Live Updates: ఈరోజు (02 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 02 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | పాడ్యమి: రా.03-02 వరకు తదుపరి విదియ | రేవతి నక్షత్రంపూర్తిగా | వర్జ్యం: సా.06-55 నుంచి రా.08-41వరకు | అమృత ఘడియలు: తె.05-32నుంచి 06-36 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ. 12-09 నుంచి 12.56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 2 Oct 2020 5:13 AM GMT
Jayashankar Bhupalpally: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-46 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 90.80 మీటర్లు
-ఇన్ ఫ్లో 2,54,200 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 97,400 క్యూసెక్కులు
- 2 Oct 2020 5:09 AM GMT
Hyderabad updates: కరోనా నేపధ్యంలో సాధా సీదాగా గాంధీ జయంతి వేడుకలు..
హైదరాబాద్..
-లంగర్ హౌజ్ లోని బాపు ఘాట్ కు చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి..
-కాసేపట్లో సర్వమత ప్రార్థనల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడీ,రాష్ట్ర మంత్రులు ,ఎమ్మెల్యేలు..
- 2 Oct 2020 5:06 AM GMT
Kishan Reddy Comments: మహాత్మా గాంధీ మన జాతిపిత జయంతి ఉత్సవాలు..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి @ బాపు ఘాట్...
-మహాత్మా గాంధీ మన జాతిపిత జయంతి ఉత్సవాలను భారతీయ జనతాపార్టీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం ...
-నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ ఆలోచనా విధానంతో మహాత్మాగాంధీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది...
-ఆరోజు మహాత్మా గాంధీ ఉప్పుసత్యాగ్రహం, స్వదేశి ఉద్యమం, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమ స్ఫూర్తితో దేశ స్వతంత్రం సాధించుకున్నాం ...
-నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా అన్ని రంగాలలో కూడా ఆత్మ నిర్భర్ భారత్ కావాలి అ ని, అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి రంగం కూడా లక్ష్యంతో నరేంద్రమోడీ ప్రభుత్వం ఇలాంటి సమయంలో కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు...
-స్వచ్ఛభారత్ అంటే రోడ్లు శుభ్రం చేయడం ఒక్కటే కాదు మన దేశాన్ని ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా కి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ కూడా మాస్కులు ధరించి సరైన జాగ్రత్తలు తీసు కోవాల్సిన అవసరం ఉంది...
- 2 Oct 2020 4:57 AM GMT
Gandhi Jayanti: దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మా గాంధీ150 జయంతి..
పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్.
# దేశ ప్రజలకు ఇతర దేశంలో ఉన్న భారతీయులకు శుభాకాంక్షలు..
# బ్రిటిష్ కబంధ హస్తాలనుండి,భారత దేశానికి స్వేచ్ఛ స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు..
# స్వతంత్రం అనేది 130 కోట్ల జనం హక్కు..
# దేశం,రాష్ట్రం గ్రామాలు అభివృద్ధి చెందాలి..
# గాంధీ చెప్పినట్టుగా గ్రామ స్వరాజ్యం రావాలి..
# సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది..
# వలస కార్మికులు తగ్గాలి,విదేశాలకు వెళ్లే వలస కార్మికులు తగ్గి సొంత ప్రాంతల్లోనే బాగుపడాలి..
# అప్పుడే గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యం..
# రైతు బంధు లాంటి సంక్షేమ ఫలాలు గ్రామ స్థాయిలో అమలౌవుతున్నాయి..
- 2 Oct 2020 3:00 AM GMT
Hyderabad updates: బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఫిలింనగర్ బోల్తా పడిన డీసీఎం..
హైదరాబాద్..
-ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని జరగలేదు..
-సంఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు రోడ్డు పైనా నుంచి డీసీఎం తొలగింపు..
-కేసు నమోదు చేసుకొని దర్యాప్తు పోలీసులు..
-ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది....
- 2 Oct 2020 2:01 AM GMT
Telangana updates: వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనకు పిలుపు...
తెలంగాణ..
-కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపు.
-తెలంగాణలో అన్ని జలాల్లో నిరసన కార్యక్రమాలు చేయనున్న కిసాన్ కాంగ్రెస్ .
-సంగారెడ్డి లో జరగే కిసాన్, మాజ్దూర్ బచావో దివస్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొంటారు.
- 2 Oct 2020 1:43 AM GMT
Srisailam updates: శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో మెకానికల్ సింజన్ ట్రయిల్ రన్ విజయవంతం..
శ్రీశైలం..
-నిన్న సాయంత్రం ఆరు గంటలకు రెండవ యూనిట్ స్విచ్ ఆన్ చేసిన సాంకేతిక నిపుణులు
-సాంకేతిక ప్రమాణాల నిర్ధారణ సఫలీకృతం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు సిబ్బంది
-వారం పది రోజుల్లో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తికి రెండవ యూనిట్ సిద్దమవుతుందని అంటున్న అధికారులు
-ఒకటవ యూనిట్ లో వేగవంతంగా జరుగుతున్న మరమ్మతులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire