Live Updates: ఈరోజు (04 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 04 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి రా.1-45 తదుపరి పంచమి | మృగశిర నక్షత్రం రా.2-36 తదుపరి
ఆర్ద్ర | వర్జ్యం ఉ.6-54 నుంచి 8-37 వరకు | అమృత ఘడియలు సా.5-11 నుంచి 6-54 వరకు | దుర్ముహూర్తం ఉ.11-22 నుంచి 12-07 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-౨౬
తాజావార్తలు
Live Updates
- 4 Nov 2020 2:54 PM GMT
Indira Bhavan Malkajgiri Updates: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ డివిజన్ అధ్యక్షులతో సమావేశం...
- ఇందిరభవన్ లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ డివిజన్ అధ్యక్షులతో సమావేశం ప్రారంభం..
- పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ కుసుమ కుమార్, డీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్.
- 4 Nov 2020 2:50 PM GMT
Kishanreddy Comments: కరోన వల్ల చిన్నవ్యాపారస్తులు చితికిపోయారు..
- ఖైరతాబాద్ చింతల్ బస్తీలో పీఎం స్వనిది కింద స్ట్రీట్ వెనడర్స్ కు గుర్తింపు కార్డులు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,హాజరైన ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచెంద్రారెడ్డి.
- కిషన్ రెడ్డి..కేంద్ర మంత్రి.
- చిన్న వ్యాపారస్తుల కష్టాలు మోడీ గారికి తెలుసు కాబట్టే స్ట్రీట్ వెండర్స్ స్వనిధి పథకం పెట్టారు.
- నేడు గుర్తింపు కార్డులు పొందిన ప్రతి ఒక్కరికి 10,000 ఆర్థిక రుణ సాయం అందుతుంది.
- వ్యాక్సిన్ వచ్చే వరకూ మాస్కులు శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి.
- చిన్నపిల్లలను వృద్ధులను కరోనా నుంచి కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉంది.
- స్వనిది కింద 10వేలు రుణ సాయాన్ని పొంది, తిరిగి కట్టిన వాళ్లకు 30 వేల వరకు ఆర్థిక సాయం అందుతుంది.
- 4 Nov 2020 2:42 PM GMT
Hyderabad Updates: నకిలీ పులి చర్మం అమ్మిన యువకుడు అరెస్ట్...
హైదరాబాద్..
- నకిలీ పులి చర్మం అమ్ముతున్న షరీఫ్ అనే వ్యక్తి నీ అరెస్ట్ చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు..
- ఒరిజినల్ పులి చర్మం అని నమ్మించి 5 లక్షలకు నకిలీ పులి చర్మం అమ్మిన షరీఫ్..
- షరీఫ్ ను లంగర్ హౌస్ వద్ద అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు...
- 4 Nov 2020 1:58 PM GMT
Telangana Updates: విజయశాంతి ని బుజ్జగించడానికి రంగంలో దిగిన కాంగ్రెస్ అధిష్టానం...
* కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ని బుజ్జగించడానికి రంగంలో దిగిన కాంగ్రెస్ అధిష్టానం.
* పార్టీ సీనియర్లు ఎవరులేకుండానే విజయశాంతి తో భేటీ అయిన మనిక్కం.
* ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మనిక్కం ఠాగూర్ సాయంత్రం విజయశాంతి తో భేటీ.
* దాదాపు గంటపాటు విజయశాంతి తో భేటీ అయిన మనిక్కం ఠగూర్.
* కాంగ్రెస్ పార్టీలో జరిగిన అవమానం గురించి మనిక్కం ఠాగూర్ కు రాములమ్మ వివరించినట్లు సమాచారం.
- 4 Nov 2020 1:13 PM GMT
Hyderabad Updates: గ్రేటర్ లో బీసీ లకు సిట్లు ఇవ్వాలని ప్రతిపాదించిన జీవన్ రెడ్డి...
హైదరాబాద్...
- గ్రేటర్ లో బీసీ లకు 50 శాతం సిట్లు ఇవ్వాలని ప్రతిపాదించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
- మద్దతు పలికిన జానారెడ్డి, చిన్నారెడ్డి
- రెడ్డి లు అయినా... బీసీ లకు 50 శాతం సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించిన జీవన్ రెడ్డి. జనారెడ్డిలకు అభినందనలు తెలిపిన హన్మంత రావు
- 4 Nov 2020 1:09 PM GMT
Telangana Updates: పీసీసీ కోర్ కమిటీలో కీలక నిర్ణయాలు...
- 50 శాతం సీట్లు బీసీ లకు ఇవ్వాలని నిర్ణయం
- బీసీ రిజర్వేషన్ పై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం
- న్యాయ పోరాటం...రాజకీయ పోరాటం
- 7 న మహిళలు..దళితులపై దాడులకు నిరసన గా ధర్నా
- 11న ఖమ్మం లో ట్రాక్టర్లు తో రైతు ర్యాలీ
- 12 న జిల్లా కేంద్రాల్లో రైతు కోసం దీక్ష .. రైతు సమస్యలపై
- గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేసే అభ్యర్థుల వద్ద
- జనరల్ సీట్లలో పోటీ చేసే వారికి 10 వేలు
- నాన్ జనరల్ 5 వేలు చెక్కులు రూపంలో పార్టీకి ఇవ్వాలి.
- సన్నరకం వడ్లకు 2500 మద్దతు ధర ఇవ్వాలి
- రైతు సమస్యలపై ఉద్యమానికి శాశ్వత కమిటీ వేయాలని నిర్ణయం
- 4 Nov 2020 11:24 AM GMT
Mulugu District Updates: మేడారంలోని సమ్మక్క-సారలమ్మ లను దర్షించుకున్న మాజీ మంత్రి..
ములుగు జిల్లా..
-తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ లను దర్షించుకున్న మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు, సినీ హాస్యనటుడు బాబుమోహన్.
-గిరిజన సాంప్రదాయం ప్రకారం ఆలయ పూజారులు ఆయనకు స్వాగతం పలికారు.
-దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అధిక మెజారిటీతో గెలవాలని తల్లులను మొక్కకున్నట్లు తెలిపిన బాబుమోహన్.
- 4 Nov 2020 11:22 AM GMT
Bhadradri Kothagudem Updates: అమరవీరుల స్మారక స్థూపన్ని ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా:
కొత్తగూడెం...
-ప్రగతి మైదానంలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపన్ని ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
-పాల్వంచ నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని పరిశీలించిన రాష్ట్ర రోడ్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..
-ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి , ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్,......
- 4 Nov 2020 11:09 AM GMT
Sangareddy district Updates: జహీరాబాద్ చెరుకు రైతుల సమస్య పరిష్కరించిన మంత్రి హరీష్ రావు..
జహీరాబాద్..
-10,000 మంది రైతులకు ఊరట
-జహీరాబాద్ ప్రాంతంలో భారీగా చెరుకు సాగు
-రైతులతో అగ్రిమెంట్ చేసుకోని ట్రైడెంట్ షుగర్ పరిశ్రమ
-ఆ ప్రాంత చెరుకును సంగారెడ్డి గణపతి షుగర్స్‌కు తరలించాలని నిర్ణయం
-అదే సమయంలో ఈ ప్రాంత రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం
-సంగారెడ్డి రైతులకు చెల్లించే ధరనే జహీరాబాద్ ప్రాంత రైతులకూ వర్తింపజేయాలని తెలిపిన మంత్రి
-ట్రైడెంట్ పరిశ్రమ చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని ఆదేశం
-లేదంటే చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిక
-రైతులకు రావాల్సిన బకాయిలు అణాపైసాతో చెల్లించేలా చర్య తీసుకుంటాం: మంత్రి హరీష్ రావు
-రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- 4 Nov 2020 11:06 AM GMT
Hyderabad Updates: ఆటో డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..
హైదరాబాద్:
- ఆటో డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి మంత్రి కె.టి.ఆర్. బందువులమని బెదిరింపులు..
- ఎల్బీ నగర్ లో నిన్న అర్ధరాత్రి ఆటో డ్రైవర్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి...
- ఎల్బీనగర్ లోని సితారలో జరిగిన ఫంక్షన్ కు వచ్చిన కొంత మంది పక్కనే ఉన్న ఆటోలు, సుమోలపై బీర్ బాటిల్స్ పెట్టి తాగుతుండగా
- ఇదేంటని అడిగిన ఆటో డ్రైవర్ల పై దాడి రాము కెటిఆర్,కన్నారావు మనుషులమని తమను ఏ పోలీస్ ఎం చేయలేదని బెదిరింపులు
- పోలీస్ స్టేషన్ లో బాధితుల ఫిర్యాదు.
- ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire