Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 03 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ రా.12-36 తదుపరి చవితి | రోహిణి నక్షత్రం రా.12-55 తదుపరి మృగశిర | వర్జ్యం సా.4-13 నుంచి 5-57 వరకు | అమృత ఘడియలు రా.9-26 నుంచి 11-10 వరకు | దుర్ముహూర్తం ఉ.8-19 నుంచి 9-05 వరకు తిరిగి రా.10-28 నుంచి 11-19 వరకు | రాహుకాలం మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 3 Nov 2020 7:25 AM GMT
విజయవాడ
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి
- 3 Nov 2020 7:25 AM GMT
అమరావతి
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎన్నికల సంఘానికి నిధుల విడుదలపై ప్రభుత్వం సహకరించడంలేదని నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వెల్లడించిన హైకోర్టు
ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించడంలేదన్న హైకోర్టు
ఈసీ ఇచ్చిన వినతులపై ప్రభుత్వం స్పందించకుండా బాధ్యతారాహి త్యంగా వ్యవహరిస్తోందన్న హైకోర్టు
తాము తొలగించిన వ్యక్తి తిరిగి ఈసీగా రావటంతో ప్రభుత్వం నాన్ కో ఆపరేటింగ్ గా వ్యవహరిస్తోందన్న న్యాయ స్థానం
ఇది సరికాదన్న హైకోర్టు
ప్రభుత్వాలు మారుతాయి తప్ప రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ ఉంటాయన్న హైకోర్టు
రాజ్యాంగ బద్ధ సంస్థలను కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందన్న హైకోర్టు
ఎన్నికల సంఘం 3 రోజుల్లోగా ప్రభుత్వానికి సవివర వినతి పత్రం సమర్పించాలని ఆదేశం
ప్రభుత్వం దీన్ని పరిశీలించి ప్రభుత్వం ఏం చేసిందో నివేదిక రూపంలో 15 రోజుల్లోగా హైకోర్టుకి సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం
మాజీ జస్టిస్ కనగరాజ్ ఫీజు చెల్లింపుల విషయంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
కనగరాజ్ తన పదవికి సంబంధించి అద్వకేట్ ను నియమించుకుంటే ఆయనే న్యాయవాదికి సొంత చెల్లింపులు చేసుకోవాలన్న హైకోర్టు
కనగరాజ్ ఇంటి కోసం 20 లక్షలు, ఫర్నిచర్ కోసం కేటాయించిన 15 లక్షలు ఇవ్వాలా వద్దా అనేది ఈసీ మరోసారి పరిశీలించాలన్న హైకోర్టు
కనగరాజ్ న్యాయవాది కోసం పెట్టిన ఖర్చు వివరాలు ప్రజలకు తెలియాలని, ఇదంతా ప్రజలకు చెందిన సొమ్మన్న హైకోర్టు
- 3 Nov 2020 7:25 AM GMT
ప.గో.జిల్లా..ఏలూరు లోని బిసి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరక్టర్ల అభినంద సభ...
హాజరైన మంత్రులు ఆళ్లనాని,తానేటి వనితా, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బాయ చౌదరి, జీయస్ నాయుడు,ఏలీజా,కారుమూరి నాగేశ్వరరావు పుప్పాల వాసుబాబు,తల్లారి వెంకట్రావు,ముదునూరి ప్రసాదరాజు, ఎంపీ మార్గాని భరత్..డిసిఎంస్ చైర్మన్ యడ్ల తాతాజీ, డిసిసిబి చైర్మన్ కవూరు శ్రీనివాస్,
జిల్లాకు చెందిన కార్పొరేషన్ చైర్మన్లు
గుబ్బల తమ్మయ్య, ఇళ్లభాస్కరరావు,పేండ్ర వీరన్న,అనంతలక్ష్మి.
- 3 Nov 2020 7:24 AM GMT
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు..
వరుపుల రాజా తలపెట్టిన పాదయాత్రను ఉత్తరకంచి వద్ద అడ్డుకున్న పోలీసులు....
పర్మిషన్ వున్నా అరెస్ట్ చేయడం పై ఆగ్రహించిన TDP శ్రేణులు...
పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట.
- 3 Nov 2020 5:22 AM GMT
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి...
తిరుమల
- నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే
- శ్రీవారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
- జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినరోజు నుండే అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశారు.
- సీఎం జగన్ పరిపాలనకు ఎలాంటి దుష్టశక్తులు అడ్డురాకుండా ఆశిర్వదించాలని స్వామివారిని ప్రార్థించా.
- 3 Nov 2020 5:16 AM GMT
Amaravati Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం...
అమరావతి
// ఈ నెల మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం.
// ఈ నెల 5న జరగనున్న కేబినెట్ భేటీలో సమావేశాల నిర్వహణ తేదీలు ఖరారు
- 3 Nov 2020 4:54 AM GMT
Polavaram Updates: ఐ. టీ. డీ. ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం...
పశ్చిమ గోదావరి జిల్లా
పోలవరం..
* కోవిడ్ ముంపు బాధితులకు తరలి వెళ్తున్న నిత్యావసరాల వాహనాలను,జెండా ఊపి ప్రారంభించిన డిఎస్పి వెంకటేశ్వరరావు.
* పాపికొండలు కొండారెడ్డి గిరిజన గ్రామాల్లో సిరివాక ,తెల్లదిబ్బలు టేకూరు, చీడూరు,కొత్త మామిదిగొంది, గ్రామాల్లో కోవిడ్ భాధితులకు సుమారుగా 250 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ..
* ఐటీడీఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జి.అనిల్ కుమార్.
- 3 Nov 2020 4:19 AM GMT
Tadepalli Updates: డిజిపి గౌతమ్ సవాంగ్ రాక!
తాడేపల్లి..
-గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ మధ్యాహ్నం 12 గంటలకు రానున్న డీజీపీ
-ఆపరేషన్ ముష్కాన్ లో భాగంగా ఒక బాలికను దత్తత తీసుకోనున్న డీజీపీ
- 3 Nov 2020 4:15 AM GMT
Amaravati Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..
అమరావతి..
-నిన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీతో జరిగిన అధికారుల సమావేశ వివరాలు వెల్లడించాలి.
-జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడిన పోలవరం నిర్మాణంలో కేంద్రం మెలికలు పెడుతోంది.
-పోలవరం ప్రాజెక్టు విషయమై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.
-పోలవరం సాధనకై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళాలి.
- 3 Nov 2020 4:06 AM GMT
Krishna District Updates: ప్రైవేట్ అంబులెన్స్ ను ఢీ కొన్న గుర్తు తెలియని వాహనం..
కృష్ణాజిల్లా..
-అంబులెన్స్ లో ఉన్న ఇద్దరు మృతి
-వీరు జార్ఖండ్ కు చెందిన వారీగా గుర్తించిన పోలీసులు
-ఒరిస్సా వద్ద పుట్టపర్తి కి వెళ్తున్నారని సమాచారం
-మృతదేహాలను పోస్టుమార్టుం కోసం హాస్పిటల్ కు తరలింపు
-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire