Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • సీసీ రోడ్డు వేస్తూండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి కూలీ మృతి.
    8 Aug 2020 1:43 PM GMT

    సీసీ రోడ్డు వేస్తూండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి కూలీ మృతి.

    వరంగల్ అర్బన్ జిల్లా: ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో సీసీ రోడ్డు వేస్తూండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి, చిల్పుర్ మండలం దేశాయి తండా గ్రామానికి చెందిన కూలీ భూక్య లోకేష్ (19) మృతి.

  • 8 Aug 2020 12:20 PM GMT

    - నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం బాణాల గ్రామంలో వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి

  • 8 Aug 2020 12:20 PM GMT

    కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడారు: శ్రీనివాస్ గౌడ్

    - సుప్రీం కోర్టు లో మేము వేసిన IA లో పోతిరెడ్డిపాడు , రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన తప్ప వేరే వున్నాయా... నేను చాలెంజ్ చేస్తున్నా..

    - కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడారా..

    - కోర్టు ప్రొసీజర్ తెలియక మాట్లాడారా..మీ అడ్వకేట్ లను అడిగి తెలుసుకోండి

    - మేము కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చింది అప్పటి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంచారని..

    - మీరు కూడా సుప్రీం కోర్టు లో ఇంప్లీడ్ కండి.. మాకేమీ అభ్యంతరం లేదు

    - ఏపి తో కొట్లాడేందుకు కలిసి వస్తం అంటే కలిసి రండి

    - చీప్ గా మాట్లాడి చులకన కాకండి

    - వాళ్ళు కాదు కూడదని ముందుకు వెళితే మా వ్యూహం మాకుంది.. క్రిష్ణా నది మొత్తం మహబూబ్ నగర్ జిల్లా మీది నుంచే పోతుంది లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే

    - కాంగ్రెస్ నేతలకు మేము కోర్టు లో వేసిన IA అర్థం కాక మాట్లాడుతున్నారు.

    - ఇప్పటికే slp వుంది కాబట్టి ఐఏ వేశాము

    - ఏపికి వేసిన 203,388 GO లను అపందని మేము IA వేశాము

    - రాయలసీమ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయితే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి. అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు.

  • 8 Aug 2020 12:18 PM GMT

    ఓటమి ఎరుగని నేత నంది ఎల్లయ్య: జగ్గారెడ్డి

    - కాంగ్రెస్ పార్టీ ల్ 6 సార్లు ఎంపీ గా గెలిచిన వ్యక్తి వయసు రీత్యా,అనారోగ్య రీత్యా చనిపోవడం బాధాకరం..

    - సోనియా,రాహుల్ గాంధీకి ,కాంగ్రెస్ పార్టీ కి లయాలిటీ గా ఉంటూ నాయకత్వం వచ్చిన నేత నంది ఎల్లయ్య ..

    - ఒక దళిత మాదిగ నాయకుడిగా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం లో విజయవంతగా తన జీవితం గడపడం జరిగింది..

    - ఓటమి ఎరుగని నేత నంది ఎల్లయ్య...

    - నంది ఎల్లయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి

  • 8 Aug 2020 12:03 PM GMT

    తెలంగాణ లో అన్ని రాజకీయపార్టీలను వణికిస్తున్న కరోన.

    - తెలంగాణ లో అన్ని రాజకీయపార్టీలను వణికిస్తున్న కరోన.

    - అధికార , ప్రతిపక్ష పార్టీలలో దడ పుట్టిస్తోంది.

    - కరోనతో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి.

    - తాజాగ అధికార టీఆరెస్ లో కార్మికశాఖ మంత్రి మల్ల రెడ్డి కి కరోన పొజిటీవ్.

    - ఆయన మల్లారెడ్డి హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు.

    - ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి కరోన పొజిటీవ్. ఆయన కుటుంబంతో సహా కరోన పొజిటీవ్ రావడంతో ఆయన హోమ్ క్వరెంటైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

  • 8 Aug 2020 12:00 PM GMT

    రేషన్ బియ్యం లోడ్ తో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా.

    కామారెడ్డి :

    - భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులో గల కృష్ణమందిర్ సమీపంలో రేషన్ బియ్యం లోడ్ తో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా.

    - ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు.

    - భువనగిరి నుండి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం.

    - పోలీసుల సమాచారం మేరకు స్వాదీనపరుచుకుని ఎమ్ ఎల్ సి పాయింట్ కు తరలించిన సివిల్ సప్లై అధికారులు.

  • 8 Aug 2020 11:32 AM GMT

    రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన కేంద్ర జలశక్తి శాఖ మంత్ర గజేంద్ర సింగ్ షెకావత్

    - రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన కేంద్ర జలశక్తి శాఖ మంత్ర గజేంద్ర సింగ్ షెకావత్

    - 2016 సెప్టెంబర్లో ఒకసారి మినహా ఇప్పటివరకు మళ్లీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగలేదు

    - విభజన చట్టం సెక్షన్ 84(3) ప్రకారం అపెక్స్ కౌన్సిల్ గోదావరి, కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డులపై పర్యవేక్షణ అధికారాలు కలిగి ఉంది

    - అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశం చాలాకాలంగా పెండింగ్‌లో ఉండిపోయింది

    - 2018 ఫిబ్రవరి, 2020 జనవరిలో జలశక్తి శాఖ కార్యదర్శి నిర్వహించిన సమీక్షలో అనేక అపరిష్కృత అంశాలను గుర్తించారు

    - వాటిని పరిష్కరించడం కోసం అపెక్స్ కౌన్సిల్ 2019 సెప్టెంబర్లో ఎజెండా సిద్ధం చేయాలని రెండు రాష్ట్రాలను కోరింది

    - మే 2020లో జలశక్తి శాఖ మరోసారి రాష్ట్రాలకు గుర్తుచేస్తూ లేఖలు రాసింది. అయినా స్పందన లేదు

    - దాంతో గోదావరి, కృష్ణా బోర్డులు సూచించిన అంశాలతో జలశక్తి శాఖ అపెక్స్ కౌన్సిల్ ఎజెండా సిద్ధం చేసింది

    - 2020 మే 14న గోదావరి బోర్డుకు ఏపీ సర్కారు ఏడు తెలంగాణ ప్రాజెక్టులపై తీవ్ర అభ్యంతరాలు చెబుతూ లేఖ రాసింది

    - అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టుల్లో కాళేశ్వరం, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-3, సీతారామ లిఫ్ట్, తుపాకులగూడెం, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, పెన్‌గంగాపై నిర్మించిన బ్యారేజులు రామప్ప - పాకాల సరస్సుల నీటి దారి మళ్లింపు ఉన్నాయి

    - జూన్ 2018లో కాళేశ్వరం లిఫ్ట్ డీపీఆర్‌ను జలశక్తి శాఖ అడ్వైజరీ కమిటీ అంగీకరించిన విషయం తెలిసిందే

    - అయితే ఎలాంటి అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం రోజుకు 2 టీఎంసీ నుంచి 3టీఎంసీ వరకు లిఫ్ట్ సామర్థ్యం పెంచింది

    - ప్రాజెక్టులో మార్పులు, సామర్థ్యం పెంపు వంటి వాటికి జలశక్తి శాఖ ఆమోదం ఉండాలి

    - ఏపీ సర్కారు అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవు

    - అందుకే అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందే వరకు ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వానికి గోదావరి బోర్డ్ 2020 మే 30న లేఖ ద్వారా తెలియపర్చింది

    - జూన్ 5న జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టులపై లోతుగా చర్చ జరిగింది. వాటి డీపీఆర్‌లను జూన్ 10లోగా అందజేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని గోదావరి బోర్డు ఆదేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు సమర్పించలేదు.

    - ఈ పరిస్థితుల్లో ఏపీ అభ్యంతరం తెలిపిన ప్రాజెక్టులపై డీపీఆర్‌లు సమర్పించకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందకుండా నిర్మాణం జరపవద్దని తెలంగాణ ప్రభుత్వానికి జలశక్తి శాఖ చెబుతోంది.

    - వీలైనంత త్వరగా అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశం జరపాలని కోరుకుంటున్నాను

    - లేఖలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

  • 8 Aug 2020 11:30 AM GMT

    సికింద్రాబాద్ లో బోయిన్ పల్లి 300 గ్రాముల ఓపియం డ్రగ్ పట్టివేత

    - సికింద్రాబాద్ లో బోయిన్ పల్లి 300 గ్రాముల ఓపియం డ్రగ్ పట్టివేత

    - ఎవరికి అనుమానం రాకుండా చక్కెర తో కలిపి అమ్మకానికి సిద్ధం

    - లాక్ డౌన్ లో వ్యాపారం లాస్ రావడం తో ఈ మార్గాన్ని ఎంచుకున్న హనుమాన్ రాం అనే 

  • 8 Aug 2020 11:27 AM GMT

    - మాజి ఎంపి నంది ఎల్లయ్య మరణం గురించి ఢిల్లీలోని టెన్ జనఫధ్ కు తెలియజేసిన మాజి ఎంపి హనుమంత రావు....

    - వెంటనే స్పందించి న ఏఐసిసి కార్యాలయ వర్గాలు...

    - నంది ఎల్లయ్య సోదరుడు నంది కృష్ణతో పోన్ లో మాట్లాడి నంది ఎల్లయ్య మరణం పట్ల సంతాపం ప్రకటించిన సానియా గాందీ...

    - వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన సోనియా...

  • 8 Aug 2020 11:26 AM GMT

    చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒంటికన్ను తో జన్మించిన మగ శిశువు..

    మంచిర్యాల జిల్లా:

    - చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒంటికన్ను తో జన్మించిన మగ శిశువు.

    - చెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన శంకర్ ప్రియాంక దంపతులకు ఒకే కంటితో జన్మించిన పసికందు.

Print Article
Next Story
More Stories