Live Updates: ఈరోజు (06 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (06 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 06 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి ఉ.09-02 వరకు తదుపరి పంచమి | కృత్తిక నక్షత్రం మ.03-42 వరకు తదుపరి రోహిణి | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు మ.01-40 నుంచి 02-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు | రాహుకాలం: మ.03-00 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Telangana updates: నిజాయితీకి మారుపేరు- రైతు ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి...
    6 Oct 2020 3:25 PM GMT

    Telangana updates: నిజాయితీకి మారుపేరు- రైతు ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి...

    కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ..

    * చెరుకు ముత్యం రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ లో సెక్రటేరియట్ లో తన నియోజవర్గాల్లో నిరంతరం కృషి చేసారు.

    * రేపు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేస్తది.

    * నాలుగు కోట్ల ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే...ఇవ్వాళ నలుగురు మాత్రమే తెలంగాణను ఎళుతున్నారు.

    * కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదు.

    * శ్రీనివాస్ రెడ్డి 14 సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు...

    * చెరుకు ముత్యం రెడ్డి మంత్రిగా ఉంటే శ్రీనివాస్ రెడ్డి పైరవీలు చెయ్యలేదు.

    * కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేటీఆర్ ఎమ్ చేస్తుండో తెలంగాణ సమాజం గమనిస్తోంది.

    * 142 గ్రామాలకు 142 మంది సీనియర్ నాయకులు ప్రజలకు అండగా ఉన్నాము.

    * దుబ్బాక లో టీఆరెస్ నైతికంగా ఓడిపోయింది.

    * సిద్దిపేట-దుబ్బాక హరీష్ రావు కు రెండు కళ్ళు అంటుండు..మరి ఇన్నేళ్లు దుబ్బాకను ఎందుకు పట్టించుకోలేదు.

  • Laxmi Barrage updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
    6 Oct 2020 3:19 PM GMT

    Laxmi Barrage updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

    -23 గేట్లు ఎత్తిన అధికారులు

    -పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

    -ప్రస్తుత సామర్థ్యం 95.30 మీటర్లు

    -ఇన్ ఫ్లో 30,500 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 14,600 క్యూసెక్కులు

  • Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
    6 Oct 2020 3:15 PM GMT

    Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

    -5 గేట్లు ఎత్తిన అధికారులు

    -పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

    -ప్రస్తుత సామర్థ్యం 118.00 మీటర్లు

    -పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    -ప్రస్తుత సామర్థ్యం 8.54 టీఎంసీ

    -ఇన్ ఫ్లో 13,000 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో 13,000 క్యూసెక్కులు

  • Telangana updates: తెలంగాణ రాష్ట్రం పర్యటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది..
    6 Oct 2020 3:07 PM GMT

    Telangana updates: తెలంగాణ రాష్ట్రం పర్యటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది..

    -Hmtv తో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రా రెడ్డి

    -దుర్గం చెరువు మీద కేబుల్ బ్రిడ్జి చూడడానికి ఎంతో మంది పర్యాటకులు వస్తున్నారు

    -పర్యాటకుల కోసం బోటింగ్ ను అందుబాటులో కి తీసుకొని వచ్చాము

    -గతంలో బోటింగ్ అంటే ట్యాంక్ బండ్ కు వెళ్లేవారు

    -ఇప్పుడు దుర్గం చెరువు లో బోటింగ్ తీసుకు వచ్చాము

    -ఇన్ని రోజులు లాక్ డౌన్ తో ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు

    -లాక్ డౌన్ తర్వాత ఇప్పుడు దుర్గం చెరువు మీద కేబుల్ బ్రిడ్జి చూడడానికి వేలాదిగా వస్తున్నారు

    -వీకెండ్ వస్తే హైదరాబాద్ వాళ్లే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి హైదరాబాద్ చూడడానికి వచ్చే విధంగా కేబుల్ బ్రిడ్జి ఉంది

  • Hyderabad updates: సరూర్ నగర్ లో నిన్న కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు..
    6 Oct 2020 2:54 PM GMT

    Hyderabad updates: సరూర్ నగర్ లో నిన్న కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు..

    -మహేష్ భగవత్, రాచకొండ సిపి కామెంట్స్..

    -సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీ లో నిన్న రాత్రి మొక్కజొన్నల వ్యాపారి నాగభూషణం ను కిడ్నాప్ చేసిన అజీజ్ గ్యాంగ్ సభ్యులు..

    -గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ లను పట్టుకొని అరెస్టు చేసాం

    -అబ్దుల్ అజీజ్, సునీల్ పాటిల్, నిఖిల్ సింగ్, రాజేష్ లను జగిత్యాల పోలీసుల సహకారంతో సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసాం

    -ప్రధాన నిందితుడు రాజ్ భూషణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు..

    -రాజ్ భూషణ్ కు నాగభూషన్ కు మధ్య వ్యాపార లావాదేవీల గొడవలు ఉన్నాయి..

    -రాజ్ భూషణ్ రైతుల నుంచి భారీగా మొక్క జొన్నలు కొనుగోలు చేసి నాగభూషన్ కు విక్రయించిన రాజ్ భూషణ్..

    -మొక్కజొన్న లను కొనుగోలు చేసిన నాగభూషన్ పౌల్ట్రీ కి విక్రయిస్తున్నారు

    -రాజ్ భూషణ్ కు నాగభూషన్ 2 కోట్ల 80 లక్షలు ఇవ్వాల్సి ఉంది

    -ఎన్ని సార్లు అడిగిన ఇవ్వకపోవడం తో కిడ్నప్ కు పధకం ప్రకారం కిడ్నప్ చేసిన రాజ్ భూషణ్..

    -రౌడీ షీటర్ అజీజ్ గ్యాంగ్ తో 10 లక్షల కిడ్నప్ సుపారి మాట్లాడిన రాజ్ భూషణ్..

    -ఆర్థిక లావాదేవీల విషయంలో నాగభూషణం కిడ్నాప్ చేసిన కరీంనగర్ జిల్లాకు చెందిన రౌడీ గ్యాంగ్..

    -సుపారి గ్యాంగ్ పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి....

    -వీరిపై cr no 648/2020 U/s 448, 364 (A) IPC r/w 120 (B) సెక్షన్స్ క్రింద నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపిన రాచకొండ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్..

  • Hyderabad updates: బాలానగర్ డీసీపీ పద్మజ మీడియా సమావేశం...
    6 Oct 2020 2:46 PM GMT

    Hyderabad updates: బాలానగర్ డీసీపీ పద్మజ మీడియా సమావేశం...

    బాలానగర్... 

    -నిన్న పోలీసుల తనిఖీలో శమిర్పెట్ లో దొరికిన 40 లక్షల నగదు దుబ్బాక బిజేపి అభ్యర్థి రఘునందన్ రావు సన్నిహితులది...

    -నిన్న తనిఖీలో కెట్ర వాహనం లో వ్యక్తులు అనుమనస్పదంగా కనిపించడంతో తనిఖీలు చేసారూ..

    -పోలీసులను చూసి కెట్రా వాహనం నుండి సంచితో వ్యక్తి దూకి పరిపోతుండగా పట్టుకున్నారు..

    -కెట్రా తో పాటు మరో స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు...

    -శ్రీనివాస్ బాబు, మజీద్ , ఆంజనేయులు , సురేష్ లను అదుపులో తీసుకున్నారు...

    -వీరంతా పటాన్చెరువు నుండి సిద్దిపేట కు వెళ్తున్నారు

    -వీరి వద్ద నుండి 40 లక్షల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు , రెండు కార్లు స్వాధీనంచేసుకునట్లుగా డీసీపీ వివరించారు.

  • Telangana updates: కేసీఆర్ కుటుంబం కోట్లు దోచుకున్నారు, వేలకోట్ల సంపాదించారు...
    6 Oct 2020 2:41 PM GMT

    Telangana updates: కేసీఆర్ కుటుంబం కోట్లు దోచుకున్నారు, వేలకోట్ల సంపాదించారు...

    ఉత్తమ్ ..

    -కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కల్వకుంట్ల కుటుంబం అధికారంలోకి వచ్చి దోచుకుంటుంది.

    -దుబ్బాక ప్రజలు ఎవరిదగ్గర డబ్బుకు తీసుకున్న ఓట్లు మాత్రం కాంగ్రెస్ కు వెయ్యాలి.

    -కేసీఆర్ ప్రభుత్వం దుబ్బాకకు ఏమిచేసారని దుబ్బాక ప్రజలు అడుగాలి.

    -గజ్వెల్, సిద్దిపేట లో చేసిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు చేయలేదని దుబ్బాక ప్రజలు హరీష్ రావు ను నిలదీయండి.

    -దుబ్బాక అభ్యర్థిని నేనే అని హరీష్ అంటున్నాడు. అంటే ఆపార్టీ అభ్యర్థికి ఆత్మగౌరవం. లేదా ...?

    -ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించండి ప్రభుత్వాన్ని నిలదీస్తాం.

    -రేపటి నుండి దుబ్బాక ఎన్నికవరకు నాతోపాటు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త అక్కడే ఉంటాం.

    -కాంగ్రెస్ కార్యకర్తల వెన్నుదన్నుగా నిలబడుతాం.

  • Telangana updates: ఆత్మగౌరవం దెబ్బతిన్నది అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను: చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
    6 Oct 2020 2:34 PM GMT

    Telangana updates: ఆత్మగౌరవం దెబ్బతిన్నది అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను: చెరుకు శ్రీనివాస్ రెడ్డి..

    Hmtv తో చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

    -Trs లో నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను.

    -తనకు దుబ్బాక నుండి టిక్కెట్ ఇస్తానని trs హామీ ఇచ్చి మోసం చేసింది.

    -నా తండ్రి చెరుకు ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయి.

    -ఈ ఉప ఎన్నికల్లో trs లింగారెడ్డి సెంటిమెంటు ప్రచారం చేస్తే నేను ముత్యం రెడ్డి సెంటిమెంటు తో ప్రచారం చేస్తా.

    -దుబ్బాక ప్రజలు ఇంకా ముత్యం రెడ్డిని మర్చిపోలేదు.

    -దుబ్బాకలో trs మాటలు ప్రజలు నమ్మరు.

    -నేను trs కు పోటీనివ్వడం కాదు గెలిచేది నేనే కాంగ్రెస్ పార్టీనే.

    -కాంగ్రెస్ ఎన్ని గ్రూపులో ఉన్న... అందరూ నా గెలుపు కోసం కలిసి పనిచేస్తారని భావిస్తున్న.

  • Basheer Bagh updates: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ మీడియా సమావేశం..
    6 Oct 2020 2:20 PM GMT

    Basheer Bagh updates: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ మీడియా సమావేశం..

    బషీర్ బాగ్...

    పాతబస్తీ లో రద్దీ ప్రాంతాల్లో నగరం లోని అయ రద్దీ మార్కెట్ లో సెల్ ఫోన్ దొంగ లిస్తున్న పేరుమోసిన సెల్ఫోన్ దొంగల ముఠాను అరెస్ట్ చేసము..

    25 స్మార్ట్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాము

    8 మంది గ్యాంగ్ గ ఏర్పడ్డారు..

    రద్దీ ప్రాంతాల్లో రద్దీ మార్కెట్ లో సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు ఈ ముఠా..

    సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి 7 గురుని అరెస్ట్ చేశారు.

    ఈ గ్యాంగ్ లో ఒక జువైనల్ కూడా వున్నారు..

    ఈ గ్యాంగ్ లో ప్రశాంత్ అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నారు..

    నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ క్రైమ్ రివ్యూ. 2020 అనాలసిస్..

    గడిచిన కొద్దీ నెలాలుగా నగరంలో నేరాలు కేసులు వివరాలు ఇలా వున్నాయి.

    నేరాల సంఖ్య క్రీమ్ రెట్ తగ్గింది..

    దేశంలో శాంతి భద్రతలను కాపాడటంలో హైదరాబాద్ కు ఆరో స్థానం లభించింది..

    2018 80 హత్యలు జరిగాయి

    2019లో 84 జరిగాయి

    2020లో 43 హత్యల కేసులో నమోదు అయ్యాయి.

    పోలీసులు రైడింగ్ చేసిన కేసుల్లో వివిధ కేసులు

    2018 30

    2019 34

    2020 14

    ఇదేవిధంగా కిడ్నాప్ కేసులు చుస్తే

    2018 492

    2019లో 522

    2020 లో 309 కేసులు నమోదయ్యాయి

    రేప్ కేసులు

    2018 274

    2019 301

    2020 216 కేసులు నమోదయ్యాయి

    హత్య ప్రయత్నం

    2018 లో 170

    2019 లో 202

    2020 లో 88 కేసులు నమోదయ్యాయి..

    మహిళలపై జరుగుతున్న దాడులు కేసులు

    2018 2130

    2019 2611

    2020 1322

    నార్కోటిక్స్ ఎన్ డి పి సి ఆక్ట్ కేసులు

    2018 55

    2019 98

    2020 58

    141 మంది పై కేశులు సమొడు అయ్యాయి.

    రౌడీ మర్డర్

    2018 లో 27

    2019 18

    2020 లో 14 హత్య కేసులు నమోదయ్యాయి.

    నిషేధిత గుట్కా కేసులు

    2018 284

    2019 140

    2020 80

    గేమింగ్ ఆక్ట్ కేసులు

    2018185

    2019 207

    2020 లో 224 కేసులు నమోదయ్యాయి.

    ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ అన్ లైన్ లో కేసులు 27 మంది అరెస్ట్ అయ్యారు.

  • Mahabubabad updates: నూతన వ్యవసాయ చట్టం పై మీడియా సమావేశం. పాల్గొన్న కొండపల్లి శ్రీధర్ రెడ్డి...
    6 Oct 2020 2:03 PM GMT

    Mahabubabad updates: నూతన వ్యవసాయ చట్టం పై మీడియా సమావేశం. పాల్గొన్న కొండపల్లి శ్రీధర్ రెడ్డి...

    మహబూబాబాద్ జిల్లా...

    -బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నూతన వ్యవసాయ చట్టం పై మీడియా సమావేశం. పాల్గొన్న కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి...

    -కీసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి కామెంట్స్..

    -రైతుల యొక్క ఆదాయాన్ని 2022 సంవత్సరం లోపు రెట్టింపు చేయాలని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ దిశగా నూతన వ్యవసాయ బిల్లును తెచ్చారు...

    -ప్రతిపక్ష పార్టీలు వ్యవసాయ బిల్లు పై విష ప్రచారం చేస్తున్నాయి...

    -వ్యవసాయ మార్కెట్ లు ఎక్కడ తొలగించబడవు.

    -రైతు తన పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే వీలవుతుంది...

    -ఒప్పంద సేద్యం వలన రైతులు మేలు జరుగుతుంది...

    -పంటల కనీస మద్దతు ధర పై ఎలాంటి ప్రభావం చూపదు...

    -ఖమ్మంలో కనీస మద్దతు ధర పై ప్రశ్నించిన గిరిజన రైతుకు సంకెళ్లు వేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యవసాయ బిల్లు పై మాట్లాడే అర్హత లేదు...

    -వ్యవసాయ బిల్లును దేశ వ్యాప్తంగా రైతులు స్వాగతించారు...

    -చిన్న సన్నకారు రైతులతో దేశ వ్యాప్తంగా 10వేల రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటు చేసి , వారికి ఆర్ధిక సహాయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది...

Print Article
Next Story
More Stories