Live Updates: ఈరోజు (సెప్టెంబర్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 06 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చవితి (సా.4-11వరకు) తదుపరి పంచమి | అశ్విని నక్షత్రం (తె.3-44 వరకు) తదుపరి భరణి | అమృత ఘడియలు: రా.7-45 నుంచి 9-31 వరకు | వర్జ్యం: రా.11-18 నుంచి 1-04 వరకు | దుర్ముహూర్తం: సా.4-29 నుంచి 5-18 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు |సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-08
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Sep 2020 11:42 AM GMT
Siddipet updates: దుబ్బాక లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్..
సిద్దిపేట;
👉ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తి ఎన్ని మాట్లాడి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు ఓట్లు వేసేది మాత్రం టిఆర్ఎస్ పార్టీకే...
👉దుబ్బాక నియోజకవర్గం ముఖ్యమంత్రి జిల్లా అని, సిద్దిపేట జిల్లా అభివృద్ధి చెందింది అంటే అది ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాతే...
👉 ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా దుబ్బాకలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. గజ్వేల్, సిద్దిపేట మాదిరిగానే త్వరలో దుబ్బాక కూడా అభివృద్ధి చెందుతుంది...
- 6 Sep 2020 8:43 AM GMT
Peddapalli updates:సుల్తానాబాద్-కాల్వ శ్రీరాంపూర్ మధ్య గల రహదారి పై ధర్నా చేపట్టిన యాదవ నగర్ కాలనీ వాసులు...
పెద్దపల్లి :
--సుమారు రెండు కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.
-సుల్తానాబాద్ రైల్వే వాగన్ లో పనిచేసేందుకు రైల్వే లైన్ లో భూములు కోల్పోయిన స్థానికులకే హమాలీలుగా అవకాశం ఇవ్వాలని డిమాండ్
-ఘటన స్థలానికి చేరుకొని నిరసన కారులతో చర్చలు జరుపుతున్న పోలీసులు.
- 6 Sep 2020 8:34 AM GMT
Hyderabad latest news: -ఎల్బీనగర్ వార్డు ఆఫీస్ సమీపంలోని హోల్ సెల్ కిరణ షాప్ లోఅగ్నిప్రమాదం....
హైదరాబాద్...
-ఎగిసి పడుతున్న మంటలు
-మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది...
-అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సమీపంలో దట్టంగా అలుముకున్న పొగ స్థానికుల భయాందోళన...
- 6 Sep 2020 8:00 AM GMT
Hyderabad latest news: ఎల్బీనగర్ వార్డు ఆఫీస్ సమీపంలోని హోల్ సేల్ కిరాణా షాప్ లో అగ్నిప్రమాదం....
హైదరాబాద్...
-ఎగిసి పడుతున్న మంటలు
-మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది...
-అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సమీపంలో దట్టంగా అలుముకున్న పొగ స్థానికుల భయాందోళన...
- 6 Sep 2020 7:03 AM GMT
Warangal Rural district updates: కన్నతల్లికి కరోనా రావడంతో ఊరు బయట ఒదిలిన కొడుకులు.
వరంగల్ అర్బన్ జిల్లా:
-వేలేరు మండలంలోని పీచర గ్రామంలో అమానుషం.
-మారబోయిన లచ్చమ్మ (82) కు కరోనా పాజిటివ్,
-కన్నతల్లి కి కరోనా పాజిటివ్ రావడంతో తల్లిని ఒంటరిగా వ్యవసాయ బావి వద్ద వదిలేసిన కొడుకులు
-బాధితురాలికి నలుగురు కుమారులు, ఒక కూతురు.
-మానవత్వాన్ని మంట కలుపుతున్నా కరోనా..
- 6 Sep 2020 4:52 AM GMT
Nizamabad district updates:-ఫోర్జరీ పత్రాల తో బ్యాంక్ రుణాలు పొందిన 145 మంది పై కేసులు.
నిజామాబాద్ :
-ఎడపల్లి మండలం లోని
-సిండి కేట్ బ్యాంకు లో 2కోట్ల 50 లక్షల పంట రుణాలు పొందిన 145 మంది
-ఫోర్జరీ పత్రాల తో రుణాలు పొందటం పై పోలీసులకు పిర్యాదు చేసిన బ్యాంక్ ఉన్నతాధికారులు.
-ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు, ఓ ఫీల్డ్ ఆఫీసర్ సహకరించారని బ్యాంక్ అధికారుల పై కేసు.
- 6 Sep 2020 4:49 AM GMT
Khammam district updates: నేలకొండపల్లి మండలం రాయిగూడెం సమీపంలో భారీగా గుట్కా పట్టివేత...
ఖమ్మం జిల్లా ;-
*నేలకొండపల్లి మండలం రాయిగూడెం సమీపంలో భారీగా గుట్కా పట్టివేత...
* బీదర్ నుంచి అక్రమ వ్యాపారం కోసం కారులో తీసుకువచ్చిన 10లక్షల విలువ చేసే గుట్కా పట్టుకున్న ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు ...
- 6 Sep 2020 4:46 AM GMT
Warangal Rural updates: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా హై అలెర్ట్..
వరంగల్ రూరల్ జిల్లా.
-మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా హై అలెర్ట్..
-గత కొద్దిరోజులుగా మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ప్రత్యేక బలగాలతో భద్రత ఏర్పాట్లు.
-వాహనాల తనిఖీలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు
- 6 Sep 2020 4:41 AM GMT
Telangana updates: గ్రేటర్ హైదరాబాద్ , దుబ్బాక , ఎమ్మెల్సీ ఎన్నికలు చర్చ..
-సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం.
-గ్రేటర్ హైదరాబాద్ , దుబ్బాక , ఎమ్మెల్సీ ఎన్నికలు చర్చ.
-కోర్ కమిటీ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ,ప్ర చారకమిటీ చైర్మన్ విజయశాంతి.
- 6 Sep 2020 4:35 AM GMT
Jayashankar Bhupalpally updates: లక్ష్మీ బ్యారేజ్-75 గేట్లు ఎత్తిన అధికారులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-పూర్తి సామర్థ్యం 100 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 90.90 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 0.915 టీఎంసీ
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 1,55,500 క్యూసెక్కులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire