Live Updates:ఈరోజు (ఆగస్ట్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం, 03 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం పూర్ణిమ (రాత్రి 8-46 వరకు) తదుపరి పాడ్యమి; ఉత్తరాషాఢ నక్షత్రం (ఉ.7-45 వరకు) తదుపరి శ్రవణం నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 9-38 నుంచి 11-16 వరకు), వర్జ్యం (ఉ. 11-49 నుంచి 1-27 వరకు) దుర్ముహూర్తం ( మ. 12-31 నుంచి 1-22 వరకు తిరిగి 3-04 నుంచి 3-55 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు రక్షాబంధన్..ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 3 Aug 2020 9:23 AM GMT
శ్రీకాకుళం జిల్లా..
మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్..
జిల్లాలో ఇప్పటి వరకు 7225 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..
3301 కేసులు యక్టీవ్ గా ఉన్నాయి..
96 మంది కరోనా బారిన పడి మృతి చెందారు..
5 వేల పేషంట్లకు చికిత్స అందించే దిశగా సామర్థ్యాన్ని పెంచుకున్నాం..
జిల్లాలో మొత్తం 191 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి..
విశాఖపట్నంలో 300 పడకల వెంటిలేటర్ బెడ్స్ జిల్లాకు చెందిన బాధితులు కోసం ఇప్పటికే ఏర్పాటు చేశాము..
కోవిడ్ కేర్ సెంటర్స్ లో 3 వేల బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి..
వైద్యులు, పారామెడికల్ సిబ్బంది శక్తికి మించి పని చేస్తున్నారు..
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం రోజుకు ఐదున్నర కోట్లు ఖర్చు చేస్తున్నాం..
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బాధితులను గుర్తించడంలో మనం ముందంజలో ఉన్నాం..
కరోనా నివారణలో ఆంధ్రప్రదేశ్ దేశానికే దిక్సూచిగా మారింది..
- 3 Aug 2020 9:23 AM GMT
అమరావతి:
మహిళలపై సైబర్‌నేరాల నిరోధానికి చర్యలు
మహిళల రక్షణకోసం ఇ– రక్షా బంధన్ కార్యక్రమం
రాఖీ పండుగ సందర్భంగా క్యాంపు కార్యాలంయలో ఇ– రక్షాబంధన్‌ను ప్రారంభించిన సీఎం వైయస్.జగన్
- 3 Aug 2020 9:22 AM GMT
అమరావతి:
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ దళిత రైతు పూర్ణ చంద్రరావు వినూత్న నిరసన
నేలపాడులోని ఎన్టీవో టవర్ ను ఆనుకొని ఉన్న భారీ క్రేన్ పైకెక్కి అమరావతే రాజధానిగా ఉంచాలంటూ పులి పూర్ణచంద్రరావు డిమాండ్
ప్రభుత్వం నుంచి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని హామీ వచ్చేంత వరకు దిగొచ్చేదిలేదంటున్న దళిత రైతు పూర్ణ చంద్రరావు
ఉద్దండరాయునిపాలెంకు చెందిన దళిత రైతు పూర్ణచంద్రరావు....
- 3 Aug 2020 9:22 AM GMT
అమరావతి: రాఖీ పండుగ సందర్భంగా క్యాంపు కార్యాలయలో సీఎం వైయస్ జగన్‌కు రాఖీ కట్టిన హోంమంత్రి సుచరిత, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు విడదల రజని, ఉషా శ్రీ చరణ్, మాల కార్పొరేషన్ ఛైర్మన్ అమ్మాజి, పలువురు విద్యార్ధినులు, మహిళలు.
- 3 Aug 2020 7:58 AM GMT
రఘురామకృష్ణంరాజు, నర్సాపురం ఎంపి
అమరావతి రాజధానిగా ఉండాలి
సీఐర్డీఏ పేరు మాత్రమే మార్చామని మంత్రులు మాట్లాడడం పచ్చిదగా.
సీఆర్డీఎ అధికారాల ప్రకారం శాసనవ్యవస్థ, నాయ్యవ్యవస్థ,సచివాలయం ఉన్నచోట ప్లాట్లు ఇస్తామని రైతులతో అప్పుడు ఒప్పందం చేసుకొని ఇప్పుడు మాట మార్చడం పచ్చిదగా
రాజధాని కోసం రైతుల నుండి భూములు తీసుకుని , ఇప్పుడు పేదలకు పంచిపెడతామంటున్నారు.
పాలనావికేంద్రీకరణ, సీఆర్డీఎ చట్టం రద్దు న్యాయస్థానాలలో చెల్లదు.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం 1500 కోట్లు కేంద్రం మంజూరి చేసింది. కేంద్రం మూడు రాజధానుల కోసం నిధులు ఇస్తామనలేదు.
ఆంధ్రప్రదేశ్ కు ఒకే రాజధాని అని విభజన చట్టంలో ఉంది .
రాజీనామాల బదులు, రాజధానికోసం రాజీలేని పోరాటం చేయాలని నేను పవన్ కళ్యాణ్ కు సూచిస్తున్నాను. శాసన సభ్యుల రాజీనామాలతో ప్రయోజనం లేదని జనసేన పవన్ కళ్యాణ్ కు సూచిస్తున్నాను.
ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా బదులు రాజీలేని పోరాటం చేయాలి. నాకులాగా రక్షణ కోసం కేంద్రం సహాయం కోరాల్సిఉంటుంది.
రాజధాని విషయంలో రిఫరెండం నిర్వహించడానికి సీఎం సిద్ధంగా లేడు. సాక్షి బదులుగా, మనసాక్షి నమ్మి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి.
విశాఖపట్నం రాజధానిగా చేస్తే.... రాయలసీమ ప్రజలు వ్యక్తిగత పనుల నిమిత్తం సుదూరం ప్రయాణించాల్సి ఉంటుంది.
- 3 Aug 2020 7:58 AM GMT
అనంతపురం:
కదిరిలో దారుణం
50 వేలకు ఆడపిల్లను విక్రయించిన తల్లి
నాలుగేళ్ల చిన్నారికి వాతలు పెట్టిన తల్లి రామాంజమ్మ
రామాంజినమ్మను తమదైన శైలిలో విచారించిన కదిరి పోలీసులు
ఆరు మాసాల కిందట ఆడపిల్లను విక్రయించినట్లు రామాంజినమ్మ అంగీకారం
పాపను కొనుగోలు చేసిన వారి వివరాలు తెలియవంటున్న రామాంజమ్మ
సమగ్ర విచారణ చేపట్టిన కదిరి పోలీసులు
- 3 Aug 2020 7:57 AM GMT
అమరావతి
మహిళ స్వయం సాధికారిత దిశగా ప్రభుత్వం కీలక అడుగులు
ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు
హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు
సెర్ప్ సీఈఓ రాజాబాబు, ప్రొక్టర్ అండ్ గాంబిల్ సీనియర్‌మేనేజర్ జోసెఫ్‌వక్కీ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు
సెర్ప్ సీఈఓ రాజాబాబు, ఐటీసీ డివిజనల్ సీఈవో రజనీకాంత్ కాయ్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు
సెర్ప్ సీఈఓ రాజాబాబు, హెచ్‌యూఓల్ జీఎస్‌ఎం చట్ల రామకృష్ణారెడ్డి మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు.
- 3 Aug 2020 6:15 AM GMT
అమరావతి:
రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా పదవి బాధ్యతలు స్వీకరించనున్న సోము వీరాజు
రాష్ట్ర కార్యవర్గ విస్తారణపై దృష్టి సారించిన సోము
జంబో కార్యవర్గానికి స్వస్తి పలకాలి అన్ని నిర్ణయం.
పార్టీకి విధేయలు గా ఉన్న వల్లనే రాష్ట్ర కమిటీ లో స్థానం కల్పించాలి అన్ని నిర్ణయం
వారం రోజుల్లో ఏర్పాటు కానున్న బీజేపీ రాష్ట్ర నూతన కమిటీ
రాష్ట్ర కమిటీ ఏర్పాటు పై ఇప్పటికి ఢిల్లీ పెద్దలుతో చర్చించిన సోము
- 3 Aug 2020 6:15 AM GMT
అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు : సీఎం జగన్
అమరావతి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్ అని, ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వదినం అని పేర్కొన్నారు. మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో రాఖీ పండుగ స్ఫూర్తిని కొనసాగిస్తూ, అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రియమైన అక్కాచెల్లెమ్మలకు శుభాభినందనలు’’ అని సోమవారం ఆయన ట్వీట్ చేశారు.
- 3 Aug 2020 6:13 AM GMT
అమరావతి:
గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైయస్.జగన్.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైయస్.జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
గవర్నర్‌కు ఫోన్‌చేసిన సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, మీ జీవితంలో సంతోషం నింపాలని కోరుకుంటున్నానంటూ సీఎం అన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire