Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 8 Aug 2020 12:05 PM GMT
తూర్పు గోదావరి:
పెద్దాపురం: మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్..
- ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఒక వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మించాలి అని అమరావతి ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది.
- దీనితో బాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతా ల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి పని చేసింది
- ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించి అభివృద్ధిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సముచితం స్ధానం కల్పించి అక్కడ ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది.
- హూద్ హూద్ తుఫాన్ తర్వాత విశాఖపట్నం ను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆర్ధిక రాజధానిగా చంద్రబాబు మలచడం జరిగింది..
- వైసిపి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం మూడు నెలలు కావస్తున్నా..... ఎక్కడ అభివృద్ధి నోచుకోలేదు..... ఒక్క పైసా అభివృద్ధి పై ఖర్చు చేయలేదు...
- ముఖ్యమంత్రి కేవలం రాజధాని మార్పుపైని దృష్టి సారించారు. మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజావసరాలను విస్మరించారు.
- ఈ రోజు కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న... వైరస్ నిరోధించే చర్యలు చేపట్టడంలో ను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కావలసిన సామాగ్రి ఏర్పాటు విషయంలోనూ.... క్వారెంటైన్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన వియంలోను ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని....
- ఈ చర్యలతో ప్రజారోగ్యంతో పాటు.... రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడుతుంది.
- 8 Aug 2020 12:02 PM GMT
అన్నవరం దేవస్థానంలో తాత్కాలికంగా భక్తుల దర్శనాలు నిలిపివేసిన అధికారులు..
తూర్పుగోదావరి:
- అన్నవరం దేవస్థానంలో తాత్కాలికంగా భక్తుల దర్శనాలు నిలిపివేసిన అధికారులు..
- ఈ నెల 9 వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులను రావద్దని కోరిన అధికారులు,
- దేవస్థానం ఉద్యోగులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 29 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ..
- 8 Aug 2020 11:32 AM GMT
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన కేంద్ర జలశక్తి శాఖ మంత్ర గజేంద్ర సింగ్ షెకావత్
- రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన కేంద్ర జలశక్తి శాఖ మంత్ర గజేంద్ర సింగ్ షెకావత్
- 2016 సెప్టెంబర్లో ఒకసారి మినహా ఇప్పటివరకు మళ్లీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగలేదు
- విభజన చట్టం సెక్షన్ 84(3) ప్రకారం అపెక్స్ కౌన్సిల్ గోదావరి, కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డులపై పర్యవేక్షణ అధికారాలు కలిగి ఉంది
- అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశం చాలాకాలంగా పెండింగ్‌లో ఉండిపోయింది
- 2018 ఫిబ్రవరి, 2020 జనవరిలో జలశక్తి శాఖ కార్యదర్శి నిర్వహించిన సమీక్షలో అనేక అపరిష్కృత అంశాలను గుర్తించారు
- వాటిని పరిష్కరించడం కోసం అపెక్స్ కౌన్సిల్ 2019 సెప్టెంబర్లో ఎజెండా సిద్ధం చేయాలని రెండు రాష్ట్రాలను కోరింది
- మే 2020లో జలశక్తి శాఖ మరోసారి రాష్ట్రాలకు గుర్తుచేస్తూ లేఖలు రాసింది. అయినా స్పందన లేదు
- దాంతో గోదావరి, కృష్ణా బోర్డులు సూచించిన అంశాలతో జలశక్తి శాఖ అపెక్స్ కౌన్సిల్ ఎజెండా సిద్ధం చేసింది
- 2020 మే 14న గోదావరి బోర్డుకు ఏపీ సర్కారు ఏడు తెలంగాణ ప్రాజెక్టులపై తీవ్ర అభ్యంతరాలు చెబుతూ లేఖ రాసింది
- అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టుల్లో కాళేశ్వరం, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-3, సీతారామ లిఫ్ట్, తుపాకులగూడెం, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్, పెన్‌గంగాపై నిర్మించిన బ్యారేజులు రామప్ప - పాకాల సరస్సుల నీటి దారి మళ్లింపు ఉన్నాయి
- జూన్ 2018లో కాళేశ్వరం లిఫ్ట్ డీపీఆర్‌ను జలశక్తి శాఖ అడ్వైజరీ కమిటీ అంగీకరించిన విషయం తెలిసిందే
- అయితే ఎలాంటి అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం రోజుకు 2 టీఎంసీ నుంచి 3టీఎంసీ వరకు లిఫ్ట్ సామర్థ్యం పెంచింది
- ప్రాజెక్టులో మార్పులు, సామర్థ్యం పెంపు వంటి వాటికి జలశక్తి శాఖ ఆమోదం ఉండాలి
- ఏపీ సర్కారు అభ్యంతరం చెప్పిన ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవు
- అందుకే అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందే వరకు ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వానికి గోదావరి బోర్డ్ 2020 మే 30న లేఖ ద్వారా తెలియపర్చింది
- జూన్ 5న జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టులపై లోతుగా చర్చ జరిగింది. వాటి డీపీఆర్‌లను జూన్ 10లోగా అందజేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని గోదావరి బోర్డు ఆదేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు సమర్పించలేదు.
- ఈ పరిస్థితుల్లో ఏపీ అభ్యంతరం తెలిపిన ప్రాజెక్టులపై డీపీఆర్‌లు సమర్పించకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందకుండా నిర్మాణం జరపవద్దని తెలంగాణ ప్రభుత్వానికి జలశక్తి శాఖ చెబుతోంది.
- వీలైనంత త్వరగా అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశం జరపాలని కోరుకుంటున్నాను
- లేఖలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
- 8 Aug 2020 11:30 AM GMT
మండపేట వైసిపి కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు కామెంట్స్..
తూర్పు గోదావరి జిల్లా:
మండపేట: మండపేట లో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మండపేట వైసిపి కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు కామెంట్స్..
- రాష్ట్రం లో 35, 30 సంవత్సరాలు వైఎస్ ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతాది.
- అర్హులైన వారందరికి ఇళ్లు ఇస్తాo.
- మీలో ఎవరికి కష్టం వచ్చినా నేనున్నాను.
- ఆగష్టు15 వ తేదిన ఆర్హులైన వారందరికి సుమారు 28 వేల కోట్లతో అద్భుతమైన కార్యక్రమ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
- 30 లక్షల ఇళ్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్నారు
- 8 Aug 2020 11:28 AM GMT
కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులను చులకనగా చూస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది..
తూర్పుగోదావరి:
- కరోనా పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులను చులకనగా చూస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది..
- హోం క్వారంటైన్ లో ఉన్న జర్నలిస్టు గురించి పట్టించుకోని క్షేత్రస్థాయి సిబ్బంది..
- హోం క్వారంటైన్ కిట్ సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది..
- బాధితుడికి హోం క్వారంటైన్ కిట్ సరఫరా చేయమని అడిగిన తోటి జర్నలిస్టులను దుర్భాషలాడుతున్న వేట్లపాలెం పిహెచ్సీ వైద్యాధికారిణి ధనలక్ష్మీ..
- నాలుగు మందు బిల్లలు ఆ దరిద్రుల ముఖాన్ని కొట్టండంటూ క్రింది స్థాయి సిబ్బంది కి ఆదేశం..
- సోషల్ మీడియా లో వైరల్ గా మారిన వైద్యాధికారి ఫోన్ రికార్డింగ్..
- 8 Aug 2020 11:26 AM GMT
విశాఖ ఫిష్షింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం
విశాఖ:
- చేపల బోటు ఇంజన్ లో చెలరేగిన మంటలు
- ప్రమాదం జరగ్గానే అప్రమత్తమైన మత్స్యకారులు
- పోర్టు ట్రస్ట్ కు సమాచారం ఇచ్చిన మత్స్యకారులు
- మంటల్ని ఆర్పేందుకు పోర్టు సిబ్బందిని పంపిన అధికారులు
- మత్స్యకారులను రక్షించిన స్థానిక యువకులు
- 8 Aug 2020 11:25 AM GMT
ఏలూరు కలక్టరేట్ లో ముగిసిన జిల్లా కరోనా టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం..
ప.గో..
- ఏలూరు కలక్టరేట్ లో ముగిసిన జిల్లా కరోనా టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం..
- వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కామెంట్స్..
- కోవిడ్ హాస్పిటల్స్ లో 11, 200మంది సిబ్బందిని వైద్యం అందించడానికి నియమిస్తున్నాం...
- కరోనా మరణాలు తగ్గించడానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం...
- జ్వరం వచ్చి.. శ్వాసకోస సమస్యలతో బాధ పడితే...
- టెస్ట్ ల తో సంబంధం లేకుండా వెంటనే వైద్యం కోసం హాస్పిటల్స్ జాయిన్ చేసుకోవాలి..
- రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు నిర్వహణలో ఇతర రాష్ట్రాల కంటే అగ్ర స్థానంలో ఉన్నాం...
- కోవిడ్ హాస్పిటల్స్ భోజనం... పారిశుద్యం..మందులు.. సరఫరా ఎలా ఉన్నాయో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం...
- వైద్యం కోసం ఎక్కడికి వెళ్ళాలి.. అనే అంశంపై ANM లకు మార్గనిర్దేశం చేయాలని అధికారులకు అదేశం...
- దేశంలో ఎక్కడ లేని విధంగా రోజుకి 50వేల టెస్ట్ లు చేస్తున్నాం...
- జిల్లాలో త్వరలో ఆక్సిజన్ లైన్ బెడ్స్ అధిక సంఖ్యలో పెంచడానికి చర్యలు చేపట్టాం..
- ప్రతి ఆదివారం జిల్లాలో పూర్తి లాక్ డౌన్ ఏర్పాటు చేసాం..
- జిల్లాలో కరోనా కేసులు 75 శాతం రికవరీ అవుతున్నా యి..
- జిల్లా లోని కోవిడ్ హిస్పిటల్స్ లో 10వేల 600బెడ్స్ అందుబాటులో ఉన్నాయి..
- జిల్లాకు 19కోట్లు రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది..
- 14కోట్లు 40లక్షలు రూపాయలు ఖర్చు చేయడం జరిగింది..
- 8 Aug 2020 11:24 AM GMT
అమరావతి:
- నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 1100 కోట్లను ఖర్చు చేసేందుకు పాలనానుమతి మంజూరు
- వైఎస్ఆర్ గృహవసతి పథకంలో భాగంగా వెయ్యి కోట్లు, 13 జిల్లాల్లోనూ నిర్వహణా ఖర్చుల కింద మరో వంద కోట్లను ఖర్చు చేయనున్న ప్రభుత్వం
- 8 Aug 2020 10:41 AM GMT
చిత్తూరు జిల్లా , చంద్రగిరి మండలం :
- మండలంలోని కల్యాణి డ్యాం లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సుమారు 100 మంది శిక్షణార్థులకు కరోనా పాజిటివ్.
- శానిటేషన్,పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేసిన ఏ.రంగంపేట పంచాయతీ అధికారులు.
- ప్రస్తుతం 380 మంది శిక్షణ పొందుతున్న పోలీసులు.
- శిక్షణా కళాశాలను మూసివేసే దిశగా చర్యలు చేపడుతున్న అధికారులు.
- 8 Aug 2020 9:58 AM GMT
అనంతపురం:
- నార్పల లో కొత్త బస్టాండ్ వద్ద బోలోరో వాహనం ఢీకొని వెంకట్(35)అనే వ్యక్తి మృతి.
- మరో వ్యక్తికి గాయాలు ఆసుపత్రికి తరలింపు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire