Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 05 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ ఉ.07-10 వరకు తదుపరి చవితి | భరణి నక్షత్రం మ.01-22 వరకు తదుపరి కృత్తిక | వర్జ్యం: రా.02-32 నుంచి 04-17 వరకు | అమృత ఘడియలు ఉ. 08-30 నుంచి 09-48 వరకు | దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 0900 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 5 Oct 2020 1:42 PM GMT
Telangana updates: రాష్ట్రం లో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి..
# కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తున్న వివిధ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘాల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశం
# విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చిన మంత్రులు
#ప్రస్తుత సంక్షోభ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్న సలహాలు సూచనల ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటామని తెలిపిన మంత్రులు
#విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్ల జీతభత్యాల చెల్లింపులో యాజమాన్యాలు మరింత ఉదారంగా వ్యవహరించాలి
# గ్రామీణ ప్రాంత విద్యా సంస్థల బలోపేతానికి ప్రభుత్వ చర్యలు
# విద్యా కార్పొరేటీకరణ కు తాము వ్యతిరేకమని తెలిపిన మంత్రులు
# గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్య అందించేందుకు విద్యా సంస్థలు నెలకొల్పిన వారి పట్ల తమకు సానుకూల దృక్పథం ఉంటుందని తెలిపిన మంత్రులు
- 5 Oct 2020 1:38 PM GMT
Telangana updates: హత్రస ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది..
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి @ సత్యాగ్రహ దీక్ష...
-బిజెపి ప్రభత్వం నుండి ఇప్పటి వరకు ఎవరూ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు...
-పరామర్శించడానికి వెళ్ళిన రాహుల్ ,ప్రియాంక గాంధీ పట్ల యూపీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు..
-డిల్లీ , యూపీ బార్డర్ లో లాఠీ చార్జీ జరిగింది దానిని అడ్డుకోబోయిన ప్రియాంక గాంధీ పట్ల మగ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు..
- 5 Oct 2020 1:13 PM GMT
MLA seethakka: మోడీ ,యోగి పరిపాలన దుర్మార్గం గా ఉంది...
ఎమ్మెలే సీతక్క..
-త్యాగాల నేతలు ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ లు బాధల్లో ఉన్న వారిని పరామర్శించడానికి వెళ్తున్న వారిపై పోలీసుల వ్యవహార శైలి సరిగా లేదు...
-దళిత మహిళపై అఘాయిత్యం జరిగితే కనీసం వెళ్లి పరామర్శించ లేదు ..
-మోయిన బాద్ లో టీఆరెఎస్ నాయకుడు ఓ అమ్మాయి పై దాడి చేసి హత్య చేశాడు..
-ఆ అమ్మాయి కుటుంబానికి ఇంతవరకు ప్రభుత్వం బరోసా ఇవ్వలేదు..
-రాష్ట్రంలో డ్రగ్స్ క్లబ్స్ కు పెరుగాంచుతుంది, మహిళలకు రక్షణ లేకుండా పోయింది..
- 5 Oct 2020 12:59 PM GMT
Hyderabad updates: పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని వినతి: చెరుకు సుధాకర్ ..
హైదరాబాద్..
-టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ను కలిసిన తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ..
-వరంగల్ ,నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజవర్గం లో తాను పోటీ చేస్తున్నట్లు తెలిపిన చెరుకు సుధాకర్
- 5 Oct 2020 12:51 PM GMT
L. B. Nagar updates: ఐదుగురు నిందితులను రేమండ్ చేశారు రాచకొండ పోలీసులు...
ఎల్బీ నగర్...
మహేష్ భగవత్, రాచకొండ సీపీ..
-బీహార్ నుండి హైద్రాబాద్ కు బాల కార్మికులను తీసుకువచ్చి పని చేయిస్తున్న ముటాను అదుపులోకి తీసుకున్నారు..
-20 మంది చైల్డ్ లేబర్ తో గాజుల కంపెనీలో బలవంతంగా పని చేపిస్తున్నారు..
-ఐదుగురు నిర్వహకులను అరెస్ట్ చేసిన పోలీసులు...
-బయట నుండి తాళాలు వేసి..ఉదయం8 నుండి రాత్రి 11 గంటల వరకు పిల్లలతో పని చేపిస్తున్నారు..
- 5 Oct 2020 12:42 PM GMT
Hemanth case updates: ఈరోజు తో ముగిసిన లక్ష్మ రెడ్డి,యుగేందర్ రెడ్డి ల పోలీస్ కస్టడీ.....
హేమంత్ కేస్ అప్డేట్.....
మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు.....
-హేమంత్ మర్డర్ కేస్ లో పరారీలో ఉన్న ఎరుకాల కృష్ణ,మహమ్మద్ పాషా ( లడ్డు),రాజు ,సాయన్న ను అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు....
-ప్రేమ వివాహం నచ్చకపోవడంతో హేమంత్ ను చంపాల్సి వచ్చిందని కస్టడీలో ఉన్న లక్ష్మ రెడ్డి ఒప్పుకున్నాడు....
-మిగతా ఏడూ మందిని కూడా పోలీస్ కస్టడీ తీసుకొని విచారిస్తాం....
-గచ్చిబౌలి సిఐ శ్రీనివాస్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చిన కారణంగా ఈ కేస్ బాధ్యతలు గచ్చిబౌలి డిఐ కాస్ట్రో చూస్తారు....
-బెగారి సాయన్న పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రౌడి షీట్ ఉంది....
-అవంతిక రెడ్డి సొంత తమ్ముడు ఆశిష్ రెడ్డి పాత్ర ఇందులో ఇప్పటివరకు లేదని మా విచారణలో తేలింది....
-ఈ కేసులో మరింతగా దర్యాప్తు చెయ్యాల్సి ఉంది....
- 5 Oct 2020 12:35 PM GMT
Warangal Rural district updates: డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
వరంగల్ రూరల్ జిల్లా:
-రాయపర్తి మండలం బాలాజీనగర్ తండాలో 25 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
-పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఆయన సతీమణి డాక్టర్ లక్ష్మీ, తల్లిదండ్రులు బానోత్ కేవ్ లా నాయక్, బాజు బాయి లు
-ఎమ్మెల్యే సొంతూరు బాలాజీ నగర్ తండా లోని 25 డబుల్ బెడ్ రూం లకు ఒక్కో ఇంటికి రూ.50వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే
-శంకర్ నాయక్ తల్లిదండ్రులు
-ఎమ్మెల్యే శంకర్ నాయక్ కుటుంబాన్ని అభినందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- 5 Oct 2020 12:18 PM GMT
Gandhi bhavan updates: హత్రాస్ సంఘటన ఖండిస్తూ నిరసనగా కాంగ్రెస్ నేతల సత్యాగ్రహం...
గాంధీ భవన్..
-హత్రాస్ సంఘటన ఖండిస్తూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణి నిరసనగా కాంగ్రెస్ నేతల సత్యాగ్రహం...
-మహిళలకు రక్షణ కల్పించడంలో యూపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిజాలు దాచి తప్పులు కప్పి పుచ్చడానికి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్ష..
-బాధితులను ఓదార్చడానికి వెళ్తున్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పై దురుసుగా ప్రవర్తించడన్ని ఖండిస్తూ తెలంగాణ కాంగ్రెస్ సత్యాగ్రహం చేపట్టింది..
-సత్యాగ్రహ దీక్ష లో కూర్చున్న టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, విహెచ్ తదితర కాంగ్రెస్ నాయకులు భారీగా పాల్గొన్నారు...
- 5 Oct 2020 12:11 PM GMT
Hyderabad updates: మాదాపూర్ పీఎస్ లో షీ టీమ్ ఇన్స్పెక్టర్ సునీత పై కేసు నమోదు...
హైదరాబాద్..
-భూ కబ్జా చేస్తూ బెదిరింపు లకు పాల్పడిన మహిళా ఇన్స్పెక్టర్
-గతంలో కూడా భూ వివాదంలో కేసు నమోదు కావడంతో సస్పెండ్ కి గురైన ఇన్స్పెక్టర్
-తాజా గా మరో మారు కేసు నమోదు
-3 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడంతో పాటు బాధితులను బెదిరింపులకు గురిచేసినట్లు ఆరోపణలు
- 5 Oct 2020 12:06 PM GMT
GHMC Election updates: గుర్తింపు పొందిన పార్టీ లు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని కోరాయి...
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈవీఎంలు లేదా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలా అన్న దానిపై అన్ని రాజకీయ పార్టీల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం సేకరించింది.
#11గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ లు ఉండగా..
#8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తమ అభిప్రాయం తెలిపాయి..
#బీజేపీ మాత్రమే ఈవిఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరింది..
#2 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఎలాంటి అభిప్రాయం తెలపలేదు..
#పార్టీ గుర్తు లేని 39 రాజకీయ పార్టీలు ఉండగా..
#18 పార్టీ లు అభిప్రాయం చెప్పాయి..
#11పార్టీ లు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని కోరాయి..
#మొత్తం 50 పార్టీ లు ఉండగా...అందులో 26రాజకీయ పార్టీలు తమ అభిప్రాయం చెప్పగా..13పార్టీలు బ్యాలెట్ ,3పార్టీ లు ఈవిఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరాయి..
#వీవీ ప్యాడ్ ల తయారి కోసం ఈసిఐ ఢిల్లీ కి లేఖ రాసాం...రిప్లై కోసం ఎదురు చూస్తున్నాం...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire