Live Updates: ఈరోజు (04 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 04 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి రా.1-45 తదుపరి పంచమి | మృగశిర నక్షత్రం రా.2-36 తదుపరి
ఆర్ద్ర | వర్జ్యం ఉ.6-54 నుంచి 8-37 వరకు | అమృత ఘడియలు సా.5-11 నుంచి 6-54 వరకు | దుర్ముహూర్తం ఉ.11-22 నుంచి 12-07 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-౨౬
తాజావార్తలు
Live Updates
- 4 Nov 2020 10:59 AM GMT
Warangal Urban Updates: కాళోజి ఆరోగ్య విశ్వావిద్యాలయం విసి కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం..
వరంగల్ అర్బన్:
-కాళోజి ఆరోగ్య విశ్వావిద్యాలయం
-కాళోజి హెల్త్ యూనివర్సిటీ లో ఎంబీబీఎస్, బి డి ఎస్ అడ్మిషన్లు ప్రారంభం..
-ఇప్పటి వరకు 6వేల మంది రిజిస్ట్రేషన్స్...
-నిట్ ర్యాంకు ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు...
-రాష్ట్ర వ్యాప్తంగా 4800 సీట్ల...
-ఈడబ్ల్యుఎస్ 190 సీట్లు..
-గవర్నమెంట్ కాలేజీలల్లో 1500 సీట్లు... ప్రయివేట్ కాలేజీలల్లో 2750 సీట్లు...
-మైనార్టీ కాలేజీలల్లో 550 సీట్లు... కొత్తగా మరో కాలేజీ..
-13 డెంటల్ కాలేజీలలో 1340 సీట్లు..
-వెబ్ ఆప్షన్లు ద్వారా సీట్ల కేటాయింపు...
-కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్..
-కాలేజ్ స్టాట్ అయిన తరువాత ఫిజికల్ వెరిఫికేషన్...
-సర్టిఫికెట్ అప్లోడ్ చేయకపోతే నాట్ క్వాలిఫైడ్..
-కరోనాను బట్టి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకే క్లాస్స్ స్టార్ట్...
- 4 Nov 2020 5:40 AM GMT
CBI Court: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణ..
సీబీఐ కోర్టు....
-జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడుల చార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలన్న జగన్ డిశ్చార్జి పిటిషన్ పై నేడు కొనసాగునున్న వాదనలుCBI
-గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసు విచారణ నేడు విచారణ...
- 4 Nov 2020 5:37 AM GMT
Nizamabad Updates: చలో ఆర్మూర్ మహా ధర్నాకు భారీ బందోబస్తు..
నిజామాబాద్ జిల్లా..
-రైతులు ఆందోళన చేసిన సమయస్ఫూర్తి కోల్పో వద్దని పోలీస్ సిబ్బందికి సూచించిన ఆర్మూర్ ఏ సి పి రఘు
-3 ఏ సి పి, 9 సిఐలు, 8ఎస్ ఐ, ఏ ఎస్ ఐ లతో కలిపి 300 మంది సిబ్బందితో బందోబస్తు
- 4 Nov 2020 5:36 AM GMT
International Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయానికి చేరువలో బైడెన్!
అంతర్జాతీయం..
- డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్.. ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఆధిక్యం
- ఇప్పటి వరకు బైడెన్‌కు 209 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్‌నకు 112 ఓట్లు
- బైడెన్ మ్యాజిక్ ఫిగర్ అందుకోవటానికి ఇంకా 61 ఓట్లు మాత్రమే కావాల్సి ఉంది.
- 4 Nov 2020 5:32 AM GMT
Nalgonda Updates: చౌటుప్పల్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలు!
నల్గొండ జిల్లా..
-చౌటుప్పల్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలు మనిక్కమ్ ఠాగూర్, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్..
-ఏపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మస్తాన్ వలి కుమారుడు రాత్రి చౌటుప్పల్ వద్ద రోడ్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
-సంఘటనను పరిశీలించి మస్తాన్ వలి ని పరామర్శించేందుకు చౌటుప్పల్ బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు.
- 4 Nov 2020 5:14 AM GMT
Kamareddy Updates: విషాదం గా ముగిసిన చిన్నారి సౌమ్య అదృశ్యం..
కామారెడ్డి :
-ఎల్లా రెడ్డి మండలం మత్త మాల నిజం సాగర్ బాక్ వాటర్ ప్రాంతం లో బయట పడ్డ సౌమ్య మృత దేహం.
-అపహరించి చిన్నారిని హత్య చేసారా అనే కోణం లో పోలీసుల దర్యాప్తు
-ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యం అయిన రెండేళ్ల చిన్నారి సౌమ్య.
- 4 Nov 2020 5:10 AM GMT
Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-4 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 98,60 మీటర్లు
-ఇన్ ఫ్లో 22,270 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 9,670 క్యూసెక్కులు
- 4 Nov 2020 5:02 AM GMT
Nizamabad Updates: దర్పల్లి మండలం దుబ్బాక రామాలయం లో చోరీ..
నిజామాబాద్ :
-హుండీ డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు.
-ఆలయ గేట్ తాళాలు పగులగొట్టి చొరబడిన దొంగలు, విచారణ చేపట్టిన పోలీసులు.
- 4 Nov 2020 5:00 AM GMT
Kamareddy Updates: మిస్టరీ గా మారిన రెండేళ్ల చిన్నారి సౌమ్య అదృశ్యం!
కామారెడ్డి :
-24 గంటలు గడుస్తున్నా.. దొరకని ఆచూకీ.
-ఎల్లా రెడ్డి మండలం మత్త మాల లో నిన్న ఆడుకుంటూ అదృశ్య మైన చిన్నారి
-సౌమ్య జాడ కోసం గాలిస్తున్న పోలీసులు.
-పాపను ఎత్తుకెళ్లారా.. కిడ్నప్ చేశారా? అనే కోణం లో దర్యాప్తు.
- 4 Nov 2020 4:57 AM GMT
Warangal Rural Updates: నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలో విషాదం..
వరంగల్ రూరల్ జిల్లా:
-నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన ఊడుగుల రాజయ్య వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య.
-ఎక్సైజ్ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటు బంధువుల ఆరోపణ.
-ఊడుగుల రాజయ్య అనే వ్యక్తి బెల్టుషాపు నిర్వాహకుడు..
-లాక్ డౌన్ సమయంలో ఊడుగుల రాజయ్య కు చెందిన 70,000 రూపాయల విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిఐ శశికుమారి..
-స్వాధీన పరచుకొన్న మద్యం బాటిళ్లను తిరిగి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అని కుటుంబ సభ్యుల ఆరోపణ..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire