Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 03 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ: తె.05-06 వరకు తదుపరి తదియ | రేవతి ఉ.08-11 వరకు తదుపరి అశ్వని | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: రా.02-49 నుంచి 04-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-54 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 3 Oct 2020 12:47 PM GMT
కృష్ణాజిల్లా
గన్నవరంలో ఉద్రిక్తత
మూడు గంటలుగా నియోజకవర్గంలో హైడ్రామా
కాకులపాడులో మొదలైన ఎమ్మెల్యే వంశీ, వైసీపీ నేత దుట్టా వర్గాల మధ్య బాహాబాహీ
రాళ్లు రువ్వుకోవటంతో ఉద్రిక్తత
కాకులపాడు నుంచి గన్నవరం
దండ గుంట్ల మీదుగా వెళ్లనున్న ఎమ్మెల్యే వంశీ
దండి గుంట్ల లో ఎమ్మెల్యే వంశీ ఫ్లెక్సీ లు చించివేత
వంశీ వచ్చే సమయానికి ఫ్లెక్సీ లు తగలబెట్టే యోచనలో దుట్టా వర్గం
పోలీసుల మోహరింపు
ఇంకా కాకులపాడులోనే ఎమ్మెల్యే వంశీ
- 3 Oct 2020 12:47 PM GMT
శ్రీకాకుళం జిల్లా..
HMTV తో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు..
ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి..
ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా అని ప్రజలు అసహ్యించుకుంటున్నారు..
వైసిపి నాయకుల వ్యాఖ్యలు, చేష్టలు, తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వ్యవస్థలను నాశనం చేసేలా ఉన్నాయి..
ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది..
ఖచ్చితంగా త్వరలోనే ప్రజలు వీళ్ళకి గుణపాఠం చెబుతారు..
- 3 Oct 2020 12:46 PM GMT
కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి షెకావత్ ను శాలువాతో సత్కరించిన గౌతం రెడ్డి
కేంద్ర మంత్రికి వీడ్కోలు పలికిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి
- 3 Oct 2020 12:46 PM GMT
శ్రీకాకుళం జిల్లా..
టిడిపి నాయకులను పోలీస్ స్టేషన్లోకి అనుమతించని పోలీసులు..
కరోనా దృష్ట్యా ఫిర్యాదు చేసేందుకు ఒక్కరినే అనుమతిస్తామని చెప్తున్నా పోలీసులు..
ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను స్టేషన్ లోనికి అనుమతించాలని డిమాండ్..
పోలీసులకి టిడిపి నాయకులకు మధ్య వాగ్వాదం..
పోలీస్ స్టేషన్ బయట బైఠాయించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూనరవి, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ..
- 3 Oct 2020 12:45 PM GMT
విశాఖ..
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కామెంట్స్
సబ్బం హరి మూడు కోట్ల విలువైన స్థలం ఆక్రమించారు.
పార్కు స్థలం కబ్జా చేస్తే చర్యలు తీసుకోవడం తప్పా.
ఓ కబ్జా కోరు సబ్బం హరి ....కాదు.... పబ్బం హరి.....
సబ్బం హరి వైఎస్సార్సీపీని , నాయకులు,విమర్శిస్తే మూల్యం చెల్లించుకోవడం తప్పదు.
జివిఎంసికీ చెందిన 206 గజాల స్ధలమే కాకుండా. జివిఎసి పార్కు స్ధలం కూడా ఆక్రమించారు.
- 3 Oct 2020 12:45 PM GMT
కడప :
కడప విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరిన సిఎం జగన్
వీడ్కొలు పలికిన ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా నాయకులు, అదికారులు
- 3 Oct 2020 12:44 PM GMT
విశాఖ
మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్
మాజీ పార్లమెంట్ సభ్యులు,మాజీ మేయర్ సబ్బం హారి ప్రభుత్వాన్నే విమర్శించడం పనిగా పెట్టుకున్నారు.
పార్కు స్థలాన్ని కబ్డా చేశారు. అధికార దర్పంతో ఇప్పటి వరకు నెట్టికొచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సబ్బం హరి వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాము.
విధి రౌడీలాగ పచ్చి భూతులు మాట్లాడుతున్నారు.
రౌడీయిజం మాకు కూడా చెయ్యడం వచ్చు.
మా ప్రభుత్వానికి ఎవ్వరిమీద కక్ష సాధించాలని లేదు.
అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షణంగా తొలిగిస్తాం.
చట్టాల్లో ఉన్న లోసుగులు వలన భూకబ్జాదారులు కోర్టులకు వెళ్ళి స్టే లు తీసుకువస్తున్నారు.
- 3 Oct 2020 12:44 PM GMT
విశాఖ
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ బూతులు మాట్లాడటం దారుణం... ఆయన వాడిన పదాలు
పత్రికలు వారు రాయడానికే అహస్య పడుతున్నారు...
విలేకరులకు పంపిన వీడియోలో మాజీ మంత్రి
అయ్యన్న
ఈ విధంగా బూతులు మాట్లాడే సంస్కృతి మనకు లేదు. ఈ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సామాన్య కార్యకర్తలు బూతులు తిట్టడం రివాజుగా మారింది...
ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ అడిగినట్టు ప్రభుత్వానికి దమ్ముంటే విశాఖ రాజధాని మీద ఎన్నికలకు వెళ్లేందుకు
మేము సిద్ధమే...మీరు సిద్ధమేనా?
దమ్ముంటే ఎంపీ చేత రాజీనామా చేయించండి...
విశాఖ ప్రజలు ఎవ్వరూ రాజధాని కావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే రౌడీలు, అడ్డపంచె
నాయకులు దౌర్జన్యం చేసి భూములు లాక్కుంటున్నారు..
రాజధాని అయితే ఇంకా దౌర్జన్యం పెరుగుతుందని ఇఫ్పటికే విశాఖ ప్రజలు భయంతో ఉన్నారు.
విశాఖ రాజధాని కావాలా? అమరావతి కావాలా? విశాఖ ప్రజలనే అడుగుదాం. మీరు సిద్దమైతే మేమూ రెడీ...
- 3 Oct 2020 12:43 PM GMT
విజయనగరం బ్రేకింగ్
గంట్యాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో 20 మంది
విద్యార్థులకు కరోనా పాజిటివ్
గత నెల 30న గంట్యాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 9-10 తరగతుల విద్యార్థులకు కరోనా పరీక్షలు
పరీక్షల్లో 20 మందికి పాజిటివ్ వచ్చినట్లు డీఈవో కి లేఖ రాసిన పాఠశాల ప్రధానోపాధ్యా యుడు
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
- 3 Oct 2020 12:43 PM GMT
తూర్పుగోదావరి జిల్లా.
విఆర్ పురం మం. పులుసు మామిడి లో కాలం చెల్లిన స్వీట్స్ తిని అస్వస్థతకు గురైన ఘటన పై ఆరా తీసిన ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని
అస్వస్థతకు గురైన 12మందిలో 11మంది సంపూర్ణ ఆరోగ్యంతో రేఖపల్లి ఏరియా హాస్పిటల్ నుండి డీఛార్జి.....
మరో చిన్న పాప భద్రాచలం హాస్పిటల్ లో చికిత్స
పులుసు మామిడి గ్రామంలో మెడికల్ క్యాంపు...
కాలం చేల్లిన స్వీట్స్ విక్రయించిన కిరాణా షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను మంత్రి ఆళ్ల నాని గారు....
ఈ ఘటనపై కలెక్టర్ మురళీధర్ రెడ్డి జిల్లా,డిఎంహెచ్ఓ డాక్టర్ గౌరీశ్వర రావులతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని .
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire