Live Updates: ఈరోజు (08 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 08 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి ఉ.11-43 వరకు తదుపరి సప్తమి | మృగశిర నక్షత్రం రా.07-18 వరకు తదుపరి ఆర్ద్ర | వర్జ్యం: తె.04-05 నుంచి 05-45 వరకు | అమృత ఘడియలు ఉ.09-55 నుంచి 10-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ.02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-00 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 8 Oct 2020 12:39 PM GMT
East godavari updates: సముద్ర స్నానానికి వెళ్ళిన ఇద్దరు యువకులు గల్లంతు..
తూర్పుగోదావరి :
-ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం సముద్ర స్నానానికి వెళ్ళిన ఇద్దరు యువకులు గల్లంతు..
-ముమ్మిడివరం మం. గేదెలంక, అయినాపురం నకు చెందిన యువకులుగా గుర్తించిన స్థానికులు..
-ఒకరి మృతదేహం లభ్యం మరొకరి కోసం కొనసాగుతోన్న గాలింపు చర్యలు..
- 8 Oct 2020 12:37 PM GMT
Amaravati updates: ఏపీలో సీబీఐ అధికారులు ఆఫీస్ తెరవాల్సిన పరిస్థితి వస్తుందన్న ఏపీ హైకోర్టు..
అమరావతి..
-పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు
-పోలీసులు తీసుకెళ్లిన తర్వాత జడ్జి ముందు 24 గంటల్లోపు హాజరుపరచటం లేదన్న పిటిషనర్ తరపు న్యాయవాది రవితేజ
-జ్యుడీషియల్ విచారణకు సంబంధించి పోలీసుల తరపు కౌన్సిల్ చేసిన వాదనలపై స్పందించిన హైకోర్టు
-ఇలా అయితే హెబియస్ కార్పస్ కేసు సీబీఐతో విచారణ చేయించాల్సి వస్తుందన్న హైకోర్టు
-దాన్ని దృష్టిలో పెట్టుకునే తాను వాదనలు వినిపించానని తెలిపిన పోలీసుల తరపున న్యాయవాది
-ఇలా అయితే సీబీఐ వారు ఏపీలో ఒక ఆఫీస్ తెరవాల్సి వస్తుందన్న హైకోర్టు
-విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు
- 8 Oct 2020 12:21 PM GMT
East Godavari updates: విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణి చేసిన మంత్రి కన్నబాబు..
తూర్పుగోదావరి :
-కరప మండల కేంద్రంలో జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు..
-ముఖ్యమంత్రి ఎలా ఉండాలనేది దేశానికి మన సిఎం జగన్ చూపిస్తున్నారు..
-అమ్మ ఒడి పథకాన్ని ఎన్నికల జిమ్మిక్కులు అని కొంతమంది హేళనగా మాట్లాడారు..
-పేద వాళ్ల పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువు కోవాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాము..
-కొంతమంది మంది పెద్దలు కోర్టుకు వెళ్లి స్టేలు తెస్తున్నారు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆగేది లేదు..
-అమ్మ ఒడి పధకం ద్వారా 650 కోట్లు తల్లిదండ్రులు అకౌంట్లలో జమయ్యాయి..
- 8 Oct 2020 12:18 PM GMT
Kurnool district updates: ఆదోని రెండవ పట్టణ పోలీస్ ల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ...
కర్నూలు జిల్లా...
-అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత..
-సుమారు 187 ఓసి టెట్రా ప్యాకెట్లు, 1 బైక్ స్వాధీనం.
-కపటి గ్రామానికి చెందిన ప్రకాష్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు
- 8 Oct 2020 8:34 AM GMT
విజయనగరం జిల్లా:
చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రారంబించిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.
..మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ కామెంట్స్..
సిఎం జగన్మోహన్ రేడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు
విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోంది, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి ఆందోళన చెందే అవకాశం లేకుండా ప్రభుత్వమే అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది
విద్యపై పెట్టిన ఖర్చు మానవాభివద్ధి కోసం చేస్తున్న ఖర్చు గానే భావించి పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నారు
భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు
కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటిస్తూ తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి
ప్రతి విద్యార్థికి జీవితంలో ఒక ఆశయం వుండాలి, దానిని నెరవేర్చుకునే దిశగా ప్రయత్నం చేయాలి
ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వినియోగించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.
- 8 Oct 2020 8:33 AM GMT
శ్రీకాకుళం జిల్లా..
స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..
డెప్యూటీ సీఎం కృష్ణదాస్ ఎంతటి సమస్య వచ్చినా వనకడు, తునకడు..
అసత్య ప్రచారాలు ఏమి చేయలేవు..
విజ్ఞాన ప్రపంచంలో మన విద్యార్థులు విజేతగా నిలవాలని ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టారు..
తెలుగు అమ్మ భాష.. ఇంగ్లీషు రాజ భాష..
జగనన్న విద్యా కానుక , అమ్మ ఒడి వంటి పథకాలు మొదలయ్యాక కార్పొరేట్ పాఠశాలలు ఖాళీ అవుతున్నాయి..
నైతికవంతమైన సమాజ నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష..
ఇది అర్ధం కాక కొందరు కోర్టుకు వెళ్లారు..
30 లక్షల మంది పెద్దవాళ్ళ ఇళ్ళ పట్టాలు కోర్టు ద్వారా అడ్డుకున్నారు..
ఇదీ మన ప్రతిపక్షం గొప్పతనం..
ప్రభుత్వం చేయనవి ఎందుకు చేయలేదు అని నిలదీయాల్సిన ప్రతిపక్షమే అడ్డంకులు సృష్టించడం ఏమిటి ?
ఎద్దు ఈనింది..బొందులో కట్టండి అన్నట్లు ప్రతిపక్షం వ్యవహరిస్తోంది..
రైతులకు ఉచిత విద్యుత్ అందదు అని దుష్ప్రచారం చేస్తోంది..
- 8 Oct 2020 8:32 AM GMT
ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్
- గత ఎన్నికల్లో దుబ్బాక ఎన్నికల్లో కొంత పొరపాటు జరిగింది.. ఇప్పుడు అది జరగదు
- చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని ఎమ్మెల్యే చేయడమే మా లక్ష్యం
- చెరుకు శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థి ని ఖరారు చేసినంక పూర్తి గా మారింది
- రెండవ స్థానం కోసమే టిఆర్ఎస్, బిజెపి కొట్లాట
- మనమంతా తలుసుకుంటే విజయం మనదే
- గ్రామానికి ఒక నాయకున్ని పెట్టి క
- హరీష్ రావు అహంకారంతో తనను చూసి ఓటేయమంటుండు
- మేము అభ్యర్థి ని చూసి ఓటేయుమన్నాము
- రాయపోల్ మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలే ఇంతవరకు
- కొత్త ఇండ్లు కట్టకపోగా రాయపోల్ లో దళితులు ఇండ్లు కూలగొట్టిండ్రు
- అందరికీ న్యాయం జరగాలంటే టిఆర్ఎస్ ను చిత్తు చిత్తుగా ఓడించాలి
- మనకు డబుల్ బెడ్ రూమ్ లేదు కానీ వారు ఐదు వందల కోట్ల తో ఇళ్లు కట్టుకున్నాడు
- టిఆర్ఎస్ ఇచ్చే డబ్బు, మధ్యం అంతా అవినీతి సొమ్ము.. అది మనదగ్గర దోచుకున్నదే
- బిజెపి వాళ్లు ఏమోహంతో ఓటు అడుగుతున్నరో తెలియదు
- బిజెపి పూర్తిగా రైతు వ్యతిరేకంగా పనిచేస్తుంది
- ఎట్లాగు తెలంగాణ లో బిజెపి ఉండదనేది అందరికి తెలిసిందే
- 8 Oct 2020 8:32 AM GMT
తూర్పుగోదావరి... అమలాపురం...
అమలాపురంలో జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్.... పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ. వేంకటేశ్వర రావు మధ్య సంవాదం...
విద్యాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర రావు తన ప్రసంగంలో అభినందించలేదని... ఎత్తి చూపిన మంత్రి విశ్వరూప్...
ఎమ్మెల్సీ ఐవి దానికి సమాధానం చెబుతూ ...తాను అధికార, ప్రతిపక్ష, కేంద్ర పాలక పక్ష మనిషిని కాదని... ప్రజా పక్షానికి చెందిన వ్యక్తినని తాను ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం లేదని సమాధానం...
ప్రభుత్వ పాఠశాలు, సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని ముందు వాటి సంగతి చూడండని మంత్రికి చెప్పిన ఎమ్మెల్సీ ....
ప్రభుత్వాల ప్రోత్సాహం వలనే ప్రైవేటు పాఠశాలలు బలపడ్డాయి : ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు
- 8 Oct 2020 8:32 AM GMT
తూర్పుగోదావరి:
జిల్లా విద్యాశాఖ అధికారుల తీరుపై అలకబూనిన వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు..
తన సొంత నియోజకవర్గంలో జరిగిన జగనన్న విద్యాకానుక కార్యక్రమానికి కన్నబాబును ఆహ్వానించని విద్యాశాఖ అధికారులు..
కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం డెమో స్కూల్ లో జరిగిన జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవానికి హాజరుకాని మంత్రి కన్నబాబు..
కన్నబాబు హాజరుకాకపోవడంతో కార్యక్రమానికి దూరంగా స్థానిక వైసిపి నాయకులు..
జిల్లా కలెక్టర్ మురళీ ధర్ రెడ్డి, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ముగించిన విద్యాశాఖ అధికారులు..
మంత్రి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు..
- 8 Oct 2020 8:31 AM GMT
తిరుమల
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - 2020 వాహనసేవలు
అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పరిమిత సంఖ్య భక్తులతో ఊరేగింపు నిర్వహించాలని టీటీడీ నిర్ణయం.
వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
15.10.2020 - గురువారం - అంకురార్పణ రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
16.10.2020 - శుక్రవారం - బంగారు తిరుచ్చి ఉత్సవం - ఉదయం 9 నుండి 11 గంటల వరకు.
పెద్దశేష వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
17.10.2020 - శనివారం - చిన్నశేష వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
హంస వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
18.10.2020 - ఆదివారం - సింహ వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
ముత్యపుపందిరి వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
19.10.2020 - సోమవారం - కల్పవృక్ష వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
సర్వభూపాల వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
20.10.2020 - మంగళవారం - మోహినీ అవతారం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
గరుడసేవ - రాత్రి 7 నుండి 12 గంటల వరకు.
21.10.2020 - బుధవారం - హనుమంత వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
పుష్పకవిమానం- సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు.
గజ వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
22.10.2020 - గురువారం - సూర్యప్రభ వాహనం - ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
చంద్రప్రభ వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
23.10.2020 - శుక్రవారం - స్వర్ణ రథోత్సవం- ఉదయం 8 గంటలకు.
అశ్వ వాహనం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
24.10.2020 - శనివారం - పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం - ఉదయం 3 నుండి 5 గంటల వరకు.
స్నపనతిరుమంజనం మరియు చక్రస్నానం - ఉదయం 6 నుండి 9 గంటల వరకు.
బంగారు తిరుచ్చి ఉత్సవం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire