Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 07ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చవితి (రాత్రి 12-17 వరకు) తదుపరి పంచమి; పూర్వాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి ఉ. 6-06 వరకు), వర్జ్యం (రా. 11-37 నుంచి 1-22 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-16 నుంచి 9-07 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • సోలిపేట రామన్న‌కు టీఆర్ఎస్ శ్రేణుల నివాళి
    7 Aug 2020 4:21 PM GMT

    సోలిపేట రామన్న‌కు టీఆర్ఎస్ శ్రేణుల నివాళి

    సిద్దిపేట జిల్లా: తొగుటలో దివంగత నేత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారు అకాల మరణం పట్ల టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, నివాళులర్పించిన టీఆర్ఎస్ నాయకులు.

  • ఐడిఏ బొల్లారం లో జాయింట్ క‌లెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీ
    7 Aug 2020 4:14 PM GMT

    ఐడిఏ బొల్లారం లో జాయింట్ క‌లెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీ

    సంగారెడ్డి: ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీ లో సామూహిక మరుగుదొడ్ల తో పాటు పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా అదనపు పాలనాధికారి రాజర్షి షా,మున్సిపల్ చైర్ పర్సన్ కొలను రోజా బాల్ రెడ్డి

  • అప్పుల బాధ తాళలేక..
    7 Aug 2020 4:11 PM GMT

    అప్పుల బాధ తాళలేక..

     సిద్దిపేట: కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దరాజుపేట గ్రామానికి చెందిన గర్నేపల్లి వెంకటేష్ అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.

  • అధికారులపై కలెక్టర్ సిరియస్
    7 Aug 2020 4:06 PM GMT

    అధికారులపై కలెక్టర్ సిరియస్

    నాగర్ కర్నూల్ జిల్లా : గ్రామాల్లో కొనసాగుతున్న డంపింగ్ యార్డ్ షెడ్డు, స్మశాన వాటికల నిర్మాణాల పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కలెక్టర్ సిరియస్..

    158 గ్రామాల సర్పంచులకు, కార్యదర్శులకు, 15 మంది ఎంపీడీఓలకు, యంపీఓలకు షోకాజ్ నోటీస్ జారీచేసిన జిల్లా కలెక్టర్ యల్. శర్మన్.

  • 7 Aug 2020 12:02 PM GMT

    నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కు ఖరీప్ సాగుకు నీటి విడుదల...

    నల్గొండ జిల్లా:

    - నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కు ఖరీప్ సాగుకు నీటి విడుదల...

    - నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు రామచంద్రనాయక్, డ్యామ్ ce నర్సింహా.

  • 7 Aug 2020 12:01 PM GMT

    మహబూబాబాద్ జిల్లా: 

    - ప్లాస్టిక్ బియ్యం పై హెచ్ఎం టివిలో వరుస కధనలతో కదిలిన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తొర్రూర్ లో తనిఖీ...

    - తొర్రూర్ మండలం చీకటాయపాలెం గ్రామంలో వండిన బియ్యం రబ్బర్ బాల్ వలె ఎగిరిన కథనం హెచ్ఎంటీవీ లో ప్రసారం కావడంతో అధికారులు వెంటనే చీకటయపాలెం గ్రామంలో తనిఖీలు చేపట్టారు.

    - ఈ తనిఖీల్లో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి పాల్గొన్నారు. కొన్ని బియ్యాన్ని శాంపిల్స్ తీసుకుని టెస్ట్ లకు పంపిస్తామని తెలిపారు.

    - రిపోర్టులో వచ్చిన సమాచారం బట్టి వారి పైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి తెలిపారు.

  • 7 Aug 2020 11:30 AM GMT

    ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ ప్రెస్ మీట్

    - పోతిరెడ్డిపాడు అంశంలో కేసీఆర్ మౌనంవెనుక ఏదో కుట్ర ఉంది.

    - అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హాజరుకాకుండా కేబినెట్ భేటీ ఎందుకు?

    - కృష్ణానది జలాల వివాదాల పై మీటింగ్ కంటే కేబినెట్ భేటీ ముఖ్యమా?

    - సుప్రీంకోర్టు లో వేసిన పిటిషన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపేందుకు ఒక్క అంశం లేదు.

    - సుప్రీంకోర్టు లో వేసిన పిటీషన్ కాపి లో కర్ణాటక-మహారాష్ట్ర ఎందుకు చేర్చారో ప్రభుత్వం చెప్పాలి.?

    - పోతిరెడ్డిపాడు అంశం పై కేసీఆర్ వైఫల్యం చెందారు- కేసీఆర్ వెంటనే రాజీనామా చెయ్యాలి!.

    - జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కు నీళ్లు తీసుకుపోతా అని ప్రకటన చేస్తే కేసీఆర్ ఎందుకు జగన్ తో మాట్లాడలేదు!.

    - కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా రాకుండా పోతే కేసీఆర్ భాద్యత వహించాలి.

    - పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలైతే కేసీఆర్ రాజీనామా చెయ్యాలి

    - పోతిరెడ్డిపాడు రాయలసీమ వల్ల దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    - పోతిరెడ్డిపాడు అంశం పై నేను వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తా.

    - భట్టి విక్రమార్క సీఎల్పీ నేత

    - పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ వల్ల శ్రీశైలం-నాగార్జున సాగర్ కు నీళ్లు రావు.

    - ఏపీ విడుదల చేసిన 203 జీవో ఎఫెక్ట్ హైదరాబాద్ ప్రజలకు కూడా వస్తుంది.

    - టెండర్లు పూర్తి అయ్యే వరకు ఏపీ ప్రభుత్వానికి కేసీఆర్ సహకరిస్తున్నారు.

    - పోతిరెడ్డిపాడు అంశం పై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.

    - దక్షిణ తెలంగాణ ప్రజలందరూ పోతిరెడ్డిపాడు పై పోరాటం చెయ్యాల్సిన అవసరం ఉంది

  • 7 Aug 2020 11:29 AM GMT

    అసెంబ్లీ మీడియా పాయింట్: కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ

    - 2014వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు రాయలసీమకు నీళ్లు తరలించుకు పోతుంటే మాట్లాడలేదు

    - బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది.

    - తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేయాలని కేంద్రానికి లేఖ రాసాము

    - కానీ కేంద్రం స్పందించలేదు, ట్రిబ్యునల్ కు డైరెక్షన్ ఇవ్వలేదు.

    - ఎస్ఎల్పీ, డబ్ల్యుపి కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి.

    - పెండింగులో ఉండగానే పోతిరెడ్డిపాడు ద్వారా అదనపు నీటిని తరలించేందుకు ఏపీ జీవో ఇచ్చింది.

    - ఏపీ తెచ్చిన జీవోల వల్ల తెలంగాణ కు అన్యాయం జరుగుతుందని కోర్టులో కేసు వేశాము.

    - కానీ ఏపీ తో పంచాయితీ అయితే కర్ణాటక మీద కేసు వేశారని తప్పుదారి పట్టిస్తున్నారు.

    - కాంగ్రెస్ నేతలు కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.

    - కాంగ్రెస్ చేసిన పాపాలను మేము కడిగే ప్రయత్నం చేస్తున్నాము.

    - కేసీఆర్ చిత్తశుద్ధి ని శంకించే అధికారం కాంగ్రెస్ కు లేదు.

  • 7 Aug 2020 11:28 AM GMT

    గువ్వల బాలరాజు

    - బీజేపీ నేత డీకే అరుణ పై ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆగ్రహం

    - తెలంగాణ ప్రయోజనాల ను తాకట్టు పెట్టిన నేతలు నామరూపాలు లేకుండా పోయారు.

    - ఆంద్రమోజేతి నీళ్లు తాగి ఆనాడు వారికి మంగళ హారతులు పట్టారు.

    - నేరాలు కప్పి పుచ్చుకోవడానికి వారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరారు.

    - కృష్ణా బేసిన్ లో వాటాదారులు కానీ వారికి అప్పుడు నీళ్లు దోచుకుపోతుంటే నోరుమెదపకుండా ఉన్నారు

    - అందుకే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు.

    - ప్రాజెక్టుల నిర్మాణం పై కేసీఆర్ చిత్త శుద్దిని ఎవరు శంకించలేరు.

    - మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాకు మీరు చేసిన అన్యాయం ప్రజలు మరిచిపోలేదు..

  • 7 Aug 2020 11:25 AM GMT

    వరంగల్ రూరల్ జిల్లా :

    - నర్సంపేట పట్టణంలో కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ సెంటర్ ను తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసి ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

Print Article
Next Story
More Stories