Live Updates: ఈరోజు (06 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 06 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ ఉ.07-10 వరకు తదుపరి చవితి | భరణి నక్షత్రం మ.01-22 వరకు తదుపరి కృత్తిక | వర్జ్యం: రా.02-32 నుంచి 04-17 వరకు | అమృత ఘడియలు ఉ. 08-30 నుంచి 09-48 వరకు | దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 0900 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Oct 2020 1:38 PM GMT
Krishna district updates:ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
కృష్ణాజిల్లా..
-24 గంటల్లోనే ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
-పథకం ప్రకారం హత్యలకు పాల్పడి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసిన నిందితులు
-నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పి రవీంద్రబాబు
-రాష్ట్రంలో సంచలనంగా మారిన విస్సన్నపేట ట్రిపుల్ మర్డర్ కేసు
-దర్యాప్తు కోసం 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు
-రామస్వామి(40)తిరుపతమ్మ(35) మీనాక్షి (11) ని దారుణంగా చంపి నిందితులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు
-విచక్షణా రహితంగా కొట్టి చంపారు
-11 సంవత్సరాల బాలికను మెడకు తాడు బిగించి హత్య చేసారు
-మృతురాలు తిరుపతమ్మను కూడా దారుణంగా హత్య చేసారు
-హత్యలను యాక్సిడెంటుగా చిత్రీకరించే ప్రయత్నం
-ఆటోను గుద్దించినపుడు, గుద్దించిన ఆటో హెడ్ లైటు, సైడ్ మిర్రర్ సంఘటన స్ధలంలో లభ్యం
-నిందితుడు, మృతురాలి కాల్ డేటా ఆధారంగా బయటపడిన అక్రమ సంబంధం
- 6 Oct 2020 1:31 PM GMT
Chittoor district updates: కుప్పం పి ఈ ఎస్ ఆసుపత్రిలో దారుణం...
చిత్తూరు..
-సకాలంలో ఆక్సిజన్ అందించక పోవడం తో వ్యక్తి మృతి
-పీ ఈ ఎస్ వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
-ఎమర్జెన్సీ అని వచ్చినా సరే ఆస్పత్రి సిబ్బంది సుమారు గంటపాటు పట్టించుకోలేదని ఆరోపణ
-డాక్టర్లు పట్టించుకోకపోవడంతో అంబులెన్స్ సిబ్బందే వైద్యం అందించడానికి ప్రయత్నం
-పరిస్థితి విషమించడంతో శాంతుపురం కి చెందిన సుబ్రమణ్యం నాయుడు మృతి
-ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన
- 6 Oct 2020 1:27 PM GMT
Amaravati updates: రేపు విజయవాడకు కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రాక..
అమరావతి..
-రేపు మధ్యాహ్నం 12.25 నిమిషాలకు చెన్నయ్ నుంచి హైదరాబాద్ అక్కడ నుండి గన్నవరం విమానాశ్రయం కు చేరుకుని జక్కుల నెక్కలం, గూడవల్లి సర్కిల్ దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులను కలసి మాట్లాడతారు
-3.00 గంటలకు కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పాల్గొంటారు.
-4 గంటలకు ది వెన్యూ కన్వెన్షన్ హాల్ కు చేరుకొని బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమం " చట్టం చేయబడిన వ్యవసాయ బిల్లు పై రైతులు, వ్యవసాయరంగ నిపుణులు తో చర్చా కార్యక్రమం" లో పాల్గొటారు.
- 6 Oct 2020 1:22 PM GMT
Visakha updates: ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది నరేంద్రమోదీ కల: విష్ణుకుమార్ రాజు..
విశాఖ..
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కామెంట్స్...
-ఈ విషయంలో గత ప్రభుత్వం బాగా చొరవ చూపింది
-కేంద్రం 7 లక్ష ల పైగా ఇళ్లను ఏపీకి కేటాయించింది
-రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ..ఇల్లు నిర్మాణం ఆపేశారు..
-విశాఖలో గతంలో వచ్చిన ఇళ్ల దరఖాస్తులను రద్దు చేయడం దారుణం
-అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వేదికను కూల్చివేశారు..
-ఆయన కూలచడంలో అద్భుతమైన ప్రతిభ చూపారు
-ఇది రద్దుల ప్రభుత్వం.. కూల్చివేతల ప్రభుత్వం..
-వైసీపీ సర్కారు అనాలోచిత చర్యల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..ముఖ్యమంత్రి గమనించాలి
-రివర్స్ టెండరింగ్ లో లాభం లేదు..
-ఎన్ డి ఏ కూటమిలో వైసిపి చేరుతుందని అనుకోను
-మీరు రాజీనామా చేస్తే..మళ్ళి పోటీకి అన్ని సర్దుకావాలి
-ఎమ్మెల్యేలు రాజీనామా లు చేసి ఇతర పార్టీలోకి వెళ్తే..నాయకుల మీద గౌరవం ఉంటుంది
-ఏపీలో ఉన్న మందు బ్రాండ్లు.. ఇంకా ఎక్కడ కనబడవు
-వచ్చే ఎన్నికల్లో జనసేన బిజేపి కలసి పోటీ చేసి రాష్ట్రం అధికారంలోకి వస్తాం..
- 6 Oct 2020 1:05 PM GMT
Kakinada updates: అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చెయ్యొద్దు: జ్యోతుల నవీన్..
తూర్పుగోదావరి.. కాకినాడ..
-కాకినాడ పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కామెంట్స్..
-నిరుపేదలకు అన్యాయం జరిగిందని అడిగినందుకు నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు.
-అధికారులు. కాంట్రాక్టర్ల్ స్పందించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..
-అనంతరం తిరిగి తాను ఇంటికి వెళ్లిన తర్వాత తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నట్లు తెలిసింది..
-ఇటువంటి చర్యలకు తాను బయపడను..పేద ప్రజల కు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తమ పార్టీ తరపున ఉంటా...
- 6 Oct 2020 12:59 PM GMT
Kurnool district updates: ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ మీడియా సమావేశం..
కర్నూల్..
-రి టెండెరింగ్ పై బీవీ ఫైర్
-టీడీపీ ప్రభుత్వం లో పనులు మంజూరు చేస్తే, రి టెండెరింగ్ పేరుతో వారు చేసినట్లు చెప్పుకోవడం సరికాదు.
-ఎమ్మిగనూరు పట్టణానికి శాశ్విత తాగునీటి పథకం ఏర్పాటుకు టీడీపీ శ్రీకారం చుడితే వైస్సార్ ప్రభుత్వం తాము చేసినట్లు రి టెండెరింగ్ నిర్వహించింది.
- 6 Oct 2020 12:55 PM GMT
Amaravati updates: నా పై తప్పుడు కేసులుపెట్టిన ఖాకీలపై ప్రైవేట్ కేసు పెడతా...
అమరావతి..
కే.ఎస్.జవహర్ మాజీ మంత్రి..
-పోలీస్ రాజ్యం ఎక్కువకాలం సాగదని తెలుసుకోండి.
-రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఖాకీలు గుర్తుంచుకుంటే మంచిది.
-తప్పుడు కేసులు పెట్టి, తనను వేధించిన సీఐ, ఎస్సైలపై ప్రైవేట్ కేసు పెట్టి కోర్టుకి లాగుతా.
-తనపై కేసులు పెట్టిన పోలీసులు, జగన్ పై, బియ్యపు మదుసూధన్ రెడ్డి, రోజాలపై ఎందుకు పెట్టలేదు?
-డీజీపీ, కొవ్వూరుసీఐ మూర్తి, ఎస్సై వెంకటరమణ ల వైఖరి చూస్తుంటే, వైసీపీ తరుపున ఎన్నికల్లో పోటీచేసేలా ఉన్నారు.
-కృష్ణాజిల్లాలో మంత్రి అండదండలతో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది.
-కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు ఇసుకమాఫియాలో మునిగితేలుతున్నారు.
-కొన్ని మీడియాసంస్థలు జగన్ కు తొత్తులుగా మారి, వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి.
- 6 Oct 2020 12:44 PM GMT
Amaravati updates: నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ...
అమరావతి...
-175నియోజకవర్గాల టిడిపి అభ్యర్ధులు, సీనియర్ నాయకులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ జరిపారు.
-‘‘కరోనాపై ప్రజలను మరింత అప్రమత్తం చేయడం, చైతన్యపర్చడం, బాధితులకు కావాల్సిన సేవలు అందించడం లక్ష్యంగా టిడిపి తరఫున ‘‘ఏపి ఫైట్స్ కరోనా’’ -వెబ్ సైట్ ప్రారంభించాం.
-ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే దీని లక్ష్యం.
-ప్రజల్లో మనోధైర్యం పెంచే కృషి చేశాం.
-బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా విపత్తుల్లో బాధితులను ఆదుకోవడంలో టిడిపి ఎల్లప్పుడూ ముందు ఉంటుంది.
-పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో మరో శిరోముండనం-రూ 30వేలు అప్పు చెల్లించలేదని బిసి యువకుడికి శిరోముండనం చేయడం దారుణం.
-తూర్పుగోదావరి జిల్లాలో వర ప్రసాద్, విశాఖలో శ్రీకాంత్, జంగారెడ్డి గూడెంలో అభిలాష్ శిరోముండనం వైసిపి ప్రభుత్వానికి సిగ్గుచేటు.
-రాజమండ్రిలో ముస్లిం మైనారిటీ షేక్ సత్తార్ ఆత్మహత్యా యత్నం బాధాకరం.
-ప్రాణాలు కాపాడాల్సిన కార్యాలయం ఎదుటే పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం సభ్య సమాజానికే తలవంపులు.
-స్నానం చేసే ఆడబిడ్డలను వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం కన్నా నీచం మరొకటి లేదు.
-‘‘మేము చాలా పేదవాళ్లం, మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు.
-మాజీ మంత్రి జవహర్ పై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపే..
-ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే టిడిపి నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు.
- 6 Oct 2020 12:24 PM GMT
Andhra Pradesh updates: కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన అపెక్స్ కౌన్సిల్ వాదనలు..
#అపెక్స్ కౌన్సిల్ లో తెలంగాణ ప్రభుత్వం చెప్పిన కొత్త ప్రతిపాదనను ఒప్పుకోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
#299 టీఎంసీలకు ఒప్పుకుంటు 2016లో ఒప్పందాలపై సంతకం చేసిన సీఎం కేసీఆర్.
#ఇప్పుడు మళ్లీ కొత్త ప్రతిపాదన తెలంగాణ పెట్టడం సరైనది కాదు. దానికి ఒప్పుకొము అని తన వాదనలో చెప్పిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.
#తెలంగాణలో 68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉంది. ఈ లెక్కన 530 టీఎంసీల నీరు తెలంగాణ ప్రభుత్వం వాడుకోనే హక్కు.
#2016లో జరిగిన ఇరు రాష్ట్రల ఒప్పందంపై సీఎం కేసీఆర్ చేసిన సంతకం వల్ల నేడు రాష్ట్రానికి దక్కాల్సిన 530 టీఎంసీ ల వాటాను కోల్పోయమంటున్న నిపుణులు
#అప్పటి టీడీపీ ప్రభుత్వంతో సీఎం చంద్రబాబుతో ఒప్పందం జరిగింది.
#మీ సర్కారు నిర్ణయంతో చేసిన సంతకం చేసారు... దానికి మేము బాధ్యత తీసుకొము అంటూ తెగేసి చెప్పిన ఏపీ సీఎం జగన్.
- 6 Oct 2020 12:20 PM GMT
Kesavapuram updates: కేశవాపురం ప్రాజెక్ట్ కి త్వరలో శంకుస్థాపన- మంత్రి కేటీఆర్...
#రిజర్వాయర్ కి అవసరమైన భూసేకరణ దాదాపుగా పూర్తయింది
#రెండవ దశ అటవీశాఖ అనుమతులకు సంబంధించి వేగంగా కార్యక్రమాలు
#కేశవాపురం ప్రాజెక్టు పూర్తయితే 2050 వ సంవత్సరం వరకు హైదరాబాద్ కు తాగునీటి కొరత ఉండదు
#హైదరాబాద్ కి తాగునీటి కొరత ఉండరాదన్న ముఖ్యమంత్రి ఆలోచన ఆధారంగానే కేశవాపురం రిజర్వాయర్
#త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా రిజర్వాయర్ శంకుస్థాపన
#హైదరాబాద్ లో మరిన్ని ఎస్ టి పిల నిర్మాణానికి ప్రణాళికలు
#ప్రస్తుతం ఉన్న 770 ఎమ్మేల్డీలకు అదనంగా మరో పన్నెండు వందల MLD లకు ఎస్ టి పి లు
#వీటికి సంబంధించిన ప్రణాళికలు, వివరాలతో కూడిన నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించాలని జలమండలికి ఆదేశం
#జలమండలి కార్యక్రమాల పైన ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ సమీక్ష
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire