Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 8 Aug 2020 9:36 AM GMT

    ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నంది ఎల్లయ్య గారి అంత్యక్రియలు జరపాలని ట్విట్ లో ముఖ్యమంత్రి ని మంత్రి కేటీఆర్ ను కోరిన మాజీ మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ.. 

  • 8 Aug 2020 9:36 AM GMT

    పేద విద్యార్థులకు తెలంగాణ జాగృతి అండ

    - పేద విద్యార్థులకు తెలంగాణ జాగృతి అండ

    - ఆన్ లైన్ క్లాసుల కోసం వితరణ

    - విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ కు 50 కంప్యూటర్స్, 500 కుర్చీల బహుకరణ

    - మాజీ ఎంపీ కవిత కృషిని కొనియాడిన మంత్రి కొప్పుల ఈశ్వర్ , సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ Dr. ప్రవీణ్ కుమార్.

    - కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ జాగృతి సంస్థ సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.

    - ప్రాంతం ఏదైనా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో మాజీ ఎంపీ కవిత వెనుకడుగు వేయడం లేదు.

    - తాజాగా తెలంగాణలోని గిరిజన, దళిత, పేద విద్యార్థులు ఆన్ లైన్ లో తమ చదువును కొనసాగించేందుకు మాజీ ఎంపీ కవిత అండగా నిలిచారు.

    - తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులతో ఏర్పడిన విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ కు 50 కంప్యూటర్స్, 500 కుర్చీల బహుకరించారు.

    - సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ Dr. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న VLC లతో లాక్ డౌన్ సమయంలోనూ ఆటంకం లేకుండా ఎంతో మంది పేద విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారు.

    - ఈ ఆన్ లైన్ క్లాసులకు అవసరమైన ట్యాబ్, కంప్యూటర్లు కొనలేని పేద విద్యార్థులు చదువుకు దూరం కావొద్దన్న ఉద్దేశ్యంతోనే విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ కు 50కంప్యూటర్స్, 500 కుర్చీలు అందించారు కవిత.

    - భవిష్యత్తులోనూ పేద విద్యార్థుల చదువు కోసం తమకు చేతనైంత సమాయం చేస్తూనే ఉంటామన్నారు కవిత.

    - తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్ ఈ కంప్యూటర్లను విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్ కు అందించారు.

  • 8 Aug 2020 9:34 AM GMT

    వరంగల్ అర్బన్ :

    22 వ డివిజన్ ఉర్సు దర్గా ప్రాంతంలో మహాత్మ జ్యోతి బా పూలే విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు

  • నంది ఎల్లయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు
    8 Aug 2020 8:31 AM GMT

    నంది ఎల్లయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు

    👉నంది ఎల్లయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు ..

    👉 సిద్దిపేట పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో మంత్రి గా , ఎమ్మెల్యే గా తనతో కలిసి పని చేసిన అనుబందాన్ని గుర్తు చేస్కున్న మంత్రి హరీష్ రావు .

    👉నంది ఎల్లయ్య సీనియర్ రాజకీయ నాయకునిగా రాజకీయాల్లో తన నిరాడంబరాన్ని చాటుకున్నారూ.. మంచి మనసున్న వ్యక్తిత్వం అని కొనియాడారు..

    👉 ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని , వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు...

  • నంది ఎల్లయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు
    8 Aug 2020 8:31 AM GMT

    నంది ఎల్లయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు

    👉నంది ఎల్లయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు ..

    👉 సిద్దిపేట పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో మంత్రి గా , ఎమ్మెల్యే గా తనతో కలిసి పని చేసిన అనుబందాన్ని గుర్తు చేస్కున్న మంత్రి హరీష్ రావు .

    👉నంది ఎల్లయ్య సీనియర్ రాజకీయ నాయకునిగా రాజకీయాల్లో తన నిరాడంబరాన్ని చాటుకున్నారూ.. మంచి మనసున్న వ్యక్తిత్వం అని కొనియాడారు..

    👉 ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని , వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు...

  • నంది ఎల్లయ్య అకాల మృతి పట్ల సంతాపం తెలిపిన పొన్నం ప్రభాకర్
    8 Aug 2020 8:19 AM GMT

    నంది ఎల్లయ్య అకాల మృతి పట్ల సంతాపం తెలిపిన పొన్నం ప్రభాకర్

    పొన్నం ప్రభాకర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నేత

    శ్రీ నంది ఎల్లయ్య గారి అకాల మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను

    శ్రీ నంది ఎల్లయ్య గారు , ఆరు సార్లు పార్లమెంట్ సభ్యునిగా మరియు రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కూడా విశేషమైన సేవలందించారు.

    వారి ఆకస్మిక మరణానికి యావత్ తెలంగాణ ప్రజల పక్షాన నివాళులు అర్పిస్తూ మా ప్రగాఢ సంతాపాన్ని , వారి కుటుంబ సభ్యులకు మా సానుభూతిని తెలియచేస్తూన్నాము.

  • మెదక్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛంద లాక్ డౌన్‌
    8 Aug 2020 8:12 AM GMT

    మెదక్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛంద లాక్ డౌన్‌

    మెదక్ ;-రేపటి నుంచి 17వ తారీకు వరకు మెదక్ జిల్లా జిల్లా కేంద్రంలో స్వచ్ఛందంగా లాక్ డాన్ ప్రకటించిన వ్యాపార వాణిజ్య వర్తక సంఘాలు

  • కల్యాణ ల‌క్ష్మి చెక్కుల పంపిణీ
    8 Aug 2020 8:06 AM GMT

    కల్యాణ ల‌క్ష్మి చెక్కుల పంపిణీ

    మెదక్:వెల్దుర్తి లో 143 మంది లబ్ధిదారులకు కల్యాణ ల‌క్ష్మి చెక్కులు పంపిణీ చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

  • తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నేత మృతి
    8 Aug 2020 8:04 AM GMT

    తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నేత మృతి

    నంది ఎల్లయ్య మరణం చాలా బాధాకరం వి.హనుమంత రావు మాజి ఎంపీ

    కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు నంది ఎల్లయ్య నీతి నిజాయితీ పరుడు, ప్రజా సేవే లక్ష్యంగా పని చేసిన వ్యక్తి..

    కౌన్సిలర్ నుంచి నేటి వరకు నాతో కలిసి పని చేశాడు...

    2014 ఎన్నికల్లో గెలిచిన నంది ఎల్లయ్య పార్టికి విధేయుడిగా ఉన్నారు..

    ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను

    వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

    ప్రస్తుత పరిస్థితులలో ఆయన కరోనా తో మరణించారు కాబట్టి అయన అంత్యక్రియలకు హాజరు కాలేక పోతున్నందు భాదాకరంగా ఉంది.

  • కేసముద్రంలో  విషాదం
    8 Aug 2020 7:14 AM GMT

    కేసముద్రంలో విషాదం

    మహబూబాబాద్ జిల్లా: కేసముద్రం మండలం విలేజ్ కేసముద్రం గ్రామంలో భూ వివాదం కారణంగా అన్నను కొట్టి చంపిన తమ్ముడు.

    ఎలగల బోయిన వెంకన్న ను కొట్టి చంపిన తమ్ముడు చంద్రయ్య..

    వెంకన్న కేసముధ్రం మండలం కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు...

Print Article
Next Story
More Stories