Live Updates: ఈరోజు (06 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 06 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి రా.2-33 తదుపరి సప్తమి | పునర్వసు నక్షత్రం తె.4-31 తదుపరి పుష్యమి | వర్జ్యం సా.4-09 నుంచి 5-48 వరకు | అమృత ఘడియలు రా.2-05 నుంచి 3-41 వరకు | దుర్ముహూర్తం ఉ.8-20 నుంచి 9.05 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Nov 2020 1:14 PM GMT
Hyderabad Updates: మరో వివాదంలో ఎస్సార్ నగర్ పోలీసులు..
హైదరాబాద్..
-ఎర్రగడ్డ వికాస్ పురి కాలనీలో ఇంటి వివాదం కోర్టులో ఉండగా 25 మందితో వచ్చి బలవంతంగా తమ ఇంట్లో కి దూరి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి తమను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని బాధితులు ఇంటి ముందు నిరసన
-ముందస్తు ఒప్పందం ప్రకారమే ఎస్సార్ నగర్ పోలీసులు సమయానికి చేరుకోకుండా వారి తమ ఇంటి పొజిషన్ ఇప్పించారని బాధితులు ఆరోపణ.
-హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన బాదితులు
- 6 Nov 2020 1:11 PM GMT
Hyderabad Updates: టీఎస్ లా సెట్ పీజీ ఎల్ సెట్ 2020 ఫలితాల విడుదల..
హైదరాబాద్...
- మాసబ్ ట్యాంక్ లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి హాల్లో టీఎస్ లా సెట్ పీజీ ఎల్ సెట్ 2020 ఫలితాలు విడుదల చేసిన ఉన్నతవిద్యా మండలి చైర్మన్- పాపిరెడ్డి లా సెట్ కన్వీనర్ జేబీ రెడ్డి
-మొత్తం 30 262 మంది దరఖాస్తు
-21559 మంది హాజరు
-16572 మంది ఉత్తీర్ణత..
-76.87 శాతం ఉత్తీర్ణత..
-3ఇయర్స్ లా కోర్సు లో 15398 మంది హాజరు కాగా 12103 మంది ఉత్తీర్ణత
-5ఏళ్ల లా కోర్సులో 3973 మంది హాజరు కాగా 2477 మంది ఉత్తీర్ణత..
-పీజీ ఎల్ సెట్ లో 2188 హాజరు కాగా 1992 మంది ఉత్తీర్ణత..
- 6 Nov 2020 1:04 PM GMT
Peddapalli Updates: సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ నాయకుల అరెస్టు...
పెద్దపల్లిజిల్లా : సుల్తానాబాద్
- బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ గంగుల శ్రీనివాస్ మృతికి టిఆర్ఎస్ పార్టీ కారణమంటూ ఆందోళనకు దిగిన బిజెపి నాయకులు..
- అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు...
- 6 Nov 2020 12:57 PM GMT
Hyderabad Updates: హైదరాబాద్ లో క్రమంగా పెరుగుతోన్న నేరాలను అదపుచేయాలని బీజేపీ కోరుతోంది..
బీజేపీ మీడియా ప్రకటన,
కె.కృష్ణసాగర రావు,
బీజేపీముఖ్య అధికార ప్రతినిధి,
* హైదరాబాద్ నగరంలో డ్రగ్ అమ్మకందార్లను, పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడే వారిని, లైంగిక అఘాయిత్యాలకు పాల్పడే వారిని, క్రమంగా పెరుగుతోన్న ఈ తరహా నేరాలను అదపుచేయాలని బీజేపీ రాష్ట్ర డీజీపీని, ముగ్గురు కమిషనర్లనూ కోరుతోంది.
* వీరిలో చాలా మంది విదేశాలకు చెందినవారు, అక్రమంగా వచ్చినవారు. సోషల్ మీడియా వేదికగా యువతనూ, స్కూల్ కు వెళ్లే అబ్బాయిలు, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు.
* హైదరాబాద్ కి చెందిన పిల్లలు, టీనేజీ వారిని కాపాడటానికి, అలాంటి నేరస్తులపై నగర పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
* హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఈ యువతరాన్ని కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీలను కోరుతున్నాను.
- 6 Nov 2020 12:25 PM GMT
Srinivas Death Updates: శ్రీనివాస్ మృతికి సంతాపంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు..
నారాయణపేట జిల్లా :
-బీజేపీ పార్టీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్ మృతికి సంతాపంగా నారాయణపేట సత్యనారాయణ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ కార్యకర్తలు.
నాగర్ కర్నూల్ జిల్లా :
-బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్యకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కరూల్ పట్టణంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు.
- 6 Nov 2020 12:21 PM GMT
Hyderabad Updates: బోర్డు తిప్పేసిన ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ..
హైదరాబాదు..
-హైదరాబాదులో బోర్డు తిప్పేసిన DQ ఎంటర్టైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ (అనిమేషన్)
-కంపెనీ దివాలా తీసిందని ట్రిబ్యునల్ petition దాఖలు చేసిన డిక్యు ఎంటర్టైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ (అనిమేషన్)
-రోడ్డున పడ్డ 1400 మంది ఉద్యోగులు..
-గత ఎనిమిది నెలల నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించని సంస్థ..
-తమకు న్యాయం చేయాలంటూ పోలీసులు, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన ఉద్యోగులు..
-సంస్థపై సిసిఎస్ లో ఫిర్యాదు చేసిన ఉద్యోగులు..
-ఎండి తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని... తమకు న్యాయం చేయాలని డిమాండ్.
-రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఆ కంపెనీ ఉద్యోగులు ఫిర్యాదు
-ఇప్పటి వరకు ఒక్కొక్కరికి 14లక్షలు రావాలని తెలిపిన ఉద్యోగులు
-ఎండి పై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ లో పిర్యాదు చేసిన ఉద్యోగులు..
-తమ వేతనాలు అడిగితే వేధింపులకు , బెదిరింపులకు పాలుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఉద్యోగులు..
- 6 Nov 2020 12:08 PM GMT
Warangal Urban Updates: భీమదేవరపల్లి మండలం లో బీజేపీ కార్యకర్తల ధర్నా..
వరంగల్ అర్బన్ జిల్లా:
- భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో బీజేపీ కార్యకర్తల ధర్నా..
- బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్య కు నిరసనగా ఆందోళన .
- సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల యువత ధైర్యం కోల్పోతుందని ఆరోపిస్తూ ధర్నా.
- 6 Nov 2020 12:05 PM GMT
Karimnagar District Updates: హుజురాబాద్ నియోజకవర్గం లో మంత్రి ఈటెల రాజేందర్ పర్యటన...
కరీంనగర్ :
// ఇటీవల నియోజకవర్గం లో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న మంత్రి
// నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి
- 6 Nov 2020 11:58 AM GMT
Yadadri Updates: ఇసుక లోడ్ తో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపు తప్పి గోడకు ఢీ..తప్పిన ప్రమాదం..
యాదాద్రి:
* యాదాద్రి ఆలయ అభివృద్ధి లో పనులలో భాగంగా...
* దేవస్థాన మొదటి ఘాట్ రోడ్డు మలుపులో ఇసుక లోడ్ తో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపు తప్పి గోడకు ఢీ...
* తప్పిన ప్రమాదం..
- 6 Nov 2020 5:14 AM GMT
Hyderabad Updates: గంగుల శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొననున్న బండి సంజయ్...
హైదరాబాద్..
-బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి యాచారం మండలం తమ్మలోని గూడెం కు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
-నిన్న యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయిన బీజేపీ కార్యాకర్త గంగుల శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొననున్న బండి సంజయ్...
-బండి సంజయ్ వెంట భారీగా వెళ్తున్న బీజేపీ కార్యకర్తలు...
-నవంబర్ 1న బీజేపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్..
-58శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్ యశోదాలో చికిత్స..
-మూడు రోజుల పాటు వెంటిలేటర్ పైన చికిత్స తీసుకున్న శ్రీనివాస్ నిన్న రాత్రి మృతి..
-నిన్న రాత్రి పోస్టమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తరలించిన తరువాత నేరుగా అక్కడి నుండి యాచారం తరలించిన పోలీసులు...
-బీజేపీ రాష్ట్ర కార్యాలయం తో పాటు, శ్రీనివాస్ స్వగ్రామం తమ్మలోని గూడెం లో భారీగా మోహరించిన పోలీసులు...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire