను. కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

  • Jayaprakash Reddy passed away: జయప్రకాశ్‌రెడ్డి మృతికి  వైఎస్‌ జగన్‌ సంతాపం..
    8 Sep 2020 6:14 AM GMT

    Jayaprakash Reddy passed away: జయప్రకాశ్‌రెడ్డి మృతికి వైఎస్‌ జగన్‌ సంతాపం..

    -ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

    -ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    -చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జయప్రకాశ్‌రెడ్డి మరణం పరిశ్రమకు తీరని లోటు అన్నారు.

Print Article
Next Story
More Stories