Live Updates: ఈరోజు (04 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 04 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ పూర్తిగా | అశ్వని ఉ.10-48 వరకు తదుపరి భరణి | వర్జ్యం: ఉ..06-22 నుంచి 08-08 వరకు తిరిగి రాత్రి ౦9.26 నుంచి 11.22 వరకు | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం: సా.04-03 నుంచి 04-50 వరకు | రాహుకాలం: సా.04-30 నుంచి 06-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 4 Oct 2020 6:23 AM GMT
Visakha updates: NAD ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ..
విశాఖ జిల్లా..
-విశాఖ NAD ఫ్లైఓవర్ గోపాలపట్నం వైపు వెళ్లే మార్గాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ
-ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎం.పి ఎంవివి సత్యనారాయణ, జిల్లా అధికారులు.
- 4 Oct 2020 6:16 AM GMT
Amalapuram updates: డాక్టర్ పి ఎస్ శర్మ కు జాతీయస్థాయిలో TB నిర్మూలన కమిటీలో చోటు..
తూర్పు గోదావరి....
అమలాపురం....
-అమలాపురానికి చెందిన డాక్టర్ పి ఎస్ శర్మ కు జాతీయస్థాయిలో TB నిర్మూలన కమిటీలో చోటు..
-2025 నాటికి టీబీ నిర్మూలన లక్ష్యంగా నేషనల్ IMA ఆరుగురితో కమిటీ ఏర్పాటు..
-ఆ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి డాక్టర్ పి ఎస్ శర్మ కి చోటు..
-డాక్టర్ శర్మ ను అభినందించిన కీమ్స్ ఎండీ రవివర్మ.. డీన్ డాక్టర్ కామేశ్వరరావు
- 4 Oct 2020 6:10 AM GMT
Kakinada updates: కాండ్రకోట వద్ద కుప్ప కూలిన బ్రిటీష్ కాలం నాటి వంతెన..
తూర్పుగోదావరి :
-పెద్దాపురం మం. కాండ్రకోట వద్ద ఏలేరు వరద ఉధృతికి డబ్బా కాలువ పై కుప్ప కూలిన బ్రిటీష్ కాలం నాటి వంతెన
-కాండ్రకోట - తూర్పుపాకల మధ్య నిలిచిన రాకపోకలు..
-కాండ్రకోట, తూర్పుపాకల, తిమ్మాపురం, కట్టమూరు గ్రామాల రైతులు వినియోగించే వంతెన కూలిపోవడంతో అవస్థలు పడుతోన్న రైతులు..
- 4 Oct 2020 6:07 AM GMT
Vizianagaram updates: జిల్లా గిరిపుత్రులకు తప్పని డోలీ కష్టాలు..
విజయనగరం...
-గర్బిణి మహిళను వైద్యం కోసం 11 కిలోమీటర్ల డోలీలో తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు
-శృంగవరపుకోట మండలం ధారపర్తి పంచాయతి పొర్లు గామానికి చెందిన చంద్రమ్మ అనే గర్బిణి మహిళకు పురిటినొప్పులు రావడంతో గ్రామంలో వైద్య సదుపాయం లేకపోవడంతో డోలిలో దబ్బగుంట వరకు తీసుకు వచ్చిన బందువులు
-దబ్బగుంట నుండి 108లో శృంగవరపుకోట హాస్పిటల్ కు తరలింపు
- 4 Oct 2020 6:02 AM GMT
East Godavari updates: పెద్దాపురం-రాజానగరం ఏడిబి రోడ్డులో 1500 లిటర్లు డీజిల్ ట్యాంక్ లారీ బోల్తా..
తూర్పుగోదావరి:
-సూరంపాలెం వద్ద జరిగిన ఘటన
-లారీ బోల్తా పడడంతో కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్
-వర్షం కారణంగా జారుడు వల్ల అదుపుతప్పి బోల్తా పడిన ట్యాంకర్
- 4 Oct 2020 3:59 AM GMT
National updates: ఆందోళనకరంగా ట్రంప్ ఆరోగ్య పరిస్థితి..
జాతీయం..
-కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరం.
-కరోనా పాజిటివ్‌గా తేలిన రోజే ట్రంప్‌కు కృత్రిమ శ్వాస కల్పించినట్లు వైట్‌హౌస్ వర్గాల సమాచారం.
-మిలటరీ ఆస్పత్రికి తరలించడానికి ముందే అధ్యక్ష భవనం వైద్యులు ట్రంప్‌నకు ఆక్సిజన్‌తో శ్వాస కల్పించారని వార్తలు
-రాబోయే 48 గంటల అత్యంత కీలమని వైద్యులు ప్రకటన.
-74 ఏళ్ల వయసు గల ట్రంప్‌కు స్థూలకాయం, కొలెస్టరాల్ ఎక్కువగా ఉన్నాయని వైద్యులు ధృవీకరణ.
-ప్రస్తుతం ఆయనకు రెమ్డెసీవీర్తో పాటు యాంటీబాడీలతో కూడిన వైద్యాన్ని అందిస్తున్న వైద్యులు
- 4 Oct 2020 3:24 AM GMT
Vijayawada updates: పట్టాభి కార్ అద్దాలు పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు...
విజయవాడ.
-టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కార్ అద్దాలు పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు
-ఇంటి బయట పెట్టిన కార్ ముందు, వెనుక అద్దాలు పగలగొట్టి న దుండగులు
-సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
- 4 Oct 2020 3:20 AM GMT
Vizianagaram updates: పార్వతీపురంలో భారీగా పట్టుబడ్డ నాటుసారా...
విజయనగరం ..
-పార్వతీపురం రెల్లివీధిలో కాటన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు భారీగా పట్టుబడ్డ నాటుసారా
-650లీటర్ల నాటుసారా,9 బైక్ లు సీజ్, నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- 4 Oct 2020 3:15 AM GMT
Somasila Dam updates: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం...
నెల్లూరు :-
-- ఇన్ ఫ్లో 40వేల క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 29,736 క్యూసెక్కు లు.
-- ప్రస్తుత నీటి మట్టం 74.14 టీఎంసీలు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు.
- 4 Oct 2020 3:02 AM GMT
Srisailam Dam updates: శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద..
కర్నూలు జిల్లా...
-1 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
-ఇన్ ఫ్లో : 55,246 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 63,374 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
-ప్రస్తుతం : 884.70 అడుగులు
-పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
-ప్రస్తుతం: 213.8824 టీఎంసీలు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire