Live Updates: ఈరోజు (07 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 07 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పంచమి ఉ.10-35 వరకు తదుపరి షష్ఠి | రోహిణి నక్షత్రం సా.05-43 వరకు తదుపరి మృగశిర | వర్జ్యం: ఉ.09-03నుంచి 10-47 వరకు తిరిగి రా.11-43 నుంచి 01-25 వరకు | అమృత ఘడియలు మ.02-15 నుంచి 03-26 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 01-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 7 Oct 2020 1:19 PM GMT
Telangana updates: దుబ్బాక ఉప ఎన్నిక.. నాలుగు కోట్ల జీవన ప్రమాణం పెంచడానికి ఉపయోగపడుతుంది..
రేవంత్ రెడ్డి కామెంట్స్...
- దుబ్బాక ప్రజలు కెసిఆర్ కు, టిఆర్ఎస్ పార్టీ కి గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది
- కెసిఆర్ చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశం వినియోగించుకోవాలి
- పులివెందుల లో రాజకీయ ఎజెండా ను పక్కనపెట్టి రాజశేఖర రెడ్డి భార్య కు ఏకగ్రీవంగా
- పి జనార్దన్ రెడ్డి చనిపోయినప1పుడు వారి ఇంటికి వెళ్లి మాటిచ్చి.. నోటిఫికేషన్ పడ్డాక అభ్యర్థి ని పెట్టి పోటీకీ తెరలేపిండు కెసిఆర్
- నారాయణ ఖేడ్ ఎన్నికల్లో కూడా అదే విధంగా తన కొడుకును ఏకగ్రీవం చేసేది వదిలి ఉప ఎన్నికలు పెట్టిండు
- మనం సాంప్రదాయ పద్ధతిలో పోతే వారు మోసం చేసినందుకే.. ఈరోజు తప్పని పరిస్థితి లో
- కెసిఆర్ గతంలో ఎన్నికల న్ని కలెక్షన్స్ గా మార్చిండు
- ఉద్యమం లో ఎంతో గొప్పగా పోరాడినాడు రామలింగారెడ్డి ని ఎందుకు మంత్రి చేయలేదు
- రామలింగారెడ్డి నిజంగానే మంచోడైతే మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు
- మొదట రామలింగారెడ్డి కొడుకు కు టిక్కెట్ ఇస్తామని ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదో అందరికి తెలియదా? నేను చెప్పాలా ?
- హరీష్ రావు నీకున్న రెండు కన్ను గుడ్లు పీకి మామ అల్లుడు ఆడుకుంటుండ్రు.. ఇంకా నీవు దుబ్బాక, సిద్దిపేట రెండు కండ్ల లాంటివని ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నవ్
- టిఆర్ఎస్ ప్రభుత్వం లోదొమ్మాట పోయి దుబ్బాక అని పేరు మారింది కానీ మన బ్రతుకు మారలేదు
- ఎమ్మెల్సీ ఇస్తామని ముత్యంరెడ్డి ని పార్టీ లోకి తీసుకొని మోసం చేస్తే బెంగతోని చనిపోయిండు
- తెలంగాణ సర్వరోగ నివారణ కావాలంటే దుబ్బాక లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
- 7 Oct 2020 1:15 PM GMT
Telangana updates: టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుబ్బాక నుంచే అంతమొందించాలి..
సీతక్క కామెంట్స్..
- చెరుకు ముత్యంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులే దుబ్బాక లో ఉన్నాయి'
- తెలంగాణ లో గడీల పాలన, కుటుంబ పాలన నడుస్తుంది..
- టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుబ్బాక నుంచే అంతమొందించాలి..
- 7 Oct 2020 1:03 PM GMT
Pragathi Bhavan updates: ప్రగతి భవన్ లో ముగిసిన ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం...
ప్రగతి భవన్...
-దాదాపు ఐదు గంటలుగా పోలీస్ అధికారులతో కొనసాగిన సమావేశం.
-రాష్ట్రంలో శాంతి భద్రతలు , మావోల కదలికల పై ఆరా తీసిన సీఎం.
-రాష్ట్ర సరిహద్దులు కూంబింగ్ పై అధికారులు వివరణ ఇచ్చినట్లు సమాచారం.
- 7 Oct 2020 10:35 AM GMT
V. HANUMANTHA RAO: తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది మేము: వి. హనుమంత రావు
హనుమంతరావు కామెంట్స్
- ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటుంది టిఆర్ఎస్
- మన కండ్లముందే దొంగతనం చేసినట్టుంది టిఆర్ఎస్ పాలన
- పేదలకు ఇచ్చిన భూములను ధరణి పేరుతో రిటర్న్ తీసుకుంటున్న కుట్ర చేస్తున్నారు
- దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి గునపాఠం చెప్పాలి
- 2015 లో అన్ని సర్వే లు చేసిన ప్రభుత్వం మళ్లీ ఎందుకు ఈ ధరణి
- కరోనా వచ్చిన పేదోనికి పెళ్ళాం పుస్తే అమ్మే పరిస్థితి తెలంగాణ లో దాపురించింది
- నరేంద్ర మోడి రైతుల నోట్లో మట్టికొట్టిండు
- ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి
- ఈఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడగొడితే ఎక్కడ తప్పు చేశారనేది కెసిఆర్ కు అర్థమైతది
- 7 Oct 2020 10:30 AM GMT
సి ఆర్ డి ఏ చట్టాలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు
అమరావతి: అనుబంధ పిటిషన్స్ పై హైకోర్టు లో జరిగిన వాదనలు
- పరిపాలన వికేంద్రీకరణ, సి ఆర్ డి ఏ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలు అయిన రిట్ పిటిషన్ లో రాయలసీమ, ఉత్తరాంధ్ర పిటిషన్ లపై వాదనలు జరిగాయి
- ఈ ప్రాంతాలకు సంబంధించి వాదనలు రిట్ లో వినాలని తమను కుడా రిట్ పిటిషన్ లో పార్టీ లుగా చేర్చాలని అభ్యర్దించారు
- స్టేటస్ కో పరిధి లో లేని అనుబంధ పిటిషన్ లు ప్రత్యేకంగా వినాలని గతంలోనే నిర్ణయం
- స్టేటస్ కో పరొధిలో లేని వాటిపై విచారణ శుక్రవారం, సోమవారానికి వాదనలు వినే అవకాశం
- రిట్ పిటిషన్స్ అంశాల వారీగా వర్గీకరించి విచారించనున్న ధర్మాసనం
- పిటిషన్స్ ను ఏ జి, పిటిషనర్ తరపు 4 న్యాయవాదులు కలిసి అంశాల వారీగా విభజించాలని సూచించిన హైకోర్ట్
- సోమవారం నుంచి రిట్ పిటిషన్ పై వాదనలు ప్రారంభించే అవకాశం
- హైబ్రిడ్ విధానం ద్వారా రిట్ పిటిషన్ ల విచారణ ప్రారంభించే అవకాశం పై చర్చించిన న్యాయమూర్తులు
- 7 Oct 2020 10:25 AM GMT
కేంద్రం విద్యుత్ చట్టంతో రైతుల నడ్డి విరుస్తుంది: బీవీ. రాఘవులు
బీవీ. రాఘవులు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు @ సుందరయ్య విజ్ఞాన కేంద్రం..
- ఉత్తర్ ప్రదేశ్ బాలికపై అత్యాచారం అతిక్రూర హత్య సంఘటనలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల విధానం సరైంది కాదు..
- పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది...
- కార్మిక చట్టాలను దొంగతనంగా బిల్లు పాస్ చేశారు..
- ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిన3 వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చారు.దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు...
- విద్యుత్ చట్టం తీసుకొచ్చి రైతుల నడ్డి విరుస్తుంది..
- దీని వల్ల మోటర్లకు మీటర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది దీనిని ఎలా అడ్డుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు..
- ఈ చట్టాలను అడ్డుకోవడంతో పోరాటంలో సీపీఎం ముందుంటుంది.
- 7 Oct 2020 10:19 AM GMT
అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఓ పొలిటికల్ స్టంట్ : టి.డి.పి అధ్యక్షుడు కె ఎస్ జవహర్
తూర్పు గోదావరి- రాజమండ్రి
- రాజమండ్రి పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ మంత్రి జవహర్, రాజమండ్రి అర్బన్ టిడిపీ నాయకుల సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో సభ్యత్వానికి రాజీనామా చేసి టిడిపిలో చేరిన దళిత మోర్చా నాయకులు కానేటి కృపామణి, కానేటి మురళి తో పాటు పలువురు బిజెపి నాయకులు
- రాజమండ్రి పార్లమెంటు టి.డి.పి ఇన్ ఛార్జ్ , మాజీ మంత్రి కె.ఎస్. జవహార్ కామెంట్స్ ....
- ప్రధానితో సమావేశంలో ఏం చర్చించారో సి.ఎం. జగన్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి
- ప్రధాని మోదీతో సి.ఎం. జగన్ ప్రైవేట్ వ్యవహారాల కోసమే భేటీ అయ్యారు
- జైలుకు వెళ్లకుండా ఉండే వ్యవహారం తప్ప ప్రధానితో సి.ఎం. జగన్ కు మరేమీ చర్చించి ఉండరు
- కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తామని ఇప్పుడెళ్ళికాళ్లు పట్టుకుంటున్నారు
- నిన్న జరిగిన కృష్ణా బోర్డ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఓ పొలిటికల్ స్టంట్
- తెలంగాణ సి.ఎం కేసిఆర్ ప్రోద్బలంతోనే ఎ.పి. సి.ఎం జగన్ కృష్ణా నది ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటున్నారు
- రాజమండ్రి పార్లమెంటు పరిధిలో దళితులు, మైనార్టీలపై అత్యాచార ఘటనలపై స్థానిక వై.సి.పి నేతలు ఎందుకు స్పందించడం లేదు
- రాజమండ్రిలో ఆవ భూముల స్కామ్...గోదావరిలో ఇసుక స్కామ్ ల కోసమే ఇక్కడ వై.సి.పి వారు అధికారంలో ఉన్నారా ...
- దళితులపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా రాజమండ్రి వేదికగా ఉద్యమం చేపడతాం
- రాజమండ్రి పార్లమెంటు నియోజవర్గ టి.డి.పి అధ్యక్షుడు కె ఎస్ జవహర్
- 7 Oct 2020 10:17 AM GMT
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలే: గుంటూరు రూరల్ ఎస్పీ
గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని కామెంట్స్.
- మతాల మధ్య, కులాల మధ్య విబేధాలు సృష్టించాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం...
- సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని షేర్ చేసేటప్పుడు వాస్తవం ఏంటో తెలుసుకోవాలి.
- సోషల్ మీడియాలో వీడియోస్, ఫోటోలు, సమాచారం షేర్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
- 7 Oct 2020 10:09 AM GMT
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు
మర్రి శశిధర్ రెడ్డి, టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ చైర్మన్ .
- అక్టోబర్1 నుంచి నవంబర్6 వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ఆన్ లైన్ , ఆఫ్ లైన్ చేసుకోవచ్చు
- గతేడాది గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. ఈ సారి టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి
- ఫేక్ సర్టిఫికెట్ ల ఆధారంగా ఓటర్లను నమోదు చేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది
- ఓటర్ల జాబితా విషయంలో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడనున్నట్లు గత చరిత్ర చూసిన తెలుస్తోంది.
- ఎన్నికల సంఘం దృష్టి కి ఈ విషయాలను తీసుకెళ్లాం.
- ఫేక్ సర్టిఫికేట్ లను గుర్తించడం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించాం.
- ఓటరు పూర్తి వివరాలు.. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎక్కడ పూర్తి చేశారో స్పష్టంగా పేర్కొనాలని చెప్పాం.
- నకిలీ సర్టిఫికెట్ ఆధారంగా ఓట్లు వేయాలని చూస్తే.. క్రిమినల్ కేసులు ఎదుర్కొకతప్పదు.
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం.
- అధికార కార్యాలయం నుంచి పార్టీ వ్యవహారాలు నెరపడం సమంజసం కాదని సూచించాం.
- 7 Oct 2020 10:08 AM GMT
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు
మర్రి శశిధర్ రెడ్డి, టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ చైర్మన్ .
- అక్టోబర్1 నుంచి నవంబర్6 వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ఆన్ లైన్ , ఆఫ్ లైన్ చేసుకోవచ్చు
- గతేడాది గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. ఈ సారి టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి
- ఫేక్ సర్టిఫికెట్ ల ఆధారంగా ఓటర్లను నమోదు చేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది
- ఓటర్ల జాబితా విషయంలో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడనున్నట్లు గత చరిత్ర చూసిన తెలుస్తోంది.
- ఎన్నికల సంఘం దృష్టి కి ఈ విషయాలను తీసుకెళ్లాం.
- ఫేక్ సర్టిఫికేట్ లను గుర్తించడం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించాం.
- ఓటరు పూర్తి వివరాలు.. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎక్కడ పూర్తి చేశారో స్పష్టంగా పేర్కొనాలని చెప్పాం.
- నకిలీ సర్టిఫికెట్ ఆధారంగా ఓట్లు వేయాలని చూస్తే.. క్రిమినల్ కేసులు ఎదుర్కొకతప్పదు.
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం.
- అధికార కార్యాలయం నుంచి పార్టీ వ్యవహారాలు నెరపడం సమంజసం కాదని సూచించాం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire