Live Updates: ఈరోజు (06 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 06 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ ఉ.07-10 వరకు తదుపరి చవితి | భరణి నక్షత్రం మ.01-22 వరకు తదుపరి కృత్తిక | వర్జ్యం: రా.02-32 నుంచి 04-17 వరకు | అమృత ఘడియలు ఉ. 08-30 నుంచి 09-48 వరకు | దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 0900 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Oct 2020 9:05 AM GMT
Liquor Case: మధ్యం అక్రమ రవాణా
పగోజిల్లా.
- కారులో అక్రమ మధ్యంతో కొయ్యలగూడెం సమీపంలో SEBఅధికారులకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్..
- కారులో 70బాటిళ్ళ అక్రమ మద్యం ఉండటంతో విచారణ చేస్తున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు..
-ఓ కేసు ఇన్వెస్టిగేషన్ కు తెలంగాణా వెళ్ళి వస్తున్న బుట్టాయిగూడెంకు స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్.
- కారు యజమాని బుట్టాయిగూడెం కి చెందిన వ్యక్తిగా గుర్తించిన SEB అధికారులు..
- మధ్యం అక్రమ రవాణాకి పాల్పడింది కానిస్టేబుళ్ళా లేక కారు యజమానా అనేది పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది..
- 6 Oct 2020 8:54 AM GMT
ఎమ్మెల్సీ గా జకియా ఖాన్ ప్రమాణ స్వీకారం
అమరావతి: ఎమ్మెల్సీ గా జకియా ఖాన్ ప్రమాణ స్వీకారం
కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి, ఉప ముఖ్య మంత్రులు అo జాద్ భాషా, పుష్ప శ్రీవాణి..తదితరులు.
- ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి
- సీఎం జగన్ ఎమ్మెల్సీ ల ఎంపికలో ప్రత్యేక శైలి పాటించారు
- చరిత్రలో తొలిసారి మైనారిటీ మహిళ జకీయా ఖానుమ్ ను శాసన మండలి కి పంపారు
- జగన్ తో తొలి రోజు నుండి వెన్నంటే ఉన్న సంబశివరాజు కుమారుడు సురేష్ కి అవకాశం ఇచ్చారు
- ఇద్దరి ఎంపిక పార్టీ ని నమ్ముకున్న వారికి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యం ఇచ్చారని రుజువు చేసింది
- ిప్యూటీ సీఎం అంజాద్ బాషా
- మైనారిటీ మహిళ ను ఎమ్మెల్సీ చేయడం సీఎం జగన్ కి మైనారిటీ ల పై ఉన్న ప్రేమ కు నిదర్శనం
- ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ముస్లిం మహిళకు గౌరవం ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది
- ముస్లిం సమాజం మొత్తం సీఎం జగన్ ను అభినందిస్తున్నారు
-వైఎస్ కుటుంబం అంటేనే ముస్లిం పక్షపాతి కుటుంబం
-సామాన్య మైనారిటీ మహిళ ను మండలికి పంపడం విశేషం
-డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి
-విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ముందుండి నడిపింది పెనుమత్స సాంబబశివరాజు
-పార్టీ ని నమ్ముకున్న వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తింపు నిస్తారని నిరూపించారు
-రాష్ట్రంలో ని కార్యకర్తలు అందరిలోనూ గౌరవాన్ని పెంచారు
-మైనారిటీ మహిళ కూ ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని నిరూపించారు
- 6 Oct 2020 8:48 AM GMT
ఈ ఉద్యమం ఇప్పటికే నైతికంగా విజయం సాధించింది: CPM రాష్ట్ర కార్యదర్శి
విజయవాడ: CPM రాష్ట్ర కార్యదర్శి మధు
- ఈ ఉద్యమం ఇప్పటికే నైతికంగా విజయం సాధించింది
- రాజకీయపార్టీలు అమరావతి రాజధాని వివాదం తలెత్తింది.
- దీనితో మిగతా అంశాలపై దృష్టి లేకుండా చేస్తున్నాయి..
- రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజనహామీలు అడిగే వారు లేరు అని.. గతంలో అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది అని భావనలో అందరూ అంగీకరించారు అని..
- గతంలో యం.పిలతో ప్రత్యేకహోదా కోసం రాజీనామాలు చేయించి ఇప్పుడు వారితో తందనా ఆడుతుంది అని..
- పాచిపోయినలడ్డు అనేవాడు వారి పంచనచేరారు.
- అమరావతికి ఈ పరిస్థితి రావడానికి కారణం కేంద్రంలో పెద్దలు
- రాష్ట్రంలో ఈ పరిస్థితిలు తీరని ఆటంకం అని.. రాజధాని వివాదం తీరని నష్టం నేరం అని.. గతంలో మేము పూలింగ్ ను వ్యతిరికించాము కానీ అప్పట్లో మమ్మల్లి నిర్బంధము చేశారు అని..
- కేంద్రం రాష్ట్రానికి ఇచ్చినహామీలను తుంగలో తొక్కినారు అని.. అమరావతి ఉద్యమంకు మా మద్దతు ఉంటుందని అన్నారు..
- 6 Oct 2020 8:43 AM GMT
అపెక్స్ కౌన్సిల్ భేటీ ప్రారంభం
#జలవివాదాలపై వాదనలు వినిపిస్తున్నా తెలుగురాష్ట్రాలు#పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాల దృష్ట్యా సమావేశానికి అత్యంత ప్రాధాన్యత
#హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న సీఎం కేసీఆర్
#ఢిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఏపీ సీఎం జగన్
#నీటి కేటాయింపుల్లో రాజీ ప్రసక్తేలేదంటున్న తెలంగాణ రాష్ట్రం
#తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన వాటాపై గట్టిగానే వ్యవహరించాలని నిర్ణయం
#ఆంధ్రప్రదేశ్ వాదనలకు దీటుగా సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
#కేంద్రం కూడా ఈ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం
#నాలుగు అంశాలను అజెండాగా నిర్ణయించిన అపెక్స్ కౌన్సిల్
#అజెండాలోని అంశాలపై జల్‌శక్తి అధికారులతో చర్చించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్
#ఇరురాష్ట్రాలు లేవనెత్తే అంశాలు, కేసీఆర్ లేఖలోని విషయాల గురించి చర్చించినట్లు సమాచారం
#శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణనూ తమకే అప్పగించాలని కోరుతున్న తెలంగాణ
#ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా బోర్డుకే అప్పగించాలని కోరుతున్న ఏపీ
#కృష్ణా జలాలపై విచారణ జరపాలని గట్టిగా కోరనున్న సీఎం కేసీఆర్
#అంతర్రాష్ట్ర జల వివాద చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం విచారణకు డిమాండ్
- 6 Oct 2020 8:36 AM GMT
అమరావతి ఉద్యమం కార్యాచరణ
విజయవాడ: JAC సభ్యులు మల్లికార్జునరావు
- సోమవారం నాటికి 300 రోజులకు ఉద్యమం చేరుకున్న సందర్భంగా అమరావతి ఉద్యమం కార్యాచరణ ..
- 180 రోజు యజ్ఞం చేశాము. .
- 200వ రోజు నిరసనలు వ్యక్తం చేశాము..
- 250 వ రోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నిరసనలు వ్యక్తం చేశాము.
- 299వ రోజు ఆదివారం నాడు మహిళ JAC వారితో వెబ్ నార్ కార్యక్రమం.
- 300 వ రోజు అమరావతి వాక్.. 5 కిలోమీటర్లు నడక చేయాలని ప్రతిపాదన.
- ఈ నెల 22 నాడు శంకుస్థాపనచేసి 5 సం.లు అయినసందర్భంగా దేశ వ్యాప్తంగా చర్చజరిగేలా ప్రణాళికసిద్ధం చేశాము.
- 6 Oct 2020 8:32 AM GMT
IT Minister Mekapati Goutham Reddy: షుగర్ ఫ్యాక్టరీస్ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు: ఐటీ మినిస్టర్ మేకపాటి
విశాఖ: హెచ్ఎమ్ టీవీ తో ఐటీ మినిస్టర్ మేకపాటి గౌతం రెడ్డి ఎక్సక్లూజీవ్ కామెంట్స్.....
- ఉత్తరాంధ్ర లో పలు చక్కెర పరిశ్రమల ను సందర్శించనున్నాను...
- షుగర్ ఫ్యాక్టరీస్ అభివృద్ధి పై ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయబోతున్నాం..
- రైతులు, కార్మికులు సమస్యలు తెలుసుకుని పరిష్కరించే మార్గాలను అన్వేషిస్తున్నాం.
- ఈ రోజు విశాఖ పర్యటనలో భాగంగా తాండవ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్నాను...
- విశాఖ లో రాజకీయపరిణామాలు వేగంగా మారుతున్నాయి...
- సబ్బం హారి విషయంలో అధికారులు చట్టప్రకారం వెళుతున్నారు..
- ముఖ్యమంత్రి జగన్ పరిపాలన పారదర్శకంగా వుంది....ప్రతిపక్షం ఆరోపణలు చేష్తున్నట్టు కక్ష సాధింపు చర్యలకు మా ప్రభుత్వం లో తావు లేదు.
- 6 Oct 2020 8:26 AM GMT
Thandava Sugar Factory: తాండవ షుగర్ ఫ్యాక్టరీ పై అధ్యయనం
తూర్పుగోదావరి... తుని:
- ది పాయకరావుపేట తాండవ షుగర్ ఫ్యాక్టరీ ల ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీ రాక..
- సభ్యులు మంత్రివర్యులు కురసాల కన్నబాబు , బొత్స సత్యనారాయణ , మేకపాటి గౌతమ్ రెడ్డి తాండవ చక్కెర కర్మాగారమునకు విచ్చేయుచున్నారు
- కమిటి కు ఫ్యాక్టరీ స్థితి గతులు తెలియపరచడానికి .. కాకినాడ ఎంపీ. తుని .. పాయకరావు పేట.... పత్తిపాడు.... నర్సీపట్నం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు
- 6 Oct 2020 8:21 AM GMT
Apex Council Meeting: అపెక్స్ కౌన్సిల్ సమావేశం
- ఏపీ - తెలంగాణ ప్రభుత్వాలు లేవనెత్తిన అంశాలను చర్చించనున్న అపెక్స్ కౌన్సిల్
- పాల్గొన్న ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి.
- సమావేశానికి నేతృత్వం వహించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.
- కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి , జల వివాదాలు తదితర అంశాలపై అపెక్స్ కౌన్సిల్ చర్చ
- ఇరు రాష్ట్రాలను నిర్మిస్తున్న ప్రాజెక్టులు వాటి పై అభ్యంతరాల పైనా చర్చ
- 6 Oct 2020 8:15 AM GMT
Weather Updates: వాతావరణ సమాచారం
- వచ్చేవారంలో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం
- ఇప్పటి వరకూ తీరానికి సమీపాన అల్పపీడనాలు ఏర్పడటంతో కొద్దిపాటి ప్రభావం మాత్రమే
- ఈ సారి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అండమాన్ వద్ద ఏర్పడనున్న అల్పపీడనం
- ఈనెల తొమ్మిదినాటికి అల్ప పీడనం ఏర్పడి ఉత్తరాంధ్ర ఒడిసాల దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా.
- ఈనెల 11, 12 నాటికి అది వాయుగుండంగా మారవచ్చని అంచనా
- ఈనెల 11 నుంచి కోస్తాంధ్రకు వర్షాలు, ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు.
- ఈ రోజు కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు
- 6 Oct 2020 8:11 AM GMT
AP ECET RESULTS: ఏపీ ఈసెట్ పరీక్ష ఫలితాల విడుదల
అమరావతి: విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్
- ఏపీ హాయర్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఈసెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి అధిములపు సురేష్, ఉన్నత విద్యా శాఖ అధికారులు....
- జేయన్టీయూ ప్రొఫెసర్ భానుమూర్తి ఆధ్వర్యంలో ఈసెట్ పరీక్షల నిర్వహణ.
- పరీక్ష ఫలితాల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ సియస్ సతీష్ చంద్ర,
- ఈసెట్ 37160మంది అప్లై చెయ్యగా
- 31898హాజరు అయ్యారు...
- 58 సెంటర్ లో పరీక్షలు నిర్వహించాం.
- ఈసెట్ లో 96.12శాతం ఉత్తీర్ణులు అయ్యారు.
- ఈసెట్ లో విద్యార్థులు 25160,
- విద్యార్థినిలు 6731 మంది హాజరు అయ్యారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire