Live Updates: ఈరోజు (సెప్టెంబర్-07) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 07 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | పంచమి ( సా. 6-11వరకు) తదుపరి షష్ఠి | భరణి నక్షత్రం పూర్తిగా | అమృత ఘడియలు (రా. 12-58 నుంచి 2-44 వరకు) | వర్జ్యం (మ.2-21 నుంచి 4-07 వరకు) | దుర్ముహూర్తం (మ.12-22 నుంచి 1-11 వరకు తిరిగి మ.2-50 నుంచి 3-39 వరకు) | రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) | సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-07
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 7 Sep 2020 9:48 AM GMT
Amaravati updates: వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ప్రారంభించిన సీఎం వైయస్.జగన్..
అమరావతి...
-క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించిన సీఎం.
-అంతకు ముందు పలు జిల్లాల నుంచి లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన సీఎం వైయస్.జగన్.
-సీఎం వైయస్ జగన్ పాయింట్స్
-ఇవాళ ప్రారంభిస్తున్న వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలు నిజంగా మంచి చేయడంలో సంతృప్తి ఇచ్చే కార్యక్రమాలు.
-గతంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? ఆరోగ్యంగా ఉన్నారా? వారి తల్లులు ఎలా ఉన్నారన్నది ఎవరూ ఆలోచన చేయలేదు. వారికి ఏం చేయాలన్నది ఆలోచించలేదు.
-హెల్తీ బాడీ. హెల్తీ మైండ్. అన్నది ఎవ్వరూ పట్టించుకోలేదు.
-చాలీ చాలని విధంగా నిధులు ఇచ్చేవారు.
-ఏటా రూ.500 కోట్లు ఇస్తే ఎక్కువ అన్నట్లుగా ఉండేది.
-మన పిల్లలు రేపటి పౌరులు, రేపటి ప్రపంచంతో వారు పోటీ పడే స్థితిలో ఉన్నారా? లేరా? అన్నది చూశాక వారిలో మార్పు తీసుకురావాలని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం.
-నేటి తరంలో చాలా మందికి మంచి ఆహారం లభించడం లేదు.
-పిల్లలు, తల్లిదండ్రులు ఆ పరిస్థితిలో ఉన్నారు. వారందరిలో మార్పు తీసుకురావడం కోసమే ఈ పథకాలు.
-పేదల పిల్లలకు బలహీనత, రక్తహీనత వంటి అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి.
-వాటికి సంబంధించి మన పిల్లలు ఎలా ఉన్నారన్నది చూస్తే, అలాగే తల్లుల పరిస్థితి చూస్తే.. గర్భవత్లులో దాదాపు 53 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారు.
-31.9 శాతం పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం లేదా 5 ఏళ్ల వరకు అలాగే ఉంటున్నారు.
-17.2 శాతం మంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేరు. మరో 31 శాతం మంది పిల్లలు బరువుకు తగ్గ ఎత్తులో లేరు.
-ఇంత దుస్థితి ఉంది, ఇవి కొత్తగా వచ్చినవి కావు, కానీ గతంలో పాలకులు ఏ మాత్రం పట్టించుకోలేదు.
-ఈ నెంబర్లు మారాలి, పరిస్థితి మారాలి. పిల్లల ఎదుగుదల లేక, వారు వెనకబడి పోతున్నారు.
-ఇంట్లో తినడానికి తగిన ఆహారం లేకపోతే, అది పిల్లల మేధస్సు, ఎదుగుదలలో కనిపిస్తోంది. తల్లిదండ్రులకు తగ్గట్లుగా పిల్లలు కూడా తగిన ఎదుగుదల లేక ఉన్నారు.
-ఇవన్నీ తెలిసినా, గతంలో ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఈ ప్రభుత్వం ముందుకు అడుగు వేసింది. ఆ దిశలోనే పిల్లలు, గర్భిణీలు, బాలింతల బాగు కోసం ఈ పథకాలు.
-55607 అంగన్‌వాడీల పరిధిలో పూర్తి మార్పులు చేస్తూ, పీపీ–1, పీపీ–2 ప్రారంభిస్తున్నాం.
-బాగా డబ్బున్న వారి కుటుంబాల వారి పిల్లలు ప్రాథమిక స్థాయిలో
-రకరకాల చదువులు చదువుతున్నారు, పేద పిల్లలు అలాగే చదవాలన్న తపనతో ఈ మార్పులు చేస్తున్నాం.
-పీపీ–1, పీపీ–2 ప్రారంభిస్తూ, ఇంగ్లిష్ మీడియమ్‌లో గట్టి పునాది వేసేలా అంగన్‌వాడీల్లో మార్పు చేస్తున్నాం.
- 7 Sep 2020 9:35 AM GMT
Visakhapatnam update: టీడీపీ నేత పుచ్చా విజయ్ కుమార్ కామెంట్స్..
విశాఖ...
-ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నుండి దళితులపై 150 దాడులు జరిగాయి...
-భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రం కోసం పని చేస్తానన్న సీఎం దళితులపై జరుగుతున్న దాడులను ఖండించాలి..
-దాళితుల పై జరుగుతున్న దౌర్జన్యాలు బాదకరం..
-రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ వైసీపీ పార్టీ కోసమా పని చేస్తుంది...
-రాష్ట్రం లో దళితులు బయపడనవసరం లేదు...
-ఛలో కృష్ణా జిల్లా ఐనం పూడి గ్రామానికి వెళ్తే ఆడ్డుకుంటున్నారు
-దళితుల దాడులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి.
-హోం మంత్రి దళితులపై దాడులకు స్పందించాలి...
- 7 Sep 2020 8:59 AM GMT
Visakhapatnam updates: వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలను తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన సీఎం జగన్..
విశాఖ..
-ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశాఖ జిల్లా కాలెక్టరేట్ లో వీడియో కాన్ఫెరెన్సు నుంచి పాల్గున్న మంత్రి ఆవంతి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్
-మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్
-పేదలకు పోషకాహారం అందించే విధంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ముఖ్యమంత్రి ప్రారంభించారు.
-ఈ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని ఆశిస్తున్నాం.
-ఈ పథకం ద్వారా ధనికులతో సమానంగా పేదవారికి పోషకాహారం అందుతుంది.
-పోషక ఆహారం ద్వారా మహిళల్లో రక్తహీనత ,పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
- 7 Sep 2020 8:55 AM GMT
Vijayawada updates: రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నిరసనగా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నిరసన ధర్నా..
విజయవాడ..
-సత్య రవికుమార్ వి.హెచ్.పి నేత
-వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హైందవ ధర్మంపై దాడులు జరుగుతున్నాయి
-ఇన్ని దాడులు, దారుణాలు జరుగుతున్నా మంత్రులు, అధికారులులు స్పందించడం లేదు
-దేవాదాయ శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి
-ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు
-ప్రభుత్వం సిబిఐ తో దర్యాప్తు చేయించి దోషులను కఠినంగా శిక్షించాలి
-అతి పెద్ద ఆదాయం కలిగిన దేవాలయాలను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుంది
-హిందూ ఆలయాల ఆస్తులను కొల్లగొట్టడమే ప్రభుత్వం ఉద్దేశం
-హిందూధర్మాన్ని నీరు గార్చేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి
-మతి స్థిమితం లేని వారు చేసిన చర్యలుగా ప్రకటించడం సరి కాదు
-దేవాలయాలపై జరుగుతున్న దాడులపై మేము న్యాయ స్థానాలను ఆశ్రయిస్తాo
-గవర్నర్ ని కలిసి ప్రభుత్వం తీరు పై ఫిర్యాదు చేస్తాం
-హిందూ ఆలయాల నిర్వహణ ను ధార్మిక మండలిలకి అప్పగించాలి
-హిందూ ఆలయాల లెక్కలు అన్నీ చెప్పాలి... ఇది మరెవరికీ వర్తించదు
-మంత్రాలయం మఠం భూములు కొట్టేయాలని చూస్తున్నారు.
- 7 Sep 2020 7:19 AM GMT
Kadapa district updates: రైతు ఏడ్చిన రాజ్యం-ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడదని పెద్దల అభిప్రాయం...
కడప :
-వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని ప్రభుత్వం జారీచేసిన జీవో నెం.22 ను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ హరికిరణ్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేసిన ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి...
-కామెంట్స్...
-2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది...
-ఈ పథకం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక...
-వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగించడమంటే రైతు మెడకు ఉరితాడు బిగించడమే....
-గతంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ పథకాన్ని చంద్రబాబు ఇంకొంత మంది అవమాన పరిచే విధంగా మాట్లాడారు...
-కానీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు పరిచి చూపించింది....
-2004 లో కాంగ్రెస్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దివంగత నేత వైఎస్ఆర్ మొదటి సంతకం ఉచిత విద్యుత్ సరఫ…
- 7 Sep 2020 7:03 AM GMT
Guntur updates: జగన్ సీఎం గా ప్రమాణస్వీకరం చేయడం దళిత సోదరులు సంతోష పడ్డారు:-మద్దిరాల నాని..
గుంటూరు ః....
-టిడిపి క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల నాని,
-బైబిల్ పట్టుకోని
-కానీ పాలనలో మాత్రం దళితులపై నిత్యం వేదింపులు జరుగుతున్నాయి,
-ప్రజా వేదిక కూల్చివేత తో ప్రారంభమై నేటికి అరాచక పాలన సాగుతుంది.
-దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి,
-ప్రశ్నించిన దళిత నేతలపై అక్రమ కేసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
-జగన్ తన పద్దతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారు.
- 7 Sep 2020 6:29 AM GMT
Guntur updates: అయినంపూడి లో దళిత మహిళా పై సజీవ దహనానికి యత్నించారు..
గుంటూరు ః....
మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు
-టిడిపి , దళిత , ప్రజా సంఘాలు చలో అయినంపూడి కి పిలుపునిస్తే ప్రభుత్వం అడ్డుకుంటుంది.
-బాధితులకు అండగా ఉండేందుకు వెళ్లే వారిని పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటు,
-దళిత సోదరులు అంతా భుజాన వేసుకోని వైసిపి ని అధికారంలోకి తెచ్చారు.
-దళితులు పై దాడి చేసే హక్కు తమదే అన్నట్లు వైసిపి వ్యవహరిస్తుంది.
-శివప్రసాద్ శిరోమండనం ఘటనపై ప్రభుత్వం చర్యలు ఉంటే శ్రీకాంత్ శిరోమండనం జరిగేది కాదు.
-దళితుల పై సుమారు 150 పైగా దాడులు వైసిపి ఏడాది పాలన లో జరిగాయి,
-దళితుల పై దాడులు అన్ని విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
-అమరావతి లో అంబేద్కర్ విగ్రహాలు మాయమైతే ప్రభుత్వం కనీసం స్పందించలేదు.
-అంబేద్కర్ స్మృతి వనం ని నిర్వీరం చేయడానికి ప్రభుత్వం కుట్ర .
-అంబేద్కర్ అంటే వైసిపి కి చులకన భావం .
-దళితుల పై జరిగిన దాడులు అన్నింటి పైనా విచారణ చేపట్టాలి.
-దళిత , ప్రజా సంఘాలు అన్నింటి తో కలసి పోరాటం చేస్తాం.
- 7 Sep 2020 6:23 AM GMT
Antarvedi updates: చినరాజప్ప కామెంట్స్..గొల్లపల్లి సూర్యారావు కామెంట్స్..
తూర్పు గోదావరి జిల్లా....
-అంతర్వేది దేవస్థానం లో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప , గొల్లపల్లి సూర్యారావు, తెలుగుయువత గంటి హరీష్
-చినరాజప్ప కామెంట్స్:
-ఈ ఘటన కచ్చితంగా ఎవరో చేసినదే
-చంద్రబాబు ఈ ఘటనపై నిజ నిర్ధారణ కమిటీగా మమ్మల్ని పంపారు
-ఈ కమిటీలో నేను మాజీ మంత్రి గొల్లపల్లి ఉన్నాం.
-జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు పెరిగాయి
-ఈ ఘటనపై సిబిఐ లేదా జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయించాలి.
-----------------------------------------
-గొల్లపల్లి సూర్యారావు కామెంట్స్:
-నిన్నటి వరకు బడుగు బలహీనవర్గాల మీద దాడులు జరిగాయి.
-నేడు మతాల మీద దాడులు జరుగుతున్నాయి.
- 7 Sep 2020 3:17 AM GMT
Bus service to Hyderabad: హైదరాబాద్ కు మొదలైన ప్రయివేటు బస్సులు!
విజయవాడ
- అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ప్రైవేటు బస్సులు రోడ్డెక్కాయి
- రవాణాశాఖ అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు తిప్పుతున్నారు
- 150 ప్రైవేటు బస్సులకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ విధానాన్ని మొదలుపెట్టారు
- హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా ఒప్పందం కుదరలేదు
- సర్వీసుల పెంపునకు టీఎస్ ఆర్టీసీ ససేమిరా అంటోంది
- ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో తిప్పే కిలోమీటర్లు తగ్గించాలంటోంది టీఎస్ఆర్టీసీ
- ఏపీ భూ భాగంలో కిలోమీటర్లు పెంచబోమని టీఎస్ ఆర్టీసీ తెగేసి చెబుతోంది
- 7 Sep 2020 3:06 AM GMT
East Godavari Updates: తూర్పుగోదావరి జిల్లలో తెరుచుకున్న ఆలయాలు
- కోవిడ్ ఆంక్షలు సడలింపు తో తూర్పుగోదావరి జిల్లాలో నేటి నుంచి తెరుచుకోనున్న ప్రముఖ ఆలయాలు..
- పిఠాపురం పాదగయా క్షేత్రంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించునేందుకు అనుమతి..
- ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో తెరుచుకోనున్న సామర్లకోట భీమేశ్వరాలయం..
- అభిషేకాలు, ప్రత్యేక పూజలకు అనుమతి ఇచ్చిన ఎండోమెంట్స్ అధికారులు..
- వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ పునఃప్రారంభమైన ఆర్జిత సేవలు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire