ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 05ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం విదియ(రాత్రి 9-34 వరకు) తదుపరి తదియ; ధనిష్ఠ నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి శతభిష నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 5-04 నుంచి 6-47 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-౨౯
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 5 Aug 2020 4:43 PM GMT
కేబినెట్ నిర్ణయాలు
- తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టిఎస్ ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది.
- దీని వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశ్రమల శాఖను ఆదేశించారు.
- దీనిపై మంత్రి కెటి రామారావు ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమల శాఖ ముసాయిదా తయారు చేసింది.
- దీనిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించింది. తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలని కేబినెట్ అభిప్రాయపడింది.
- స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
- 5 Aug 2020 12:29 PM GMT
వరంగల్ అర్బన్:
కరోనా కు మందులు అంటూ అసత్య ప్రచారం చేసిన హన్మకొండ బలసముద్రంలోని హోమియోపతి డాక్టర్ వి ఎస్ రెడ్డి హాస్పిటల్ ను సీజ్ చేసిన జిల్లా అధికారులు డిప్యూటీ డిఎం& హెచ్ ఓ మదన్ మోహన్, ఆయుష్ రీజినల్ డైరెక్టర్ రవి నాయక్, సుబేధారి సిఐ అజయ్ లు
- 5 Aug 2020 11:42 AM GMT
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..
- వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, పశ్చిమబెంగాల్ లమధ్య తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది....
- దీనికి అనుబంధం గా 7.5కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది...
- దీని ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ ,ఈశాన్య తెలంగాణ జిల్లాలో,ఉత్తర కోస్తా లో ఈరోజు ,రేపు ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- రాగల మూడు రోజుల పాటు తెలంగాణ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- ఉత్తర,దక్షిణ కోస్తాలో ఈరోజు ,రేపు ఒకటి రెండు చోట్లా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- రాయలసీమ లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది...
- ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్లా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది...
- జూన్ 1 నుండి ఈరోజు వరకు నైరుతి రుతుపవనాలు కాలంలో తెలంగాణ లో సాధారణం కంటే 17 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది....
- ఇందులో అత్యధికం వా జోగులంబ జిల్లాలో 121 శాతం ,వనపర్తి లో 117 శాతం సాధారణం కన్నా అత్యధికంగా నమోదైంది. అత్యల్పం నిర్మల్ జిల్లాలో సాధారణం కన్నా 20 శాతం తక్కువగా నమోదైనది..
- కోస్తాంధ్ర లో సాధారణం కన్నా 29 శాతం ఎక్కువగా నమోదుకగా ఇందులో నెల్లూరు లో సాధారణం కన్నా 98 శాతం ఎక్కువగా నమోదయింది. శ్రీకాకుళం లో సాధారణ కన్నా 20 శాతం తక్కువగా నమోదైంది..
- రాయలసీమ లో సాధారణం కన్నా 126 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యధికం గా అనంతపురం లో 158 శాతం సాధారణం కన్నా అధికంగా నమోదైంది...
- 5 Aug 2020 11:11 AM GMT
సచివాలయం పై అసదుద్దీన్ వ్యాఖ్యలు
- తెలంగాణ రాష్ట్రం సచివాలయంలో లో కూల్చి వేసిన మసీదు ను అదే ప్రాంతంలో ప్రభుత్వంమే బేషరతుగా పునర్ నిర్మించాలి
- తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిసి ఈ విషయం చర్చిస్తాం.
- కూల్చి వేసిన ప్రాంతంలో ఎంత సమయంలో మసీదును పునర్ నిర్మిస్తారు , మాకు కచ్చితమైన తేదీ చెప్పాలి
- 5 Aug 2020 11:09 AM GMT
అర్ ఎస్ ఎస్ చీఫ్
- మోహన్ భగవత్ కి అయోధ్య లో ఏమి పని అని ప్రశ్నిస్తున్న సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుంటున్న అయ పార్టీలు సిగ్గుతో తలదించూ కోవాలి..
- కాశీ, మధుర లో ఎన్నో మసీదులు వున్నాయి..
- వీటిని సైతం కూల్చి మోది సర్కార్ లోక్ స లో చట్టాలు రూపొందించి
- ఆ ప్రాంతంలో హిందూ దేవాలయాలు రూపొందిస్తారు.
- 5 Aug 2020 11:05 AM GMT
అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ, ఎంఐఎం పార్టీ:
- అయోధ్య రామ మందిర నిర్మాణ భూమి పూజ జరిగింది.
- అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయడం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నం..
- ఒక వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారు.
- లౌకిక సూత్రానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణంచేసి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి హిందూత్వ వాదాన్ని చాటారు..
- రాజ్యాంగ ప్రమాణాన్ని ప్రధాని ఉల్లంఘించారు
- ఈ రోజు చరిత్రలో నిలిచి పోయింది. లౌకిక వాదాన్ని మోది అవమాన పరిచరు.
- మేము ఆయన మాటలను కండిస్తున్నాం
- మీ హిందూ వాదానికి కృతజ్ఞతలు, దేశ సమైక్యతను కాపాడాలంటే రామ మందిరం నిర్మాణ ద్వారా కాదు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి..
- 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ఓ క్రిమినల్స్ గుంపు ధ్వంసం చేశారు..
- దీనికి మేము, చింతిస్తున్నాము... బాధ పడుతున్నాము
- లౌకికత్వం రాజ్యాంగంలో దేశం ముఖ్యభాగమని, దానిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలని సూచిస్తున్నాము.
- 15 ఆగస్ట్ ఎర్ర కోట లో జెండా ఎగురవేసి మరోసారి స్వతంత్రం సమరయేదులను అవమాన పరుస్తున్నారు.
- అర్ ఎస్ ఎస్ చీఫ్ అయోధ్య లో ఏమి పని
- హిందూత్వ శక్తులు కొత్త భారతదేశాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు.
- బాబ్రీ మసీదు నిర్మాణం చేపట్టాల్సిందగా కోరుతున్నాం.
- లౌకిక పార్టీలతో కాంగ్రెస్ తో నా విన్నపం జాతీయ ఐక్యత, సాంస్కృతిక సమ్మేళనం, సోదరభావం లాంటి వ్యాఖ్యలెందుకు చేస్తున్నారు.
- చరిత్రాత్మక బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్ చేసిన కృషికి సిగ్గు పడుతున్నము.
- 5 Aug 2020 10:10 AM GMT
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీల వాసులుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
టీఎస్ హైకోర్టు..
- ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీల వాసులుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
- అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయన్న పిల్ పై హైకోర్టులో విచారణ
- విశ్రాంత ఉద్యోగి ఓ ఎం దేబరా పిల్ పై హైకోర్టు విచారణ
- కొందరు పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరతో భూమి కేటాయించిందన్న పిటిషనర్
- అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదన్న పిటిషనర్
- షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ప్రశ్నించిన హైకోర్టు
- అధిక బిల్లులు చెల్లించక పోతే మృతదేహం కూడా అప్పగించడం లేదన్న హైకోర్టు
- అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు
- లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని.. భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్య
- అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశము
- 5 Aug 2020 9:53 AM GMT
అదుపు తప్పిన బైక్ .. ఒకరికి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మల్హార్ మండలం మల్లారం గుట్ట సమీపంలో బైక్ అదుపు తప్పి పడి కాటారం మండలం మేడిపల్లి గ్రామ సర్పంచ్ రెడ్డి పోచయ్య (46) మృతి..
- 5 Aug 2020 9:50 AM GMT
ప్రగతిభవన్ లో ప్రారంభం అయిన కేబినెట్ సమావేశం.
ఈరోజు కేబినెట్ సమావేశం లో చర్చించే అంశాలు..
* కొత్త సెక్రటేరియట్ డిజైన్ కు ఆమోద ముద్ర.
* నియంత్రిత వ్యవసాయ విధానం అమలు పై సమీక్ష.
*రాష్ట్రంలో కరోనా పరిస్థితులు.
* కరోనా నేపథ్యంలో విద్య రంగం పై చర్చ.
* ఆయుష్ డాక్టర్ ల వయోపరిమితి పెంపు ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం.
*ఏపీ తో జల వివాదాలు అపెక్స్ కౌన్సిల్ అంశాలు చర్చ కు వచ్చే అవకాశం.
- 5 Aug 2020 9:48 AM GMT
ఐటీడీఏ పిఓ గౌతమ్ పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఏజన్సీ ప్రాంతంలో ఐటీడీఏ పిఓ పోట్రూ గౌతమ్ పర్యటన.
మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పొంగి పొర్లుతున్న వాగులను పరిశీలించంలిన ఐటీడీఏ పిఓ గౌతమ్
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire