Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • అన్ని జిల్లాల్లో కరోనా తీవ్ర మౌతుంది: వైద్య ఆరోగ్యం శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ
    8 Aug 2020 8:57 AM GMT

    అన్ని జిల్లాల్లో కరోనా తీవ్ర మౌతుంది: వైద్య ఆరోగ్యం శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ

    విజయవాడ: రాష్ట్రంలోని లోని అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ తీవ్ర మౌతుందని వైద్య ఆరోగ్యం శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అన్నారు 

    - ఉభయ గోదావరి జిల్లా లు, కర్నూలు. గుంటూరు జిల్లాలు పీక్ స్టేజి లో వున్నాయి.

    - ప్రజలు మూడు నాలుగు రోజులు జ్వరం వచ్చి , శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వుంటే పరీక్షలు చేయకుండా హాస్పిటల్ లో చేర్చుకోమని ఆదేశాలు ఇచ్చాం.

    - ప్రజలు సొంతంగా జాగ్రత్తలు తీసుకొని‌ నిర్లక్ష్యం చేయకుండా వాలంటీర్ కు, ఏఎన్ఎంకు సమాచారం అందించాలి.

    - చివరి నిమిషాల లో హాస్పిటల్ కు రావడం వల్ల కొందరిని కాపాడలేక పోతున్నాం.

    - మరణాల సంఖ్య తగ్గించేందుకు‌ కృషి చేస్తున్నాం.

    - కనీసం 6 రోజులు ముందు‌ మరణం సంభవిస్తే అందుకు గల కారణాలు అన్వేషించి ఇతరులను కాపాడేందుకు చర్యలు తీలుకుంటున్నాం.

    - కోవిడ్ బాదితుల సమాచారం బందువులు తెలుసుకొనేందుకు హెల్పె డెస్క్ ఏర్పాటు చేశాం.

    - సెర్ఫె, మెప్మా, అంగన్ వాడీ సిబ్బంది. అంత‌ 6లక్షల మందికి కరోనా వైరస్ ను అరికట్టడంపై శిక్షణ ఇస్తున్నాం.

    - 138 హాస్పిటల్ లలో కరోనా వైరస్ బాదితులకు‌సేవలు అందిస్తున్నాం.

    - సీరో సర్వలెన్స్ నిన్నటి నుంచి ప్రారంభించాం.

    - డిల్లీలో 23.5 శాతం మందికి సీరో టెస్టిలో యాంటీ బాడీస్ కనబడ్డాయి.

    - ఎంత శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చి పోయింది.

    - ఎంత శాతం మందికి యాంటీ బాడీస్ అభివృద్ధి చెందాయి అన్నది సీరో టెస్టుల ద్వారా తెలుస్తుంది

  • 8 Aug 2020 8:57 AM GMT

    వైద్య ఆరోగ్యం శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి..

    విజయవాడ:

    - రాష్ట్రంలోని లోని అన్ని జిల్లా ల్లో కరోనా వైరస్ తీవ్ర మౌతుంది.

    - ఉభయ గోదావరి జిల్లా లు, కర్నూలు. గుంటూరు జిల్లాలు పీక్ స్టేజి లో వున్నాయి.

    - ప్రజలు మూడు నాలుగు రోజులు జ్వరం వచ్చి , శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వుంటే పరీక్షలు చేయకుండా హాస్పిటల్ లో చేర్చుకోమని ఆదేశాలు ఇచ్చాం.

    - ప్రజలు సొంతంగా జాగ్రత్తలు తీసుకొని‌ నిర్లక్ష్యం చేయకుండా వాలంటీర్ కు, ఏఎన్ఎంకు సమాచారం అందించాలి.

    - చివరి నిమిషాల లో హాస్పిటల్ కు రావడం వల్ల కొందరిని కాపాడలేక పోతున్నాం.

    - మరణాల సంఖ్య తగ్గించేందుకు‌ కృషి చేస్తున్నాం.

    - కనీసం 6 రోజులు ముందు‌ మరణం సంభవిస్తే అందుకు గల కారణాలు అన్వేషించి ఇతరులను కాపాడేందుకు చర్యలు తీలుకుంటున్నాం.

    - కోవిడ్ బాదితుల సమాచారం బందువులు తెలుసుకొనేందుకు హెల్పె డెస్క్ ఏర్పాటు చేశాం.

    - సెర్ఫె, మెప్మా, అంగన్ వాడీ సిబ్బంది. అంత‌ 6లక్షల మందికి కరోనా వైరస్ ను అరికట్టడంపై శిక్షణ ఇస్తున్నాం.

    - 138 హాస్పిటల్ లలో కరోనా వైరస్ బాదితులకు‌సేవలు అందిస్తున్నాం.

    - సీరో సర్వలెన్స్ నిన్నటి నుంచి ప్రారంభించాం.

    - డిల్లీలో 23.5 శాతం మందికి సీరో టెస్టిలో యాంటీ బాడీస్ కనబడ్డాయి.

    - ఎంత శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చి పోయింది.

    - ఎంత శాతం మందికి యాంటీ బాడీస్ అభివృద్ధి చెందాయి అన్నది సీరో టెస్టుల ద్వారా తెలుస్తుంది

  • మాణిక్యాలరావు మృతి..‌ బిజెపికి తీరని లోటు అంటూ సంతాపం బీజేపీ నేతలు
    8 Aug 2020 8:50 AM GMT

    మాణిక్యాలరావు మృతి..‌ బిజెపికి తీరని లోటు అంటూ సంతాపం బీజేపీ నేతలు

    విజయవాడ: మాణిక్యాలరావు మృతి..‌ బిజెపికి తీరని లోటు అంటూ సంతాపం బీజేపీ నేతలు

    - వర్చువల్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి సంతాప సభలో పాల్గొన్న నేతలు

    - సోము వీర్రాజు:

    మాణిక్యాలరావు.. ఎంత ఎదిగినా.. తన నమ్మిన సిద్దాంతాల కోసం పని చేశారు

    - మృదుస్వభావి... కోపం వచ్చినా.. వెంటనే.. మళ్లీ మాములు అయిపోయేవారు

    - దేవాదాయశాఖ మంత్రిగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని.. పని చేశారు

    - అభివృద్ది విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడకుండా.. పని చేసేవారు

    1989 నుంచి బీజేపీ లోనే ఉంటూ.. పార్టీ అభివృద్ది కోసం పని చేశారు.

    - ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ,పార్టీకి తీరని లోటు

    కన్నా లక్ష్మీనారాయణ:

    పార్టీలో ఇటువంటి సంఘటన వస్తుందని కలలో ఊహించలేదు

    పార్టీలో నిబద్దత కోసం పని చేసిన నాయకుడు మాణిక్యాలరావు

    తాడేపల్లి గూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, దేవాదాయశాఖ మంత్రిగా పని చేస్తూనే.. పార్టీ ప్రధాన కార్యదర్శి గా బీజేపీ అభివృద్ది కోసం పని చేశారు

    తనను ఎన్నుకున్న ప్రజల బాగోగులు, నియోజకవర్గ అభివృద్ది కోసం తపన పడుతుండేవారు

    మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రిని సైతం ఎదిరించి అమిత్ షా సహకారంతో నిట్ ను తన నియోజకవర్గంలో కేటాయించుకున్నారు

    దేవాలయాల అభివృద్ది కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు

    నేను అధ్యక్షునిగా ఉన్న సమయంలో.. ప్రధాన కార్యదర్శిగా.. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా కాదనకుండా పని చేశారు

    బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నికల బాధ్యతలను పూర్తి చేశారు

    లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నా.. పార్టీ అప్పచెప్పిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు

    సురేష్ ప్రభు: 

    మాణిక్యాలరావు వంటి మంచి మనిషిని పార్టీ కోల్పోవడం బాధాకరంట

    నాకు ఎంతో ఆత్మీయుడు.. ఎన్నో విషయాలను చర్చించకున్నాం

    పార్టీ పట్ల నిబద్దత.. విలువలను పాటిస్తూ పని చేసి నాయకులు

    చివరి సారిగా ఆయన కలిసిన సమయంలో రాజకీయ అంశాలపై చర్చించాం

    మంత్రి స్థాయికి ఎదిగినా.. ఎప్పుడూ సామాన్య కార్యకర్తగానే పార్టీలో పని చేశారు

    వాళ్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియ చేస్తున్నాను

    మురళీధర్ రావు:

    ఎపీలో అనేక ఆటుపోటులు ఎదుర్కొని మాణిక్యాలరావు బీజేపీ కోసం పని చేశారు

    మంత్రి పదవి కన్నా విలువలే మఖ్యమని, రాజీనామాకు సిద్దమని ప్రకటించిన నాయకులు

    బీజేపీ కార్యకర్త ఎలా ఉండాలా అని చెప్పేందుకు మాణిక్యాలరావు జీవితాన్ని ఉదహరించాలి

    పార్టీ కోసం పని చేస్తూ ఆదర్శంగా నిలిచేలా ఆయన పని చేశారు

    సాధారణ జీవితం, ఉన్నతమైన లక్ష్యాల కోసం మాణిక్యాలరావు పని చేశారు.

    బీజేపీ కేంద్ర పార్టీ మాణిక్యాలరావుకు ఇచ్చిన కానుక NIT అని నేను భావిస్తున్నాను

    బీజేపీ ని ఎపీలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పని చేశారు.

    అనేక రాష్ట్రాలలో బీజేపీ బలపడుతున్న విధంగా.. అదే విజయాన్ని ఎపీలో

    సాధించాలని ఆయన భావించారు

    అది సాధించడం ద్వారానే ఎపీలో గ్రామ స్థాయిలో ఉండే చివరి కార్యకర్త మాణిక్యాలరావుగారికి శ్రద్దాంజలి ఘటిస్తూ ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలి

    కిషన్ రెడ్డి

    మాణిక్యాలరావు.. పార్టీలో కీలకపాత్ర, చురకైన పాత్ర పోషించే వారు

    వర్చ్యువల్ విధానం ద్వారా కార్యక్రమం జరుపుకోవాల్సి రావడం దురదృష్టకరం

    జిల్లా, రాష్ట్రస్థాయిలో పార్టీ కోసం పని చేస్తూ... క్రమశిక్షణకు ప్రతిబింబగా మాణిక్యాలరావు నిలిచారు

    ఆస్పత్రిలో చేరిన తర్వాత కూడా.. నేను వైద్యులతో మాట్లాడి ఆరా తీశాను

    ఎలా అయినా ఆయన్ను కాపాడేందుకు కృషి చేయాండి.. అన్నివిధాలా మేము అండగా ఉంటామని వైద్యులకు చెప్పాను

    కానీ దురదృష్టవశాత్తు ఆయన మన నుంచి దూరమవడం బాధ కలిగించింది

    చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ది జరుగుతుందని మాణిక్యాలరావు చెబుతుండే వారు

    మాణిక్యాలరావు జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి

    ఆయన్ను స్పూర్తిగా తీసుకుని.. ప్రజలకు, సమాజానికి పని చేయాలి

    మాణిక్యాలరావు సిద్దాంతాలను ముందుకు తీసుకెవళ్లడమే..ఆయనకు మనం ఇచ్చే నివాళి

  • రాజమండ్రిలో 200 పడకల కొవిడ్ హాస్పిటల్ కు ఏర్పాట్లు
    8 Aug 2020 8:42 AM GMT

    రాజమండ్రిలో 200 పడకల కొవిడ్ హాస్పిటల్ కు ఏర్పాట్లు

    తూర్పుగోదావరి -రాజమండ్రి: రాజమండ్రిలో 200 పడకలతో కొత్త కొవిడ్ హాస్పిటల్ ఏర్పాట్లు

    సిఎం జగన్ కార్యాలయం నుండి ఆదేశాలు

    కొవిడ్ ఆస్పత్రి ఏర్పాటు కై రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి కొత్త బ్లాక్ ను పరిశీలించిన ఎంపీ భరత్, జిల్లా ఆసుపత్రుల కో ఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కిషోర్

    అత్యాధునిక ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కు యుద్ధ ప్రాతిపదిక చర్యలు

    200 బెడ్స్ కు పైప్ లైన్ ద్వారా ఆక్సైజన్ అందించే విధంగా ఏర్పాట్లు

    సిఎం జగన్ ఆదేశాలతో రాజమండ్రిలో 200 పడకల ప్రత్యేక కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చర్యలు-- రాజమండ్రి ఎంపీ భరత్

  • విశాఖకు అమ్మోనియం నైట్రేట్ ముప్పు లేదు.. తేల్చిచెప్పిన అధికారులు
    8 Aug 2020 8:40 AM GMT

    విశాఖకు అమ్మోనియం నైట్రేట్ ముప్పు లేదు.. తేల్చిచెప్పిన అధికారులు

     విశాఖ: విశాఖపట్నం లో ఓ ప్రవైటు షిప్పింగ్ సంస్థ లో మాత్రమే నిల్వలు గుర్తించిన అధికారులు.

    - ఆ సంస్థ గిడ్డంగులను పరిశీలించిన అందులో 18,500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వ వుంది.

    - విదేశాల నుండి దిగుమతి చేసుకున్న రసాయన లవణాన్ని గిడ్డంగిలో నిల్వ వుంచి సంబంధిత ఏజెన్సీలకు అందజేస్తారు.

    - అటువంటి ఏజెన్సీలు ఆంధ్ర ప్రదేశ్ లో లేవు.

    - ఇతర రాష్ట్రాలకు చెందిన వారు నేరుగా విదేశాలకు ఆర్డర్లు చేసుకుంటారని, వారు దానిని నెలరోజుల లోగా తీసుకు వెళ్ళ వలసి వుంటుంది.

    - సుమారు 270 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఈ లవణం మండుతుందని నిర్దారణ చేసారు..

    - గోడౌన్ ను పరిశీలించిన అధికారులు ఇతర సాంకేతిక అంశాలను బేరీజు వేసి విశాఖ నగరానికి అమ్మోనియం నైట్రేట్ ముప్పు లేదని తేల్చారు.

    - అయినప్పటికీ విపత్తుల శాఖ ద్వారా మరింత లోతుగా పరీక్షలు చేయించి ముందస్తు ప్రమాద నివారణ చర్యలు మరింత పక్కాగా అమలు చేయాలని సూచించారు.

    - ఆర్.డి.వో., కె.పెంచల కిషోర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సుభాన్, ఇనస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శంకర్ రెడ్డి గిడ్డంగిని పరిశీలించారు.

  • కోనసీమలో కరోనా  తీవ్రత
    8 Aug 2020 8:36 AM GMT

    కోనసీమలో కరోనా తీవ్రత

    తూర్పు గోదావరి జిల్లా: కోనసీమ వ్యాప్తంగా రేపు కర్ఫ్యూ యధాతధం ఆర్డీవో వసంతరాయుడు

    కోనసీమలో కరోనా కేసులు తీవ్రత అధికంగా ఉంది

    రేపు ప్రజలు ఇళ్ల కే పరిమితం కావాలి -ఆర్డీవో

  • నాటుసారా స్థావరాలపైఎక్సైజ్ సిబ్బంది దాడులు
    8 Aug 2020 8:34 AM GMT

    నాటుసారా స్థావరాలపైఎక్సైజ్ సిబ్బంది దాడులు

    తూర్పు గోదావరి జిల్లా: అమలాపురం మం. కామనగరువు లో నాటుసారా స్థావరాలపైఎక్సైజ్ సిబ్బంది దాడులు

    దాడుల్లో 2200 లీటర్లు బెల్లం ఊటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ సిబ్బంది

  • ప్రతి వార్డ్ లో ఒక పి హెచ్ సి సెంటర్ ఏర్పాటు చేస్తూన్నాం: విశాఖ కలెక్టర్
    8 Aug 2020 7:05 AM GMT

    ప్రతి వార్డ్ లో ఒక పి హెచ్ సి సెంటర్ ఏర్పాటు చేస్తూన్నాం: విశాఖ కలెక్టర్

    విశాఖ: కలెక్టర్ వి.వినయ్ చంద్ కామెంట్స్

    - ప్రతి వార్డ్ లో ఒక పి హెచ్ సి సెంటర్ ఏర్పాటు చేస్తూన్నాం.

    - ఇప్పటి వరకు 24 జి వి ఎం సి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పని చేస్తున్నాయి.

    - మరో 45 వరకు త్వరలో యుద్ధ ప్రాతిపధికన ప్రతి వార్డ్ లో పి హెచ్ సి ఏర్పాటు చేస్తున్నాము.

    - జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలి.

    - కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరు హాస్పిటల్ లో ఉండాలని నిబంధన లేదు.

    - కొన్ని ప్రత్యేక పరిస్థితులున్న కోవిడ్ రోగులను మాత్రమే ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తాం.

    - విశాఖలో 14 ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే కోవిడ్ చికిత్స అందించే అనుమతులు ఇచ్చాం.

    - బెడ్స్ స్టేటస్ ఎప్పటికప్పుడు తెలిసేలా ఒక యాప్ కూడా అందుబాటులో తెచ్చుకున్నాం.

  • ప్రయివేట్ విద్యుత్ కార్మికుడు మృతి
    8 Aug 2020 7:02 AM GMT

    ప్రయివేట్ విద్యుత్ కార్మికుడు మృతి

    తూర్పుగోదావరి... ముమ్మివరం: విద్యుత్ ఫోల్ పై నుండి పడి తీవ్రంగా గాయపడి చికిత్సకై కాకినాడ తరలించిన ప్రయివేట్ విద్యుత్ కార్మికుడు పోతుల వెంకటేష్(39)మృతి

  • కె జి హెచ్ లో క్లినికల్ ట్రయల్స్
    8 Aug 2020 6:57 AM GMT

    కె జి హెచ్ లో క్లినికల్ ట్రయల్స్

    విశాఖ: ముగిసిన కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్

    మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్.

    ఇప్పటి వరకు జిల్లాలో 17448 పొజిటివ్ కేసులు ఉన్నాయి.

    ఇప్పటి వరకు 1.83 లక్షల శాంపిల్స్ కలెక్ట్ చేసాం.

    జిల్లాలో హోమ్ కోరంటైన్ లో 15 వేల మంది ఉన్నారు.

    విశాఖ నగరంలో ఉన్న అన్ని హాస్పిటల్ లో బెడ్స్ నిండిపోయాయి.

    కె జి హెచ్ లో 500 బెడ్స్ వారం రోజుల్లో సిద్ధం చేస్తాం.

    ప్రభుత్వ ఆస్పత్రులు సౌకర్యాలు పెంచుతున్నాము.

    145 మంది వైద్యులను జిల్లాలో నూతనంగా నియమించాం.

    అన్ని వార్డ్ లకు ఒక నోడల్ ఆఫీసర్స్, వార్డ్ వాలంటీర్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తూన్నారు.

    కరోనా వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు మరింత పటిష్టంగా అమలు చేస్తాం.

    కె జి హెచ్ లో క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమౌతోంది.

Print Article
Next Story
More Stories