Live Updates:ఈరోజు (ఆగస్ట్-07) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 07ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చవితి (రాత్రి 12-17 వరకు) తదుపరి పంచమి; పూర్వాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి ఉ. 6-06 వరకు), వర్జ్యం (రా. 11-37 నుంచి 1-22 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 8-16 నుంచి 9-07 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం 7సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 7 Aug 2020 9:57 AM GMT
అమరావతి:
- ఏపీ స్పీకర్....తమ్మినేని సీతారాం.....చిట్ చాట్
- స్పీకర్ గా పదవి కాలం ఏడాది పూర్తయిన సందర్భంగా ఆనందంగా ఉంది..
- మీడియా కు ప్రత్యేక ధన్యవాదాలు.
- 58 బిల్లులు ఇప్పటి వరకు సభ లో ఆమోదం పొందాయి..
- ప్రజా శ్రేయస్సు కు సంబంధించిన బిల్స్ చాలా. ఆమోదo పొందాయి..
- రాష్ట్ర ప్రజల సంక్షేమం.... అభివృద్ధి కి అనేక బిల్స్ ఆమోదం పొందాయి.
- పూర్తి స్థాయి లో నాకు ఆనందంగా ఉంది.
- 7 Aug 2020 8:30 AM GMT
కోవిడ్ పై సీఎం వైయస్.జగన్ సమీక్ష
అమరావతి: కోవిడ్ నివారణా చర్యలపై సీఎం వైయస్.జగన్ సమీక్ష
దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 8.87శాతం, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 8.56శాతం
మరణాల రేటు దేశంలో 2.07శాతం, ఏపీలో 0.89శాతం
ప్రతి పదిలక్షల మందిలో 43,059 మందికి పరీక్షలు
శ్రీకాకుళం, కర్నూలు, కడప, కృష్ణా, నెల్లూరు, పశ్చిమగోదావరి, చిత్తూరులో రాష్ట్రం సగటుకన్నా ఎక్కువ పరీక్షలు
సమీక్ష లో ముఖ్యాంశాలు
రాష్ట్రంలో పరీక్షలు బాగా చేస్తున్నాం
చేస్తున్న పరీక్షల్లో 85 శాతం నుంచి 90 శాతం క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నాం
104, 14410 కాల్ సెంటర్లు సమర్థవంతగా పనిచేయాలి
ఈ రెండు నంబర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అన్నది అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి
ప్రజలు కాల్ చేసిన వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలి
139 ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో భోజనం , పారిశుద్ధ్యంపై సీఎం ఆరా
మెనూ కచ్చితంగా అమలు చేసేలా చూస్తున్నామన్న అధికారులు
దీనివల్ల నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తోందన్న అధికారులు
ఎప్పటికప్పుడు వస్తున్న లోపాలను సరిదిద్దుకోవాలి
ఎదురవుతున్న లోపాలను అంగీకరించి వాటిని సరిదిద్దుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలం
అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి
స్కూళ్లు తెరిచే సమయానికి పిల్లలకు మాస్కులు ఇవ్వాలి
జగనన్న విద్యాకానుక ఇచ్చే సమయానికి మాస్కులు ఇవ్వాలి
కోవిడ్ ఆస్పత్రుల్లో సేవలపైన ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్న సీఎం
ఆయా అంశాల్లో సేవలు ఎలా ఉన్నాయన్న దానిపై పీడ్ బ్యాక్ తీసుకోవాలన్న సీఎం
గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు పెట్టాలి
ఆరోగ్య శ్రీ సేవలందిస్తున్న ఆస్పత్రులు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలి
ఏఎన్‌ఎం ఆరోగ్యశ్రీకి రిఫరెల్ పాయింట్‌గా ఉండాలి
కోవిడ్ ఆస్పత్రుల వివరాలు ఈ పోస్టర్‌లో ఉండాలి
వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై ఏఎన్‌ఎం తగిన విధంగా మార్గనిర్దేశం చేయాలి
దీంట్లో వాలంటీర్ భాగస్వామ్యంకూడా ఉండాలి
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్దా కోవిడ్ సోకిందని అనిపిస్తే ఏంచేయాలన్నదానిపై హోర్డింగ్స్, పోస్టర్లు పెట్టించాలి
కోవిడ్ ఉన్నట్టుగా అనుమానం ఉంటే.. ఏంచేయాలన్నదానిపై ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి
కోవిడ్ నివారణా చర్యల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యం తీసుకోండి
ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను చేపట్టాలి
- 7 Aug 2020 8:21 AM GMT
అనంతపురం కాన్సెప్ట్ సిటీకి కాన్సెప్టువల్ ప్లాన్
అమరావతి: అనంతపురం కాన్సెప్ట్ సిటీ కన్సల్టెంట్ గా CBRE సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్
భవిష్యత్ లో బిజినెస్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రం లో 3 కాన్సెప్ట్ సిటీలు ప్లాన్ చేసిన సర్కార్
అనంతపురం కాన్సెప్ట్ సిటీకి కాన్సెప్టువల్ ప్లాన్, ఫీజబిలిటి రిపోర్ట్, బిజినెస్ స్ట్రాటజీ, ఫైనాన్సియల్ మోడల్ ప్రణాళిక సిద్దం చేసి అమలు చేయనున్న CBRE
ఇందుకోసం దాదాపు 85 లక్షల రూపాయలకు పరిపాలన అనుమతులు మంజూరు
- 7 Aug 2020 8:14 AM GMT
ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చుతూ పోతే ఎలా?: రఘురామకృష్ణంరాజు
ప్రభుత్వ , ప్రైవేట్ రెండూ కలిపి 50 వేల కోట్లకు పైగా అమరావతి ఖర్చు పెట్టినట్లు హైకోర్టుకు సమాచారం అందింది
హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉండగా ప్రభుత్వానికి చెందిన కొంతమంది వ్యక్తులు అనుచితంగా, జుగుస్పాకరంగా మాట్లాడవద్దని సీఎం కోరాలి
రాజధాని విషయంలో హైకోర్టు తీర్పు ఎలా వచ్చినా అందరూ శిరసావహించాలి
విద్యామండలి భాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి న్యాయవ్యవస్థపై చేసినట్లు ఒక ప్రముఖ తెలుగు పత్రికలో వ్యాసం భాధాకరం
న్యాయ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలి, న్యాయవ్యస్థ పై కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలను సీఎం జగన్ అడ్డుకోవాలి.న్యాయవ్యవస్థను మనం గౌరవిస్తే ఇతరులు గౌరవిస్తారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాకో రాజధాని పెడతామన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. మూడు రాజధానులకే ప్రజలు కన్నీరు పెడుతున్నారు.
ఒక సామాజిక వర్గం వారు రాజధాని వల్ల బాగుపడుతున్నారనే భావన కరెక్ట్ కాదు.
- 7 Aug 2020 8:09 AM GMT
కరోనా వార్డును ప్రారంభించిన మంత్రి చెల్లుబోయిన
తూర్పుగోదావరి జిల్లా : రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ 19 ప్రాథమిక చికిత్స వార్డును ప్రారంభించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఆర్డీవో గాంధీ, డిఎస్పి రాజగోపాల్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ పాల్గొన్నారు
- 7 Aug 2020 8:01 AM GMT
ఈఎస్ఐ స్కాం అప్‌డేట్స్
అమరావతి: ఈఎస్ఐ స్కాం లో అరెస్టు అయిన మురళీమోహన్ సస్పెన్షన్
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వద్ద పీఎస్ గా పనిచేసిన మురళీమోహన్
మురళీమోహన్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు
- 7 Aug 2020 7:05 AM GMT
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు : డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
కడప: కడప నగరంలోని పాత మార్కెట్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం అంజాద్ బాష...
మార్కెట్ లోని దుకాణాల ముందు ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు...
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన డిప్యూటీ సీఎం అంజాద్ బాష...
పాల్గొన్న నగరపాలక సంస్థ కమిషనర్ లవన్న,ఇతర అధికారులు....
- 7 Aug 2020 7:00 AM GMT
ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటి? : చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో వైద్య పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని టి డి పీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న 30 ఏళ్ల యువకుడు తల్లిని కాపాడమంటూ, తన ప్రాణాలు నిలపమంటూ హృదయవిదారకంగా వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవట్లేదంటే...
ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటి? శ్రీకాకుళం రిమ్స్ లోని ఈ పేషంట్ లను తక్షణం ఆదుకోండి
- 7 Aug 2020 6:43 AM GMT
కర్నూలు మార్కేట్ యార్డ్ వద్ద సీఐటీయూ నిరసన
కర్నూలు: కర్నూలు కూరగాయల మార్కేట్ యార్డ్ తెరిపించి హమాలి కార్మికులకు పని కలిపించాలంటూ కర్నూలు మార్కేట్ యార్డ్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన
అనంతరం మార్కేట్ యార్డ్ సేకరేటరీ కు వినతి పత్రం అందించిన సీఐటీయూ నాయకులు
- 7 Aug 2020 4:32 AM GMT
అచ్చంపేట మండలం తాళ్ళచెరువు సమీపంలో ఎస్‌ఈబీ అధికారుల తనిఖీలు...
గుంటూరు:
- అటవీప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం స్వాధీనం...
- 450 బాటిళ్ళ మద్యం సీజ్..
- ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అదికారులు...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire